ఉపాధి హామీ నూతన ఏపిఓగా సుధాకర్ భాద్యతలు
శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి 15(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పధకం నూతన ఏపీఓగా సుధాకర్ గురువారం భాద్యతలు చేపట్టారు. సాంకేతిక, క్షేత్ర సహాయకులు నూతనంగా భాద్యతలు స్వీకరించిన ఏపిఓ సుధాకర్ కు పుష్పగుచ్చాలు అందించి సాధారంగా స్వాగతం పలికారు. గతంలో విధులు నిర్వహిస్తున్న ఏపిఓ సోమశేఖర్ రెడ్డి బదిలీపై సోమందేపల్లి మండలానికి వెళ్లినట్లు తెలిపారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్)
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేడు దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మె జయప్రదం చేయాలని ఓడిచెరువు మండల సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయప్ప, పోరాటాల శ్రీరాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు(శుక్రవారం) నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడి, ఆశ,హమాలీ, స్వచ్ఛభారత్ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
______________________________
టీడీపిని వీడి పలువురు వైసీపీలోకి చేరిక
శ్రీసత్యసాయిజిల్లా,నల్లమాడ ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్ )
నల్లమాడ మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి ఆధ్వర్యంలో చంద్ర,సాంబశివ,శంకర్,వీరనారప్ప,కిరణ్ కుమార్, రామచంద్ర, లక్ష్మీదేవి తదితరులు టిడిపి నుండి వైసీపీలోకి చేరారు.దుద్దుకుంట అపర్ణ రెడ్డి వైకాపాలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా(కదిరి అమరావతి)ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్)
విజయవాడ ఉండవల్లిలోని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగృహంలో కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ నాయకులు పి.వి.పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన మాజీ ఎంపీపీ మనోహర్ రెడ్డి వారితో పాటు మాజీ ఎంపీపీ లు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు మిత్ర బృందం ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
______________________________
రాయల్ పీపుల్స్ ఫ్రంట్ రాయలసీమ జోన్ యువ విభాగం అధ్యక్షులుగా లక్ష్మణ కుటాల
రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సంస్థ ద్వారా ఉత్తమ సేవలు అందిస్తున్న కుటాల లక్ష్మణన్ని రాయల సీమ జోన్ యువ విభాగం అధ్యక్షులుగా వ్యవస్థాపకులు రెడ్డి శేఖర్ రాయల్ నియమించారని గురువారం తెలిపారు. ఆయన చేస్తున్న నిస్వార్థ సేవకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తూ.... నిజాయితీగా ఉన్న గొప్ప లక్షణాలు, కులం కోసం సమాజం కోసం ఆయన కృషి అమోఘమని కొనియాడారు. పదోన్నతి కల్పించిన ఆర్పీజి కేంద్ర కమిటీ సభ్యులకు ఈసందర్బంగా లక్ష్మణ కుటాల కృతజ్ఞతలు తెలిపారు.
______________________________
వైకాపాకు పాలెం సుధాకర్ రాజీనామా
శ్రీసత్యసాయిజిల్లా,నల్లచెరువు ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్)
కదిరి నియోజకవర్గం పరిధిలో అన్ని మండలాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామీణ ప్రజల మన్ననలు అందుకొంటున్న పాలెం సుధాకర్ వైఎస్ఆర్సిపికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం అయన ఓప్రకటనలో పేర్కొన్నారు.ప్రజలు కోరితే కదిరి శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అయన తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రజలతో చర్చించి త్వరలో ప్రకటిస్తారన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మున్సిపల్ కమిషనర్ కు సమ్మెకాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని జిఓలను వెంటనే విడుదలచేయాలని గురువారం వినతి పత్రం అందించినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిఆంజనేయులు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నాగరాజు, సూరి తదితరులు ఉన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామాల పరిధిలో మృతి చెందిన,ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కుటుంబాలను గురువారం పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందించి ఎల్లవేళలా వైకాపా అండగా ఉంటుందని దైర్యం చెప్పి భరోసా ఇచ్చినట్లు మండల కన్వీనర్ మద్దే రాజునాయుడు, సోసైటీ అధ్యక్షులు ఎద్దుల రామసుబ్బారెడ్డి,సర్పంచ్ శ్రావణి,అగ్రిఅడ్వాజ్ చైర్మన్ లక్ష్మిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు బోయపాటి జగన్మోహన్ చౌదరి తెలిపారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్ కు వెళ్ళ్తున్న తెదేపా జాతీయ అధ్యక్షులు నారా భువనేశ్వరికి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు.తెలుగుదేశం ప్రజాప్రతినిధులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
______________________________
జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీలో ఫైనల్ చేరిన కదిరి జట్టు
మీడియా ఎంప్లొయ్స్ జట్టు పై కదిరి జట్టు విజయం
శ్రీసత్యసాయిజిల్లా కదిరి,ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్)
:ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ఆర్డిటి స్టేడియంలో గురువారం ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి పాల్గొనగా, జిల్లా కార్యదర్శి విజయరాజు అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్, షాకీర్, వీరశేఖర్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి, కదిరి కింగ్స్ జట్టు కెప్టెన్ మహబూబ్ భాష, శ్రీకాంత్ తదితర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన తొలి మ్యాచ్లో మచ్చ రామలింగారెడ్డి బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ని లాంచనంగా ప్రారంభించారు. కదిరి, మీడియా ఎంప్లాయిస్ జట్లు బరిలో దిగగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న మచ్చ రామలింగారెడ్డి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు. మీడియా ఎంప్లాయిస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్ కు దిగిన కదిరి జట్టు నిర్ణిత 15 ఓవర్లలకు మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేయగా అందులో భరత్(ఎన్ వీ టీవీ)98 పరుగులు, ఆనంద్ (ఎన్ వీ టీవీ)20, ఆది(ప్రతి) చివరిలో ధాటిగా ఆడి 8బంతుల్లో 24 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన మీడియా ఎంప్లాయిస్ జట్టు 15 ఓవర్లలలో9 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేసి ఓటమితో వెనుతిరిగింది. కదిరి బౌలర్లలో సురేంద్ర (ఆంధ్రప్రతి) 2ఓవర్లలో 7పరుగులిచ్చి కీలక 2 వికెట్లు తీశారు, కెప్టెన్ బాషా(ఆంధ్రప్రతి), భరత్(ఎన్ వీటీవీ), దావూద్(ప్రతి), కృష్ణమూర్తి, విజయ్ ఒక్కో వికెట్ తీసారు. ఈ విజయంతో కదిరి జట్టు ఫైనల్ లో ప్రవేశించినట్లు నిర్వహకులు తెలిపారు.
______________________________
విజ్ఞాన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి15(విజయస్వప్నం)
డబ్బులు కడితే ఏ కోర్సు సర్టిఫికెట్లైనా ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేస్తున్న విజ్ఞాన్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఏ నాయకులు మాట్లాడుతూ కదిరి పట్టణంలో విజ్ఞాన్ నర్సింగ్ కళాశాల యాజమాన్యం కదిరి సమీపంలో నర్సింగ్ విద్య లేదని విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని. అదేవిధంగా రెండు నెలల కిందట విజ్ఞాన్ కాలేజీ ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదుట ఉండేదని. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా వేరొక చోటకు మార్చడం జరిగిందని, అలాగే డబ్బులు కడితే డిస్టెన్స్ మరియు ఓపెన్,రెగ్యులర్ సంబంధించి సర్టిఫికెట్లు తెప్పిస్తామని అమాయకుల నుండి వేలాది రూపాయలు వసూలు చేసి డబ్బులు అందిన తర్వాత అమాయకుల్ని మోసం చేస్తున్నారన్నారు. విజ్ఞాన్ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పృథ్వి రాజ్, కదిరి మండల కార్యదర్శి రాకేష్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా,తలుపుల ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్)
తలుపుల మండల పోలీసుస్టేషన్ లో గురువారం నూతన ఎస్ఐ దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ..... రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు దృష్టి సరిస్తారని,మండలంలో ట్రాఫిక్ సమస్య లేకుండా, గుట్కా, గంజాయి, అక్రమ మద్యం రవాణా అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలపైన దృష్టి పెట్టి సమూలంగా నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి15(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానములో రథసప్తమి సందర్బంగా (నేడు) శుక్రవారం ఉదయము 6 గంటల నుండి శ్రీస్వామి వారు సూర్య ప్రభ వాహనము పై విశేష పుష్పాలంకరణతో తిరుమాడ విధులలో విహరిస్తూ భక్తుల దర్శనము కోసం ఉత్సవ ఊరేగింపు నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో భక్తులు,పుర ప్రజలు పాల్గోని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
______________________________
,శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి15 (విజయస్వప్నం.నెట్)
తిరుపతి శ్రీజ సంస్థ, జైకా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పాల ఉత్పత్తులు, విలువైన పౌషికాహారంపై సిబిసి శ్రీవిజ్ఞాన్, వశిష్ట,విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాలు సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు, పవర్ పాయింట్ ప్రెజెంటెంషన్ తో అవగాహన కలిపించి విద్యార్థులకు క్యారీ బ్యాగ్స్, శ్రీజ మిఠాయి బాక్ససులు అందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి