google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఆగస్టు 2024

30, ఆగస్టు 2024, శుక్రవారం

రైలు ప్రయాణ సమయాన్ని మార్చాలని వినతి - 30న ఓడిచెరువులో వికసిత్ భారత్ - ఇంఛార్జ్ తహశీల్దార్ గా రంగనాయకులు భాద్యతలు - మహిళపై దాడి చేసిన వారిపై పిర్యాదు - వాటర్ పంప్ హౌస్ వద్ద కార్మికులు దీక్షలు - గుండువారిపల్లి దారిలో అక్రమంగా నిర్మించిన చర్చి తొలగించాలి: బిజేపీ నాయకులు

అమృత మండల మహిళా సమాఖ్యలో....

లక్ పతి దీదీ ప్రత్యక్ష ప్రసారం

\

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/అమడగూరు  ఆగష్టు25(విజయస్వప్నం.నెట్)

అమడగూరు వెలుగు, అమృత మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం భారతదేశ ప్రధాని  నరేంద్ర మోదీ లక్ పతి దీదీ ప్రారంభోత్సవ కార్యక్రమం లఘు చిత్రం ద్వారా వీక్షీంచారు.ముఖ్య అతిథులుగా తెదేపా, జనసేన నాయకులు జెకె పల్లి చలమయ్య,పసుపులేటి రమేష్ బాబు హాజరు అయ్యారు.ఈ కార్యక్రమం గురించి ఏపీయం గోపాల్  లఖ్ పతి దీదీ గురించి తెలియ జేస్తూ ఒక లక్ష రూపాయలకు అంతకంటే ఎక్కువ కుటుంబ వార్షిక  ఆదాయం ఆర్జించే స్వయం సహాయక సంఘ సభ్యురాలు కుటుంబ జీవనోపాదులు మెరుగుపరుచుకొనుటకు నాలుగు ముఖ్య సూచనలు ఈవిధంగా సూచించారని సభ్యురాలు జీవననో పాదులు మరింతగా పెంచడం,బలోపేతం చేయడం, విస్తరించడం,ఆస్తులు,నైపుణ్యాలు,ఫైనన్స్,మార్కెట్లో పొదుపు సంఘాల సభ్యులకు తగిన  సమయాణుకూల  మద్దతును సులభతరం చెయ్యడం,డిపార్ట్మెంటల్ కన్వర్జెన్స్ మరియు నిపుణులైన సంస్థలతో భాగస్వామ్యం చేయడం,అన్ని వాటదారుల శిక్షణ సామర్థ్యం పెంపొంచించడంఅలాగే ముఖ్యమంత్రి లక్ పతి దీదీలకు,కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ విఓఏలకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.జనసేన నాయకులు పసుపులేటి రమేష్ బాబు  మాట్లాడుతూ మహిళలు అక్షరాశ్యతలో అందరూ చదువుకోవాలని,ప్రతి మహిళా చదువుకుంటే ఆకుంటుంభం బాగుంటుందని,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.అన్నట్లు అందరూ చదువుతో పాటు ప్రస్తుత సమాజ పరిస్థితులను బట్టి సాంకేతిక పరిజ్ఞానం కూడా అందరికీ అవసరమని, మహిళలు అందరూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి దిశగా  కూడా జిల్లాలో మొదటిస్థానం లో ఉండడానికి కావలసిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ జనసేన పార్టీ తరపున ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. భారతదేశ ప్రధాని  నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసారంలో హాజరై మండల సభ్యులు వీక్షించారు.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు అనుష,ఏపియం గోపాల్,సీసీలు శంకర్ నాయక్,రత్నమయ్య,రవీంద్ర,హరిప్రసాద్,విఓఏలు లక్ పతి దీదీ సభ్యులు హాజరైయ్యారు. 

ఓడిచెరువులో.... 

ఓడిచెరువు మండల కేంద్రంలో ఆదివారం వెలుగు పల్లవి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్పతి ధీధీ ప్రత్యక్ష ప్రసారం లఘు చిత్ర ప్రదర్శన నిర్వహించారు. స్వయం సహాయక మహిళా సంఘాలలో ఉన్న మహిళలని వార్షిక ఆదాయము లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువ వచ్చే విధంగా వారికి అవసరమైన శిక్షణలు,మౌలిక సదుపాయాలు,ఆర్థిక సహాయం అందించి మెరుగైన జీవనోపాదులను ఏర్పాటు చేసుకునేలా సిఆర్పి లను మ్యాపింగ్ చేసి అనునిత్యం 100 రోజుల కార్యాచరణలో భాగంగా పర్యవేక్షణ చేసి లక్పతి దీదీలుగా తయారు చేయడమే ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యమని,ప్రధానంగా సంఘ సభ్యుల జీవనోపాధిని మెరుగుపరచడం,బలోపేతం చేయడం,సభ్యుల ఆస్తులు, నైపుణ్యాలు,ఫైనాన్స్, మార్కెట్లో సంఘ సభ్యులకు మద్దతును సులభతరం చేయడం,ప్రభుత్వ అన్ని శాఖల కన్వర్జేన్స్ ద్వారా ప్రయోజనాలను కల్పించడం, సభ్యుల సామర్థ్యాలను పెంచడం కోసం శిక్షలు ఇవ్వడం జరుగుతుందని,ప్రత్యేకించి సంఘము ద్వారానే కాకుండా వ్యక్తిగత రుణాలు కూడా అందించడం జరుగుతుందని,ఇందుకోసం సి ఆర్ పి లు ప్రాజెక్టు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘ సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ సదుపాయాన్ని కల్పిస్తుందని,ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘ సభ్యులను మైక్రో ఎంటర్ ప్రెన్యూర్ గా తయారు చేయడానికి అవసరమైన సూచనలు సలహాలు సాంకేతికతను అందించే ఏర్పాట్లు పూర్తి చేశారని,అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన,గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు, ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ వంటి పథకాలను అనుసంధానం చేశారని, అందులో భాగంగా వర్చువల్ సమావేశానికి మండల పరిధిలోని గుర్తించిన పొటెన్షియల్ లఖ్పతి దీదీలు అలాగే లక్పతి సిఆర్పిలు మండల సమాఖ్య అధ్యక్షురాలు  వెంకటలక్ష్మి, కార్యదర్శి లక్ష్మీదేవి ఎంపీడీవో ఆఫీస్ ఏవో  రెడ్డప్ప,ఏపిఎం  రమణప్ప సీసీలు వేణుగోపాల్,శ్రీనివాసులు,వెంకటరమణ,చంద్రారెడ్డి, హేమభూషణ,మునెప్ప ఎంఎస్ఏ తదితరులు హాజరయ్యారు.

కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు25(విజయస్వప్నం.నెట్)

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు నిస్వార్థంగా కష్టపడి పని చేసిన సేవలు పార్టీకి వెన్నుముకగా నిలిచిచాయని, ఇలాంటి నిస్వార్థంగా కృషి చేసిన కార్యకర్తలకు ఏలాంటి పదవులు ఇచ్చిన కూడా తక్కువేనని, ఇలాంటి కార్యకర్తలు వున్నంతకాలం తెదేపాకు తిరుగులేదని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి తెదేపా కార్యాలయంలో ఆదివారం మన తెదేపా యాప్ ద్వారా పార్టీ సమాచారాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళి క్రియాశీలకంగా వ్యవహరించిన మండలంలోని కొండకమర్ల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కృష్ణమూర్తి,గండికోట ఇర్షాద్, పొగాకు షన్వాజ్ లను పార్టీ అధిష్టానం గుర్తించి ప్రసంశ పత్రాలు మంజూరు చేయగా, సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా అందించి, కార్యకర్తలను అభినందించారు.

$$$__________@@@__________$$$

అక్కదేవతలకు ఘనంగా పూజలు

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు, ఆగస్టు26(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయితీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వలసిన శ్రీ అక్కదేవతల ఆలయంలో శ్రావణ సోమవారం పురస్కరించుకుని నల్లమాడ మండలం బొగ్గలపల్లికి చెందిన కిష్టయ్య,అంజనమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్శనం కోసం విచ్చేసిన వందలాది మంది భక్తాదులకు అన్నదానం సౌకర్యం కల్పించారని పూజారి వెంకటేష్ తెలిపారు.

$$$__________@@@__________$$$

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు






శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/అమడగూరు ఆగస్టు26(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో స్ధానిక బస్టాండ్ సెంటర్లో సోమవారం కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ప్రతిమకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు కృష్ణ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎన్ని అవరోధాలు వచ్చినా నిలకడగా ఉండడం,మనసు నిమగ్నం చేసుకొని గెలుపోవటంలను సమానంగా తీసుకోవడం కష్టసుఖాల్లో తటస్థంగా ఉండడం కృష్ణ తత్వమన్నారు. నేటి సమాజంలో యువత మానసిక ఒత్తిళ్ళకు గురవుతున్నారని ఇలాంటి తరుణంలో కృష్ణ తత్వాన్ని అలవర్చుకోవాలని వారు తెలిపారు.వశిష్ట పాఠశాల కరస్పాండెంట్ పిట్టా శివశంకర్ రెడ్డి, రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ జయసింహ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి గోకులాష్టమి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, చిన్నారులకు చిన్నికృష్ణ,గోపీక, రాధిక,రాధాకృష్ణ వేషధారణలో ఉట్టి కొట్టించడం పలువురుని ఆకట్టుకున్నాయి.   

అమడగూరులో.... 

మండల వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల్లో శ్రీకృష్ణుని చిత్రపటానికి వివిధ పుష్పాలు అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి నీరాజనాలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం విశేషం. చిన్నారులకు శ్రీకృష్ణుని వేషధారణలతో వివిధ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

$$$__________@@@__________$$$

పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగస్టు26 (విజయస్వప్నం.నెట్)

పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ చేయాల్సిన ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకుండా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) పేరుతో తీసుకురావడాన్ని డిటియఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని,తక్షణం దేశమంతటా పాత పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని డిటియఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్  డిమాండ్ చేసారు.సిపిఎస్ రద్దు చేయాలని పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని వివిధ రాష్ట్రాలలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా యుసిఎస్సి ముందుకు తీసుకురావడం తీవ్ర ఆక్షేపణీయమని,సీపీఎస్ విధానం కంటే మెరుగైన విధానం అంటూ యుపిఎస్సి అంకెల గారడీ చేసిందని విమర్శించారు. ఉద్యోగుల,ఉపాధ్యాయుల వాటాతో సంబంధం లేకుండా అన్ని రకాల సదుపాయాలు వుండే పాత పెన్షన్ కంటే మరేదీ అంగీకారం కాదని తెలిపారు.గత రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రియల్ 25న సిపిఎస్ స్థానంలో జపిఎన్ విధానాన్ని ముందుకు తీసుకు వచ్చిందని,దీనిని డిటియఫ్,ఇతర ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేసారు.ప్రస్తుత ప్రభుత్వ కాలంలో జిపిఎస్ చట్టం అమలు ముందుకు వస్తే డిటియఫ్ తీవ్రంగా వ్యతిరేకించి,నిరసన చేసిన ఫలితంగా తాత్కాలికంగా జిపెఎస్ చట్టాు అబియన్స్లో పెట్టింది వివరించారు.సిపిఎస్, జీపిఎస్,యుపిఎన్ ఏదైనా పెన్షన్ ఉద్యోగుల హక్కు, భిక్షకాదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నమైనదని విమర్శించారు. కార్పొరేట్లకు,షేర్ మార్కెట్ మాయాజాలానికి ఉపయోగపడే సెపెఎస్,యుసిఎస్ విధానాలను అమలు చేయడం ఆపి,పాత పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.

$$$__________@@@__________$$$

ఖాద్రీశుని ఆలయంలో కృష్ణాష్టమి ఆస్థాన పూజలు

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి, ఆగష్టు27(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి సందర్భంగా ఆస్థాన పూజలు నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో కృష్ణ మందిరంలో శ్రీకృష్ణుని ప్రతిమకు అభిషేకాలు ఆస్థాన పూజలు నిర్వహించి, దీప దూప నైవేద్యం సమర్పించి సాయంత్రం వేళ స్వామి వారికి ఉయ్యాల ఉత్సవం నిర్వహించారు. రేపటి రోజు బుధవారం ఆలయంలో ఉట్టి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఛలో విజయవాడ- తరలిన సిపిఐ నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు27(విజయస్వప్నం.నెట్)

ఈనెల 28వతేది విజయవాడలో నిర్వహించే భూ ఆక్రమ లావాదేవీలను రద్దు చేయాలని,పేదల ఆక్రమణలో ఉన్న భూములకు ఇళ్ల స్థలాలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ....భూ బాధితుల రాష్ట్ర సదస్సు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సిపిఐ డివిజన్, మండల నాయకులు ఆంజనేయులు,చలపతి నాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు,మహిళలు, ప్రజలతో కలిసి ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఓపిఎస్ ముద్దు, యూపీఎస్ వద్దు:డిటీఎఫ్

సత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు27(విజయస్వప్నం.నెట్)

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)నే అమలు చేయాలని, ఇతర ఏ స్కీములూ వద్దని డిటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో లో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూని ఫైడ్ పెన్షన్ స్కీం (యుపీఎస్)ను దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. యూపీఎస్ అమలు వల్ల ప్రభుత్వ ఉద్యోగ, ఉపా ధ్యాయులకు అదనంగా ఎలాంటి ప్రయోజనమూ లేదని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్ లను ప్రభుత్వం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

$$$__________@@@__________$$$

ఖాద్రీ సన్నిధిలో స్వామి వారి ఉట్లోత్సవం




శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, ఆగష్టు28(విజయస్వప్నం.నెట్)

శ్రీకృష్ణజన్మాష్టమి పండుగ వేడుకలు పరష్కారించకొని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ తూర్పురాగోజుపురము ముందు భాగమున ఊట్లోత్సవం బుధవారం రాత్రి అత్యంత వైభవంగా,వేడుకగా నిర్వహించారు.గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని,ఇందులో భాగంగా శ్రీ స్వామి వారిని ప్రత్యేక పల్లకిలో అలంకరణ చేసి ఆస్థాన పూజ అనంతరము ఆలయం ఎదుట ఉట్లోత్సవ ఉత్సాహంగా కోలాహలంగా తీరుమాడవీదుల గుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అర్చకులు ఉత్సవము నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

రైలు ప్రయాణ సమయాన్ని మార్చాలని వినతి

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) ఆగష్టు28(విజయస్వప్నం.నెట్ )

ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ప్రయాణ సమయాల్లో మార్పు గురించి బుధవారం విజయవాడలోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ కలిసి వినతి పత్రం అందజేశారని బిజెపి కిషన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి విజయస్వప్నం.నెట్ ప్రతినిధికి తెలిపారు.శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరం నుండి నర్సాపూర్ వరకు దక్షిణ మధ్య రైల్వే ట్రైన్ నెంబర్ 17247/ 17248 ధర్మవరం, కదిరి, మదనపల్లి, పీలేరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, మీదుగా వెళుతున్నదని, ఈ యొక్క రైలు ఈ ప్రాంత ప్రజలకు రాజధానితో అనుసంధానం చేయడంతో  ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే రైలులో చాలామంది విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు రాజధాని ప్రాంతానికి వెళ్లేటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని, ఈ రైలు ధర్మవరంలో మధ్యాహ్నం 2:20 నిమిషాలకు బయలుదేరి కదిరికి 3: 15 నిమిషాలకు వస్తున్నదని, విజయవాడ చేరే సమయం అర్ధరాత్రి 1:40  నిమిషాలు పడుతున్న చాలామంది ఈ ప్రాంతంలో విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విజయవాడకు చేరుకునే సమయం అర్ధ రాత్రి రావడంతో అక్కడ ఇబ్బంది పడుతున్నారని, కావున రైలు ప్రయాణం సమయంలో కొంత మార్పు కావాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుకుంటున్నారని, ముఖ్యంగా ధర్మవరం నుండి  బయలుదేరే సమయంలో 5 గంటలకు పెంచితే ఇదే రైలు విజయవాడకు ఉదయం 4 గంటలకు సమయం చేరుకుంటుందని అంచనా దీని ద్వారా  కదిరి నుంచి ములకలచెరువు నుంచి ధర్మవరం మదనపల్లి ప్రాంతాల నుంచి ప్రయాణించే ప్రయాణికులు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ రైలు సమయాలు పునః సమీక్షించాలని కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం సందర్శనకు కటారుపల్లి వేమన సమాధి దర్శనం కోసం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను సందర్శన కోసం చాలామంది కదిరి రైల్వే స్టేషన్ నుండి తమ ప్రయాణాల చేయడానికి అనువైనదిగా భావిస్తారని,గుంతకల్ రైల్వే డివిజన్లోని అత్యధిక లాభాలతో ఉన్న రైల్వే స్టేషన్ కదిరికి ప్రతిరోజు రెండు లక్షల పైగా ఆదాయం సమకూరుస్తుందని ప్రభుత్వాలు లెక్కల ద్వారా మనకు తెలుస్తుందని, రైలు ప్రయాణం సమయంలో మార్చాలని వినతి పత్రం అందజేశారని ఆయన ఈసందర్భంగా పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

30న ఓడిచెరువులో వికసిత్ భారత్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఆగష్టు28(విజయస్వప్నం.నెట్)

మండల లెవెల్ ఆఫీసర్లకు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో   30వ తేదీన  అనగ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు నోడల్ అధికారి ఆధ్వర్యంలో “వికసిత్ భారత్” కార్యక్రమం పైన సమావేశము నిర్వహిస్తారని,కావున ఈ సమావేశమునకు మండల లెవల్ అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని,అటు హాజరుకాని ఎడల మీ పై అధికారుల దృష్టికి  తీసుకెళ్తామని  మండల ప్రజా పరిషత్ అభివృద్ధి , కార్యాలయం పర్యవేక్షకులు పూల రెడ్డప్ప బుధవారం ఓప్రకటనలో పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

ఇంఛార్జ్ తహశీల్దార్ గా రంగనాయకులు భాద్యతలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు28(విజయస్వప్నం.నెట్)

మండల ఇంఛార్జ్ తహశీల్దార్ గా నల్లమాడ మండల తహశీల్దార్ రంగనాయకులు బుధవారం భాద్యతలు చేపట్టారు. ఇటీవల బదిలీపై వచ్చిన తహశీల్దార్ అనంతాచారికి ఆరోగ్య సమస్యపై శెలవులో కొనసాగడంతో తాత్కాలిక తహశీల్దార్ గా నల్లమాడ మండల తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రంగనాయకులుకు జిల్లా ఉన్నతాధికారులు భాధ్యతలు అప్పగించారని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తహశీల్దార్ రంగనాయకులు మాట్లాడుతూ రైతులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

$$$__________@@@__________$$$

మరుగుదొడ్లు ఫోటోలు బాధ్యత నుంచి తొలగించాలి: డిటీఎఫ్ గౌస్ లాజమ్శ్రీ

సత్యసాయిజిల్లా, ఓడిచెరువు, ఆగష్టు28(విజయస్వప్నం.నెట్)

పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలను అప్లోడ్ బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను తొలగించాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్ లు బుధవారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేసి,తరగతి గదిలో బోధనకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు.ప్రత్యేకించి మరుగుదొడ్ల ఫొటోల బాధ్యత నుంచి తొలగించాలని గత ప్రభుత్వంపై పోరాటాలు చేశామన్నారు.పోరాటాల ఫలితంగా ప్రస్తుత ప్రభుత్వం మరుగుదొడ్ల ఫొటోలు బాధ్యత నుండి ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.అయితే ఈ ఫొటోలు ఎస్ఎంసీ ఛైర్మన్, సభ్యులు, గ్రామ సచివాలయ అసిస్టెంట్లతో తీయించాలని చెప్పారన్నారు.వారు ఫొటోలు తీయకపోతే ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలని చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు.కావున ఈ బాధ్యత నుంచి ఉపాధ్యాయులను తొలగించాలిని కోరారు.

$$$__________@@@__________$$$

మహిళపై దాడి చేసిన వారిపై పిర్యాదు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు28(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని వేమారెడ్డిపల్లికి చెందిన రమేష్ అనే వ్యక్తి తనపై దాడి చేశాడని అదే గ్రామానికి చెందిన  సుకన్య పోలీసుస్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమేష్ వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని, తను గట్టిగా కేకలు వేయడంతో తలను గోడకు బలంగా కొట్టి పారిపోయాడని విలపిస్తూ విషయాన్ని తన భర్తకు ఫోన్ ద్వారా తెలపడంతో వెంటనే కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించినట్లు ఫిర్యాదులో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారని ఏఎస్ఐ రమణారెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీ శిరిడీ సేవానద్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో శ్రీశిరిడి సేవాసద్ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరం కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్యుల బృందం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.శ్రీ శిరిడి సాయిసత్య సేవ సంఘం కదిరి వారి ఆధ్వర్యంలో రోగులకు బిపి,షుగర్,ఈసిజి 2జి తదితర చికిత్సలను ఉచితంగా అందించి,మందులను పంపిణీ చేశారు.ముఖ్యంగా కిమ్స్ అవేర్ ఆసుపత్రి వైద్యులు పిఆర్జిఎస్ టుడి ఎకో ఈసీజీ, బీపీ,షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించి మెరుగైన వైద్యం కోసం రోగులకు సలహా సూచనలు అందించారు.కార్యక్రమంలో శ్రీ శిరిడి సేవా సంఘం కదిరి వారి కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి శ్రీ షిరిడి సాయి సత్సేవ సంఘం ఆధ్వర్యంలో వచ్చిన రోగులకు అల్పాహారం,మంచినీరు సౌకర్యాలు కల్పించినట్లు ఆర్ట్ శేషాద్రి తెలిపారు.

$$$__________@@@__________$$$

వృద్ధాశ్రమానికి నిత్యసర సరుకులు పంపిణీ

శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు/అమడగూరు, ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా ఆరవ వర్ధంతి సందర్భంగా ఓడిచెరువు మండల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి తమ వంతుగా నిత్యవసరులు అందజేశారు.గురువారం అమడగూరు మండలంలోని గాజులపల్లి వద్ద  శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో క్షేత్ర సహయకులు పీట్ల మనోహర్, అక్కులప్ప, రామాంజనేయులు ఆధ్వర్యంలో నిత్య సరుకులను ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి కి అందజేశారని తెలిపారు. ఈసందర్భంగా నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా వర్ధంతి సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

వాటర్ పంప్ హౌస్ వద్ద కార్మికులు దీక్షలు

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)నల్లమాడ,ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నల్లమాడ మండల కేంద్రంలోని సత్యసాయి పంప్ హౌస్ వద్ద కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత ఎనిమిది రోజులుగా దీక్షలు చేపట్టారని,కార్మిక సమస్యల పైన దీక్షలు చేపట్టిన స్పందన లేకపోవడంతో కార్మికులకు సిపిఐ జిల్లా సమితి సంఘీభావం తెలిపి వాళ్ళు డిమాండ్లను తక్షణమే పరిష్కారం కావాలని పంప్ హౌస్ వద్ద దీక్ష చేపట్టి,డిమాండ్లు వివరిస్తూ ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని,11 నెలల నుంచి పిఎఫ్,ఈఎస్ఐ వెంటనే జమ చేయాలని,శ్రీసత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టును కాపాడాలని,సాయి వాటర్ సప్లై ప్రాజెక్టుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని,కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,కార్మిక సమస్యల పైన దీర్ఘకాలికంగా పనిచేసే కార్మికులకు ప్రభుత్వం తక్షణమే గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ చంద్ర, వాటర్ కార్మికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఓడిచెరువులో జాతీయ క్రీడా దినోత్సవం




శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా మండల కేంద్రంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించి,విద్యార్థిని, విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో, షటిల్ క్రీడా పోటీలు నిర్వహించినట్లు  ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాసరావు,వ్యాయామ ఉపాధ్యాయుడు గోపినాథ్, ఉపాధ్యాయ బృందం  తెలిపారు. ఈసందర్భంగా  హాకీ మంత్రికుడు ధ్యాన్ చంద్  గురించి,క్రీడా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు.అదేవిదంగా మాతృ భాష దినోత్సవం విశిష్టత గురించి తెలిపారు.

$$$__________@@@__________$$$

రేపు కనుమ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ పూజలు


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

మండలంలోని నందివారిపల్లి సమీపంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ కనుమ ఆంజనేయ స్వామి దేవస్థానంలో 31వతేదీ  రేపు నాలుగవ(ఆఖరి శనివారం)శ్రావణమాసం శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆకు పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కోలాటం చెక్కభజన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి,సుదూర  ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

గుండువారిపల్లి దారిలో అక్రమంగా నిర్మించిన చర్చి తొలగించాలి: బిజేపీ నాయకులు


 శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)ఆగష్టు29 (విజయస్వప్నం.నెట్)

అమడగూరు  మండలం, గుండువారిపల్లికి వెళ్లే దారిలో గుండువారిపల్లిలో ఏ ఒక్కరు కూడా క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తులు గాని,కుటుంబాలు గాని లేకపోయినా మతమార్పిడులకు పాల్పడాలనే దురుద్దేశంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శి,గ్రామ రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో క్రిస్టియన్ మతస్తులు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చర్చిని నిర్మాణం చేసారని,చర్చి నిర్మాణం చేయాలంటే ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలనే కనీస అవగాహన లేకుండా చర్చి ని నిర్మించినారని, వెంటనే చర్చి నిర్మాణం నిలుపుదల చేయాలని బిజేపీ నాయకులు గురువారం తహశీల్దార్ రామనాధరెడ్డికి,పోలీసు స్టేషన్లో  వినతిపత్రం అందజేశారు. ఈవిషయంపై అధికారులు స్పందించి చర్చి ప్రారంభం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించినటువంటి చర్చి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని,ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉంటే ఏరకంగా అనుమతి ఇచ్చిందనే విషయం మీద సమగ్ర విచారణ జరిపించి నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతి మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని,ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ రెవెన్యూ అధికారి కనుసనల్లోనే చర్చి నిర్మాణం జరిగిందని భారతీయ జనతా పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేశామని,మా విజ్ఞప్తిని బుట్ట దాఖలు చేసి చర్చి నిర్మాణం పూర్తి చేసే విధంగా సహకరించినటువంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూస్తారని భారతీయ జనతా పార్టీ  అమడగూరు మండల శాఖ విశ్వాస్తుందని,వెంటనే తగిన చర్యలు తీసుకొని చర్చి కార్యకలాపాలునిలపుదలు చేయాలని, నిలుపుదలతో పాటు నిర్మించిన చర్చిని తీసేయాలని భారతీయ జనతా పార్టీ,అమడకూరు మండల శాఖ డిమాండ్ చేస్తూ ....వెంటనే చర్యలు తీసుకొని చర్చి కార్యకలాపాలు నిలుపుదల చేయకపోయినట్లయితే హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని భారతీయ జనతా పార్టీ,అమడగూరు మండల శాఖ మండల అధ్యక్షుడు ఇందుకూరు సురేంద్ర రెడ్డి హెచ్చరించారు‌. ఈకార్యక్రమంలో బిజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసులు, ఎస్టీ మోర్చా జోనల్ ఇంఛార్జి హరినాయక్, సీనియర్ నాయకులు ఐ.రాము,బీసీ నాయకులు శ్రీనివాసులు,రామయ్య,పురుషొత్తమ్, మస్తాన్ రెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వేమనారాయణ,తిప్పన్న, వెంకటరమణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేడు పల్లె ఉమా వర్థంతికి తరలి రండి

-మాజీమంత్రి పల్లె

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, ఆగష్టు29(విజయ స్వప్నం.నెట్)

నేడు 30వతేది శుక్రవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమా వర్థంతి కార్యక్రమం ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు, అశోక్ లైల్యాండ్ షోరూం సమీపంలో స్వంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తారని, కావున నియోజకవర్గ మండలాల పరిధిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి ఘనంగా నివాళులు అర్పించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు.

$$$__________@@@__________$$$

రేపు శ్రీకృష్ణుని ప్రతిమ ఉత్సవ ఊరేగింపు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

ముడల కేంద్రంలో బస్టాండ్ వద్ద 26 వతేది కృష్ణాష్టమి,గోకులాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ప్రతిమకు భక్తిశ్రద్ధలతో వారం రోజుల పాటు పూజలు నిర్వహించారు.తైత్రశకం శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధనంద యోగ్వేశురుల కర్త వారి ఆధ్వర్యంలో రేపు 31 వతేది శనివారం శ్రీకృష్ణుని ప్రతిమకు అలంకరించి ప్రత్యేక వాహనంలో మండల కేంద్రంలో పురవీధుల గుండా ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారని కార్యవర్గ సభ్యులు తెలిపారు.

$$$__________@@@__________$$$

నేడు ఖాద్రీ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతము


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి,ఆగష్టు29(విజయస్వప్నం.నెట్)

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానములో నేడు 30వతేది శుక్రవారము ఉదయము 9.30 నిమిషములకు శ్రీశ్రావణ వరమహాలక్ష్మీ సామూహిక వరలక్ష్మీ వ్రతము నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతమునకు కావలసిన పూజ సామాగ్రి అనగా ( పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, గాజులు, జాకీట్ పీస్ తదితర సామాగ్రి) దేవస్థానము వారే సమకూర్చెదరని,కావున యావన్మంది భక్తాదజనులు శ్రీశ్రావణ వరమహలక్ష్మీ వ్రత కార్యక్రమమునకు విచ్చేసి శ్రీస్వామివారి అమ్మవారి శుభాశీస్సులు పొందవలెనని వెండిదండి శ్రీనివాస రెడ్డి, ఉపకమీషనరు / కార్యనిర్వహణాధికారి వారు తెలియజేశారు

25, ఆగస్టు 2024, ఆదివారం

ఖాద్రీశుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి - శ్రీ జ్ఞానసాయిలో కృష్ణాష్టమి వేడుకలు - వాహనాలును తనిఖీ చేసిన ఎస్ఐ - పాడి రైతులకు అవగాహన - గుండె పోటుతో వ్యక్తి మృతి - శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో చిన్నారి పుట్టినరోజు వేడుకలు - ఈ పంట నమోదు పరిశీలించిన ఏఓ - గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం

మండల వాల్మీకి అధ్యక్షురాలుగా నాగవేణి

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు22(విజయస్వప్నం.నెట్)

మండల నూతన వాల్మీకి సంఘం అధ్యక్షురాలుగా మిట్టపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన బోగీ నాగవేణి గురువారం ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పేర్కొంటూ.... తనకు రాష్ట్ర వాల్మీకి కోర్ కమిటీ ఉపాధ్యక్షులు కుర్లపల్లి మోహన్ ఉత్తర్వులు పంపినట్లు నూతన వాల్మీకి మండల అధ్యక్షురాలు నాగవేణి తెలిపారు.

$$$__________@@@__________$$$

నేడు ఉపాధి హామీ పథకంపై గ్రామసభలు

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు  ఆగష్టు22(విజయస్వప్నం.నెట్)

మండల వ్యాప్తంగా 10పంచాయతీ గ్రామాల్లో నేడు (శుక్రవారం)మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులను గుర్తింపు కోసం గ్రామసభలు నిర్వహిస్తారని గురువారం ఎంపిడిఓ మునెప్ప  ఓప్రకటనలో పేర్కొంటూ....గ్రామ పంచాయితీల వారిగా షెడ్యూల్ విడుదల చేశారు.అమడగూరు,చీకురేవుపల్లి,జౌకుల కొత్తపల్లి,కసముద్రం,మహ్మదాబాద్,కొట్టువారిపల్లి,పూలకుంటపల్లి,తుమ్మల పంచాయతీ గ్రామాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి గుండువారిపల్లి,చినగానిపల్లి పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు, సర్పంచులు,ఎంపీటీసీలతో కలిసి సంబంధిత అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేశారని పేర్కొన్నారు.కూలీలు,మేట్లు, శ్రమశక్తి సంఘాల సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొని ఉపాధి హామీ పథకం ద్వారా పనులను గుర్తిస్తారని తెలిపారు.

$$$__________@@@__________$$$

ఈ పంట నమోదు పరిశీలించిన ఏఓ


అమడగూరు,జనసేన వార్త, ఆగష్టు22

మండలంలోని చిన్నగానిపల్లి,చీకిరేవులపల్లి,కసముద్రం పంచాయతీ గ్రామ రైతు సేవా కేంద్రాల్లో గురువారం మండల వ్యవసాయాధికారి వెంకటరమణాచారి ఈ పంట నమోదు ప్రక్రియ పరిశీలించి, సిబ్బందికి సూచనలు,సలహాలిచ్చారు.ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

$$$__________@@@__________$$$

శ్రీమాతశ్రీ వృద్ధాశ్రమంలో చిన్నారి పుట్టినరోజు వేడుకలు


అమడగూరు,జనసేన వార్త, ఆగస్టు 22

మండలంలో గాజులపల్లి గ్రామ సమీపంలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ బాబాకలందర్  దంపతుల ముద్దుల చిన్నారి సారియా 6వ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆశ్రమానికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని కేలండర్ పేర్కొన్నారు.

ఆశ్రమ నిర్వాకరాలు అరుణజ్యోతి మాట్లాడుతూ చిన్నారి సారియాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

$$$__________@@@__________$$$

గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం






శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,ఆగస్టు23(విజయస్వప్నం.నెట్)

రాష్ట్రంలో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కి,నారా లోకేష్ కి, పల్లె సింధూర రెడ్డి కి తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

మండలం కేంద్రంలో  పంచాయతీలో అమడగూరు గ్రామసభ కార్యక్రమంలో అధికారులు తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ గ్రామసభల్లో పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వీధి దీపాలు, మురుగునీరు, సిమెంటు రహదారులు, గ్రామాలలో రోడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలు పెంచడం అనేక సమస్యలపై అధికారులు గ్రామ ప్రజలు చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షబ్బీర్ పంచాయితీ కార్యదర్శి చంద్ర, టెక్నికల్ అసిస్టెంట్ అశోక్, వేల్పర్ ఎడ్యుకేషన్ సుని, అసిస్టెంట్ ఇంజనీరింగ్,ఏవో వెంకటరమణాచారి,ఫీల్డ్ అసిస్టెంట్ రామంజి, డి.మూర్తి,బూత్ కన్వీనర్ బి ఎన్బి మూర్తి జనసేన నాయకుడు శ్రీనాథ. తెదేపా మహిళా నాయకురాలు గాయత్రి,భాస్కర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,నారాయణ,రామంజి తెదేపా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.      ఓడిచెరువులో....  మండల వ్యాప్తంగా శుక్రవారం 14 పంచాయతీ గ్రామ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు.మండల కేంద్రంలో ఒకటవ సచివాలయంలో ఎంపీడీవో వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ ప్రారంభించారు.సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు, ఎంపీపీ షామీర్ పర్వీన్ భాను, మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మహాత్మగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు,గ్రామాల్లో మౌళిక సదుపాయాలు, వ్యవసాయ రంగంలో ఉపాధి హామీ అనుసంధానం తదితర అంశాలపై సమీక్షించారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రామలింగారెడ్డి, తెదేపా, జనసేన, బిజెపి కూటమి సభ్యులు జయచంద్ర, సీసీ కెమెరా శంకర్, టైలర్ నిజాం, పీట్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 200 రోజులు పని దినాలు పెంచాలని,ఇతర ప్రాంతాలకు ఉపాధి పనులకు వెళ్ళేందుకు కూలీలకు అదనంగా ఛార్జీలు చెల్లించాలని తదితర అంశాలపై సిపియం నాయకులు రమణ, కుళ్ళాయప్పలు సున్నంపల్లి పంచాయతీ గ్రామసభలో అధికారులకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

గుండె పోటుతో వ్యక్తి మృతి

 శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,ఆగస్టు 23(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండల పరిధిలో ఏ.కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం  మంజుల గంగులప్ప పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారని బంధువులు తెలిపారు.మృతినికి ఇద్దరు కుమారులు వున్నారు.విషయం తెలుసుకున్న గ్రామస్తులు గంగులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి,మంచి మనిషి గంగులప్ప మన మధ్య లేకపోవటం  భాద కారణమని, వారికీ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

$$$__________@@@__________$$$

పాడి రైతులకు అవగాహన



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మల్లెలవాండ్లపల్లిలో శనివారం ఉచిత గర్భ కోశ చికిత్సా శిబిరం ఏర్పాటు చేసి జిల్లా పశు గణాభివృద్ది సంస్థ వారు ఉచిత మందుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 90% కచ్చితత్వంతో పేయి దూడల పుట్టుకను ఉద్దేశించి లింగ నిర్ధారిత వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయు పథకం ప్రాచుర్యనిమిత్తం,ఆ పథకానికి మంచి పశువుల ఎన్నికకు, రైతుల అవగాహన కొరకు, గ్రామంలో అన్ని పశువులను పరీక్షించుట కొరకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరము ఏర్పాటు చేపట్టారన్నారు. 1350/- విలువ గల రెండు సూదులను,850/- సబ్సిడీ పోగా 500/- మాత్రమే చెల్లిస్తే, మొత్తంగా పేయిదూడలను పొందే సూదులను ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారని తెలిపారు.పైగా, రెండు సూదులు వేసినా కట్టకపోతే 500/- తిరిగి వెనక్కి ఇవ్వడం, పొరపాటున కుర్ర దూడ పుడితే 250/- వాపస్ ఇవ్వడం,విదేశీ జాతులనే కాక స్వదేశీ జాతులైన గిర్,సాహివాల్,తార్పర్కార్  వంటి కావలసిన బ్రీడ్ లను ఎంపిక చేసుకొనే అవకాశం ఉండడం,పుట్టేది పేయిదూడ కనుక ఈనునప్పుడు ఆవుకు కష్టం లేకుండా ఈనడం,పుట్టే పేయిదూడ చూడి నిలిస్తే 20% అధిక పాలనిచే శక్తి కలిగి ఉండడం అనునవి ప్రత్యేక లాభదాయకమైన అంశమలని  డి.ఎల్.డి.ఏ.,అనంతపురం జిల్లా కార్యనిర్వహణాధికారి డాక్టర్ టి.వి.సుధాకర్ తెలిపారు.భవిష్యత్తులో ఈ లింగ నిర్ధారిత వీర్యము అత్యధిక ప్రాచుర్యం పొందుతుందని, గ్రామములో అత్యధిక పాడి కొరకు పేయిదూడలు మాత్రమే పొందే ఆధునిక సాంకేతిక విప్లవముగా ఈ పథకం మారగలదని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.

అదే గ్రామములో, పశువులలో చూడి నిర్ధారణ,తిరిగి ఎదకు వస్తూ కట్టకుండా నిలిచిపోయినవి, పూర్తిగా ఎదకురానివి లాంటి  సుమారు 33 పశువులకు గర్భకోశవ్యాధుల నిపుణుడు అయిన డాక్టర్ టి.వి. సుధాకర్ గర్భకోశ పరీక్షలు నిర్వహించారు.నట్టల నివారణ మందులు 12వాటికి తాపారు, సాధారణ కేసులు 9 చూసి వాటికి తగు వైద్యం అందించి, సలహాలు, సూచనలిచ్చారు. 

     ముఖ్యంగా, పాడి పశువులలో మంచి కట్టు శాతం రావటానికి ఆఖరు దశలో ఉన్నపుడు కృత్రిమ గర్భధారణ చేయిస్తే మాత్రమే చూడి నిలుస్తుందని తెలుసుకోవడం,  షుమారు 11-15 ఎద లక్షణాలు ఉన్నప్పటికీ, 2,3 చూపినా ఆ పశువు ఎదలో ఉందని రైతు తెలుసుకోగలగడం,స్థానికంగా విరివిగా లభ్యమగుచున్న సుబాబుల్ ఆకు వాడకం,ఈనిన మూడు నెలల లోపే కృత్రిమ గర్భధారణ చేయించడం,ఏడాదికో దూడ లక్ష్యంగా ప్రత్యేక మైన మేపు, యాజమాన్యం పాటించడం, తద్వారా పశువు తన జీవితకాలంలో సాధ్యమైనన్ని  ఎక్కువ ఈతలు ఈనడం వలన అధిక దూడలు,అధిక పాలదిగుబడి పొంది తద్వారా అధిక రాబడి పొందడం,ఎద సూది చేసిన తర్వాత 20 రోజుల పాటు బెల్లం నీళ్లు,టెంకాయ నీళ్లు లాంటివి త్రాగించడం,రోజుకి 100 గ్రాముల  ఎముకల పొడి తినిపించడం,మునగాకు, కరివేపాకు మేపడం లాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం లాంటి విషయాలపై రైతులకు ప్రత్యేక అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి పశువులకు సరైన పోషణ కొరకు పచ్చి మేత,దాణాలతో పాటు కొండ చిగిరాకు, మునగాకు, కరివేపాకు, మొలకెత్తిన పెసలు, ఉలవలు, సద్దలు, రాగులు మేపినట్లైతే  హార్మోన్స్ లోపం మరియు పోషకార లోపాలు లేకుండా చేసి,పశువులను త్వరగ చూలు కట్టించ వచ్చునని తెలిపారు.

గర్భకోశ వ్యాధులతో ఉన్నవాటిని, ఎద లక్షణాల పశువులను, చూడి పశువులను చూపించి తగు జాగ్రత్తలు, నివారణోపాయాలు సూచిస్తూ, డాక్టర్ టి.వి.సుధాకర్  హాజరైన రైతులకు, ఏహెచ్ఏ లకు, పశువైద్యులకు  ప్రత్యేక శిక్షణ, మెలుకువలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల పశువైద్యాధికారి సి. ప్రవీన్ కుమార్, ఏహెచ్ఏలు, జిఎంఎస్ లు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీ జ్ఞానసాయిలో కృష్ణాష్టమి వేడుకలు



శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు, ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో  శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చిన్నారులు కన్నయ్య,గోపిక,రాధాకృష్ణల వేషధారణలతో ఆకట్టుకున్నారు.ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు అలరిస్తూ.... ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయ బృందం సాంప్రదాయ దుస్తులు ధరించి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కరస్పాండెంట్ మోహన్ రెడ్డి చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఖాద్రీశుని దర్శించుకున్న హైకోర్టు జడ్జి



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి,ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)

నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా కదిరి పట్టణంలో వెలసిన  శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి సుజాత   నేడు  శనివారం సాయంత్రం 5.30 గంటలకు విచ్చేయగా,గౌరవనీయులైన జడ్జి సుజాతకి ఆలయ తూర్పూ రాజగోపురము వద్ద నుండి పూర్ణకుంభముతో  ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాస రెడ్డి, ఉపప్రధాన అర్చకలు ఎ.కుమార్ రాజాచార్యులు,   ఆలయ అధికారులు స్వాగతం పలికి  శ్రీస్వామి,ఆమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి  శ్రీస్వామి వారి చిత్ర పటము,శేషవస్త్రములతో సత్కరించి,తీర్థ ప్రసాదములు సమర్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.

$$$__________@@@__________$$$

వాహనాలును తనిఖీ చేసిన ఎస్ఐ


         శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,ఆగష్టు24(విజయస్వప్నం.నెట్)

మండల కర్ణాటక సరిహద్దులో శనివారం ఎస్ఐ వెంకటనారాయణ  ముమ్మరంగా వాహనాలను తనకి నిర్వహించారు.ప్రతి వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని,వాహనాలకు సంబంధించిన ఆర్సీలు లైసెన్సులు హెల్మెట్లు ఉండాలని పరిమితికి మించి ప్రయాణీకులను  తరలించకూడదని,అతివేగం చాలా ప్రమాదకరమని,ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడపరాదని,కర్ణాటక మద్యం అమ్మిన సరఫరా చేసిన వారిపై అధికారుల ఆదేశాల మేరకు జరిమానాలు,జైలు శిక్షలు విధిస్తామని హెచ్చరించారు.సరిహద్దు గ్రామ పరిసరాల్లో,వివిధ వాహనాలు తనిఖీలు నిర్వహించి, వాహనదారులకు, ప్రయాణికులకు ఎస్ఐ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.