google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : భక్తిశ్రద్ధలతో శ్రీరాముడు పల్లకి ఉత్సవం - నామినేషన్ల కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

భక్తిశ్రద్ధలతో శ్రీరాముడు పల్లకి ఉత్సవం - నామినేషన్ల కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు

భక్తిశ్రద్ధలతో శ్రీరాముడు పల్లకి ఉత్సవం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్18(విజయస్వప్నం.నెట్)

మండలంలోని తిప్పేపల్లి పంచాయతీ ఉంట్లవారిపల్లి గ్రామ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి,గ్రామ పురవీధుల్లో పల్లకి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.రెండు రోజులు రామాలయంలో భజనలు,భక్తిగీతాలను ఆలపించి గురువారం రాత్రి సీతారాముల చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పల్లకీలో పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో భక్తులకు దర్శనం ఇస్తూ ఊరేగింపు నిర్వహించి, భక్తులకు వడపప్పు,పానకం, తీర్ధప్రసాదాలు,అన్నప్రసాదాలు అందజేశారు.నల్లగుట్టపల్లిలో ఒకరోజు రాత్రింబవళ్ళు అఖండ భజనలు భక్తిగీతాలను ఆలపించి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మామిళ్ళకుంట్లపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి, శ్రీరాములవారికిచక్రస్నానం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

$$$__________@@@__________$$$

వైకాపా అధికారం లోకి వేస్తే.... రాష్ట్రం అధోగతి

అట్టహాసంగా తెదేపా ఉమ్మడి అభ్యర్థిగా పల్లె కుటుంబ సభ్యులు నామినేషన్లు

నామినేషన్ల కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు

తెదేపా తీర్ధం పుచ్చుకున్న వైకాపా ప్రముఖ నాయకులు ప్రమోద్ రెడ్డి



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/పుట్టపర్తి ఏప్రిల్18(విజయస్వప్నం.నెట్)

వైకాపా మళ్ళీ అధికారంలోకి వస్తే.... రాష్ట్రం అధోగతి పాలవుతోందని తెదేపా పుట్టపర్తి నియోజకవర్గ అభ్యర్ధి పల్లె సింధూరరెడ్డి విమర్శించారు.గురువారం ఆమె పుట్టపర్తి కేంద్రంలో నామినేషన్ దాఖలు చేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.... వైకాపా పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.తెదేపాతోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం సాధ్యమని పేర్కొన్నారు.పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డితో పాటు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, యువనేత పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డి తమ తమ నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారిణికి సమర్పించారు. ఈకార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథి పాల్గొని మాట్లాడుతూ.... వైకాపా పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈకార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల నుండి వేలాది మంది తెదేపా, జనసేన, బిజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.పుట్టపర్తి పట్టణంలో పురవీధుల్లో పూర్తిగా పసుపుమయం అయింది.పుట్టపర్తి తెదేపా, జనసేన, బిజేపీ జెండాలతో రెపరెపలాడింది.ఉదయం ఎనుములపల్లి గణేష్ కూడలి వద్దకు తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, యువ నాయకుడు  పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేరుకోగా తెదేపా, జనసేన, బిజేపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పూలు చల్లి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హారతులు పట్టి స్వాగతం పలికారు.మధ్యాహ్నం 12:15 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిణికి ముగ్గురు 3 సెట్లు నామినేషన్ల పత్రాలను సమర్పించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్,బిజేపీ జిల్లా అధ్యక్షులు జీయం.శేఖర్,తెదేపా జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప,రెస్కో మాజీ ఛైర్మన్, తెదేపా నాయకులు లాయర్ రాజశేఖర్, వాల్మీకి సాధికారత సమితి అధ్యక్షులు రామాంజనేయులు,వడ్డెర్ల సాధికారత కమిటీ అధ్యక్షులు పల్లపు రవీంద్ర,సాలక్క గారి శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. వైకాపా నుండి తెదేపాలోకి చేరిన ఎద్దుల ప్రమోద్ రెడ్డి ఓడిచెరువు మండల పరిధిలోని కొండకమర్ల పంచాయతీ గ్రామానికి చెందిన వైకాపా ప్రముఖ నాయకులు ఎద్దుల ప్రమోద్ రెడ్డితోపాటు మహేశ్వర్ రెడ్డి గురువారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి తెలిపారు.మాజీమంత్రి పల్లె చేరిన వారికి కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానం పలికారు. తెలుగుయువత నాయకులు బూదిలి ఓబుళరెడ్డి, డాక్టర్ జాకీర్ హుస్సేన్, టిటిడిపి పొగాకు షానవాజ్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. ఈకార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు సామకోటి ఆదినారాయణ, వలిపి సోమశేఖర్, కాలేనాయక్, శ్రీరామిరెడ్డి, శ్రీరామ్ నాయక్, రామలక్ష్మణ్, లాయర్ హరికృష్ణ, కంసల నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

తెదేపా అభ్యర్ధి పల్లె సింధూరరెడ్డి నామినేషన్ కు తెలుగుతమ్ముళ్లు

ఓడిచెరువు మండల వ్యాప్తంగా తెదేపా, జనసేన, బిజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గురువారం తెదేపా కూటమి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివెళ్లినట్లు మండల కన్వీనర్ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్లా సుధాకర్,సర్పంచ్ శంకర్ రెడ్డి, డాక్టర్ జాకీర్, ఎస్సీ సెల్ నాయకులు బడిశం రామాంజనేయులు, టైలర్ నిజాం, గంగాద్రీ, ఎంపిటిసి శ్రీనివాసులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుంఛపు ఆంజనేయులు,నారాపరెడ్డి,ఆరీఫ్ ఖాన్, షాను, మీసేవ సుధాకర్, కంచి సురేష్, సుధాకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఇర్షాద్, ఇడగొట్టు ఆంజనేయులు, ఆదినారాయణ, మస్తానమ్మ, ఆంజన్ రెడ్డి, జనసేన, బిజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఫ్యాను గుర్తుకు ఓటు వేసి  జగనన్న ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం: 

ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట




పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలంలోని ఇనగలూరు, రామిరెడ్డిపల్లి శెట్టివారిపల్లి, బోడేద్దులవారిపల్లి గ్రామాల్లో గురువారం పుట్టపర్తి శాసనసభ్యులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, ప్రతి ఇంటికి వెళ్ళి అభివృద్ధి సంక్షేమం వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని,పేద వర్గాలకు సంక్షేమ పథకాలు గడప వద్దకు రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని, ఇచ్చిన మాట ప్రకారం అక్కాచెల్లెళ్లకు డ్వాక్రా రుణాలు మాఫీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చి ఆదుకున్న జగనన్న కావాలా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసిన పచ్చ పార్టీ కావాలో ఆలోచించాలని, పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న  జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారని, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించాలని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ప్రచారంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు,అభిమానులు వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేడు పుట్టపర్తిలో ఎమ్మెల్యే సతీమణి దుద్దుకుంట అపర్ణ ప్రచారం


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్18(విజయస్వప్నం.నెట్)

నేడు శుక్రవారం ఉదయం 7:30 గంటలకు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి పుట్టపర్తి మున్సిపాల్టీ పరిధిలోని యనుములపల్లి సచివాలయం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని,కావున ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్,పుడా చైర్ పర్సన్,వైస్ చైర్మన్లు,కౌన్సిలర్లు,కన్వీనర్లు,జేసిఎస్ కన్వీనర్లు,సచివాలయ కన్వీనర్లు,మండల,బూత్ కమెటీ కన్వీనర్లు,ఏజెంట్లు,సింగల్ విండో ప్రెసిడెంట్లు,ప్రజా ప్రతినిధులు,వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు,అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు,గృహ సారథులు,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు  పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కేంద్ర కార్యాలయం కార్యదర్శులు ఓప్రకటనలో తెలిపారు. నేడు ఎమ్మెల్యే తనయుడు అమడగూరులో.... అమడగూరు మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ పరిధిలో గొల్లపల్లి,వడ్డిపల్లి, మహమ్మదాబాద్ గ్రామాల్లో నేడు శుక్రవారం పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని జెడ్పీటీసీ కవిత శివశంకర్ రెడ్డి, ఎంపీపీ ప్రసాద్ రెడ్డి,మండల కన్వీనర్ సూర్యనారాయణరెడ్డిలు గురువారం ఓప్రకటనలో తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి