హోలీ శుభాకాంక్షలు
రసాయనాలు లేని రంగులతో పండుగను ఆనందంగా జరుపుకుందాం.. విజయస్వప్నం.నెట్ వీక్షకులకు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు.. ఎడిటర్...!!!
$$$__________@@@__________$$$
బ్రహ్మ గరుడ వాహనంపై శ్రీలక్ష్మినరసింహుడు
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి,మార్చి 24(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో అంగరంగ వైభవంగా పక్షం రోజులు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 6వరోజు శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారు బ్రహ్మ గరుడ వాహనంపై తిరు వీధుల్లో ఊరేంగింపుగా దర్శనమిచ్చారు.ఉదయం వివిధ రకాల పుష్పలాతో అలంకరించిన పల్లకిలో స్వామివారు కొలువై మేళతాళాలు వాయిద్యాల మధ్య పుర వీధుల్లో ఊరేంగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు.సాయంత్రం ఆలయంలో యోగశాల నుండి విష్ణువు వాహనమైన బ్రహ్మ గరుడ వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిస్తూ తిరువీధుల్లో ఊరేంగగా పల్లకి ముందు జానపద కళాకారులు భజనలు,భక్తి గీతాలు ఆలపించారు. రాత్రివేళ్ళ ఆలయంలో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించగా,చిన్నారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తిశ్రద్దలతో తిలకించారు.నేడు సోమవారం శేషావాహనంపై శ్రీలక్ష్మినరసింహస్వామి దర్శనమిస్తారని ఆలయ కార్యనిర్వాహక అధికారి, అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
క్షయ రహిత సమాజానికై శ్రమిద్దాం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)
ఎలాంటి వ్యాధికైనా ముందస్తు నివారణ చర్యలు ముఖ్యమని వీటిని ప్రతి ఒక్కరు భాద్యతగా స్వీకరించినప్పుడే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాదులను ఆదిలోనే నివారించవచ్చని వైద్యాధికారి డాక్టర్ భానుప్రకాష్ పేర్కొన్నారు. ప్రపంచం క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో క్షయవ్యాధి అవగాహనా కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ.... 2024లో క్షయ వ్యాధి రహిత భారతదేశం లక్ష్యంగా దేశంలో అన్ని ఆరోగ్య విభాగాల్లో శ్రమిస్తున్నాయని, వీటిలో ప్రజల భాగస్వామ్యం,సహాయ,సహకారం చాలా అవసరమని, ఇందులో భాగంగా ఆరోగ్య విద్య,అవగాహన,భాగ స్వామ్యం,నివారణ,చికిత్సలో సహకారం వీటిని తూచ పాటిస్తూ ఇతరులతో కూడా పాటింపచేసినప్పుడే క్షయ రహిత నవభారత సమాజం ఏర్పడుతుందని అయన పేర్కొన్నారు.వ్యాధి లక్షణాలు మొదలై రెండు వారాముల నుండి జ్వరంఆకలి లేక పోవడం,దగ్గినప్పుడు ఎర్ర రక్త జీరలతో కూడిన గల్ల,బరువు తగ్గడం వంటి లక్షణాలను ఆది లోనే కనుగొనగలిగితే ప్రాథమిక దశలోనే నివారించవచ్చని,ఈ లక్షణాలు కనిపించిన వెంటనే స్థానిక ఆరోగ్య సిబ్బంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్,ఆశ,ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించడం ద్వారా 6 నెలల పాటు ఉచిత మందుల చికిత్స డాట్ పర్యవేక్షణ విధానంలో లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో వైద్యధికారి కమల్ రోహిత్,వైద్యబృందం శుభాషిణి, దిల్ షాద్, విజయకుమారి, వరలక్ష్మి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పలువురిని మాజీమంత్రి పల్లె పరామర్శ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ మలకవారిపల్లికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు శివారెడ్డి కాలుకి శస్త్రచికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఇంటి వద్దకు వెళ్లి శివారెడ్డి కుటుంబ సభ్యులను పలకరించి,యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.జనసేన పార్టీ పుట్టపర్తి సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

సత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అనంతపురం లో..... మండలంలోని ఎద్దుల వారిపల్లికి చెందిన తెదేపా ఎస్సీ సెల్ నాయకులు గంగాద్రి కుమార్తె భాగ్యశ్రీ అనారోగ్యంతో అనంతపురం లోని సవేరా చికిత్స పొందుతుందగా ఆదివారం మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. చికిత్స పొందుతున్న భాగ్యశ్రీ తో మాట్లాడి ఆరోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించినట్లు తెలిపారు. ధైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా ఆదుకుంటానని ఎస్సీ సెల్ నాయకుడికి మాజీ మంత్రి పల్లె భరోసా ఇచ్చినట్లు తెలిపారు.ఓడిచెరువు మండలంలోని నాయనకోట గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మునెప్ప(45)శస్త్రచికిత్స వికటించి మృతి చెందిన విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె ఆదివారం మృతుడి భార్యతో ఫోన్లో మాట్లాడి పరామర్శించి, దైర్యంగా ఉండాలని తెదేపా అండగా ఉండి ఆదుకొంటామని భరోసా ఇచ్చినట్లు మాజీ కన్వీనర్ రాజారెడ్డి,ఆర్ఎంపి జాకీర్, ఎస్సీ సెల్ బడిశం రామాంజనేయులు తదితరులు తెలిపారు.
$$$__________@@@__________$$$
హీరో రామ్ చరణ్ అభిమానులు రక్తదానం
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి24(విజయస్వప్నం.నెట్)మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా ఆదివారం అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించినట్లు అభిమానులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నారాయణ స్వామి ,చంద్ర మోహన్,బావాజీ, మురళి, శివ కుమార్, ప్రదీప్, వెంకటేష్ ,మనోహర్, లక్ష్మణ, రాజేంద్ర, కార్తిక్, హరీష్, వాల్మీకి, దేవలం కార్తిక్, ముని గోపాల్, పవన్ కళ్యాణ్, అనిల్, మధు సుధన్, సాయికుమార్ తదితర మెగాఅభిమానులు స్వఛ్చందంగా పాల్గొని రక్తదానం చేశారన్నారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు లక్ష్మణ కుటాల, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్ లు ప్రతి ఒక్క రక్త దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
$$$__________@@@__________$$$
వైకాపా నుండి తెదేపాలోకి భారీగా చేరిక
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీలో 71 కుటుంబాలు,అలాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లిలో 26కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. కురుమాలకు చెందిన 5 కుటుంబాలు, గొల్లపల్లిలో మరో 4కుటుంబాలు టిడిపిలోకి చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, జనసేన సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ సమక్షంలో ఆదివారం వైకాపా నుండి తెదేపాలోకి చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారని మండల తెదేపా శ్రేణులు తెలిపారు. నల్లమాడ లో.... మండలంలోని దొన్నికోట పంచాయతీ గ్రామంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ సిక్స్ పధకాలపై ప్రజలకు వివరిస్తూ.... రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రచారం చేపట్టినట్లు గ్రామ స్థాయి తెదేపా నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు సామకోటి ఆదినారాయణ, కృష్ణమూర్తి, కేశవరెడ్డి, గంగులప్పనాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి24(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సి అండ్ ఐజి మిషన్ చర్చిలో మట్టలాదివారాన్ని క్రైస్తవ సోదరులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు మట్టలు పట్టుకొని చర్చి చుట్టు ప్రదర్శన నిర్వహించారు. మట్టలాదివారం విశిష్టతను ఫాస్టర్ డాక్టర్ రెవరెండ్ ఎంజి జయానందం వివరించారు. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు చూపిన సన్మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో దార్ల రాజశేఖర్, బాలరాజు, సునీల్ కుమార్, ఆశీర్వాదమ్మ, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
7వరోజు ఆదిశేష వాహనంపై నరసింహస్వామి
శ్రీసత్యసాయి జిల్లా మార్చి25 కదిరి(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 19 నుండి ఏప్రిల్ 2 వరకు వైభవంగా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏడవరోజు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఆదిశేష వాహనంపై పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకి దర్శనమిచ్చారు.వివిధ పుష్ప్వాల అలంకరణతో ఏడు పడగల ఆదిశేష పల్లకీలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు కొలువై ఊరేగింపుగా పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయంలో చిన్నారులు,కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.నేడు మంగళవారం 8రోజు సూర్య,చంద్రప్రభ వాహనంపై శ్రీలక్ష్మీసింహస్వామివారు పల్లకిలో ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు,కార్యనిర్వాహకులు అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప జన్మదిన పూజలు
ఓబుళదేవరచెరువు మార్చి25(విజయ స్వప్నం.నెట్)
మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం అయ్యప్పస్వామివారి జన్మదినం సందర్బంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి యేటా పాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రం రోజు అయ్యప్పస్వామి జన్మదినం సందర్బంగా ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.తెల్లవారుజామున నుండి స్వామివారి మూల విరాట్ విగ్రహానికి పసుపు,కుంకుమ అర్చనలు,పాలు,పెరుగు,నెయ్యి,తేనే,గంధం,పంచ ఫలాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించి,పట్టు వస్త్రాలు,పుష్ప అలంకరణలతో మహామంగళహారతి నీరజనాలు సమర్పించారు.స్వామివారి నామస్మరణాలతో భక్తులు కాయకర్పూరం సమర్పించారు. దర్శనం చేసుకొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
$$$__________@@@__________$$$
శ్రీ ఖాద్రీనృసింహుశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 25(విజయస్వప్నం.నెట్)
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వెలసిన కదిరి పట్టణంలో శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము,చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం.శ్రీస్వామివారి బ్రహ్మోత్సవములలో భాగంగా కదిరి పున్నమి పండుగ సందర్భముగా సోమవారం శ్రీమత్ ఖాద్రీ నృసింహుని దర్శనం కోసం భక్తులు పోట్టెత్తారు.శ్రీస్వామివారి దర్శనార్థము తెల్లవారుఝుమున నుండి బారులు తీరడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.ముఖ్యంగా స్వామి ఇంటి ఇలవెల్పుగా వుండే భక్తులు,కర్నాటక రాష్ట్రములోని వివిధ ప్రాంతముల నుండి అధికముగా భక్తాదులు ఆలయానికి విచ్చేయడంతోరద్దితో క్కికిరిసిన ఆలయ ప్రాంగణముతో పాటు తీరుమాడ వీధుల్లో స్వామి నామస్మరణలతో మారుమోగింది.ఆలయములో విశేషముగా దీపాలు వెలుగించి,స్వామివారి ఇలవెల్పు అయిన భక్తాదులు స్వామి వారికి తలనీలాలను,తూలభారము మొక్కుబడులు సమర్పించుకున్నారు.భక్తుల సౌక్యార్థము ప్రత్యేక దర్శనము, ఉచిత దర్శనము క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి 'అర్చకులు తెలిపారు.ఒక్కపొద్దులు,ఉపవాసము వున్న భక్తులందరికి దర్శనము అనంతరము నైవేద్య ప్రసాదము వితరణ, చల్లని తాగునీరు అందించి, నిత్య అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేశారన్నారు.కళాకారులు సంగీత కచేరీ నిర్వహించారు.
$$$__________@@@__________$$$
శ్రీఅక్కదేవతల ఆలయంలో అన్నదాన సత్రానికి 20వేలు విరాళం
శ్రీ సత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి25(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డుపై వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో అన్నదాన సత్రానికి గోపేపల్లి గ్రామానికి చెందిన మీసాల గంగులప్ప,అక్కలప్ప మల్లికార్జున (నల్లసింగయ్య గారిపల్లి లైన్మెన్) కవిత,సురేష్ బాబు అనిత, వీరి కుమారుడు పనింద్ర యాదవ్,జస్మిత్ కుటుంబసభ్యులతో కలసి సోమవారం ఆలయ పూజారి వెంకటేషుకి 20వేల నగదును అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
శ్రీ అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు..

పాల్గుణ సోమవారం పౌర్ణమి సందర్భంగా అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో ఓడిచెరువుకి చెందిన కర్లవేణుగోపాల్ (విద్యుత్ బిల్ కలెక్టర్)లక్ష్మీ నారాయణమ్మ, వీరి కుమారులు హేమంత్,తిలోక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దర్శనం కోసం విచ్చేసిన 300 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.