google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : తెదేపా పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ - బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘన సన్మానం - వరి నల్లి తెగుళ్లపై రైతులకు అవగాహన - తొలి రోజు శ్రీ మత్స్యావతార అలంకరణలో ఖాద్రీశుడు

4, అక్టోబర్ 2024, శుక్రవారం

తెదేపా పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ - బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘన సన్మానం - వరి నల్లి తెగుళ్లపై రైతులకు అవగాహన - తొలి రోజు శ్రీ మత్స్యావతార అలంకరణలో ఖాద్రీశుడు

జీవో 117 రద్దు చేయాలని డిటీఎఫ్ నిరసన

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) పుట్టపర్తి,అక్టోబర్02(విజయస్వప్నం.నెట్)

డిటీఎఫ్(డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్)ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి సందర్భంగా బుధవారం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జీవో 117ని రద్దు చేయాలని,మాతృభాష మాధ్యమం అమలు కొరకు నిరసన ప్రదర్శన నిర్వహించారని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్ధీన్,జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ జీవో 117 రద్దు చేయాలని,ఆంగ్ల భాష మాధ్యమంతో పాటు మాతృభాషా మాధ్యమును యధావిధిగా  కొనసాగించాలని,ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలని,ఐఆర్(మధ్యంతర భృతి) ప్రకటించాలని,పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయాలను చెల్లించాలని,మున్సిపల్ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని సీనియర్ హెచ్ఎం లకు అర్బన్ ఎంఈఓ అవకాశం కల్పించాలని,పిఎఫ్ సౌకర్యం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి మౌలాలి,నాగరాజు,రామకృష్ణ,ఈదుళ్ల వెంకటచలమయ్య,నజీర్ భాష,సాకే నరేంద్ర,షబ్బీర్, వీరారెడ్డి,అతావుల్లా,సోమశేఖర్ నాయక్ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్02(విజయస్వప్నం.నెట్)

ఆమడగూరు మండలంలోని  కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.స్వాతంత్ర సమరయోధుడు,అహింస వాది జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎంపీడీవో మునియప్ప,ఏపీఓ అమరావతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండలంలో పారిశుద్ధ్య కార్మికులను ఎంపీడీవో మునియప్ప ఏపీఓ,అమరావతి సన్మానించారు.పారిశుద్ధ కేంద్రం  ఆవరణంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి బుధవారం పంచాయతీ కార్యదర్శి చంద్ర, సర్పంచ్ షబ్బీర్,నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈసందర్భంగా  ఎంపీడీవో మునియప్ప,ఏపీఓ అమరావతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం జాతిపిత మహాత్మా గాంధీ అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.శాంతి పరమావధిగా సత్యాగ్రహం చేసి మహాత్మా గాంధీ అహింసవాదిగా నిలిచారన్నారు.ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు,వర్క్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసులు,ఎంఆర్సి ఆది,ఫీల్డ్ అసిస్టెంట్ టైలర్ రామాంజులు,టెక్నికల్ అసిస్టెంట్ మంజునాథ్ రెడ్డి  రంగప్ప, పారిశుద్ధ్య కార్మికులు అంజి,వెంకటరమణ,శివప్ప, తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో పితృ పక్షల కైంకర్యం

శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)అమడగూరు,అక్టోబర్02(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని గాజులపల్లి కూడలి వద్ద ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమంలో అమడగూరు మండలానికి చెందిన మునిస్వామి జ్ఞాపకార్థం పితృపక్షల మాసం(మాలల అమావాస్య)సందర్భంగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున,భార్య స్వాతిలక్ష్మి దంపతుల కుటుంబసభ్యులతో కలసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ కీ"శే,,మునిస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా వృద్ధుల తరఫున ఆశ్రమం తరఫున కోరుకుంటున్నామని, అలాగే  కదిరి పట్టణానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి,మంజుల దంపతులతో కలసి తమ ముద్దుల కుమారుడు చైతన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా  వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. చిన్నారి చైతన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక…

$$$__________@@@__________$$$

తెదేపా కార్యకర్తలకు మాజీమంత్రి పల్లె అండ

శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,అక్టోబర్02(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గంలోని తెదేపా  కార్యకర్తలకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా వుంటారని పేర్కోంటూ బుధవారం మండల కేంద్రంలో బిసీ కాలనీలో నానబాల రామాంజనేయులు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్పందిస్తూ.... కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని, తిరుపతి ఆసుపత్రిలో చికిత్స కోసం మండల తెదేపా నాయకుల ద్వారా ఆర్థికసాయం అందించారు.అన్ని విధాలా అండగా సహాయ సహకారాలు అందిస్తామని,అందుబాటులో ఉంటూ అండగా వుంటారని కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఇచ్చారు.ఈకార్యక్రమంలో టైలర్ నిజాం,సౌదీ నాగరాజు,మీసేవ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తొలి రోజు శ్రీ మత్స్యావతార అలంకరణలో ఖాద్రీశుడు

 
శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)కదిరి,అక్టోబర్03(విజయస్వప్నం.నెట్)

శరన్నవరాత్రులు సందర్భంగా గురువారం కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారు శ్రీ మత్స్యావతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈనెల 3వతేది నుండి 12వతేది వరకు శరన్నవరాత్రులు నిర్వహణలో భాగంగా తొలిరోజు  శ్రీఖాద్రీశుడిని మత్స్యావతార అలంకరణతో పల్లకి తీరువీధుల్లో భక్తులకు దర్శనార్థం ఊరేగించి శ్రీమత్స్యావతార అలంకరణ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కార్యనిర్వహణాధికారి వెండి దండి శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు,ఆలయ సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వరి నల్లి తెగుళ్లపై రైతులకు అవగాహన

శ్రీసత్యసాయిజాల్లాఓడిచెరువు, అక్టోబర్03(విజయస్వప్నం.నెట్)

వరికి సోకిన వరినల్లి తోపాటు ఇతర తెగుళ్లపై  గురువారం ఏడిఏ జిల్లా వనరుల కేంద్రం (డీ.ఆర్.సి) సనావుల్లా,ఏఓ ఎస్.అబ్దుల్ రైతులకు సూచనలు సలహాలు అందించారు.గురువారం మండలంలోని డబురువారిపల్లి,ఆకుతోటపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు సాగు చేసిన వరి,టమోటా పంటలను వారు పరిశీలించి,వరి నల్లి  నివారణకు ఓమైట్ ఎకరాకు 300 మిల్లీ లీటర్లు,టమోటా పంటకు ఆకుమచ్చ,కాయ మచ్చ తెగులు నివారణకు బ్లె టాక్స్ ఎకరాకు 500 గ్రాములు పిచికారి చేసుకోవాలని రైతులకు తెలిపారు. పంటకు సంబంధించి సూచనలు సలహాలు అందించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఇలియాజ్ అహ్మద్,పట్టు పరిశ్రమ శాఖ  ఏడిఏ కే.గీత,ఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి,  ఏఈఓ వెంకటేష్,విఏఏ  పవన్ కుమార్,ఆంజనేయ నాయక్ తదితర రైతులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘన సన్మానం

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అక్టోబర్03(విజయస్వప్నం.నెట్)

మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం బదిలీపై వెళ్తున్న అధికారులకు కార్యాలయ సిబ్బంది,సర్పంచులు ఘనంగా సన్మానించారు.ఈఓఆర్డిడీ రాజశేఖర్(తనకల్లు) సూపరింటెండెంట్ పూల రెడ్డప్ప(తనకల్లు) సీనియర్ అసిస్టెంట్ గజ్జల శ్రీనివాసులురెడ్డి(పెనుకొండ) జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ (కదిరి) బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఎంపీపీ పర్వీన్ భాను,సర్పంచులు తొట్లి రంగారెడ్డి,బోయపాటి జగన్మోహన్ చౌదరి,చిట్వేల్ బాబా,ముద్దలపల్లి గోవిందు, వెంకటరమణ, షామీర్ బాష, నర్సిరెడ్డి,మదీద్ బాష, వార్డు సభ్యులు జానీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అయితే వీరి స్థానాల్లో ఈఓఆర్డిడీగా కేశవరెడ్డి, సూపరింటెండెంట్ గా వెంకటరమణ నాయక్, సీనియర్ అసిస్టెంట్ గా పద్మనాభరెడ్డి,జూనియర్ అసిస్టెంట్ గా శ్రీనివాసాచారి లను బదిలీ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు రెండు రోజుల్లో భాధ్యతలు చేపట్టనున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

తెదేపా పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ






శ్రీసత్యసాయిజాల్లా(ఓడిచెరువు)కదిరి,అక్టోబర్03(విజయస్వప్నం.నెట్)

కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచనల మేరకు తెదేపా పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించి, వార్డులో కరపత్రాలు అందిస్తూ ప్రచారం చేపట్టారు.వార్డులోని ప్రతి ఇంటికి నూరు రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు.నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేసిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలు ప్రజలకి వివరిస్తూ సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి ఒక్క హామిని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ తో పాటు తెదేపా మైనార్టీ నాయకులు చాంద్ భాష, నాయుడు, దాదా పీర్,సిరాజ్, మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా, నాయకులు మొహమ్మద్, భాష, సచివాలయం సిబ్బంది విజయ్, కీర్తి,సాయి, అశ్విని,  ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి