google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓకు ఘన సన్మానం - విద్యార్థినీలకు బహుమతులు ప్రదానం చేసిన ఎంపీడీవో - సాంఘిక బాలుర వసతి గృహం తనిఖీ - సియం చంద్రబాబును కలిసిన బిసీ సెల్ నాయకుడు - జిల్లా స్థాయి పోటీలకు మండల విద్యార్థులు ఎంపిక - ఏపీయూడబ్ల్యూజే కదిరి డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

1, అక్టోబర్ 2024, మంగళవారం

బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓకు ఘన సన్మానం - విద్యార్థినీలకు బహుమతులు ప్రదానం చేసిన ఎంపీడీవో - సాంఘిక బాలుర వసతి గృహం తనిఖీ - సియం చంద్రబాబును కలిసిన బిసీ సెల్ నాయకుడు - జిల్లా స్థాయి పోటీలకు మండల విద్యార్థులు ఎంపిక - ఏపీయూడబ్ల్యూజే కదిరి డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

మొక్కలను సంరక్షించల్సిన భాధ్యత మనందరిది

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ అమడగూరు,సెప్టెంబర్28(విజయస్వప్నం.నెట్)

స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకొని అమడగూరు మండల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొడ్డం అశోక్  సహకారంతో శనివారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో చెట్ల యొక్క ప్రాముఖ్యతను,నాటిన మొక్కలను సంరక్షించల్సిన,ఆవశ్యకతను వివరించారు.గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షణ బాధ్యతను తీసుకొని ఒక మహా వృక్షంగా పెంచాలని, ఎన్నేళ్ళుగా పెంచిన చెట్లను కాపాడుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ షబ్బీర్, ఎంఈఓ జిలాన్ భాష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు విచ్చేయగా,ఉపాధ్యాయ సిబ్బంది, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,దొడ్డం మూర్తి పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సహకరించిన యూత్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు ఫీల్డ్ అసిస్టెంట్ టైలర్ రామాంజి,సభ్యులు శివ,సులేమాన్,సింహ,నాగార్జున,రేవన్,శివ,కాలేశా,సూరన్న, వంశి,పల్సర్ పవన్,రాజాలను అభినందించారు.

 ఓడిచెరువులో....

భగత్ సింగ్ కు ఘన నివాళులు ఓడిచెరువు మండల కేంద్రంలో స్ధానిక ఆటోస్టాండ్ వద్ద శనివారం భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా సిపిఎం,సిఐటీయు నాయకులు వివి.రమణ,కుళ్ళాయప్ప, పోరాటాల శ్రీరాములు ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో శాంతమ్మ,శివమ్మ, నరసింహులు,దీవాస్,శంకర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఎం.యర్రబల్లి గ్రామంలో ఉచిత వైద్యశిబిరం

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని తంగేడుకుంట పంచాయతీ ఎం.యర్రబల్లి గ్రామంలో శనివారం మండల ప్రాథమిక వైద్యాశాల ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించి, పారిశుద్ధ్య లోపం వల్ల వ్యాపించే జ్వరాలపై అవగాహన కల్పించినట్లు సూపర్వైజర్లు విజయకూమారి, శశిధర్ తెలిపారు.గ్రామంలో పదేళ్ల బాలికకు డెంగ్యూ జ్వరం లక్షణాలు నిర్ధారణతో వైద్య సిబ్బంది గ్రామంలో సందర్శించి పురవీధుల్లో ఫాగింగ్,బ్లీచింగ్ పొడి పిచ్చుకారి చేయించి, గృహాల్లో తొట్టిల్లో నీరు తొలగించి శుభ్రపరిచారు. ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించి అవగాహన కల్పిస్తూ....పరిసరాల్లో కొబ్బరి చిప్పలు,టైర్లలో, గుంతల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూడాలని,వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.మురికి నీళ్ళు నిల్వతో దోమలు వ్యాపించి మలేరియా,టైఫాయిడ్, డెంగ్యూ తదితర వైరల్ జ్వరాలు వ్యాపిస్తాయని, గ్రామంలో ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు శుక్రవారం డ్రై డే ఫ్రైడే పాటించి పరిసరాలు శుభ్రం చేసుకోని ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.ఈ ఉచిత వైద్యశిబిరంలో కదిరి ఏరియా మలేరియా సబ్ యూనిట్ అధికారి దేవ్లానాయక్ పాల్గొని పర్యవేక్షించారు.వైద్య సిబ్బంది మద్దిలేటి మనోహర్,బిందు భార్గవి,అఖిల,శ్రీనివాసులురెడ్డి,ఆశ కార్యకర్తలు కుళ్ళాయమ్మ, జ్యోత్స్న,అలివేలమ్మ, మునిరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన జగన్ పై చర్యలు తీసుకోవాలి

బిజేపీ నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,సెప్టెంబర్28(విజయస్వప్నం.నెట్)

ప్రపంచవ్యాప్తంగా హిందువులందరు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత వైకాపా ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు  వాడారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  వెల్లడించిన విషయం కోట్లాది హిందువులను ఎంతో క్షోభకు గురి చేసిందని మండల బిజేపీ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.ఈసందర్భంగా శనివారం విలేకరులతో మాట్లాడుతూ....2019 నుండి 2024 మధ్య మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో అంతర్వేదిలో రథదగ్ధం,రామతీర్థంలో  శ్రీరాముని విగ్రహ శిరచ్చేదం,హిందూ దేవాలయాల పై దాడులు,విగ్రహాల ధ్వంసం,బలవంత మత మార్పిడులు ,ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ప్రార్ధన మందిరాలు నిర్మాణాలు,దేవాలయాల ఆస్తుల ఆక్రమణ,హిందువుల పండగల పై ఆంక్షలు,తిరుమల,శ్రీశైలం,బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల వంటి ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్తుల నియామకం,ధార్మికతను దెబ్బతీస్తూ వ్యాపార కార్యకలాపాలు ప్రోత్సహించడం వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయని విమర్శించారు.తిరుమలలో నిత్యం జరిగే అన్నదానంలో నాణ్యతా లోపాలు,దర్సనాల టిక్కెట్లు అమ్మకాలు,సౌకర్యల కల్పన,అభివృద్ధి పేరిటి చేపట్టిన పనుల్లో నిధుల దుర్వినియోగం,తితిదే నిధులు మల్లింపు వంటి అనేక ఆరోపణలు వచ్చాయని,గత ప్రభుత్వంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇటువంటి అసంఖ్యాక సంఘటనలు జరిగిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పైన పేర్కొన్న అన్ని అంశాలపై దర్యాప్తు చేసి,నిందితులను చట్టం ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు,మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి,ఎస్టీ జోనల్ ఇంచార్జి హరినాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయుకులు ఐ రాము,సుబ్బిరెడ్డి,తిప్పన్న,నరసింహులు,హిందూ ప్రచారక్ వెంకట్,తెదేపా,జనసేన నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం ప్రారంభం


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్28(విజయస్వప్నం.నెట్)

మండల హౌసింగ్ ఏఈ సుదర్శన్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇల్లు-మన గౌరవం కార్యక్రమం శనివారం ప్రారంభించగా ప్రజాప్రతినిధులు, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం మన ఇల్లు-మన గౌరవం గృహా నిర్మాణ పధకానికి ప్రాధాన్యత కల్పించిందని, పైకప్పు వేసుకున్న లబ్దిదారులు అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని, వివిధ దశల్లో ఉన్న ఇళ్ళను 2025 మార్చి నెలలో పూర్తి చేయాలని,అలా కాకపోతే కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు అందించలేదని,ఇళ్ల నిర్మాణాల్లో అనవసరమైన ఖర్చులు నివారించడానికి తక్కువ ఖర్చుతో సాంకేతికపై ఏఈ, వర్క్ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పిస్తారని, తక్కువ ఖర్చుతో కూడిన సామాగ్రి వినియోగించేందుకు వర్క్ ఇన్స్పెక్టర్,ఏఈ ల సహయ సహకారాలు తీసుకోవాలని,పునాది స్థాయిలో ఉన్న లబ్దిదారులకు నుండి తీరు మట్టం, పైకప్పు వేసుకున్న వారికి 90 వేలు దేశంలో వారిగా పైకప్పు  అయిన తరువాత రెండు విడతలుగా చెల్లిస్తారని, లబ్దిదారులు ఇంటి పైకప్పు నిర్మాణాలు 2025 మార్చి నాటికి,ప్లాస్టింగ,ఫ్లోరింగ్, విద్యుద్ధీకరణ,మరుగుదొడ్లు నిర్మాణం వంటి ఇతర పనులు మార్చి 2025 తర్వాత గృహా ప్రవేశానికి పూర్తి చేసుకోవాలని, గృహాలు మంజూరైన లబ్దిదారులకు కేటాయించిన సమయంలో 2025 లోపు చేయాలని,2025 తర్వాత నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసిన ఇళ్ల బిల్లులు చెల్లించలేరని ఆయన స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ రామనాథరెడ్డి,ఎంపీడీఓ మునియప్ప,డీటి వెంకటరెడ్డి, బిజేపీ మండల అధ్యక్షులు ఇందుకూరి సురేంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసులు,ఎస్టీ సెల్ జోనల్ ఇంఛార్జి హరినాయక్,తిప్పన్న,వెంకట్, నరసింహులు,తెదేపా,జనసేన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఘనంగా పల్లవి మండల సమాఖ్య 21వ వార్షికోత్సవం

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్28(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలోని వడ్డివారిపల్లి గ్రామ సమీపంలో వెలుగు(డిఆర్డీఏ)పల్లవి మహిళా మండల సమాఖ్య కార్యాలయంలో శనివారం పల్లవి మండల సమాఖ్య 21వ వార్షికోత్సవం మండల అధ్యక్షురాలు వెంకటలక్ష్మి అధ్యక్షతన, ఏరియా కోఆర్డినేటర్ డిపీఎం జీవనోపాధుల సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ.... పొదుపు స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకునే అన్ని రకాల రుణాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే సంఘం కట్టుబాట్లు ప్రకారం వందశాతం చెల్లించాలని,జీవనోపాధులు పెంపొందించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని,గ్రామైఖ్య సంఘాలు,మండల సమాఖ్యలను మరింత బలోపేతం చేయాలని, వ్యక్తిగత రుణాలు పొంది ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ధ్యేయంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఈకార్యక్రమంలో 60 గ్రామ సంఘాలకు గాను 36 గ్రామ సంఘాల మహిళాప్రతినిధులు, శ్రీనిధి ఏజిఎం వేణుగోపాల్,ఏపిఎం రమణప్ప,సిసీలు,అనిమేటర్లు

$$$__________@@@__________$$$

అన్ని విధాలా ఆదుకుంటాం

మాజీ ఎంపీటీసీని మాజీమంత్రి పల్లె పరామర్శించి భరోసా

శ్రీసత్యసాయిజిల్లా,నల్లమాడ (ఓడిచెరువు) సెప్టెంబర్29(విజయస్వప్నం.నెట్)

అన్ని విధాల ఆదుకుంటానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భాధిత మాజీ ఎంపీటీసీకి హామీ ఇచ్చారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్లమాడ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు చదివే వెంకటలక్ష్మమ్మ గృహానికి మాజీమంత్రి పల్లె ఆదివారం వెళ్లి పరామర్శించారు.ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు.మెరుగైన చికిత్సలు అందించేందుకు ఫోన్ ద్వారా వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తనను పరామర్శించడానికి వచ్చిన పల్లె రఘునాథ్ రెడ్డికి ఆమెతోపాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీమంత్రి పల్లె కు తెదేపా నాయకుడు 50 వేలు విరాళం అందజేత ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన తెదేపా బిసీ సెల్  అధికార ప్రతినిధి బోరు రమణ ఆదివారం విజయవాడ వదర బాధితుల కోసం 50,116 నగదు పుట్టపర్తి తెదేపా కార్యాలయంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి అందజేశారని తెలిపారు. ఈసందర్భంగా బోరు రమణను మాజీమంత్రి పల్లె అభినందిస్తూ.... విజయవాడ వరద బాధితుల కోసం సహాయం చేయడానికి తెదేపా నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ముందుకు వస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్28(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర వైకాపా ఆదేశాల మేరకు తిరుమల స్వామివారి లడ్డు వివాదంపై మండల కేంద్రంలో శనివారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మండల వైకాపా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రమైన లడ్డుపై ఎన్డీయే కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ.... స్వామివారి ఆలయంలో ప్రక్షాళన పూజలు నిర్వహించారన్నారు.ఈకార్యక్రమంలో జెడ్పీ సభ్యులు దామోదర రెడ్డి,కన్వీనర్ రాజునాయుడు,ఎద్దుల రామసుబ్బారెడ్డి,షామీర్ బాషా,కోళ్ళ కృష్ణారెడ్డి, ఆదినారాయణ,హబీద్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఏపీయూడబ్ల్యూజే కదిరి డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, సెప్టెంబర్29(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా గౌరవ అధ్యక్షులు పుల్లయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం కదిరి పట్టణంలో డివిజన్ నూతన కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపారు.తాలూకా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రభ)జనరల్ సెక్రటరీ సాదిక్ వలి(వార్త) ఆర్గనైజర్ సెక్రెటరీ నరేందర్ రెడ్డి(99 టీవీ)ట్రెజరర్ జిలాన్ (సాక్షి) వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ (సూర్య)రవి(సాయంకాలం) చంద్రశేఖర్ రెడ్డి (ఆర్ టివి)జనరల్ సెక్రటరీ ప్రభాకర్ (సూర్య)రామ్మోహన్(సాక్షి) అల్లా బకాష్(వార్త) కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ (విశాలాంధ్ర) సతీష్ రెడ్డి(ఆంధ్రప్రభ)ఆంజనేయులు (వార్త) అజయ్(కదిరి డిజిటల్ కేబుల్)లక్ష్మీపతి(ఆంధ్రప్రభ) మాధవ(సూర్య)రఘునాథ్ రెడ్డి,(సాక్షి) శివ శంకర్ రెడ్డి సాక్షి రాజశేఖర్ రెడ్డి (వార్త) నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు.

$$$__________@@@__________$$$

బంగారు దుకాణంలో భారీ చోరి




శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్30(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో హిందూపురం,కదిరి ప్రధాన రహదారిలో పవిత్ర బంగారు(జువ్యెలరీ)దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.దుకాణం యాజమాని నల్లమాడ సిఐ నాగేంద్ర రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా వున్నాయి.... యధాతధంగా రోజులాగానే బంగారు దుకాణం యాజమాని రామాచారి ఆదివారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్ళారని, సోమవారం ఉదయం దుకాణం తలుపులు తెరిచి చూడగా బంగారు,వెండి ఆభరణాలు చోరీ అయినట్లు గమనించి, పక్కనే ఉన్న పశు వైద్యశాల వెనుక వైపు ఉన్న  ఎరువుల దుకాణం కిటికీకి ఉన్న గ్రిల్ తొలగించి లోపలికి చొరబడి అక్కడి నుండి బంగారు దుకాణం గోడకు పెద్ద కన్నం వేసి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారని, దుండగులు 20 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు ఎత్తు కెళ్ళారని, వీటి విలువ 19 లక్షలు ఉంటుందని యాజమాని రామాచారి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.సిఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.వేలిముద్రల నిపుణులు,డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు.

$$$__________@@@__________$$$

జిల్లా స్థాయి పోటీలకు మండల విద్యార్థులు ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్30(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు కేజీబీవీ పాఠశాల విద్యార్థీనీలు నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పేర్కొంటూ....ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ బాబు, ఉపాధ్యాయ బృందం అభినందించారని తెలిపారు.ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అమడగూరు పాఠశాల నుండి అండర్ 17 వాలీబాల్ విభాగంలో గౌతమ్ కుమార్, అండర్ 14 కబడ్డీ  విభాగంలో కే.జయంత్,అండర్ 17 బాలికల విభాగంలో ఏ.చందన,కేజీబీవీ పాఠశాలలో అండర్ 14 బాలికల యోగ విభాగంలో భూమి,అండర్ 17 విభాగంలో వైష్ణవి,పిఎంఆర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో అండర్ 17 వాలీబాల్ విభాగంలో ఆర్ వెంకటేష్,అండర్ 14 కబడ్డీ విభాగంలో వి.శాజిల్ ఎంపికైనట్లు తెలిపారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది సహా విద్యార్థులు అభినందించారు.పాఠశాల పేరును జిల్లా స్థాయిలో నిలుపినందుకు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు సి.షబ్బీర్ భాషాకి కృతజ్ఞతలు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయుడు షబ్బీర్ భాష పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సియం చంద్రబాబును కలిసిన బిసీ సెల్ నాయకుడు

శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్30(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిసినట్లు మండలానికి చెందిన తెదేపా బిసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జరిపిటి అంజనప్ప సోమవారం విలేకరులకు తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో నియోజకవర్గంలో ప్రజల మన్ననలను పొందుతున్నట్లు తెలిపారని, విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికి రాష్ర్టాన్ని అన్ని విధాలా తన అనుభవాన్ని అభివృద్ధి దిశగా 100 రోజుల పాలన దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు.

$$$__________@@@__________$$$

మాతృశ్రీ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎంపీడీవో మునియప్ప

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్30(విజయస్పప్నం.నెట్)

మండలంలోని గాజులపల్లి సమీపంలో శ్రీమాతృశ్రీ  వృద్ధాశ్రమానికి ఆశ్రయం కల్పించాలని నిర్వాహకురాలు అరుణజ్యోతి ఎంపీడీవో మునియప్పకి వినతిపత్రం గతవారం అందజేశారు.దీనికి స్పందించిన అధికారులు సోమవారం ఆశ్రమాన్ని సందర్శించి పరిశీలించి అదనంగా ఉన్న గదిని త్వరలోనే వృద్ధులకు వాడుకునేలా సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆశ్రమంలోని వృద్ధులను మాట్లాడి యోగ క్షేమాల గురించి ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.నిర్వాహకురాలు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ఏఈ గుప్తా సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సాంఘిక బాలుర వసతి గృహం తనిఖీ




శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు,సెప్టెంబర్30(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో వడ్డివారిపల్లి వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత వసతి గృహాన్ని సోమవారం సోషియల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శివరంగ ప్రసాద్,డీపిఎం డాక్టర్ కుళ్ళాయప్ప నాయక్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు.వసతి గృహములో భోజనాలు,నీరు తదితర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.ఈసందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వంటశాల,సామాగ్రి తదితర విద్యార్థుల గదులను పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.అధికారుల వెంట ఏఎస్ డబ్ల్యుఓ రెడ్డిబాలాజీ, హాస్టల్ వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిబ్బంది వున్నారు.

$$$__________@@@__________$$$

విద్యార్థినీలకు బహుమతులు ప్రదానం చేసిన ఎంపీడీవో


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,సెప్టెంబర్30(విజయస్వప్నం.నెట్)

స్వచ్చ హి సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కస్తూరిభా బాలికల పాఠశాలలో విద్యార్థినీలకు సమావేశం ఏర్పాటు చేయగా ఎంపీడీవో మునియప్ప చేతుల మీదుగా విద్యార్థినీలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతక ముందు ఎస్ఓ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమక్షంలో ఘన వ్యర్థల నిర్వహణ,నీటి కాలుష్యం,గాలి కాలుష్యం,నేల కాలుష్యంపై వ్యాసరచన,సాంస్కృతిక పోటీలు కార్యక్రమాలు నిర్వహించారు.

పరీక్షల్లో, సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈఓఆర్డిడీ నషిమా, ఉపాధ్యాయిని బృందం పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

బదిలీపై వెళ్తున్న ఎంపీడీఓకు ఘన సన్మానం



శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, సెప్టెంబర్30(విజయస్వప్నం.నెట్)

కర్నూల్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మికి సోమవారం ఎంపీపీ షామీర్ పర్వీన్ భాను,సర్పంచ్ గోవిందు,సూపరింటెండెంట్ రెడ్డప్ప,ఈఓఆర్డిడీ రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ గజ్జల శ్రీనివాసులురెడ్డి,జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్,వార్డు సభ్యులు జానీ తదితరులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికారులు సిబ్బందితో కలిసి ఎంపీడీవో వరలక్ష్మి శాలువా కప్పి సన్మానించారు.ఏపిఓ సుధాకర్, టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జిల్లా స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ కి రెయిన్బో పాఠశాల విద్యార్థులు ఎంపిక


శ్రీసత్యసాయిజాల్లా,ఓడిచెరువు/అమడగూరు, అక్టోబర్01(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలో వేమారెడ్డిపల్లి వద్ద ఉన్న స్థానిక రైన్బో ఇంగ్లీష్ మీడియం  పాఠశాల విద్యార్థులు జి.లయశ్రీ (10 వ తరగతి), బి.యశ్వంత్ నాయుడు(9 వ తరగతి), జి.హర్షవర్ధన్ రెడ్డి (8 తరగతి) చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ఓడిచెరువు మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులను, సహకరించిన సైన్స్ ఉపాధ్యాయులు డి.జనార్దన్ రెడ్డిని, బి.శ్రీధర్, జి.మంజునాథ్ ని,మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కె.ప్రతాప్ ని,సోషియల్ డిపార్ట్మెంట్ కె.ముక్తిరాజ్ లను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.జయసింహారెడ్డి  ప్రత్యేకంగా అభినందించారు.

అమడగూరులో....

చెకుముకి సైన్స్ టాలెంట్ కి విద్యార్థులు ఎంపిక 

అమడగూరు,అక్టోబర్01(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండల కేంద్రంలో స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షలో అమడుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు హృతిక్ రెడ్డి,యశ్వంత్ రాయల్,భరత్ కుమార్ మొదటి స్థానంలోనూ జేకే పల్లి పాఠశాలకు చెందిన విద్యార్థులు ద్వితీయ స్థానంలోనూ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారని ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు తెలిపారు.ఈ పరీక్ష నిర్వహణలో అమడుగూరు మండలానికి చెందిన సైన్సు ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి,రామ్మోహన్, అనిత,ఎ.జాఖాన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సంక్షేమం,అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివి 

చంద్రబాబు మరో 10 ఏళ్లు ఏపికి ముఖ్యమంత్రి గా కొనసాగితేనే రాష్ట్రం సస్యశ్యామలం

-ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి 



శ్రీసత్యసాయిజిల్లా,ఓడి చెరువు/నల్లమాడ/అమడగూరు,అక్టోబర్01(విజయస్వప్నం.నెట్)

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లు లాంటివని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లమాడ,ఓడి చెరువు ,అమడగూరు మండలాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అభివృధ్ధి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి మయమన్నారు. ఏపీని అస్తవ్యస్తంగా తయారుచేసి అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు.అలాంటి అప్పుల ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు  పోతోందని తెలిపారు.ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు.పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు సక్రమంగా నూరు శాతం అమలయ్యేలా చూస్తామన్నారు.నియోజకవర్గంలోని 195 చెరువులకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు అందించడమే నా కర్తవ్యం అన్నారు.నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు‌.ఈ ఐదేళ్లలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.మహమ్మదాబాద్ క్రాస్ లో రూ.16 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లుకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి భూమి పూజ చేసారు.ఓడి చెరువు,ఆమడగూరు మండలంలోని తిమ్మిరి కుంటపల్లి గ్రామాల్లో బాధిత తెదేపా కార్యకర్తల కుటుంబాల్ని ఎమ్మెల్యే,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల దిగువ కాలనికి చెందిన తెదేపా కార్యకర్త రవీంద్ర తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథ్ వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆర్థికసాయం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.కుసుమవారిపల్లికి చెందిన చారుపల్లి భాగ్యశ్రీకి సియం రీలీఫ్ ఫండ్ ద్వారా రూ"1,00,780, వెంకటాపురం పంచాయతీలో వీరుఓబునపల్లికి చెందిన భారతికి  రూ"82,935 చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నల్లమాడ, ఓడిచెరువు ఆమడగూరు మండలాల కన్వీనర్లు మైలేజ్ శివ శంకర్,జయచంద్ర ,గోపాల్ రెడ్డి తో పాటు పార్టీ సీనియర్ నాయకులు పిట్టా ఓబుళరెడ్డి ,రాజారెడ్డి, జాకీర్, బడిశం రామాంజనేయులు, మాజీ జడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్ కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, రామకృష్ణ ,నంజప్ప,గొల్లపల్లి ఈశ్వర్ రెడ్డి,రెడ్డప్ప,రాజారెడ్డి,గోవిందు, రామాంజుల నాయుడు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

3నుండి శ్రీఖాద్రీశుడి సన్నిధిలో దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు




శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి, అక్టోబర్01(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి  ఆలయములో 3వ తేదీ గురువారం నుండి 12 తేదీ శనివారం వరకు దశరా శరన్నవరాత్రి ఆలంకార మహోత్సవములు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దశరా శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా వివిధ రూపా,అవతారములలో విశేష అలంకరములో భక్తులకు ప్రతి రోజూ దర్శనార్థం కోసం సాయంత్రము 7 గంటల నుండి  కార్యక్రమాలు ప్రారంభమై కొనసాగుతాయని పేర్కొన్నారు.

3వ తేదిన శ్రీ మత్యావతారము,4వ తేదిన శ్రీ కూర్మావతారము,5వ తేదిన శ్రీ నృసింహావతారము,6వ తేదిన శ్రీ రామావతారము,7వ తేదిన శ్రీ కృష్ణావతారము,8వ తేదిన శ్రీ పరమపధనాథ అలంకారము, 9వ తేదిన శ్రీ సరస్వతీ అలంకారము,10వ తేదిన శ్రీ మోహినీ అలంకారము,11వ తేదిన శ్రీ వెంకటేశ్వర అలంకారము,12వ తేదిన విజయదశమి సందర్భంగా అశ్వవాహనము పై గ్రామోత్సవము, మధ్యాహ్నం 2 గంటలకు శమీ పుజమంటపము చేరుట అస్తాన పుజలంనతరము అశ్వవాహనము పై శ్రీస్వామి వారి గ్రామోత్సవములు నిర్వహిస్తారని,స్వామి వారి అలంకార ఉత్సవములు 3వతేది నుండి 12వతేది వరకు ప్రతి రోజు ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు, పార్థసారథి ఆచార్యులతో శ్రీవారికి విశేష అలంకరణల చేసి ప్రతి రోజూ సాయంత్రం 7గంటల నుండి భక్తులకు అలంకారణతో దర్శనాలు  12వతేదిన ఆదివారము మధ్యహ్నం 2గంటలకు పైన స్వామి వారు ఆలయము నుండి శమిపూజ మండపము వద్దకు విచ్చేసి,శమి పూజ మండపము వద్ద శమివృక్షము, అయుద పూజ మరియు అస్థాన సేవ అనంతరము ఆశ్వవాహనము పై గ్రామోత్సవము పైన భక్తులుకు దర్శనము ఇస్తు తిరుమాడవిధుల ద్వారా ఆలయ ప్రవేశము దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారని దేవస్థానం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వెండి దండి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి