google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net

5, ఫిబ్రవరి 2024, సోమవారం

భవన నిర్మాణ కార్మికుల వినూత్న నిరసన


శ్రీసత్యసాయి జిల్లా ఫిబ్రవరి 04(విజయస్వప్నం.నెట్)

త పదేళ్లుగా ఇంటి బాడుగలు కట్టలేక, కుటుంబాలు పోషించలేక ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహాలు మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి ఆరు రోజులు కావస్తున్నా, అధికారులలో ఎలాంటి స్పందన లేకపోవడంతో సిఐటీయూ నాయుకుల ఆధ్వర్యంలో మోకాళ్ళపై నిలబడి కళ్ళు మూసుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆరు రోజులుగా ఇళ్లపట్టాలు పంపిణి చేసి,గృహా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..! రిలే దీక్ష శిబిరంలో వివిధ రూపాలల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడ అధికారులకు కనిపించలేదని, వినూత్న రీతిలో మోకాళ్ళపై కళ్ళు మూసుకొని నిరసన తెలుపుతున్నారని తెలిపారు. ఇళ్ల పట్టాలు కేటాయించి, గృహాలు మంజూరు చేసే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప, పోరాటాల శ్రీరాములు, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

_______________________________

శ్రీసత్యసాయి జిల్లా,కదిరి(విజయస్వప్నం.నెట్)

దిరి పట్టణ పరిధిలో 83సర్వే నెంబర్ లో జరిగిన భూ కుంభకోణం కారకుడు ఆర్ఐ, మునవర్ హుసేన్,  దళారులైన బొట్టు సామి, నారాయణ పాల్ తదితరుల అవినీతిపై విచారణ చేసి అరెస్టు చేయాలని,అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన దీక్షలు ఆదివారం ఏడవరోజుకు చేరుకొన్నాయని ఆర్సిపి నాయకులు తెలిపారు. 

_______________________________

శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి(విజయస్వప్నం.నెట్) 

డిచెరువు మండలంలోని అలాపల్లి పంచాయతీ గౌనిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినిలు జిల్లా స్థాయి వాలీబాల్ పోటిల్లో గెలుపొంది తృతీయ స్థానంలో నిలిచారాని వ్యాయామ ఉపాధ్యాయుడు రాంబాబు తెలిపారు.ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు కొత్తచెరువు మండలంలో శనివారం నిర్వహించగా గౌనిపల్లి విద్యార్థులు ప్రతిభతో తృతీయ స్థానంలో నిలిచారాన్నారు.మండలలోని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ అరుణ్ కుమార్,ఆర్డీఓ భాగ్యరేఖ జ్ఞానపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారని తెలిపారు.ఈకార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

_______________________________


శ్రీసత్యసాయి జిల్లా,కదిరి ఫిబ్రవరి04(విజయస్వప్నం.నెట్)

గాండ్లపెంట మండలం మల్లమీదపల్లి పంచాయితీ కన్నంమరిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీవెంకటరమణ స్వామి ఆలయానికి ఆదివారం వైసీపీ రాష్ట్ర బీ.సీ విభాగం ఉపాధ్యక్షులు,డాక్టర్ బత్తల హరిప్రసాద్ అందజేశారని తెలిపారు.అలాగే కదిరి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బుల్ అహ్మద్ ఆలయ నిర్మాణానికి తనవంతుగా 1 లక్ష రూపాయలు విరాళం అందిస్తారని ప్రకటించారన్నారు.ఈసందర్బంగా గ్రామాల్లో  దాదాపు 50 కుటుంబాలకు చెందిన వారు వైకాపాలో చేరగా ఎమ్మెల్యే అభ్యర్థి బి. ఎస్ మక్బుల్ అహ్మద్,డా.బత్తల హరిప్రసాద్  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారన్నారు.వైకాపాలో చేరిన వారిలో దొడ్డప్ప,రామయ్య,శాంతమ్మ,చంద్ర,పూజారి వెంకటప్ప, శ్రీనివాసులు,నాగేంద్ర,గురమ్మ, శంకరప్ప తదితరులు ఉన్నారన్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ తాతం జగన్మోహన్,వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,జడ్పిటిసి భాస్కర్ రెడ్డి,సర్పంచ్ చలపతి,కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి,జెసిఎస్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కోఆప్షన్ సభ్యులు ఫయాజ్ అలీ,మండల కో ఆప్షన్ సభ్యులు అమీర్,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అమానుల్లా,సచివాలయ కన్వీనర్ నౌషాద్, నాయకులు విజయ్ కుమార్ రెడ్డి,హరినాథ్ రెడ్డి,రామకృష్ణ ,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

_______________________________

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి