4, ఫిబ్రవరి 2024, ఆదివారం

 శ్రీరాముడిపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన #కత్తి_పద్మారావు పై చట్టపరమైన చర్యలు కోరుతూ ట్యాంక్ బండ్ పై జరిగిన నిరసన కార్యక్రమం హిందూ బంధువుల స్పందన మరియు మద్దత్తుతో కార్యక్రమం అద్భుతమైన విజయం సాధించింది.


అంతకుముందు శ్రీరాముడి పైన యుట్యూబ్ వేదికగా అనుచిత అసభ్య కర వ్యాక్యాలు చేసినటువంటి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కత్తి పద్మారావు పై హిందూ జన సంఘాలు హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో కంప్లైంట్ దరఖాస్తు చేసారు. అధికారుల కంప్లైంట్ స్వీకరణకు సరియిన సహకారం అందించనందున సంఘం ప్రతినిధులపై తీవ్రం అసంతృప్తి తెలిపారు. కావును ప్రజలు కూడా ఇటువంటి వాటిపైన అవగాహన పెంచుకొని ప్రతిఘటించాలి, అని ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు లలిత్ కుమార్, కరుణాకర్, హమారా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అందరు తమ తమ మద్దతుని తెలుపుతూ నిరసన రాలిలో పాల్గొని విజయయవంతం చేయాలి అని పిలుపునిచారు.



శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తూ నిరసనగా, ఇటువంటి అనుచిత వ్యాక్యాలు మునుముందు ఈదేశం లో జరగకూడదు అని ప్రభుత్వాన్ని కోరుతూ,  తగిన కఠిన చర్యలు తీసుకోవాలని  హైదరాబాద్ లోని ట్యాంక్ బ్యాండ్ పై వున్న అంబేద్కర్ విగ్రహం దెగ్గర  హిందువులు   నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా జాగ్రతగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ అధికారులు ఎటువంటి సహకారాన్ని ప్రదర్శించలేదు అని హిందూ బందువులు అందరు అసంతృప్తిని వ్యక్తం తెలియచేసారు.

"హాజరైన ప్రతీ ఒక్కరికీ, మరీ ముఖ్యంగా మాతృ శక్తికి మనఃపూర్వక, వినయపూర్వక నమస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాము.. ఇది ఆరంభం మాత్రమే... #భవిష్యత్తులో_మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు జరగాల్సి ఉంది... మరెన్నో ఉద్యమాలు, పోరాటాలు జరగాల్సిన ఉంది... భవిష్యత్తులో కూడా ప్రతీ పిలుపుకీ ఇలాగే స్పందిస్తూ సహకరించి మన విజయానికి నాందిపలకాల్సిందిగా కోరుతున్నామని" హిందూ జనశక్తి స్థాపకుడు లలిత్ కుమారు గారు అన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి