google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : 3వరోజు హంస వాహనంపై శ్రీలక్ష్మినరసింహుడు

22, మార్చి 2024, శుక్రవారం

3వరోజు హంస వాహనంపై శ్రీలక్ష్మినరసింహుడు

3వరోజు హంస వాహనంపై శ్రీలక్ష్మినరసింహుడు


సత్యసాయి జిల్లా మార్చి21 కదిరి(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 19 నుండి ఏప్రిల్ 2 వరకు వైభవంగా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం మూడవరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి హంస వాహనంపై పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకి దర్శనమిచ్చారు. వివిధ పుష్ప్వాల అలంకరణలో వీణపాణి రూపంలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు పల్లకిలో ఆశీనులై ఊరేగింపుగా పురదర్శనమిచ్చారు.నేడు శుక్రవారం శ్రీలక్ష్మీసింహస్వామివారు సింహ వాహనంపై పల్లకిలో ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు, కార్యనిర్వాహకులు అర్చకులు తెలిపారు.

@@@__________$$$__________@@@

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి21(విజయస్వప్నం.నెట్)


మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం తహశీల్దార్ ఖాజాబీ, ఎంపీడీవో వరలక్ష్మి  గ్రామ సచివాలయ మహిళ పోలీసులకు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియమవాళి అతిక్రమించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారాల్లో పాల్గొంటే చర్యలు తప్పవన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో విధులు నిర్వహించే వారు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఈఓఆర్డీ రాజశేఖర్, గ్రామకార్యదర్శి రఫిక్, మహిళా పోలీసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి