google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : బూత్ స్లిప్‌ల కోసం 1950కి SMS చేయండి

21, ఏప్రిల్ 2024, ఆదివారం

బూత్ స్లిప్‌ల కోసం 1950కి SMS చేయండి

బూత్ స్లిప్‌ల కోసం:

1950కి SMS చేయండి

ECI <స్పేస్> (మీ ఓటరు ID)

మీకు 15 సెకన్లలో బూత్ స్లిప్ వస్తుంది

***దయచేసి దీన్ని అందరితో పంచుకోండి మరియు మీ కోసం దీన్ని అమలు చేయండి మరియు సమాచారాన్ని ఇతరులకు చేరవేయండి

ECI


తెదేపా అభ్యర్థి పల్లె సింధూరను ఆశీర్వదించండి

-మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని,ఈ ఎన్నికల్లో వైసీపీ పాలనకు అంతం పలకాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా  మండలంలోని మిట్టపల్లి పంచాయతీలోనీ గ్రామాల్లో ఆదివారం మాజీ మంత్రి పల్లె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ.... తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.తెదెపా తీసుకొచ్చిన మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.చదువుకునే విద్యార్థి తల్లి ఖాతాలోకి ఏటా రూ.15వేలు చొప్పున అందజేస్తామని,50 సంవత్సరాలు నిండిన బీసీ వర్గాలకు ప్రతినెల 4000 రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తామని,నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతినెల 3వేలు చొప్పున ఏటా 36 వేలు భృతి మంజూరు చేస్తామని,ప్రతి పేదవాడి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తామన్నారు.18 ఏళ్ళ నుండి 59 ఏళ్ళు నిండిన మహిళలకు ఏటా 18 వేలు ఆడబిడ్డ నిధి అందజేస్తామని, అలాగే అన్నదాతను ఆదుకునేందుకు అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏటా 20 వేలు మంజూరు చేసి ఆదుకుంటామన్నారు.ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడ లేవన్నారు.ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారని,ఇవన్నీ పోవాలంటే తెదేపా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని,హిందూపురం పార్లమెంటు తెదేపా ఉమ్మడి అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల తెదేపా కన్వీనర్ జయచంద్ర,మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుళరెడ్డితో పాటు తెదేపా,జనసేన,బిజెపి కూటమి నాయకులు,కార్యకర్తలు,మహిళలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

    

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఏప్రిల్21(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పేరా మల్లప్ప ఆకస్మిక మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారని తెదేపా శ్రేణులు తెలిపారు.అనంతరం దిగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన వీరప్ప శనివారం రాత్రి పిడుగు పాటుకు గురై మృతి చెందిన సమాచారంతో గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీమంత్రి పల్లె ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

$$$__________@@@__________$$$

ప్రతి ఒక్కరూ వైకాపా గెలుపు కోసం శ్రమిద్దాం

-ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

 మండలంలోని డబురువారిపల్లి, కొండకమర్ల, చింతమానుపల్లి గ్రామాల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించి ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యాచరణపై సమీక్షించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ.... ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ

జగనన్న నాయకత్వంలో సంక్షేమ పథకాలు ఇంటికి అందాయని,అర్హతె  ప్రామాణికంగా ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన జగనన్నదని పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు వెన్న తో పెట్టిన విద్యని ఆయన అన్నారు. కులమతాలకు,పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి అండగా నిలిచింది జగనన్న వైకాపా ప్రభుత్వమని,డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని అక్కచెల్లమ్మ లను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబుని,జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుదని విమర్శించారు.ఎక్కడ లేని  విధంగా పుట్టపర్తి నియోజకవర్గానికి  మూడు జాతీయ రహదారులు సాధించుకుని, సత్య సాయి జిల్లాను ఏర్పాటు చేసుకొన్నామని,మన సంకల్పం గొప్పదైతే సమస్యలు అన్నీ చిన్నవేనని, ఈ ఎన్నికలు చాల కీలకమైనవని, ప్రతి ఒక్కరూ వైకాపా గెలుపు కోసం శ్రమించాలన్నారు.కృష్ణ జలాలతో పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని 864 కోట్లతో హంద్రీ నీవా కాలువల ద్వారా 193 చెరువులకు నీరు అందించడానికి పనులు ప్రారంభించుకున్నామని,ఈ ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని, న్యాయం వైపు ఉన్న జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, మనం అంతా కలసి కట్టుగా పని చేసి పుట్టపర్తిలో వైసిపి జెండా ఎగరెద్దామని, మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. సమావేశాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్21(విజయస్వప్నం.నెట్)

మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ ఎగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప(68) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారని వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి