google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : నేడు మండల సర్వసభ్య సమావేశం - పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ఎమ్మెల్యే దుద్దుకుంట చొరువతో తాగునీటి సౌకర్యం - రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్తకు గాయాలు - బీజేపీ నాయకుడు దస్తగిరి ఔదర్యం

13, మార్చి 2024, బుధవారం

నేడు మండల సర్వసభ్య సమావేశం - పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - ఎమ్మెల్యే దుద్దుకుంట చొరువతో తాగునీటి సౌకర్యం - రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్తకు గాయాలు - బీజేపీ నాయకుడు దస్తగిరి ఔదర్యం

నేడు మండల సర్వసభ్య సమావేశం
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి12(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో నేడు బుధవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో ఎంపిడిఓ వరలక్ష్మి,ఎంపిపి పర్వీన్ భాను సంయుక్త అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు అధికార సిబ్బంది పేర్కొంటూ.... జడ్పీటిసి, 1,2ఎంపిపిలు,సర్పంచులు,ఎంపిటిసిలు,కోఆఫ్సన్ సభ్యులు, గ్రామ కార్యదర్శులు, అన్నీ శాఖల అధికారులు, సిబ్బంది  సర్వ సభ్య సమావేశానికి హాజరు కావాలని అధికారులు కోరారు.
________________________________
శ్రీ సత్యసాయిజిల్లా,ఓడిచెరువు,మార్చి12)విజయస్వప్నం.నెట్)
మండలంలోని ఇనగలూరుకు పంచాయతీ గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త శబరిష్ నాయుడు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టడడంతో  నష్టపోయిన విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం గ్రామాన్ని సందర్శించి,పొలాన్ని పరిశీలించి, రైతును పరామర్శించి,అనంతరం అయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతుకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మండల తహశీల్దర్ ఖాజాబికి  ఫోన్ లో వివరించారని స్థానిక తెదేపా శ్రేణులు తెలిపారు.
________________________________
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
శ్రీసత్యసాయిజిల్లా,హిందూపురం మార్చి12(విజయస్వప్నం.నెట్)
రాబోయే సార్వత్రిక ఎన్నికలు సందర్బంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించి ఏర్పాట్లు సక్రమంగా ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. హిందూపురం పరిధిలో మణెసముద్రం,కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, పట్టణ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అలాగే రొద్దం మండలంలోని కంబాలపల్లిలో మండల ప్రాధమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ తనిఖీ చేపట్టారు.పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు,గాలి,లైట్లు,ఫ్యాన్లు, నీరు, నీడ తదితర సౌకర్యాల ఏర్పాట్లపై అరా తీసారని రెవిన్యూ అధికారులు  తెలిపారు.
________________________________
ఎమ్మెల్యే దుద్దుకుంట చొరువతో తాగునీటి సౌకర్యం
శ్రీసత్యసాయిజిల్లా,ఆమడగూరు, మార్చి12(విజయస్వప్నం.నెట్)
మండల పరిధిలోని దిగువ గువ్వలపల్లి గ్రామంలో కొన్నేళ్లుగా చేతి పంపు మరమ్మత్తులకు నోచుకోక తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..... తక్షణమే ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి 30వేలు విలువ చేసే సామాగ్రిని చేతి పంపుకు అమర్చడంతో తాగునీటి సమస్య తీరిందని, ఎన్నో ఏళ్లుగా మరమ్మత్తులకు నోచుకోలేని చేతిపంపుకు సామాగ్రి అందించి తాగునీటి సమస్య పరిష్కరించి, తాగునీటి సౌకర్యం కొరకు చొరవ తీసుకొన్న పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి గ్రామస్తులు ధన్యవాదములు తెలిపారు.
________________________________
రోడ్డు ప్రమాదంలో తెదేపా కార్యకర్తకు గాయాలు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, మార్చి12(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో బీసీ కాలనికి చెందిన తెదేపా కార్యకర్త రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సలు పొందుతున్నట్లు స్థానిక తెదేపా శ్రేణులు తెలిపారు.మండలంలోని ఇనగాలూరు, గొల్లపల్లి గ్రామాల్లో బాబు షూరిటీ,సూపర్ సిక్స్ పధకాలపై ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా గాజుకుంటపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడడంతో రామాంజనేయులుకు తీవ్ర గాయాలుకాగా,వెంట ఉన్న తెదేపా కార్యకర్తలు 108 ద్వారా రామాంజనేయులును ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు.
________________________________
బీజేపీ నాయకుడు దస్తగిరి ఔదర్యం
శ్రీసత్యసాయిజిల్లా,నల్లమాడ, మార్చి12(విజయస్వప్నం.నెట్)
నల్లమాడ మండలం రెడ్డిపల్లి పంచాయతీ తిప్పయ్యగారిపల్లికి చెందిన పుట్టపర్తి నియోజకవర్గం బీజేపీ కోఆర్డినేటర్ షేక్ దస్తగిరి మంగళవారం నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించి మానవత్వం చాటుకొన్నారు.కదిరి పరిధిలోని యాకాలచెరువు గ్రామంలో నిరుపేద హుస్సేనప్ప కుటుంబ పరిస్థితి తెలుసుకొన్న బీజేపీ నాయకుడు షేక్ దస్తగిరి ఇంటికెళ్లి తనవంతుగా నిత్యావసర సామాగ్రి,నగదును అందించి మాట్లాడుతూ..... నిరుపేద హుస్సేనప్పకు దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందించాలని అయన కోరారు.ఇదిలా ఉండగా నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించిన బీజేపీ  నాయకుడు షేక్ దస్తగిరి సేవాగుణాన్ని పలువురు అభినందిస్తున్నారు.
________________________________

శ్రీసత్యసాయిజిల్లా, కదిరి, మార్చి12(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానములో స్వామివారి సంబందించిన హుండిల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మంగళవారం హుండీ లెక్కింపులో  60రోజుల మొత్తం నగదుగా రూ"78,71,911లు భక్తులు సమర్పించినట్లు తెలిపారు. అలాగే 928 యుఎస్ఏ డాలర్స్,యూరొ కరెన్సీ రూ "50,భూటన్ 41నాగ్ల్ట్రమ్,రూ"5 నేపాల్, సౌతాఫ్రికా రూ"10, కెనడా కరెన్సీ రూ"20, శ్రీలంక రూ"1500, ఇండోనేషియా రూ"1000 విదేశీ కరెన్సీ ద్వారా వచ్చినట్లు తెలిపారు.ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అధ్వర్యంలో చేపట్టగా, పర్యవేక్షణాధికారిగా..., జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారి నరసింహరాజు, సత్యసాయి జిల్లా దేవస్థానము సిబ్బంది, కెనరా బ్యాంకు మేనేజరు మధుసూదన్, కదిరి బ్యాంక్ శాఖ  సిబ్బంది, సేవకర్తలు, భక్తాదులు పాల్గొన్నారు.
________________________________
వైకాపా నుండి తెదేపాలోకి పలువురు చేరిక
పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి పల్లె

శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు, మార్చి12(విజయస్వప్నం. నెట్)
మండలంలోని ఇనగలూరు పంచాయతీలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఇద్దే లక్ష్మినారాయణ రెడ్డి,ఇద్దేగంగిరెడ్డి, ఇద్దే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు మంగళవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరారు. బొడెద్దులవాండ్లపల్లికి చెందిన నాగరాజు, గొల్లపల్లికి చెందిన పెయింటర్ వీరాంజనేయులు, చంద్రనాయక్ లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వంచిరెడ్డిపల్లికి చెందిన శివశంకర్ రెడ్డి, ఓడిచెరువు రహంతుల్లా కుమారులు అహ్మద్ అలి,బాబావలి కుటుంబ సభ్యులు వైకాపా నుండి తెదేపాలోకి చేరగా, చేరినవారికి మాజీమంత్రి పల్లె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు మినీ మేనిపెస్టో సూపర్ సిక్స్ పథకాలపై ఆకర్షణతో తెదేపాలో చేరినవారు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా స్థానిక మసీదులోకి వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి మాజీ మంత్రి పల్లె ప్రార్థనలు చేశారు. అనంతరం పలువురు తెదేపా కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యతో బాధపడుతున్న వారిని పరామర్శించి మాజీమంత్రి పల్లె ఆర్థిక సాయం అందించారని తెదేపా శ్రేణులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి