భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి: సిఐటియూ, కార్మికుల ర్యాలీ
ఓడిచెరువు - శ్రీసత్యసాయి జిల్లా,ఓడిచెరువు మండలంలో భువన నిర్మాణ కార్మికులకు ఇళ్లపట్టాలు,గృహాలు మంజూరు చేయాలని సిఐటియూ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్ఆర్ కూడలి నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి,తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,మండల కార్యదర్శి పోరాటాల శ్రీరాములు,అధ్యక్షులు కుల్లాయప్ప మాట్లాడుతూ.... భవన నిర్మాణ కార్మికులు కోనేళ్లగా గూడు లేక కష్టపడి కూలి చేసుకొని బాడుగలు కట్టుకోలేక కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నరని,రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేసి సమస్యల పరిష్కారం చేయాలని,లేని పక్షంలో వివిధ రూపాలలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప,కార్యదర్శి రవి,కోశాధికారి సూరి,శ్రీనివాసులు,మహేంద్ర,సహాయ కార్యదర్శి కేశవ,రమణప్ప,మహిళ నాయకురాలు మనీ,గంగాదేవి, తదితర భవన కార్మిక సభ్యులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి