విద్యుత్ షాక్ గురై వ్యక్తి కూలి మృతి
శ్రీ సత్యసాయి జిల్లా - ఫిబ్రవరి 01
మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామానికి చెందిన నంజప్ప నాయుడు(65)గురువారం విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ బి. మల్లికార్జునరెడ్డి తెలిపారు.మృతుడు నజ్జప్ప నాయుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని,31 సాయంత్రం (బుధవారం)తూవంకపల్లి (బడావండ్లపల్లి)చెందిన వెంకటరామిరెడ్డి నాజ్జప్ప నాయుడుకి ఫోన్ చేసి తన పొలంలో విద్యుత్ తీగ తెగిపోయిందని తెలిపగా....కరెంట్ వైర్ లాగడానికి పొలం వద్దకు రమ్మని పిలవడంతో వెంటనే గ్రామానికి చేరుకొని ఇద్దరు కలిసి కరెంట్ పని చేసుకుంటూ ఉండగా అనుకోకుండా విద్యుత్ తీగ తగిలి షాక్ గురై పడిపోయినాడని వెంటనే అక్కడికి వెళ్లి చూడగా మృతి చెందారని మృతుడు నజ్జప్ప నాయుడు కుమారుడు చంద్రశేఖర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతిడిని పోస్ట్ మార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు
ఉచిత వివాహ కార్యక్రమానికి ఎస్ఐకి ఆహ్వానం
ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి01
మండల కేంద్రానికి అతి సమీపంలో ఎం.కొత్తపల్లి బంగారు బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం ఆవరణలో శ్రీలక్ష్మినరసింహస్వామి సన్నిధిలో ఈనెల 14వతేది(మాఘుమాసం)కదిరి జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ కోడూరు శ్రీకాంత్, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే 11 జంటల వధూవరులకు సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొనాలని గురువారం పోలీసుస్టేషన్ లో ఎస్ఐ మల్లికార్జునరెడ్డిని చైర్మన్ కోడూరు శ్రీకాంత్, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మర్యాద పూర్వకంగా కలసి ఆహ్వానపత్రిక అందజేశారు.శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు పలువురి సహాయ సహకారాలతో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.... ఇలాంటి సామూహిక ఉచిత వివాహ శుభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడడం,అభినందనీయమని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి కొనియాడారు.జోగి శ్రీదేవి ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఈసందర్బంగా తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ సేవకులు సీసి కెమెరా శంకర,డప్పు నరేష్,సర్వేయర్ గంగులప్ప,రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి