సంక్షేమ ఫలాలపై ప్రతి ఇంటికి వెళ్లి తెలిపే భాద్యత కార్యకర్తలదే....!
సిద్దం బహిరంగ సభలో సిఎం వైఎస్ జగన్
అనంతపురం/శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి18(విజయస్వప్నం.నెట్)
వైకాపా ప్రభుత్వం పాలనలో నవరత్నాలు సంక్షేమ పధకాలు ప్రజలకు చేరిన విధానం ప్రతి ఇంటికి వెళ్లి వివరించే భాద్యత కార్యకర్తలు భాద్యతగా తీసుకొని వెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం రాప్తాడు సిద్ధం బహిరంగ సభలో ఏర్పాటు చేసిన వేదికపై పిలుపునిచ్చారు.14ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేదని,మన (వైకాపా)పాలనలో రైతులకు, మహిళలకు,విద్యార్థులకు అన్నివర్గాల ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు అందించి రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపించిన ప్రగతిని వివరించాలని,రాబోయే ఎన్నికల్లో వైకాపా విజయం కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ముందుగా సియం వైఎస్ జగన్ వేదిక నలుమూలలకు తిరుగుతూ.... పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ.... పలకరిస్తూ.... వేదికపై మాట్లాడుతూ....జిల్లాల పునర్వీభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం తరలివస్తే....నేడు రాప్తాడుకు జనసముద్రం ఉప్పెనల తరలివచ్చిందని,జనసముద్రానికి, రాయలసీమగడ్డకు,ఇక్కడకు వచ్చిన సీమ బిడ్డలకు మీ జగనన్న నిండు మనసుతో, గుండెల నిండాప్రేమతో అభివాదం చేస్తున్నట్లు తెలిపారు.
______________________________
మాలల ప్రభంజనం ర్యాలీ విజయవంతం చేయాలి
శ్రీసత్యసాయిజిల్లా, ఫిబ్రవరి18(విజయస్వప్నం.నెట్)
అనంతపురం జిల్లా కేంద్రంలో ఈనెల 25న నిర్వహించే మాలల ప్రభంజనం ర్యాలీని విజయవంతం చేయాలని ఎస్సి,ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు రామన్న, అడ్వకెట్ పుల్లయ్యలు పిలుపునిచ్చారు.ఓడిచెరువు మండల కేంద్రం ఆర్డీటి పాఠశాల ఆవరణలో ఆదివారం మాలల ప్రభంజన ర్యాలీ పోస్టర్లు వారు విడుదల చేసి మాట్లాడుతూ....మాలల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ప్రభంజనం ర్యాలీలో భారీసంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని వారు కోరారు. నారాయణ, ఆకుతోటపల్లి నరసింహులు తదితరులు ఉన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా, ఆమడగూరు,ఫిబ్రవరి18(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమడగూరు వైకాపా నాయకులు సిఎం సిద్ధం బహిరంగ సభకు ఆదివారం బస్సుల్లో తరలివెళ్లినట్లు తెలిపారు.అనంతపురంలో రాప్తాడు వద్ద చేపట్టిన సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభకు మండలంలోని 10పంచాయతీ గ్రామాల నుండి వైకాపా శ్రేణులు ప్రత్యేక బస్సుల్లో తరలివెళ్లినట్లు సింగల్ విండో అధ్యక్షులు బొమ్మిరెడ్డి సూర్యనారాయణరెడ్డి,రైతు సంఘం అధ్యక్షులు గుమ్మల ధర్మారెడ్డి,డీలర్ల సంఘం అధ్యక్షులు కొండారెడ్డి తదితరులు తెలిపారు.
______________________________
విమానాశ్రయంలో సిఎంను కలసిన బొడ్డు నాగరాజు
శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి18(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలానికి చెందిన వైకాపా యువనాయకులు బొడ్డు నాగరాజు ఆదివారం సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలసారు.రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో పాల్గొనేందుకు విమానంలో సియం వైఎస్ జగన్ పుట్టపర్తి చేరుకొన్న సందర్బంలో విమానాశ్రయంలో సిఎం జగన్ ను బొడ్డు నాగరాజు గౌరవ పూర్వకంగా కలసి రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్యా పుట్టపర్తి నియోజకవర్గంలో వైకాపా స్థితిగతులపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి18(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అలాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం శ్రీగంగమ్మతల్లి విగ్రహా ప్రతిస్థాపన,హోమాలు,గోపూజ కార్యక్రమాలు అర్చకులు శ్రీ పంచ రత్న సురేష్ శర్మ నిర్వహించారు.అలుకుర్ కిష్టప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తీర్థప్రసాదలు అందచేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఆలుకుర్ ఆంజనేయులు,అనిత,మునిం ద్ర,జ్యోతి,పద్మావతి,శంకరప్ప,మహేష్,సురేష్ తదతరులు పాల్గొన్నారు.
______________________________
వైకాపా నుండి కందికుంట సమక్షంలో తెదేపాలో చేరిక
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఫిబ్రవరి17(విజయస్వప్నం.నెట్)
కదిరి డివిజన్ లోని కాలసముద్రం గ్రామంలో 50 కుటుంబాలకు చెందిన వైకాపా నాయకులు,కార్యకర్తలు ఆదివారం కదిరి శాసనసభ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.
______________________________
సిఎం సిద్ధం సభకు తరలిన వైకాపా శ్రేణులు
అనంతపురం జిల్లా,రాప్తాడులో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగసభకు ఓడిచెరువు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి వైకాపా నాయకులు,కార్యకర్తలు ఆదివారం బస్సులలో తరలివెళ్తున్నట్లు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి