రెండవరోజు కూర్మావతారంలో స్వామివారు దర్శనం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, అక్టోబర్04(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో దశరా శరన్నవరాత్రి అలంకరణ మహోత్సవాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం శ్రీకూర్మావతార అలంకరణ రూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కూర్మావతారం విశిష్టత, శరన్నవరాత్రుల ఉత్సవ వేడుకలను ప్రధాన అర్చకులు భక్తులకు వివరించారు.
$$$__________@@@__________$$$
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
-సిపిఎం నాయకులు వినతి
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,అక్టోబర్04(విజయస్వప్నం.నెట్)
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సిపిఎం నాయకులు శ్రీరాములు,కుళ్ళాయప్ప,గంగాధ్రీ,రాము తదితరులు శుక్రవారం రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ మున్వర్ బాషకు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెదేపా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత ఇసుక రవాణా అనుమతులు ఆమలు చేయాలని,ప్రతి నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ పాయింటులను ఏర్పాటు చేయాలని,2014-19 మధ్య ఉన్న ధరలను ఆమలు చేయాలని, లేబర్ కోడ్ ఆమలు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదవశాత్తు మృతి చెందిన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ ఆమలు చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని,అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారన్నారు.
$$$__________@@@__________$$$
ఓడిచెరువు ఎంపీడీవోగా రాబర్ట్ విల్సన్
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,అక్టోబర్04(విజయస్వప్నం.నెట్)
మండల ఎంపీడీవోగా రాబర్ట్ విల్సన్ శుక్రవారం భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో వరలక్ష్మి కర్నూల్ జిల్లాకు బదిలీపై వెళ్లడంతో ఆమె స్ధానంలో రొద్దం మండలం ఎంపిడిఓగా విధులు నిర్వహిస్తున్న రాబర్ట్ విల్సన్ బదిలీపై ఓడిచెరువు మండల ఎంపిడివోగా భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
రేపటి నుండి తుమ్మల వెంకటేశ్వరస్వామి ఉపవాస పూజలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,జనసేన న్యూస్ అక్టోబర్04(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తుమ్మల పంచాయతీ గ్రామ సమీపంలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల అమావాస్య ఒక్కపొద్దులు(ఉపవాస పూజలు)రేపటి(శనివారం)నుండి ప్రారంభం అవుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చింతా శరత్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మల కొండ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు భోజనాలు, మంచినీళ్ళు తదితర సౌకర్యాలు కల్పించే ఏర్పాటు పూర్తి చేసినట్లు తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోలేని భక్తులు తుమ్మలయ్య కొండనే తిరుమల కొండగా భావించి ఇక్కడే (కింద భాగంలో) తమ మొక్కులు తీర్చుకొనే ఆనవాయితి అనేక దశాబ్దాలుగా కొనసాగుతోందిని తెలిపారు.మన రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో చిక్బల్లాపూర్,బాగేపల్లి,పావగడ తదితర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శించుకోవడానికి వస్తారని కమిటీ సభ్యులు కొట్టు అశ్వర్థ కుమార్,కొట్టు రామాంజినేయులు, శ్రీనివాసులు, రామచంద్ర , ఈశ్వరయ్య, సరళమ్మ, ఉమాపతిరెడ్డి, పూజారి రమణ ఈసందర్భంగా విలేకరులకు తెలిపారు.
$$$__________@@@__________$$$
పుట్టపర్తి రూరల్ ఎస్ఐగా కేయం.లింగన్న భాధ్యతలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి, అక్టోబర్04(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి రూరల్ ఎస్ఐగా కే.యం.లింగన్న శుక్రవారం భాధ్యతలు స్వీకరించారు.ఈయన నల్లచెరువు పోలీసుస్టేషన్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కృష్ణమూర్తి బుక్కపట్నం పోలీసుస్టేషన్ కు బదిలీపై వెళ్ళారు.
$$$__________@@@__________$$$
నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించండి:నారా లోకేష్ కి మండల తెదేపా నాయకులు వినతి
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,అక్టోబర్04(విజయస్వప్నం.నెట్)
ఉండవల్లిలో ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుని గురువారం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించి,నామీనేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని మాజీ జడ్పీటీసీ,జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి కోరారు.సార్వత్రిక ఎన్నికలలో కృషి చేసినందుకు లోకేష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.ఈకార్యక్రమంలో టిఎధన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజులునాయుడు,మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ,తెలుగు యువత నాయకులు నాగేంద్ర రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్, టీయన్ టీయూసీ నాయకులు స్టూడెయో మూర్తి,ఐ.టీడీపీ అధ్యక్షులు అంగజాల శ్రీనివాసులు,తెదేపా సీనియర్ నాయకులు అదెప్ప తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
భక్తిశ్రద్ధలతో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,అమడగూరు05(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల కేంద్రంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 3వరోజు శనివారం ఆలయ ధర్మకర్త పొట్టిగా పురుషొత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యుల ఉభయదారుల ఆధ్వర్యంలో గంధం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అమ్మవారికి ధూపదీప,పట్టు వస్త్రాలు,నైవేద్యాలు సమర్పించి శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించారు.దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
$$$__________@@@__________$$$
3వ రోజు నృసింహ అవతారంలో స్వామివారు దర్శనం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, అక్టోబర్05(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో స్వయంగా వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయములో దశరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3రోజు శనివారం నృసింహస్వామి అలంకరణలో పల్లకిలో పురవీధులలో ఊరేగింపుగా ఖాద్రీ నృసింహు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.సదరు ఉత్సవములో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్ది, ఉత్సవ ఉభయదారులు శ్రీ.నాగేళ్ళ లక్ష్మీనరసింహ ప్రసాద్ కుటుంభ సభ్యులు, ప్రధాన అర్చకులు,దేవస్థానము సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సమాజంలో మంచి మార్పులు ఉపాధ్యాయులతో సాధ్యం
-ఎమ్మెల్యే కందికుంట
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, అక్టోబర్05(విజయస్వప్నం.నెట్)
కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన పలువురు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి అంటే ఉపాధ్యాయుల తోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు . మన రాష్ట్రంలో ఉపాధ్యాయుల చైతన్యంతోనే పలుమార్పులు చోటు చేసుకున్నాయని సమాజంలో మార్గదర్శకంగా ఉపాధ్యాయులు మిగిలిపోతారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధా ,చలం, సురేష్ , శ్రీధర్ రెడ్డి అక్కులప్ప దివ్య తదితరులకు సన్మానించారు ఈ కార్యక్రమం సీనియర్ పత్రిక విలేఖరి నగేష్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు
$$$__________@@@__________$$$
పుట్టపర్తి ఆర్డీఓగా సువర్ణ భాధ్యతలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి,అక్టోబర్05(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి ఆర్డీఓగా సువర్ణ శనివారం భాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న భాగ్యరేఖను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.తూర్పూ గోదావరి జిల్లాలో గ్రూపు వన్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న సువర్ణను పుట్టపర్తి ఆర్డీఓగా పదోన్నతిపై బదిలీ చేయగా, నూతనంగా ఆర్డీఓగా సువర్ణ భాధ్యతలు స్వీకరించారు.
$$$__________@@@__________$$$
ఎస్ఐ మల్లికార్జునరెడ్డి భాధ్యతలు స్వీకరణ
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అక్టోబర్ 05(విజయస్వప్నం.నెట్)
మండల పోలీసుస్టేషన్లో శనివారం ఎస్ఐగా బి.మల్లికార్జునరెడ్డి భాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వంశీకృష్ణ పదోన్నతిపై సిఐగా కళ్యాణదుర్గం బదిలీ అయ్యారని,ఆయన స్ధానంలో కనగానపల్లి ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఇక్కడికి బదిలీపై విచ్చేసి భాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.
$$$__________@@@__________$$$
తుమ్మల కొండపై స్వామివారికి తొలి శనివారం పూజలు
మండలంలోని తుమ్మల పంచాయతీ గ్రామ సమీపంలో తుమ్మల కొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల అమావాస్య ఉపవాస వ్రతాలు(ఒక్కపొద్దులు) సందర్భంగా మొదటి శనివారం ఘనంగా నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు చింతాశివారెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో భోజనాలు,మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతా శరత్ కుమార్ రెడ్డి,గోపిసెట్టి శ్రీనివాసులు,రామచంద్ర,సరళమ్మ,అదిమూర్తి,పూజారి రమణ,నరేష్ కుమార్ రెడ్డి,బిజెపి మండల అధ్యక్షులు సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మైనర్ బాలికపై అత్యాచార నిందితుడు రిమాండ్ కు తరలింపు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్05(విజయస్వప్నం.నట్)
అమడుగూరు మండలంలోని ఏ.పుట్లవాండ్లపల్లికి చెందిన 12 ఏళ్ళ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి లోతుగా దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఆమడగూరు మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వతరగతి చదువుకుంటున్న విద్యార్థినిపై బంధువైన రాజశేఖర్ అనే యువకుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని,ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసామన్నారు.
గ్రామాన్ని సందర్శించి విచారణ జరిపామని, నిందితుడిపై ఫోక్సో కేసు, అత్యాచార కేసులు నమోదు చేసి నిందితుడు రాజశేఖర్ ని రిమాండ్ గా తరలించినట్లు డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు.
$$$__________@@@__________$$$
సియం సహాయనిధికి చెక్కు
మాజీమంత్రి పల్లె కు యువ నాయకుడు సిద్దా చలపతి నాయుడు అందజేత
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అక్టోబర్05(విజయస్వప్నం.నెట్)
బుడమేరు ఉప్పోంగి ఉదృత ప్రవాహానికి అతలా కుతలమైన విజయవాడ వరద బాధితులను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి మండల తెదేపా యువ నాయకుడు ఇనగలూరు సిద్దా చలపతి నాయుడు రూ. 50 వేల చెక్కును మాజీ మంత్రి,పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జీ పల్లె రఘునాథరెడ్డికి అందజేశారు.అనంతపురంలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాసంలో శనివారం చెక్కు అందజేసారు.ఈ సందర్భంగా సిద్దా చలపతి నాయుడు విజయస్వప్నం.నెట్ ప్రతినిధితో మాట్లాడుతూ వరదలతో విజయవాడ ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైందని వరద బాధితులను ఆదుకునేందుకు అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చొరవ,కృషి,అమోఘమన్నారు.వరద బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు తనవంతు సాయంగా ఆర్థిక సాయాన్ని అందజేసినట్లు చెప్పారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపు మేరకు ధాతలు సేవాభావంతో మరింత స్పందించాలని ఆయన కోరారు.పల్లె కు చెక్కు అందజేసిన వారిలో సాకివేల శ్రీనివాసులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
డీఆర్డీఏ ఏపియంగా రవీంద్ర భాధ్యతలు
శ్రీసత్యసాయిజాల్లా, ఓడిచెరువు, అక్టోబర్05
మండల కేంద్రంలోని వడ్డివారిపల్లి గ్రామ సమీపంలో వెలుగు కార్యాలయంలో శనివారం ఏపియంగా రవీంద్ర భాధ్యతలు చేపట్టారు.నల్లచెరువు మండలంలో విధులు నిర్వహిస్తున్న బదిలీపై ఏపియం రవీంద్ర ఇక్కడి వచ్చారు.గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఏపియం రమణప్ప పుట్టపర్తి కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు.ఈసందర్భంగా వెలుగు సిసీలు,అనిమేటర్లు, సిబ్బందితో కలిసి నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఏపిఎం రవీంద్రకు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు.
$$$__________@@@__________$$$
వైకాపా నాయకుడి మృతదేహానికి నివాళులు కుటుంబ సభ్యులను పరామర్శించిన వైకాపా సిఈసి సభ్యులు కొత్తకోట
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్06(విజయస్వప్నం.నెట్)
మండలంలోని పూలకుంట్లపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శాంతమ్మ భర్త(వైకాపా నాయకులు) జగదీశ్వరరెడ్డి ఆదివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ సీఈసీ సభ్యులు డాక్టర్ కొత్తకోట సోమశేఖర రెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులు అర్పించి,ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
$$$__________@@@__________$$$
తంగేడుకుంట పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఓడిచెరువు, అక్షరవిజయం, అక్టోబర్06
మండలంలోని తంగేడుకుంట పంచాయతీ గ్రామ ఉన్నత పాఠశాలలో 2006-07 పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొని తమ తీపి గుర్తులు నెమరు వేసుకున్నారు.రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
నాటి అనుభూతులను గుర్తు చేసుకున్నారు. ఈకార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జయచంద్ర రెడ్డి,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చెన్నా రెడ్డి,ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాధమ్మ,ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, జనార్ధన, రవికుమార్, రమేష్, మధు, కరుణాకర్ రెడ్డి పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. అనంతరం విద్యార్థులచేత గురువులకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు ప్రమీల, కౌశిక్, వెంకటరమమురళి, నరసింహయ్య, అశ్విని, గుణవతి, నాగమణి, అశ్విని, వసుంధర, రేవతి, వనజ, ద్రాక్షాయిని, అశ్విని తదితరులు పాల్గొన్నారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయిని,అవార్డు గ్రహీత తాడిమర్రి రాధమ్మ ను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
$$$__________@@@__________$$$
వైద్యశిబిరంలో అన్నదానం
మండల పరిధిలోని కొండకమర్ల పంచాయతీ గ్రామంలో ఆదివారం శ్రీసత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్యశిబిరం నిర్వహించగా బాబా భక్తుడు ఇడగొట్టు ఆంజనేయులు వైద్యశిబిరంలో హాజరైన ప్రజలకు అన్నదానం సౌకర్యం కల్పించారు. ఈసందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.... ప్రతి నెల 6వతేది శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొండకమర్ల గ్రామంలో ఉచిత ఆరోగ్య వైద్యశిబిరం నిర్వహిస్తారని అందులో భాగంగా వైద్య చికిత్సలు కోసం విచ్చేసిన 200 మందికి అన్నదానం ఏర్పాటు చేశారన్నారు.
$$$__________@@@__________$$$
4వ రోజు శ్రీరామావతార అలంకరణలో స్వామివారు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, అక్టోబర్06(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయములో దశరా శరన్నవరాత్రి ఆలంకార మహోత్సవాల్లో భాగంగా 4వరోజు ఆదివారం స్వామి వారు శ్రీ రామావతార అలంకరణలో పల్లకిలో పురవీధులలో ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు.ఖాద్రీ నృసింహుస్వామివారి ఉత్సవంలో భక్తులు రామ నామ జపం చేస్తూ....రామభజనలు చేశారు.సదరు ఉత్సవములో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్ది,ఉత్సవ ఉభయదారులు ముక్కర వెంగయ్య,డా.జి.శంకరయ్య,కుటుంబ సభ్యులు దేవస్థానము సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
నూతన ఎంపీడీఓకి పలువురు సన్మానం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,అక్టోబర్ 07(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సోమవారం గత రెండు రోజుల క్రితం నూతనంగా భాధ్యతలు చేపట్టిన ఎంపిడిఓ రాబర్ట్ విల్సన్ ను సోమవారం ఎంపీపీ పర్వీన్ భాను,తెదేపా,బిజేపీ కూటమి నాయకులు,కార్యకర్తలు వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది ఎంపిడిఓను గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి పరిచయాలు చేసుకున్నారు.అలాగే ఈఓఆర్డిడీగా భాధ్యతలు చేపట్టిన కేశవరెడ్డిని సన్మనించి శుభాకాంక్షలు తెలిపారు.ఎంపిపి పర్వీన్ భాను,మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,మండల కన్వీనర్ జయచంద్ర,ఎంపిటీసీ శ్రీనివాసులు,బిజేపీ నాయకులు రంగారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరికృష్ణ,నరేష్,ఎబివిపి జిల్లా కార్యదర్శి వాసు,ఓడిచెరువు సర్పంచ్ గోవిందు తదితర ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
అక్కదేవతల ఆలయంలో శరన్నవరాత్రులు
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు) అక్టోబర్ 07(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో సోమవారం శరన్నవరాత్రులు 5వరోజు పూజరి వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీ అక్కదేవతల ప్రతిమలను వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి,అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమానికి దుప్పట్లు అందజేత
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్07(విజయస్వప్నం.నెట్)
మండలంలోని గాజులపల్లి సమీపంలో ఉన్న శ్రీమాతృశ్రీ ఆశ్రమంలో వృద్ధులు చలికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని నల్లచెరువు మండలానికి చెందిన తగలుమర్రి నాగమల్లు ఆశ్రమాన్ని సోమవారం సందర్శించి 25 దుప్పట్లు అందజేశారు ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ దాత నాగమల్లుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఎస్ఐ వెంకటనారాయణ ఆశ్రమంలో వృద్ధులను అప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి సేవలను కొనియాడుతూ....సంతృప్తి వ్యక్తం చేశారు.
$$$__________@@@__________$$$
మురళీకృష్ణుడి రూపంలో శ్రీఖాద్రీశుని దర్శనం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు కదిరి అక్టోబర్07(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో సోమవారం దశరా శరన్నవరాత్రి అలంకరణ మహోత్సవాలు నిర్వహించారు.దశరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 రోజు మంగళవారం స్వామివారు శ్రీకృష్ణావతార అలంకరణలో విద్యుత్ కాంతులతో పల్లకిపై పురవీధుల్లో ఊరేగుతూ ఖాద్రీ నృసింహుస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.ఈ శరన్నవరాత్రుల కార్యక్రమంలో ఆలయ నిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి, ఉత్సవ ఉభయదారులు కీ,శే.జోన్నా వీరయ్య,కీ.శే.జోన్నా వీరశేషయ్య ,కుటుంబ సభ్యులు,ఆలయ ప్రధాన అర్చకులు, దేవస్థానం సిబ్బంది తదితర భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
గ్రామ కార్యదర్శుల ఐక్యత సంఘం ఎంపిక
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్07(విజయస్వప్నం.నెట్)
అమడగూరు మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు సోమవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు పంచాయతీ గ్రామ కార్యదర్శుల ఐక్యత సంఘం ఎంపిక చేసినట్లు తెలిపారు. అధ్యక్షురాలుగా పి.మమత, ఉపాధ్యక్షులుగా బి.బాస్కర, కోశాధికారిగా బి.చంద్ర, కార్యదర్శిగా వి.రామలింగారెడ్డి లతోపాటు కార్యవర్గ సభ్యులుగా ఎస్.సునియ, ఎ.నరేంద్ర, వై.శ్రీనివాసులు, బి.జానకి లను ఎన్నుకున్నారని పేర్కొంటూ.... కమిటీ పత్రాలను ఎంపీడీవో మునియప్పకు అందజేశారు.
$$$__________@@@__________$$$
దేవుని విగ్రహల చోరీకేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్టు
చోరీ కాబడిన విగ్రహాలు స్వాదీనం
అమడగూరు, జనసేన న్యూస్, అక్టోబర్07(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తుమ్మలకొండపైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ కాబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం,పద్మావతి అమ్మవారి పంచలోహ విగ్రహం,వెండి గొడుగు ఒకటి,వెండి ముఖ కవచాన్ని శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా ఇంఛార్జ్ డిఎస్పీ,పుట్టపర్తి డిఎస్పీ ఉత్తర్వుల మేరకు పుట్టపర్తి పట్టణ సిఐ పర్యవేక్షణలో ఆమడగూరు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఏ.వెంకటనారాయణ,స్టేషన్ హెడ్-కానిస్టేబుల్ పి.సూర్యనారాయణ,కానిస్టేబుళ్లు ఏ.విజయ భాస్కర్,ఏ. తాజ్ లతో కలిసి తనిఖి నిర్వహిస్తుండగా వెంకటనారాయణపల్లి మలుపు వద్ద ముద్దాయిలు డోర్ నెంబర్,3-110, కొత్త నిడిమామిడి గ్రామం,పుట్టపర్తి రూరల్ మండలం,శ్రీ సత్య సాయి జిల్లా,ప్రస్తుతం మామిళ్లకుంట్లపల్లి గ్రామం, ఓబుల దేవరచెరువు మండలానికి చెందిన నరసింహులు కుమారుడు నగరిగిరి గంగరాజు, డోర్ నెంబర్,1/135, ఎలక్కుంట్ల గ్రామం,ధర్మవరం రూరల్ మండలం(శ్రీసత్యసాయిజిల్లా) చెడిపోతుల నారాయణస్వామి కుమారుడు చెడిపోతుల నాగరాజు వీరిరువురిని అరెస్టు చేసి చోరీ కాబడిన విగ్రహాలను,వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకొని రిమాండ్ నిమిత్తం కదిరి కోర్ట్ కి పంపించారని సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
$$$__________@@@__________$$$
గ్రామ పంచాయతీ కార్యదర్శి మమత భాధ్యతలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్07(విజయస్వప్నం.నెట్)
ఆమడగూరు పంచాయతీ గ్రామ కార్యదర్శిగా పి.మమత సోమవారం భాధ్యతలు చేపట్టారు. నూతనంగా భాధ్యతలు చేపట్టిన గ్రామ కార్యదర్శి మమతను పలువురు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.గతంలో ఇక్కడ ఇంచార్జి కార్యదర్శిగా విధులు నిర్వహించిన బి.చంద్రను ఘనంగా సన్మానించి సిబ్బంది వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమం నందు డిజిటల్ అసిస్టెంట్ అశోక్. సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలి :డిటిఎఫ్
శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు, అక్టోబర్ 08(విజయస్వప్నం.నెట్)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో యస్.జి.టీలకు కూడా ఓటు హక్కు కల్పించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ డిమాండ్ చేశారు.కొన్ని దశాబ్దాలుగా టిచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవటం వారిని అగౌరవపరచటమేనన్నారు.ఉపాధ్యాయ హక్కుల సాధనలో యస్.జి.టి లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యత్వ నమోదుతోపాటు ఉద్యమాలు కూడా వారివల్లే విజయవంతమవుతున్నాయని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. ఉపాధ్యాయుడికి ఐకాన్ అవార్డు
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు,అక్టోబర్08(విజయస్వప్నం.నెట్)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాంతి ఫౌండేషన్ వారు శ్రీసత్యసాయిజిల్లా ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ కు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఇంటర్నేషనల్ టీచర్ ఐకాన్ అవార్డ్ 2024 ఆన్లైన్లో మంగళవారం ప్రకటించారని తెలిపారు.ఉపాధ్యాయుడు గౌస్ లాజమ్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా పలుపురు అభినందించారు.అవార్డు గ్రహీత గౌస్ లాజమ్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా విద్యారంగంలో చేసిన కృషి గుర్తించి ఈ అవార్డు అందజేశారనిఅని తెలిపారు.
$$$__________@@@__________$$$
గ్రామ పంచాయతీ పాలకులకు శిక్షణ తరగతులు
శ్రీసత్యసాయిజాల్లా ఓడిచెరువు,అక్టోబర్08(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నేటి నుంచి రెండు రోజుల పాటు గ్రామ పంచాయతీ సర్పంచులకు,ఉప సర్పంచులకు,వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని మంగళవారం ఎంపిడిఓ రాబర్ట్ విల్సన్ ఓప్రకటనలో తెలిపారు.జిల్లా పంచాయతీ అధికారి సూచనల మేరకు 2024-25 ఆర్జీఎస్ఏ కార్యాచరణ ప్రణాళికపై 9వతేది బుధవారం నుండి 10వతేది వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని పేర్కొంటూ....అన్ని పంచాయతీ గ్రామ సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు సభ్యులు హాజరై శిక్షణ తరగతుల కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
$$$__________@@@__________$$$
మామిడి తోటలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్08(విజయస్వప్నం.నెట్)
ఒంటిపై రక్తపు గాయాలతో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని మహమ్మదాబాద్ సమీపంలోని మామిడితోటలో చోటుచేసుకుంది.విజయవాడ సిసిఎస్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తికి చెందిన మామిడి తోటలో పెనుకొండ పట్టణానికి చెందిన రామలక్ష్మమ్మ అనే మహిళ ఏడాది నుంచి కాపలాగా ఉంటోంది.తల్లిని చూసేందుకని ఆమె కుమారుడు మంగళవారం తోట వద్దకు రాగా ఒంటిపై రక్తపు గాయాలతో మామిడి తోటలో ఉన్న ఒక గదిలో ఆమె విగతజీవిగా పడి ఉండడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.విషయం తెలుసుకున్న కదిరి డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటనారాయణతో కలిసి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.గది ఆవరణంలో పారకు రక్తపు మరకలు ఉండడాన్ని గమనించారు.డాగ్ స్క్వాడ్ ను రప్పించి మహిళ మృతికి గల కారణాలపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
$$$__________@@@__________$$$
కుక్కల స్వైరవిహారం
బాలికపై దాడి చేసి గాయపరిచిన కుక్కలు
భయాందోళనలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు
అమడగూరు,జనసేన న్యూస్,అక్టోబర్08
అడవి మృగాలను తలపించేలా గ్రామ సింహాలు జనాలపై విరుచుకుపడుతూ ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఎవరినో ఒకరిని కరిచి గాయపరుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటన సంఘటనలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.అయితే కుక్కల దాడిలో బాలిక గాయపడిన సంఘటన మండలంలోని జవుకులకొత్తపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వీధి కుక్కలు గ్రామాలపై పడి ప్రజలను చంపి పీక్కు తినే రోజులొచ్చే కాలం ఎంతో దూరం లేదనడానికి ఈ సంఘటన నిదర్శనం. మండలంలోని జవుకులకొత్తపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలిక శ్రీనిధిరాయ్ తన ఇంటి ఆవరణలో నిలబడి వుండగా కుక్కలు బాలికపై దాడి చేసి గాయపరిచాయి.బాధిత బాలిక శ్రీనిధిరాయ్ తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు తమ కుమార్తె ఇంటి ఆరుబయట వుండగా కుక్కలు ఒక్కసారిగా వచ్చి దాడి చేయగా గొంతు, శరీరంపై తీవ్రంగా గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.బాలిక తల్లిదండ్రులు, చుట్టు ప్రక్కల వారు అప్రమత్తమై కుక్కలను తరిమివేశామన్నారు. ముఖంపై,గొంతు వద్ద గాయాలతో ప్రాణాలతో బయట పడిందన్నారు. సంబంధిత అధికారులు కుక్కలను గ్రామాల్లో సంచరించకుండ నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. గ్రామాల్లో చిన్నారులను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురౌతున్నారు.అంతే కాకుండా పాదచారులు సైతం ఎటు వైపు నుండి దాడి చేస్తాయో .... క్రూర కుక్కలు బాబోయ్ అంటూ పరుగు పందెం తలపించేలా కాళ్లకు బుద్ది చెబుతారని చర్చించుకుంటున్నారు.
$$$__________@@@__________$$$
మహిళా సంఘాల కట్టుబాట్లు తప్పనిసరి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు అక్టోబర్08(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని బసప్పగారిపల్లి గ్రామంలో మంగళవారం ఏపియం రవీంద్ర ఆధ్వర్యంలో దుర్గా గ్రామెఖ్యై మహిళా సంఘాల పరిధిలోని స్వయం సహాయక పొదుపు సంఘాల సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ సంఘం కట్టుబాట్లు పాటించాలని,పొదుపు జిల్లాతోపాటు తీసుకున్న రుణాలను నిర్ణయించిన కంతుల ప్రకారం సకాలంలో చెల్లించాలని, బకాయి ఉన్న శ్రీనిధి రుణాలను త్వరగా చెల్లించి,తిరిగి మరిన్ని రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.అనంతరం పొదుపు,రుణాలు, చెల్లింపులు తదితర పుస్తకాలు పరిశీలించి, లావాదేవీలపై సమీక్షించారు. ఈకార్యక్రమంలో గ్రామ సంఘం ప్రతినిధి ఈశ్వరమ్మ,సిసి రమణ,అనిమేటర్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఆరవ రోజు శ్రీ ఖాద్రీడికి ప్రత్యేక అలంకరణ
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి,అక్టోబర్08(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 6వరోజు మంగళవారం పరమపదనాధుడు అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.శరన్నవరాత్రుల వేడుకలు నిత్య కైంకర్యాలు, అలంకరణలతో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీ ఖాద్రీశుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
$$$__________@@@__________$$$
సరస్వతిధేవి రూపంలో శ్రీఖాద్రీశుడు దర్శనం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి,అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయములో దశరా శరన్నవరాత్రి అలంకరణ మహోత్సవముల్లో భాగంగా 7వరోజు బుధవారం స్వామి వారు చదువుల తల్లి శ్రీసరస్వతిదేవి అలంకరణ రూపంలో తిరువీధుల్లో పల్లకిలో ఊరేగుతూ ఖాద్రీ నృసింహుస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.సదరు శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్ది,ఉత్సవ ఉభయదారులు యూనియన్ బ్యాంకు వారు(కీ.శే.మావిళ్ళ నాగరాజు,శ్రీమతి.మావిళ్ళ ప్రద్మవతి)మావిళ్ళ సూర్యప్రభకర్,శ్రీమతి.సత్యవతమ్మ కుటుంబ సభ్యులు, ప్రధాన అర్చకులు,దేవస్థానము సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
నేను నుండి మనం వరకూ....
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
నేను నుండి మనం వరకు గర్భవతులు కొనసాగించే ప్రయాణం ఓ అద్భుతమని గర్భం స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప బహుమానం,సంతోషకరమైన అందమైన దశ అని ఈ సమయంలో అన్ని మెలకువలతో ఆరోగ్య జాగ్రత్తలు పాటించినప్పుడే చక్కటి సంతానం పొందటానికి వీలు అవుతుందని వైద్యాధికారి భాను ప్రకాష్ తెలిపారు.బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భవతులలో మొదటి త్రైమాసికంలో గణనీయమైన శారీరక,మానసిక మార్పులు వస్తాయని,ఇందుకు అనుగుణంగా ఆహార అలవాట్ల విషయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం చాలా కీలకంగా పేర్కొన్నారు.సమయానుకూలంగా పోషక,ఖనిజ,పిండి పదార్థములు కలిగిన సమతుల్య ఆహార పోషక విలువలతో కూడిన మాంసకృతులు,గ్రుడ్డు,పాలు,ఆకుకూరల్లో ఐరన్ ధాతువు,పసుపు-ఆకుపచ్చ కూరగాయలు,ప్రకృతి సిద్ధంగా విటమిన్ కిరణాల స్వీకరణ మొదలైనవి తీసుకోవడం ద్వారా శిశువు ఎదుగుదలలో ఏర్పడే అనిశ్చితులను ఆదిలోనే నివారించవచ్చని సూచించారు.డాక్టర్ కమల్ రోహిత్ మాట్లాడుతూ ప్రమాద సంకేత ఆహార అలవాట్లలో నూనె,కొవ్వు పదార్థాలు,పచ్చి మాంసం,ధూమపానం,ఆల్కహాలు మొదలైనవి నివారించుకుంటూ వైద్యులు సూచించే సూచనలు,జాగ్రత్తలు పాటించినప్పుడు ఆరోగ్యకర గర్భధారణ ప్రయాణం సులభంగా,సురక్షితంగా ఉంటుందని తెలిపారు.ఈకార్యక్రమానికి హాజరైన 51మంది గర్భవతులలో 11మందిని హైరిస్క్ వారుగా గుర్తించి ఉచిత స్కానింగ్ సిఫారసు,ప్రత్యేక చికిత్సతో పాటు ఉచిత మందుల పంపిణీ చేశారు.హాజరైన గర్భవతులు,వారి సహాయకులకు కదిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు నాగేళ్ల రంజిత్,సేగు సాగర్ భోజన వసతి కల్పించారు.ప్రతినెలా రోటరీ క్లబ్ సంస్థ సభ్యుల భాగస్వామ్యాన్ని, సేవా గుణాన్ని పలువురు ప్రశంసిస్తూ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది దిల్ షాద్,విజయ కుమారి,అరుణ జ్యోతి,శ్రావణి, సుప్రియ,హేమావతి,మనోహర్,శ్రీనివాసులురెడ్డి,నరేంద్ర, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
కేజీబీవీ పాఠశాలలో ఖాళీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కేజీబీవీ(కస్తూరిబా బాలికల విద్యాలయంలో)కేటగిరి ఫోర్త్(IV)బోధనేతర సిబ్బంది ఉద్యోగాలైన రెండు సహాయ వంటమనిషి పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బుధవారం మండల విద్యాధికారి జిలాన్ భాష విలేకరుల సమావేశంలో తెలిపారు.ఒప్పంద(కాంట్రాక్ట్)ప్రాతిపదికన భర్తీ చేయుటకు స్థానిక మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని,అభ్యర్థుల వయసు 1.07.2024 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని,.ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఈడబ్ల్యూస్ మహిళలకు 47 సంవత్సరాలు ఉండవచ్చునని,దివ్యాంగ మహిళలకు 52 సంవత్సరాలు వయసు ఉండవచ్చునని,ఎక్స్ సర్వీస్ ఉమెన్(మహిళా)అయితే 45 సంవత్సరాల వయసు ఉండవచ్చునని,దరఖాస్తులు ఈనెల15 సాయంత్రం నాలుగు గంటల వరకు మండల విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారిణి సంపూర్ణ పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ప్రజలకు అందుబాటులో ఉద్యోగ సిబ్బంది ఉండాలి
శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని గ్రామ సచివాలయంల్లో ఉద్యోగ సిబ్బంది సమయపాలన పాటిస్తూ.... ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాలు అందించాలని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రాబర్ట్ విల్సన్ సూచించారు.ఓడిచెరువు గ్రామ పంచాయతీ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాలు అందించాలని సూచించారు.అనంతరం రికార్డులు పరిశీలించి, అక్కడున్న ఉద్యోగ సిబ్బందికి విధుల నిర్వహణ తదితర అంశాలపై సలహాలు సూచనలిచ్చారు.
$$$__________@@@__________$$$
స్వరస్వతి రూపంలో శ్రీ చౌడేశ్వరిదేవి దర్శనం
భక్తిశ్రద్ధలతో దసరా నవరాత్రుల ఉత్సవాలు
ఆలయంలో ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి ప్రత్యేక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో వెలసిన శ్రీచౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఏడవ రోజు బుధవారం స్వరస్వతి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం వేదమంత్రోత్సవాల నడుమ హోమయాగం నిర్వహించారు.భక్తాదులతో ఆలయం కిటకిట లాడింది. పక్క రాష్ట్రాలైన కర్ణాటక,తమిళనాడు నుండి భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం కోసం తరలివచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తమ రెడ్డి,ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.భక్తులకు కొంగు బంగారమై విరాజుల్లె శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరించి,అమ్మవారికి పట్టు వస్త్రాలు నైవేద్యాలు సమర్పించి,దీపారాధన గావించి భక్తులకు శ్రీ చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మహిళా ప్రజాప్రతినిధుల స్థానాల్లో భర్తలు హాజరు
రెండు రోజుల శిక్షణ తరగతుల్లో కొనసాగిన తంతు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
గ్రామస్థాయిలో ఎన్నికైన మహిళలు పేరుకు మాత్రమే ప్రజా ప్రతినిధులుగా వుంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో భర్తలు హాజరై పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధులుగా మహిళలు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది.అలాంటి అంశమే మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శిక్షణ తరగతుల కార్యక్రమంలో కొనసాగింది.మహిళా రిజర్వేషన్లు, మహిళా సాధికారత,పురుషులతో పాటు సమానంగా మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యా,వైద్య, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు పరిచింది.ఇదిలా వుండగా బుధవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఈఓఆర్డిడీ కేశవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్డిఎస్ఏ కార్యాచరణ ప్రణాళిక,ఏపిపిఆర్ చట్టం నిబంధనలు తదితర అంశాలపై పంచాయతీ గ్రామ పాలకుల రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా తొలి రోజు సమావేశంలో మహిళల ప్రజా ప్రతినిధుల స్ధానంలో భర్తలు హాజరు కావడం షరా మామూలుగా వుంది.ఎంపీపీ పర్వీన్ భాను అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమంలో ఆమె భర్త షామీర్ బాషా హాజరైయ్యారు.అలాగే మండల పరిధిలోని నాలుగు పంచాయతీ గ్రామ మహిళా సర్పంచుల స్థానాల్లో భర్తలు హాజరైయ్యారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాల సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధుల స్థానాల్లో భర్తలు హాజరవుతున్న కూడా అధికారులు మాత్రం తమకేమీ పెట్టినట్లుగా వ్యవహరించడం రమారమి మారింది.మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలను చైతన్యవంతం చేస్తుంది.ఈకార్యక్రమాలో సర్పంచులు,గ్రామ కార్యదర్శులు, వార్డు సభ్యులు
$$$__________@@@__________$$$
పుట్టపర్తి నియోజకవర్గం లో ఈ నెల 14 నుంచి 19 వరకు పల్లె పండుగ వారోత్సవాలు
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు భూమి పూజ వారోత్సవాలు.
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
సమగ్ర గ్రామీణ అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 14 నుంచి 19 వరకు పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో పల్లె పండుగ వారోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నారు .అందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలో రూ.20 కోట్లతో అన్ని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో సిసి రోడ్లు,డ్రైనేజీ,కల్వర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు .ఎమ్మెల్యేతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని,ఈ అభివృద్ధి పనులను ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాదికి నియోజకవర్గంలో మంజూరైన 20 కోట్ల నిధులతో ఈ పనులు ఆయా పంచాయతీల్లో చేపట్టనున్నారు. ముందుగా కొత్తచెరువు మండలంలో ఈనెల 14న ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు కొత్తచెరువు పంచాయతీలో అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలసి భూమి పూజ చేస్తారు. అదే రోజున మండలంలోని లోచర్ల పంచాయతీలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.14న కొత్త చెరువు మండలంలోని కొత్త చెరువు, లోచర్ల పంచాయతీ గ్రామాల్లో, 15 న పుట్టపర్తి మండలంలోని కప్పలబండ, జగరాజుపల్లి, వెంకటగారిపల్లి, పెడబల్లి పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేస్తారు.16న బుక్క పట్నం మండలంలోని బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి సిద్దరాంపురం గ్రామాల్లో,17న నల్లమాడ మండలంలోని నల్లమాడ పంచాయతీలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.18 న ఓడి చెరువు మండలంలోని ఓడి చెరువు, సున్నంపల్లి పంచాయతీ గ్రామాల్లో,19న ఆమడగూరు మండలంలోని ఆమడగూరు, గుండువారిపల్లి పంచాయతీ గ్రామాల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. కావున పుట్టపర్తి నియోజకవర్గం లోని ఆయా మండలాల్లో జరిగే అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారి చే భూమి పూజ కార్యక్రమానికి పైన ప్రకటించిన తేదీల్లో హాజరవుతారు. ప్రతి ఒక్కరూ హాజరు కాగలరని మనవి.
ఆయా మండలాల స్థానిక అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక తెదేపా, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరు కావాలని కోరారు.
$$$__________@@@__________$$$
ఈనెల 12న పుట్టపర్తి శిల్పారామంలో దసరా ఉత్సవాలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి,అక్టోబర్09(విజయస్వప్నం.నెట్)
ఈనెల 12న విజయదశమి దసరా పండుగ పురష్కరించుకుని పుట్టపర్తి శిల్పారామంలో కళలను పోషించడానికి, కళాకారులను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో సాంస్కృతిక సాంప్రదాయ సమూహారం శిల్పారామంలో వైభవంగా వేడుకలు నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శిల్పారామం పరిపాలన శాఖ అధికారి రమేష్ రెడ్డి మంగళవారం తెలిపారు. విజయదశమి పండుగ రోజు సాయంత్రం 4గంటల నుండి 8 వరకు జబర్దస్త్ టీవీ షో ఆర్టిస్టులు బుల్లెట్ భాస్కర్, నరేష్, పైమా లతో హాస్యం పండించే కార్యక్రమాలు, చిత్తూరు జిల్లా కళాతరంగిణి వారి ఆధ్వర్యంలో డిజే పాటలతో నృత్యాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విస్తృతంగా ప్రచారం చేపట్టారని ఆయన చెప్పారు. ఈకార్యక్రమాలకు ఆర్ధికంగా సహాయ సహకారాలు అందించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీసత్యసాయిజిల్లా పలు నియోజకవర్గాల మండల,గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
$$$__________@@@__________$$$
8వరోజు మోహిని అలంకరణలో శ్రీఖాద్రీశుడు దర్శనం
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి,
అక్టోబర్10(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయములో దశరా శరన్నవరాత్రి అలంకరణ మహోత్సవముల్లో భాగంగా 7వరోజు గురువారం శ్రీ మహావిష్ణువు అవతారమైన మోహిని అమ్మవారి అలంకరణ రూపంలో తిరువీధుల్లో పల్లకిలో ఊరేగుతూ ఖాద్రీ నృసింహుస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సదరు శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్ది, ఉత్సవ ఉభయదారులు కీ,శే,మంగు రామారావు కుమారుడు డాక్టర్ రమణమూర్తి కుటుంబ సభ్యులు, ప్రధాన అర్చకులు,దేవస్థానము సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, అక్టోబర్10 (విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో గురువారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రంగారెడ్డి అధ్యక్షతన, యువమోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎస్టీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓడిచెరువు మండల ఇన్చార్జ్ భాస్కర్ నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సామాన్య,పేద, మధ్యతరగతి ప్రజలకు అందిస్తు మన్ననలు పొందుతోంది,దేశం సుభిక్షంగా ఉండాలంటే భవిష్యత్తు తరాలకు భరోసా కావాలంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీనే సాధ్యమని,భారతదేశాన్ని ముందుకు నడిపే విషయంలో ఎప్పుడు ముందుండి ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తుందని,నరేంద్ర మోడీ నిర్వహిస్తున్నటువంటి ఉచిత రేషన్ బియ్యం కార్యక్రమాన్ని తిరిగి 2028 డిసెంబర్ వరకు పొడిగించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయాలని,ఈ పథకం ద్వారా 80 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందుతున్నారని,17,082 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఈసందర్భంగా ఆయన కోరుతూ పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుతోట హరికృష్ణ,అశ్వర్తప్ప,బిజేవైయం జిల్లా కార్యదర్శి ఎ.నరేష్ బాబు,మండల ఉపాధ్యక్షులు నాగప్ప,మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సి.జనార్ధన్, వెంకటేష్, కార్యవర్గ సభ్యులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
బిజేపీ నాయకుడిని పరామర్శ
మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త కిష్టప్ప ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాళ్ళుకు గాయాలు అయ్యి ఇంటి వద్ద చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బిజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయక్,మండల బిజెపి నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించి,ఆర్థిక సాయం అందించి,వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పిభాజపా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రంగారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యుడు అశ్వర్ధప్ప,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,ఎస్సీ మోర్చా కార్యదర్శి నరసింహులు,బిజేవైయం జిల్లా కార్యదర్శి నరేష్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
బదిలీపై వెళ్తన్న సీసీలకు సన్మానం
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు,అక్టోబర్10
(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ,గౌనిపల్లి గ్రామ సంఘంలో గురువారం నూతన ఏపీఎం రవీంద్ర,నూతన సీసీ సోమశేఖర్ రెడ్డిఆధ్వర్యంలో పొదుపు మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సంఘం ప్రతినిధులతో కలిసి సీసీలు శ్రీనివాసులు,ఎం. భూషణ్ లను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో అనిమేటర్లు రమాదేవి, మంజలమ్మ, రామచంద్ర, సుధాకర, మూర్తి, దీపిక, ఉషా, శ్రావణి, హేమవతి, తెదేపా నాయకులు బోయపల్లి శివారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, రాజగోపాల్,డీలర్ శివనారాయణ, పాఠశాల కమిటీ చైర్మన్ మవిటీ రాజేష్, పలక గంగన్న, మునిస్వామి, పూజారి సుధాకర తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఏపిఎం రవీంద్రను సన్మానించిన తెదేపా శ్రేణులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,అక్టోబర్10(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకుమర్ల పంచాయతీ గ్రామానికి చెందిన తెలుగుదేశంపార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం మండల కేంద్రంలో ఇటీవల డిఆర్డీఏగా భాధ్యతలు చేపట్టిన రవీంద్ర రవీంద్రను గౌరవ పూర్వకంగా కలిసి శ్రీ భగవాన్ శ్రీసత్యసాయిబాబా చిత్రపటం అందించి, అనంతరం శాలువా కప్పి సన్మానించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగిరెడ్డిగారి రాజారెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్ సాద హోలీ. నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇరుగుట్టు ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, ఆదినారాయణ నాయక్, ఎస్సీ సెల్ కార్యదర్శి బడిశం సురేష్, పీట్ల మనోహర్. ఎస్.డి.రామచంద్ర, ఆంజనేయులు. శంకర్ నాయక్,గోవిందు నాయక్. ఎస్ గంగాద్రి, ప్రసాద్ తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కర్ణాటక ఉత్తరల్లి బిజెపి ఎమ్మెల్యే కృష్ణప్ప
సేవా దృక్పథంతో ఆలయ అభివృద్ధికి అమ్మవారి భక్తుడిగా సేవలు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,
అక్టోబర్10(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఉత్తరల్లి బిజెపి ఎమ్మెల్యే కృష్ణప్ప (బెంగళూరు సౌత్ ) అమ్మవారి మీద ఉన్న భక్తికి నిదర్శనమే ఆలయం అభివృద్ధి,కళ్యాణ మండపం, అతిధి గృహాలు తదితర వసతి సౌకర్యాల గృహలు నిర్మించడమే కాకుండా పేదలకు, వృద్ధులకు నిత్యన్నదానం సేవలందిస్తున్నారు. గురువారం ఆయన మండలంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యాల కోసం పాఠశాల ప్రాంగణం ముందు అమడగూరు సర్పంచ్ షబ్బీర్ ఆధ్వర్యంలో ఏర్పర్చిన ఫుట్ పాత్ ను స్వయంగా తన సొంత నిధులు ఇచ్చి నిర్మించారు.అలాగే మండలంలోని గ్రామ ప్రజలు, బిజేపీ నాయకులు ఐ.రాము, దొడ్డం నరసింహమూర్తి, అంగడి బాబు ఈ కార్యక్రమానికి నిధులు సమకూర్చారు. గురువారం ఫుట్ పాత్ ను ఎమ్మెల్యే కృష్ణప్ప చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం మంగళ వాయిద్యాలతో ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే కి పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు.అనంతరం దృశ్యాలవతో సన్మానించారు. దేవాలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రులు 7వరోజు చాముండి హోమం కార్యక్రమం లో వేద పండితుల మంత్రోచ్ఛారణతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు.హోమం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఆలయ ధర్మకర్త తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్ప, సతీమణి గాయత్రి కుటుంబ సభ్యులు మంజునాథ,గోవిందు రాజులు, శంకరప్ప, జనార్ధన, శ్రీనివాస్, వెంకటేష్, ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉమాదేవి,మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, సర్పంచ్ షబ్బీర్, దొడ్డం మూర్తి, అశోక్ సప్లైయర్స్ రమేష్,ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
$$$__________@@@__________$$$
ఫోక్సో కేసులో బాధితురాలని పరామర్శించిన ఆర్డీవో సువర్ణ
ధైర్యంగా ఉండాలంటూ న్యాయం జరిగేలా
చూస్తామని భరోసాఇచ్చారు
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్10(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని పుట్లవాండ్లపల్లి లో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వచ్చిన ఆర్డీవో సువర్ణ గురువారం నాడు బాధితురాలని వారి ఇంటి వద్ద పరామర్శించి ధైర్యం చెప్పారు.ఇలాంటి సమయంలోనే నిలకడగా ఉండాలని, ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. బాధితురాలు ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు, కష్ట సమయాల్లో తమకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ ద్వారా ఆమె మొబైల్ నెంబర్ ను బాధితురాలికి అందజేశారు బాధితురాలు భవిష్యత్తు ని దృష్టిలో ఉంచుకుని పై చదువుల నిమిత్తం ప్రభుత్వం తరఫున సిఫారసు చేస్తామని ఆమె భవిష్యత్తును కాపాడుతామని బాధితురాలికి హామీ ఇచ్చారు ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు రెవెన్యూ సిబ్బంది తహసిల్దార్ రామ్నాథ్ రెడ్డి, ఆర్ ఐ ఈశ్వరయ్య, వీఆర్వో పవన్, అంగన్వాడీ సూపర్వైజర్ గంగాదేవి పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, కానిస్టేబుల్ తాజు, అంగన్వాడి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మహిళ మృతి చెందిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ సునీత
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్10(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామ శివారులో సుబ్బయ్య నార వద్ద మామిడి తోటలో కాపలా ఉంటున్న మహిళ అనుమానాస్పద స్థితిలో పెనుగొండ పట్టణానికి చెందిన రామలక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందిన ప్రాంతాన్ని గురువారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత పరిశీలించారు. అనంతరం అమడగూరు పోలీస్ స్టేషన్ సందర్శించి కేసుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.త్వరలోనే నిందితున్ని పట్టుకొని విచారణ జరిపి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మండల పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య పనులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,అక్టోబర్10(విజయస్వప్నం.నెట్)
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం ఎంపిడిఓ రాబర్ట్ విల్సన్, ఈఓఆర్డిడీ కేశవరెడ్డి సూచనల మేరకు స్వచ్ఛ భారత్ కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు.కార్యాలయం వెనుక వైపు చుట్టు పక్కల వున్న ఏపుగా పెరిగిన గడ్డి మొక్కలు, పేరుకుపోయిన చెత్త చెందారని తొలగించి స్వచ్ఛ భారత్ వాహనం ద్వారా తరలించారు.