google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : మే 2024

31, మే 2024, శుక్రవారం

ఘనంగా సీఐటీయూ 54వ ఆవిర్భావ వేడుకలు - తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభో....!! -

ఘనంగా సీఐటీయూ 54వ ఆవిర్భావ వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే30(విజయస్వప్నం.నెట్)

సీఐటీయూ 54వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో ఆటో స్టాండ్ వద్ద సీఐటీయూ నాయకులు వివి.రమణ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా. సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,ట్రాన్స్ పోర్ట్ రంగం ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబావలి,మండల కార్యదర్శి శ్రీరాములు,కుళ్లాయప్ప మాట్లాడుతూ 1970 మే 30వ తేదీన సిఐటియు ఆవిర్భావం చేపట్టినట్లు పేర్కొన్నారు.అప్పటినుండి ఇప్పటివరకు కార్మికులు,కార్మికుల సమస్యల పైన,వర్గ పోరాటాల్లో దేశంలోనే అగ్ర భాగాన నిలిచి,పోరాటాలు చేసిన చరిత్ర సిఐటియు కార్మిక సంఘానికి ఉందని,కార్మికులు పోరాడి సాధించుకున్న 42 కార్మిక చట్టాలను,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకురావడం జరిగిందని, ఇలాంటి లేబర్ కోడుల వలన కార్మికులకు అభద్రత భావం ఏర్పడిందని,కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని,కాబట్టి. గతంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం,ప్రైవేటు రంగానికి వ్యతిరేకంగా పోరాడుదామని డిమాండ్ చేస్తూ వారు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సుధాకర్,మాబ్ భాష,శంకర,మనోజ్,మురళి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభో....!!

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే30(విజయస్వప్నం.నెట్)

మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ దిగువపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నెలకొని రెండువారాలు గడుస్తున్నా.... పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో రెండు మంచినీటి సరఫరా పథకం బోరు మోటార్లు మరమ్మతులు నోచుకోలేదని, దీంతో నీటి సమస్య జఠిలంగా మారిందని, సుదూర ప్రాంతాలకు వెళ్లి రైతు బోరు బావులను ఆశ్రయించి పిల్లలు,మహిళలు,వృద్ధులు రాత్రింబవళ్ళు నీళ్ళ కోసం అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు.విద్యత్ సరఫరాలో కోతల వల్ల రైతు బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారని, బోరు మోటార్ విద్యుత్ తీగలు చోరీ చేయడంతో మరమ్మతులకు అంతరాయం కలిగిందని రెండు వారాలుగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారిందని, అంతేకాకుండా పశువులకు నీరు అందించేందుకు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని,ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి మంచినీటి పథకం బోర్లు రిపేరు చేసి గ్రామస్తులకు తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

$$$__________@@@__________$$$

ప్రకృతి వ్యవసాయం ఉత్తమం: బిజేపీ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే31(విజయస్వప్నం.నెట్)

ప్రకృతి వ్యవసాయం  సాధనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దినేష్ గత మూడు దశాబ్దాలకు పైగా విశేషమైన సేవలు అందించడంపై బిజేపీ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి అభినందించారు.శుక్రవారం కదిరి కుమ్మరివాండ్లపల్లిలో  చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించిన బిజెపి ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి వారితో(దినేష్ తో)కలిసి ప్రకృతి వ్యవసాయంలో వస్తున్న సవాళ్లు రైతులకు చేరుకోడాల్సిన మార్గాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.వారి అనుభవాలను అలాగే సమాజంలో ఆహార పదార్థాల పైన ప్రజలకు కల్పించాల్సిన అవగాహన ఇతర అంశాల గురించి వివరించారన్నారు.ఈ సందర్భంగా దినేష్ ను శాలువతో  సన్మానించారు.ఈ సందర్భంగా ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ ప్రాంతంలోని రైతులు వేరుశనగ పంటను విపరీతంగా సాగు కోసం కావలసిన రసాయనాలు భూమిపై చల్లడం వలన భూమి లోపల పోషకాలు నశించి పోతున్నాయని,గతంలో ఒక ఎకర వేరుశనగ పంటకు 30 సెర్లు విత్తనాలు వేసేవాళ్ళని,రైతుల ఆదాయం కోసం వాటిని 60 సేర్లు విత్తనాలకు పెంచారని,కానీ  పంట సాగుకు కావలసిన ఎరువులను,సాంద్రతను పూర్తిగా ,వేరుశనగ విత్తనాలు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న విధంగానే చిరుధాన్యాలను రైతులకు సబ్సిడీలపై పంట వేఅసుకున్నందుకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో రామాంజులరెడ్డి,గంగాధర్,శ్రీనాథ్ రెడ్డి,రమేష్ బాబు,చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సిగరెట్ పొగ జీవితానికి సెగ


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే31(విజయస్వప్నం.నెట్)

ఆరోగ్యవంతమైన అలవాట్లతో పొగాకు రహిత సమాజ నిర్మాణానికి అన్ని వర్గాల వారు కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ పేర్కొన్నారు.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ఈసందర్భంగా మాట్లాడుతూ..... క్యాన్సర్ వ్యాధి కారకాల్లో పొగ త్రాగడం అతి ముఖ్యమైనదని,వయోభేదం లేకుండా పొగాకు ఉత్పత్తుల అలవాట్ల వల్ల అందరి ఆయు ప్రమాణ సగటు రేటు అవరోహణ క్రమంలో అతివేగంగా తగ్గిపోతోందని,నిలకడకు,మెరుగుదలకు మంచి ఆరోగ్య అలవాట్లు ఒక్కటే ఉత్తమ మార్గమన్నారు.పొగాకు వాడకం వలన నోటి,ఊపిరితిత్తులు,ప్రేగు,రక్త, గర్భాశయ,మూత్ర సంబంధ,జీర్ణాశయ క్యాన్సర్  అలాగే దీర్ఘకాలిక వ్యాధులు పక్షవాతం,అంగవైకల్యం,గుండె,వంధ్యత్వం,రక్తనాళాలు గట్టిపడటం వంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.నివారణకై వైద్యులు ఇచ్చే  మంచి సలహాలు,సూచనలు,ఆరోగ్య అలవాట్లు పాటించాలని సూచించారు.అనంతరం సదస్సుకు హాజరైన వారితో పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి పర్యావరణాన్ని రక్షించుటకై ప్రతిజ్ఞ చేయించారు.ఈకార్యక్రమంలో  వైద్యాధికారి కమల్ రోహిత్,వైద్య బృందం సుభాషిని,దిల్షాద్,విజయ కుమారి,వరలక్ష్మి,సరిత,హెప్సిబా తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

భజన కళాకారుడు శ్రీరామిరెడ్డి మృతి

కుటుంబానికి ఐదు వేలు ఆర్థికసాయం

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే31(విజయస్వప్నం.నెట్)

శ్రీ సత్యసాయిజిల్లా కొత్తచెరువు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన భజన కళాకారుడు శ్రీరామరెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న జానపద వృత్తి కళాకారుల సంఘం శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు ఎం.నారాయణ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారని మండల కళాకారుల సంఘం సభ్యులు తెలిపారు.భజన కళాకారులకు సహాయనిధిగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో సభ్యత్వం చేసిన కళాకారుడు రామిరెడ్డి మృతి చెందాడంతో జానపద కళాకారుల సంఘం జాతీయ,రాష్ట్ర అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి సూచనల మేరకు మృతుడి కుటుంబానికి జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి నుండి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర నాయకులు,జిల్లా అధ్యక్షుడు ఎం.నారాయణ నారాయణ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి చేతులమీదుగా అందించినట్లు తెలిపారు.కళాకారుల సంఘం సహయనిధి ఉద్ధేశ్యం గ్రామాలలో భజన సంస్కృతి మరింత పెరగడానికి,భజన కళాకారులు భజనలు సాంస్కృతిక కళలపై ఆసక్తి కనబరిచాలని,మన ఆధ్యాత్మిక ధర్మప్రచారం మరింత పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారని, కళాకారుల సంఘం సభ్యులు మీరంతా సహకరించాలని వారు కోరారు.

$$$__________@@@__________$$$

వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు





శ్రీసత్యసాయి కదిరి(ఓడిచెరువు) జూన్01(విజయస్వప్నం.నెట్) 

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునకు అనుబంధ శ్రీద్వారం ఆంజనేయస్వామి,ఏటి గడ్డ ఆంజనేయస్వామి ఆలయాల్లో  శనివారం హనుమాన్ జయంత్సోవం సందర్భంగా స్వామివారిని తులసిమాలలతో అలంకరించి,ప్రత్యేక అభిషేక పూజలు,ఆస్థాన కైంకర్యములు నిర్వహించారు.హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు  తీర్థ ప్రసాదములు అందజేశారు. ఓడిచెరువులో.... మండల కేంద్రంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ఆకుపూజ,అర్చనలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు కాయకర్పూరం సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.మిట్టపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంత్సోవం సందర్భంగా వార్డెన్ శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారిని నూతన వస్త్రాలు,వెండి కవచములు,వివిధ పుష్పాలతో అలంకరించి,ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతుల నీరాజనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయంలో భజనలు చేపట్టారు.ఓడిచెరువు ఎం.కొత్తపల్లి బండపైన శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ఓడిచెరువు మండల పరిధిలో అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ శ్రీఅభయ ఆంజనేయస్వామివారి ఆలయంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి,విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గ్రామస్తులు,భజన బృంద సభ్యుల ఆధ్వర్యంలో భజనలు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీఆంజనేయ స్వామి భక్తులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీ ఖాద్రీనృసింహుశుని దర్శనానికి  పోటెత్తిన  భక్తులు

భక్త ప్రహ్లాద దర్శనము పాప విమోచనం



శ్రీసత్యసాయిజిల్లా కదిరి జూన్ 01(విజయస్వప్నం.నెట్)

నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా  కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము చారిత్రాత్మకంగా వైశాఖ మాస ఆఖరి శనివారం, హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ ఖాద్రీ నృసింహునికి అర్చకులు పూజలు నిర్వహించారు.దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.శ్రీ స్వామి వారి దర్శనార్థము తెల్లవారుఝుమున నుండి భక్తులు బారులు తీయడంతో ఆలయ ఆవరణలో రద్దీలోనే దీపార్చన పూజలు భక్తిశ్రద్ధలతో  నిర్వహించారు.అభిషేక దర్శనము కోసం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి ఇంటి ఇలవెల్పుగా కొలిచే కర్నాటక రాష్ట్రములోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికముగా విచ్చేసిన భక్తాదులు స్వామివారికి తలనీలాలను,తూలభారము మొక్కుబడులు సమర్పించుకున్నారు.భక్తుల సౌక్యార్థము అతి శీఘ్రదర్శనము,ప్రత్యేక దర్శనము,ఉచిత దర్శనమునకు క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.దర్శనం కోసం విచ్చేసిన భక్తాదులకు నైవేద్య ప్రసాదము వితరణతో పాటు నిత్య అన్నదాన వసతి సౌకర్యాలు కల్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి,అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్02(విజయస్వప్నం.నెట్) 

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదవ తరగతి 2004 -05  బ్యాచ్ విద్యార్థులు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొని తమ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉపాధ్యాయులు జయచంద్రారెడ్డి, భాగ్యలక్ష్మి, రామచంద్రరెడ్డి, సుబ్బిరెడ్డి, జయరాజ్, బాబాఫకృద్దీన్, కృష్ణారెడ్డి, ఆంజనప్ప, ఫకృద్దీన్, బాబు  పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరూ కలిసి గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ నిర్వాహణ కమిటీ  సభ్యులైన విద్యార్థులు మాట్లాడుతూ 19 సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని,ఉపాధ్యాయుల చల్లని దీవెనన్న వల్లే మేమంతా ఈ స్థాయిలో ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో రవి,బాబాఅలీ,సల్మా,కళ్యాణి, శీను,లావణ్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

30, మే 2024, గురువారం

బుధవారప్రియుడికి పట్టాభిషేకం

బుధవారప్రియుడికి పట్టాభిషేకం

 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే29(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి ఆలయంలో బుధవారప్రియుడికి (శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారికి) ప్రత్యేక పూజలు నిర్వహించి,పట్టాభిషేకం కార్యక్రమం చేపట్టారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.వైశాఖ మాస బుధవారం సందర్భంగా ఆలయ ఆవరణలో వినాయకస్వామి,సుబ్రహ్మణ్యంస్వామి,శ్రీలక్ష్మీసింహస్వామివారి ఉపాలయాల్లో పూజలు నిర్వహించి, అనంతరం శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి మూల విరాట్ విగ్రహానికి వివిధ పుష్పాలతో అలంకరించి, అర్చనలు, అభిషేకాలు,పట్టు వస్త్రం,ధూపదీప నైవేద్యాలు, సమర్పించి స్వామివారికి పట్టాభిషేకం పూజలు నిర్వహించారని తెలిపారు.దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.

$$$__________@@@__________$$$

సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయశాఖ ఏడి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే29(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి రైతుభరోసా కేంద్రంలో బుధవారం ప్రభుత్వం సబ్సిడీ  వేరుశెనగ కాయల పంపిణీ కార్యక్రమం కదిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్.సత్యనారాయణ ప్రారంభించారు.అనంతరం ఆయన వేరుశనగ కాయల నాణ్యతను పరిశీలించారు.ఈసందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.....ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశెనకాయలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.వ్యాపారస్తులు  రైతులకు ప్రలోభాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన వ్యాపారస్తులను హెచ్చరించారు.మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 4354 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు తొలి రోజు 1570  క్వింటాళ్లువేరుశెనగాకాయలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణతో పాటు మండల వ్యవసాయశాఖ అధికారి ఇలియాజ్ మహ్మద్, రైతుభరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

28, మే 2024, మంగళవారం

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు; జిల్లా కలెక్టర్, ఎస్పీలు - వైభవంగా శ్రీస్వామివారి వెండి రథం ఉత్సవము -

ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు: జిల్లా కలెక్టర్, ఎస్పీలు

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే27(విజయస్వప్నం.నెట్)

జూన్ 4న హిందూపురం బిట్ కళాశాల, లేపాక్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియ హలో భాగంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని,ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని, అందుకు రాజకీయ పార్టీలు, ఏజెంట్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అరుణ్ బాబు కోరారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డితో  కలిసి ఓట్ల లెక్కింపుపై అభ్యర్ధులు, వారివారి కౌంటింగ్ ఏజెంట్లతో  సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.... ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కట్టుదిట్టమైన భద్రత చర్యలు పూర్తి అవుతున్నట్లు తెలిపారు.ఏలాంటి వివాదాలకు చోటు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో అభ్యర్థులు,ఏజెంట్లు తమ గుర్తింపు కార్డులను ధరించాలని, ఓట్లు లెక్కింపు ముగింపు వరకు అధికారులకు సంపూర్ణ సహకారాలు అందించాలని,ఈవీయంల లెక్కింపు కోసం 14 టేబుళ్ళు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఓట్ల లెక్కింపు గదుల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ నిరంతరం పర్యవేక్షించబడుతాయన్నారు.జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.... కౌంటింగ్ ప్రక్రియ రోజు ఆతర్వాత రోజు కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈసమావేశంలో హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బికే.పార్థసారథి, వైకాపా తరపున వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి సమద్ షాహిన్, బిఎస్పీ తరుపున భాగ్య, సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా తరపున రమేష్,ఆర్ ఎస్పీ పార్టీ తరపున శ్రీనివాసులు,నవ క్రాంతి పార్టీ తరపున ధనుంజయ, డిఆర్వో కొండయ్య,కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

చినుకు పడితే.... ఇనుప కడ్డీలకు విద్యుత్ 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే27(విజయస్వప్నం.నెట్)

వర్షం కురిసిందంటే.... ఎక్కడైనా సరే సంతోషంతో మురిసిపోతారు.రైతులు అయితే హర్షం వ్యక్తం చేయడం రివాజు. ఇదిలా వుంటే.... ఓడిచెరువు మండల కేంద్రంలో వ్యాపారులకు,దుకాణ సముదాయ దారులు, ప్రయాణికులకు చినుకు పడితే భయంతో వణుకు తున్నారు.విషయం ఏమిటంటే.... బస్టాండ్ సమీపంలో స్తంభం నుండి గృహాలకు,వ్యాపార సముదాయ దుకాణాలకు విద్యుత్ తీగలు అతుకులతో ఏర్పాటు చేసుకోవడంతో తేలికపాటి వర్షం చినుకులు పెడితే చాలు దుకాణాల ముందు ఇనుప కడ్డీలకు,రేకులకు విద్యుత్ సరఫరా అవుతుందని పలువురు షాక్ తగిలి ప్రాణాపాయం నుండి బయట పడి భయభ్రాంతులకు గురౌతున్నారు. సంఘటనపై సంబంధించిన లైన్ మేన్లకు సమాచారం అందించగా స్పందించలేదని పలువురు పేర్కొంటున్నారు.గత మూడు రోజుల క్రితం స్ధానికంగా వుండే హిదాయతుల్లా చికెన్ వ్యాపారం చేసుకుంటున్న అంగడి వద్ద సహాయకుడిగా కుమారుడు దాదాఫీర్ విద్యుత్ సరఫరా అవుతున్న ఇనుప కడ్డీలకు తాకడంతో షాక్ గురై కింద పడుతున్న కుమారుడిని గమనించి అప్రమత్తంగా తీగలు తొలగించి కాపాడుకున్నారని తండ్రి హిదాయతుల్లా తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

$$$__________@@@__________$$$

ప్రతి ఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలి

ఘర్షణలకు పాల్పడితే చర్యలు:కదిరి డిఎస్పీ శ్రీలత 




శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే27(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలకు మేరకు జూన్ 4వతేదీ జరగబోవు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా సోమవారం కదిరి పట్టణంలో డిఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో కదిరి సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న సుమారు 100 మంది పోలీసులకు శ్రీ సత్యసాయి జిల్లా ఏఆర్ పోలీసుల సహకారాలతో అంబేద్కర్ కూడలి వద్ద పోలీస్ మాక్  డ్రిల్  నిర్వహించారు.ఈ పోలీస్ మాక్ డ్రిల్ నందు ఎన్నికల కౌంటింగ్  రోజు ఎవరైనా వ్యక్తులు గుంపులుగా చేరి సమస్య సృష్టించబడతారో వారిని పోలీసులు ఏ విధంగా ఎదుర్కోవాలనే సూచనలు ప్రకారం ఈ మాక్ డ్రిల్ నిర్వహించారని డిఎస్పీ శ్రీలత తెలిపారు.ప్రతి ఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలని, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.మాక్ డ్రిల్ ద్వారా పోలీసులతో ప్రజలకు వివరిస్తున్నారన్నొరు.అల్లరి మూకలను చెదరగొట్టుటకు పోలీసులు తీసుకునే  చర్యలు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ....ముందుగా అల్లరి మూకలపై టియర్ గ్యాస్  ప్రయోగించి గుంపును చెదరగొడతారని,తర్వాత ఇంకా అల్లరిముకలు ఆగడాలు ఎక్కువగా ఉంటె లాఠీ చార్జి చేయబడుతుందని, లాఠీ ఛార్జ్ లో గాయపడిన వారిని అంబులెన్సులో ఆసుపత్రికి ఏలా తీసుకెళ్లి చికిత్సలు అందించే విధానం,లాఠీ చార్జి చేసినా కూడా అల్లరిమూకలు చెదరకపోతే చివరిగా సదరు అల్లరిమూకలపై పోలీసులు కాల్పులు జరుపుతారని పేర్కొంటూ.... ప్రజలకు పోలీసులతో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.144 సెక్షన్ కొనసాగుతుందని, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బాణసంచా పేల్చుట, విజయోత్సవ ర్యాలీలు నిషేధించారని ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో  కదిరి టౌన్ సిఐ కె.పుల్లయ్య,కదిరి రూరల్ సర్కిల్ సిఐ వెంకటేశ్వర్లు,కదిరి అర్బన్ పిఎస్ సిఐ మోహన్,స్పెషల్ పార్టీ పోలీసులు,ఎఆర్ పోలీసులు,  కదిరి సబ్ డివిజన్ పోలీస్  సిబ్బంది సుమారు వంద మంది  పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీ అక్కదేవతల ఆలయంలో  కర్ణాటక భక్తులు ప్రత్యేక పూజలు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే27(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో వైశాఖ మాస సోమవారం సందర్భంగా కర్ణాటక గౌరీ బిధినూరుకు చెందిన చలపతి,రెడ్డమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హఅనంతరం దర్శనం కోసం విచ్చేసిన వందలాది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వైభవంగా శ్రీస్వామివారి వెండి రథం ఉత్సవము



శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే28(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా క్షేత్రము  శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రంలో వైశాఖ మాసం,బహళ పక్షం,తిథి:పంచమి  మంగళవారము రాత్రి 8 గంటల నుండి  శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండిరథము ప్రాకరోత్సవ(ఆలయ ప్రాకరోత్సవము)  కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.వెండి రథం పైన కొలువు దీరిన స్వామివారికి సుగంధ పుష్పాలతో,కదిరి మల్లెలు,తులసి మాలతో అలంకరణ గావించి,అస్థాన పూజలు నిర్వహించి అనంతరము తాళమేళాలతో ఆలయ ప్రాకరోత్సవము అత్యంత వైభవముగా నిర్వహించారు.అనంతరం నివేదనగా పులిహోర ప్రసాదము నైవేద్యం గావించి  పలు రకాలు ఫలాలు సమర్పించి ప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించి,వెండి రథోత్సవముకు విచ్చేసిన భక్తులందరు విరివిగా పాల్గొని స్వామి వారి సేవలో తరించి అనుగ్రహము పొందారని కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ 


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ పగడాలవారిపల్లి గ్రామంలో నూతన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ గ్రామపెద్దల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం శ్రీపంచరత్న సురేష్ శర్మ పురోహితులచే శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నవగ్రహ పూజ,వాస్తు పూజలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేటి నుంచి రైతులకు విత్తన కాయలు పంపిణీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే28(విజయస్వప్నం.నెట్)

నేడు బుధవారం నుండి ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ కాయల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంగళవారం మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ అహ్మద్ ఓప్రకటనలో తెలిపారు.ఇటీవల వేరుశన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా సంబంధిత రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి రసీదు చూపీ,నగదు చెల్లించి వేరుశనగ విత్తన కాయలు తెచ్చుకోవాల్సిందిగా ఆయన ఈసందర్భంగా కోరారు.

27, మే 2024, సోమవారం

వర్షం కోసం గంగమ్మగుడిలో ప్రత్యేక పూజలు - 31న గోరంట్ల మండలంలో అక్కదేవతల పరష

వర్షం కోసం గంగమ్మగుడిలో ప్రత్యేక పూజలు


 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే26(విజయస్వప్నం.నెట్)

 మండలంలోని సున్నంపల్లి పంచాయతీ గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ ఏటి గంగమ్మతల్లి ఉపాలయంలో ఆదివారం  భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు నరసింహులు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ గంగమ్మతల్లికి వివిధ పుష్పాలతో అలంకరించి,దీపధూప నైవేద్యాలు సమర్పించి, కర్పూర హారతి నీరాజనాలతో  పూజలు నిర్వహించారన్నారు.అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి దర్శనం చేసుకొన్న గ్రామస్తులకు,భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.

$$$__________,@@@__________$$$

31న గోరంట్ల మండలంలో అక్కదేవతల పరష

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే26(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల మండలంలోని మలసముద్రం గ్రామంలో ఈనెల 31వతేది శుక్రవారం శ్రీఅక్కదేవతల ఎలవగంప ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారి, నిర్వాహకులు రవికుమార్,చక్రి ప్రకటనలో తెలిపారు. అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు,గ్రామస్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు,అన్నప్రసాదాలు స్వీకరించి,అక్కదేవతల కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

25, మే 2024, శనివారం

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకం, కౌంటింగ్ లో పొరపాట్లు ఉండకూడదు: కలెక్టర్ అరుణ్ బాబు, సజావుగా పది సప్లిమెంటరీ పరీక్షలు

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకం


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే24(విజయ స్వప్నం.నెట్)

జూన్ 4వ తేదీ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కీలకమని,కౌంటింగ్ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల నిర్వహణ అధికారులకు(ఆర్ఓలకు)జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రిటర్నింగ్,సహాయక రిటర్నింగ్,అదనపు సహాయక రిటర్నింగ్ అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి ఓట్లు లెక్కింపుపై ఆయన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ అరుణ్ బాబు వివరించారు.ఎన్నికల నిర్వహణలో ఆఖరి ఘట్టం కోట్ల లెక్కింపు కీలకమని సిబ్బందికి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలన్నారు. సిబ్బంది సైతం గుర్తింపు కార్డులకు ధరించి కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించాలన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్వో కొండయ్య, రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ, వెంకటశివారెడ్డి, వంశీకృష్ణ, గౌరీశంకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఓడిచెరువు మండలానికి పాఠ్యపుస్తకాలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే24(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయానికి శుక్రవారం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు చేరినట్లు ఎమ్మార్సీలు తెలిపారు. మండల వ్యాప్తంగా  పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొదటి విడతగా పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు పేర్కొంటూ.... మిగిలిన పాఠ్యపుస్తకాలు త్వరలో వస్తాయని తెలిపారు.పాఠశాలలు పునః ప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తామని ఉపాధ్యాయుల ద్వారా సమాచారం.

$$$__________@@@__________$$$

కౌంటింగ్ లో పొరపాట్లు ఉండకూడదు: కలెక్టర్ అరుణ్ బాబు

శ్రీసత్యసాయిజిల్లా హిందూపురం(పుట్టపర్తి)మే24(విజయస్వప్నం.నెట్)

జూన్ నాలుగో తేదీ నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా  తగిన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు శ్రీసత్యసాయిజిల్లా కలెక్టర్ అరుణ్ బాబు  సూచించారు.శుక్రవారం ఆయన ఈవీయంలు భద్రపరిచిన నాయనపల్లివద్ద బిట్ కళాశాల వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరా ఫుటేజులను పరిశీలించారు.తదుపరి రికార్డులు తనిఖీ చేసి,మూడంచల భద్రత సిబ్బందికి సూచనలు సలహాలిచ్చారు

కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లపై అడిగి తెలుసుకుని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లు కూర్చునేందుకు వీలుగా టేబుల్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు కట్టిదిచంగా ఉండాలన్నారు.ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు అన్ని రకాల భద్రత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతపై సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జెసి అభిషేక్ కుమార్,సబ్ కలెక్టర్ అపూర్వ భారత్,ఆర్వోలు వంశీకృష్ణ, గౌరీ శంకర్ తదితర నియోజకవర్గాల సహాయక ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సజావుగా పది సప్లిమెంటరీ పరీక్షలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే24(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో విజ్ఞాన్ పాఠశాలలో శుక్రవారం పది సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు హాజరైయ్యారు. పరీక్షలు సజావుగా జరిగినట్లు విద్యాధికారులు తెలిపారు.

$$$__________@@@__________$$$

వైభవంగా చిన్నమ్మతల్లి గ్రామోత్సవం


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే25(విజయస్వప్నం.నెట్)

మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ బత్తినపల్లిలో శనివారం గౌను ఓబులప్ప, కేశప్ప, చిన్నప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా చిన్నమ్మతల్లి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి పసిబాల చిన్నమ్మతల్లి ప్రతిమకు ఆభరణాలు ప్రత్యేక పెట్టెలో ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆభరణాల పెట్టెతో పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో భక్తులకు దర్శనమిస్తూ ఊరేగించి అనంతరం చిన్నమ్మతల్లి మెట్టినిల్లు నల్లమాడ మండలం వంకరకుంట పంచాయతీ వాసిరెడ్డిపల్లికి ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు గౌను వంశీయులు తెలిపారు. మే31 అమడగూరు మండలంలో....  అమడగూరు మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో ఈనెల 31వతేది అక్కదేవతల ఎలవగంప ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఓప్రకటనలో పేర్కొన్నారు. అక్కదేవతల ఎలవగంప ఉత్సవ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు స్వీకరించి అక్కదేవతల కృపకు పాత్రులు కావాలని కోరారు.


24, మే 2024, శుక్రవారం

వైభవంగా శ్రీవారి మల్లపూల ఉత్సవం - గ్రామాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్ - శ్రీస్వామివారి హుండీ ఆదాయం 71,70లక్షలు

$$$__________@@@__________$$$

వైభవంగా శ్రీవారి మల్లపూల ఉత్సవం


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే23(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గురువారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామి వారికి మల్లెపుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు.శ్రీ లక్ష్మి నరసింహస్వామివారికి  ప్రితికరమైన వైశాఖ పౌర్ణమి పురస్కరించుకుని ఉదయం నుండి శ్రీస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకములు,అర్చనలు, నివేద సమర్పించి.సాయంత్రం వేళ శ్రీస్వామివారు(శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభూల స్వామి వారు) ఆలయము నుండి ప్రత్యేకముగా అలంకరించిన పల్లకిలో మద్దిలేరు వాగు సమీపంలో మల్లెపుల మండపమునకు మంగళవాయిద్యములతో ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.

ఉత్సవము  విశిష్టత వివరించిన అర్చకులు

స్వామి వారి బ్రహ్మోత్సము అనంతరము వైభముగా నిర్వహించే ఉత్సవము మల్లెపూల ఉత్సవమని, శ్రీ ఖాద్రీ క్షేత్రములో స్త్రీల సౌభాగ్య చిహ్నలైన కదిరి మల్లెపూలు,కదిరి కుంకుమ,గాజులు,కదిరి దవనముపై అర్చకులు విశేషముగా అబివర్ణంచారు.పత్రము,పుష్పము,ఫలము తోయం అను గీతా వాక్యనుసారం భక్తులు స్వామి వారి అనుగ్రము పొందుటకు అత్యంత భక్తి శద్దలతో కదిరి మల్లెలు సమర్పించి స్వామి అనుగ్రహన్ని పొందుతారుని,గ్రీష్మ తాపన్ని తగ్గించే ఔషధ గుణం కూడ కదిరి మల్లెలలో కలదని,ప్రతి వైశాఖ పౌర్ణమికి ఈ మల్లెపుల తిరుణాలను వైఖానస అగశ్రాస్త్ర ప్రకారము నిర్వహించి శ్రీవారు అనుగ్రహము పొందడం ఆనవాయితీగా వస్తోందని,మల్లెపుల మండపము నందు శ్రీవారికి అస్థాన పూజలను వైఖానన అగమోక్తముగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నివేదన ప్రసాదమును భక్తులకు వితరణ,కార్యక్రములు అనంతరము శ్రీస్వామివారికి ప్రత్యేక పల్లకిలో తిరుమాడ వీధుల్లో విహారిస్తూ భక్తాదులకు దర్శనమిస్తూ ఆలయములోనికి యధావిధిగా ప్రవేశించారు.

$$$__________@@@__________$$$

గ్రామాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే23(విజయస్వప్నం.నెట్)

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం గ్రామాల్లో సిఐ రాజేంద్రనాధ్ యాదవ్,ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు.జూన్ 4న ఓట్లు లెక్కింపు ప్రక్రియలో భాగంగా కొండకమర్ల, కుసుమవారిపల్లి,దిగువపల్లి తదితర గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి, ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ.... మండలంలోని గ్రామాల్లో ఏలాంటి సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు, ఘర్షణలు జరగకుండ ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సమస్యాత్మక గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్ళల్లో మారణాయుధాలు,ఇతర ఘర్షణలకు సంబంధించిన వస్తు సామాగ్రి గృహాల్లో ఉంచుకోరాదాని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నియమావళి మేరకు కౌంటింగ్ ముగిసిన తరువాత గ్రామాల్లో అలజడులు సృష్టించిన, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కోడ్ నిబంధనల పాటించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన వారు కోరారు.అనంతరం గ్రామాల్లో కార్టన్ సెర్చ్ నిర్వహించి, పోలీస్ బృందంతో కలిసి ఇళ్ళల్లో సోదాలు చేపట్టారు.

$$$__________@@@__________$$$

శ్రీస్వామివారి హుండీ ఆదాయం 71,70లక్షలు


శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే23 (విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గురువారం శ్రీస్వామివారి  హుండిల లెక్కింపు కార్యక్రమము నిర్వహించారు.హుండి లెక్కింపు పూర్తైన నగదు రూ.71,70,337/-లు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. సదరు మొత్తము 50 రోజులకు సంబంధించిందని,హుండీ లెక్కింపు కార్యక్రమము రేపు 24వతేది శుక్రవారము కూడ కోనసాగుతోందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు.హుండి లెక్కింపు కార్యక్రమములలో శ్రీసత్యసాయిజిల్లా దేవాదాయశాఖ సీనియర్ సహాయకులు రమేష్ బాబు పర్యవేక్షించారు. దేవస్థానము సిబ్బంది, యస్.బి.ఐ. బ్యాంకు కదిరి మేనేజర్ యం. శ్రీరాఘవేంద్ర, సిబ్బంది  పాల్గొన్నారు. 

23, మే 2024, గురువారం

నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు - అవాంఛనీయ ఘటనలపై దృష్టి సారించాలి: ఆర్డీవో భాగ్యరేఖ - పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలి

నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మే22 (విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణములో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి  ఆలయంలో నేడు గురువారం హుండిల లెక్కింపు  ఉదయము 6గంటల నుండి  ప్రారంభిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఓప్రకటనలో బుధవారం తెలిపారు. సదరు హుండీల లెక్కింపు కార్యక్రమమునకు హాజరుగు వ్యక్తులు ప్రభుత్వ నిభందనల ప్రకారము పురుషులు పంచె,కండువాతో రావలని, ఎవ్వరు వారి స్వంత నగదు తీసుకొని  హుండి లెక్కింపు ప్రాంతములోనికి హజరు కాకూడదని అలాగే బంగారు ఇతర విలువైన వస్తువులు ధరించి రాకూడదని ఉపకమీషనరు, కా ర్యనిర్వహణాధికారి తెలిపారు.

$$$__________@@@__________$$$

అవాంఛనీయ ఘటనలపై దృష్టి సారించాలి: ఆర్డీవో భాగ్యరేఖ

  శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే22(విజయస్వప్నం.నెట్) 

పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల  కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని బుధవారం డిఎస్పీ వాసుదేవన్ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి అధికారుల  సమావేశంలో ఆర్డీవో భాగ్యరేఖ సూచించారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల అనంతరం అల్లర్లు జరిగే అవకాశం ఉందని, శాంతి  భద్రతలకు భంగం కలగకుండా గట్టి నిఘా ఉంచి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పెట్రోల్ బంకుల్లో, కిరాణా దుకాణాల్లో బాటిళ్లల్లో పెట్రోల్,డీజిల్ క్రయవిక్రయాలు పూర్తిగా నియంత్రించి,కర్ణాటక నుండి మద్యం, పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 144 సెక్షన్ కొనసాగుతుందని ఎక్కడ కూడా నలుగురికి మంచి ఉండరాదని, అంగళ్ళు, టీ స్టాల్, భోజన హోటళ్ళ వద్ద గుంపులుగా ఉండకూడదన్నారు. బాణసంచా పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వలు గుర్తించి సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను, పోలీసులను ఆదేశించారు. గతంలో బైండోవర్ జాబితా, ప్రస్తుతం జాబితాలో ఎవ్వరైనా పేర్లు నమోదు కాకుండా ఉంటే పరిశీలించి, గుర్తించిన వివరాలు నమోదు చేయాలన్నారు.ఇనుప కమ్మీలు,రాళ్ళు,కర్రలు తదితర సామాగ్రి నిర్మణాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఆమె తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో  అమడగూరు, ఓడిచెరువు, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ మండలాల తహశీల్దార్లు రమాకాంత్ రెడ్డి,ఖాజాభీ, వేణుగోపాల్, కళావతి, భారతి, నాగభూషణం, వెంకటస్వామి, పుట్టపర్తి రూరల్,అర్బన్ సిఐలు రామయ్య, కొండారెడ్డి, ఎస్ఐలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే22 (విజయస్వప్నం.నెట్)

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందించే పండ్ల మొక్కలను పెంచడంపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ.... దరఖాస్తులు స్వీకరించాలని బుధవారం ఏపిఓ సుధాకర్ సాంకేతిక, క్షేత్రస్థాయి సహాయకులకు బుధవారం సమావేశం ఏర్పాటు చేసి సూచించారు. ఆసక్తి కనబరిచే రైతుల పేర్లు నమోదు చేసుకొని, దరఖాస్తులు స్వీకరించాలని ఆయన తెలిపారు.జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని,హాజరు,పనిదినాలు తదితర అంశాలు మస్టర్ లో పొందుపరచాలని,300 రూపాయలు కూలీ నగదును అందించే విధంగా దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులను గుర్తించి కూలీలకు కల్పించాలని ఆయన సూచించారు. వేసవిలో నీడ నీరు ప్రథమ చికిత్స కిట్లు తప్పకుండా పని చేసే ప్రదేశంలో అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సాంకేతిక సహాయకులు రాజారెడ్డి, రాజేంద్ర, నాగముని, హనుమంతురెడ్డి, చంద్రారెడ్డి ఆంజనేయులు క్షేత్ర సహాయకులు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.