google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : కమణీయంగా శ్రీసీతారాముల కళ్యాణం

22, ఫిబ్రవరి 2024, గురువారం

కమణీయంగా శ్రీసీతారాముల కళ్యాణం

బీసీల ఐక్యతతో రాజాధికారం సాధ్యం

బిసి నాయకుల ఆత్మీయ సమ్మేళనం ర్యాలీ


శ్రీసత్యసాయి పుట్టపర్తి ఫిబ్రవరి21(విజయస్వప్నం.నెట్)

బీసీల ఐక్యతతో రాజాధికారం సాధ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన్న శంకర్ రావు,సామకోటి ఆదినారాయణ, రమేష్ గౌడ్,పిసి గంగన్న,డిఎస్పి వేణుగోపాల్ పేర్కొన్నారు.బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే....ఉద్యమం ఒకటే మార్గమని,ఐక్యమత్యమే.... మహాబలమన్నటుగా బీసీల్లో చిన్నచిన్న విభేదాలు వీడి రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకెళ్లాలని బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పిలుపునిచ్చారు. అంతకముందు పుట్టపర్తి పురవీధుల్లో బీసీ నాయకులు నినాదాలు చేస్తూ.... ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలో దళవాయి వెంకటరమణ,సిమెంట్ పొలాన్న, లాయర్ హరికృష్ణ, సంపంగి గోవర్ధన్, సొంపాళ్యం నాగభూషణం,వేమనారాయణ,రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

______________________________

కమణీయంగా శ్రీసీతారాముల కళ్యాణం




శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి21(విజయస్వప్నం.నెట్)

కదిరి సేవా భారతి ఆధ్వర్యంలో బుధవారం అయోధ్య శ్రీసీతారాముల కళ్యాణం కమణీయంగా వైభవంగా నిర్వహించారు. బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులకు శ్రావణానందం కలిపించారు. కదిరి ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ఆవరణలో వివిధ పుష్పలతో సుందరంగా కల్యాణ వేదికను అలంకరణ చేసి ప్రధాన అర్చకుల వేద మంత్రాలతో అయోధ్య శ్రీసీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.అయోధ్య శ్రీరాముడి కీర్తిపై బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఆకట్టుకొన్నాయి. రామరాజ్యంలో సకాల వర్షాలు,పాడిపంటలు, సిరిసంపదలతో నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా,సుగుణభి రాముడి ప్రజా పాలనలో రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లాయని,శ్రీరామ నామస్మరణతో కుటుంబ వ్యవస్థ విలువలు సంరక్షణ సాధ్యమని చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో భోదించారు. శ్రీసీతారాముల వేషధారణలో బాలబాలికలు ఆలపించిన గీతాలు,నృత్యాలు పలువురిని ఆకట్టుకొన్నాయి. సేవాభారతి నిర్వాహకులు డి.నారాయణశెట్టి, కుమార్ రెడ్డి, తలుపుల గంగాధర్, ఉత్తమరెడ్డి, డిఎల్ రామాంజనేయులు, సురేష్, కుంచపు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

______________________________




శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు ఫిబ్రవరి21(విజయస్వప్నం.నెట్)

ఆమడగూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బుధవారం ఎంపిపి, ఎంపిడిఓ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా నిర్వహించారని పలువురు అనుకొన్నారు. తాగునీరు, వెలుగు మహిళా సంఘాల రుణాల జాప్యం, గృహ నిర్మాణం బిల్లులు మంజూరు జాప్యం సమస్యలపై చర్చలు మినహా కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించక పోవడంతో పలు సమస్యలపై వచ్చిన గ్రామ పాలకుల్లో అసంతృప్తి నెలకొన్నట్లు కనిపించిందని పలువురు అనుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి