4వ రోజుకు చేరిన భవన కార్మికుల రిలే దీక్షలు
శ్రీసత్యసాయి జిల్లా, ఓడిచెరువు ఫిబ్రవరి02- భవన నిర్మాణ కార్మికులు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణి చేసి,గృహాలు మంజూరు చేయాలని మండల రెవిన్యూ కార్యాలయం ముందు చేపట్టిన రిలే దీక్షలు 4వరోజు శుక్రవారం కొనసాగించారు.సిఐటీయు నాయకులు లక్ష్మినారాయణ,పోరాటాల శ్రీరాములు,కుళ్లాయప్ప తదితరులు సంఘీభావం తెలిపారు.4రోజులు ఇళ్ల పట్టాల కోసం దీక్షలు చేపట్టిన అధికారులు స్పందించలేదని, ఇళ్ల పట్టాలు మంజూరు చేసే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప,కార్యదర్శి రవి,కోశాధికారి సూరి,శ్రీనివాసులు,మహేంద్ర, సహాయ కార్యదర్శి కేశవ,రమణప్ప,మహిళ నాయకురాలుమనీ,గంగాదేవితదితరులు పాల్గొన్నారు.భవన నిర్మాణ కార్మికుల దీక్షా శిబిరంలో తెదేపా మైనారిటీ నాయకులు టైలర్ నిజాం,చాంద్ బాషా తదితరులు మద్దతు పలికారు.
_________________________________________________
బదిలీపై వెళ్లిన ఎస్ఐ బి. మల్లికార్జునరెడ్డి
శ్రీసత్యసాయి జిల్లా ఓడిచెరువు మండల పోలీసుస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ బి.మల్లికార్జునరెడ్డి బదిలీ ప్రక్రియలో భాగంగా కనగానపల్లి మండల పోలీసుస్టేషన్ కు నియమాక ఉత్తర్వులు అందడంతో అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం రిలీవ్ అవుతున్నట్లు అయన విలేకరులకు తెలిపారు. గతములో ఎప్పడు పని చేయని కొత్త ప్రదేశము ఓడిచెరువు మండలంలో పనిచేసిన స్వల్ప కాలంలో విధి నిర్వహణలో సహకరించిన పోలీస్ సిబ్బందికి, మండల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు.ఎస్ఐ బి.మల్లికార్జునరెడ్డి విధి నిర్వహణలో అనతి కాలంలోనే ఉత్తమ సేవలు అందించారని మండలంలోని అన్ని వర్గాల ప్రజలు కొనియాడుతున్నారు.
___________________________________________________
శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా భాద్యతలు స్వికరించిన మున్సిపల్ కమిషనర్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపినట్లు కదిరి పట్టణానికి చెందిన రిషిత చిన్న పిల్లల వైద్య నిపుణులు,ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు సివి మదన్ కుమార్,అడ్వకేట్ సీవీ కృష్ణమూర్తి తెలిపారు.
________________________________________________
రాత్రింబవళ్ళు దీక్షలు కొనసాగిస్తాం : ఆర్సిపి నాయకులు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం ఐదవ రోజుకు చేరుకోగా,రాత్రి పగలు ఇక్కడే వంటవార్పు చేసుకుంటూ దీక్షలు కొనసాగిస్తున్నట్లు నాయకులు తెలిపారు. అందులో భాగంగా 4వరోజు(నిన్నటి రోజు)రాత్రి దీక్షా శిబిరంలో సహపంక్తి భోజనాలు చేసి తెల్లవారుజామున వరకు నిరసన తెలిపారన్నారు.సర్వేనెంబర్ 83 కుంభకోణం పై విచారణ జరిపి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణి చేసే వరకు నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
__________________________________________
జానపద కళాకారుల సంఘాలను బలోపేతం చేయాలి
శ్రీసత్యసాయి జిల్లా,కదిరి - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు సందర్భంగా అనంతపురము ఉమ్మడి జిల్లా కళాకారులకు కదిరి మార్కెట్ యార్డ్ లో గ్రామీణ ప్రాంతాల భజన కళాకారులకు శుక్రవారం సమావేశం ఏర్పాటు చేయగా.....జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి ముఖ్య అతిధిగా హాజరై కళాకారులకు గుర్తింపు కార్డులు పంపిణి చేసినట్లు రాష్ట్రనాయకులు,అనంతపురం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎం.నారాయణ తెలిపారు.ప్రభుత్వం దృష్టికి కళాకారుల సమస్యలు తీసుకెళ్లి,కళరంగాలను పొత్సహిస్తూ..... గుర్తింపు కార్డులు మంజూరు చయించిన రాష్ట్ర సాంస్కృతిక మంత్రి ఆర్ కే రోజాకి,సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కి సిబ్బందికి ఈసందర్బంగా జానపద వృత్తి కళాకారుల సంఘం నాయకులు,కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జానపద కళాకారుల సంఘం కార్యాలయం కిరణ్,జిల్లా నాయకులు సోమేశ్వర,నాగేశ్వరరావు,చెన్నకేశవులు,రామిరెడ్డి,రమణ,ఆంజనేయులు,కదిరిరెడ్డి,నరసింహులు ,శ్రీరాములు,కృష్ణప్ప,నాగరాజు,నాగార్జున,నాగన్న,రాజశేఖర్ రెడ్డి,జయరామ్ఆదినారాయణరెడ్డి,తిమ్మరాయుడు,కల్యాణదుర్గంనాగన్న,వెంకటనారాయణ,శివలింగప్ప,మల్లన్న,గోవిందరెడ్డి, రామకృష్ణ,గురువులు కర్నూలు జిల్లా సురేష్ బృందం, సంఘం ప్రతినిధులు,మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో భజన,హరినామ సంకీర్తన,జక్కి,కోలాటం,చెక్క భజన వివిధ జానపద వృత్తి కళాకారులను గుర్తించి సంఘాలు ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరి ఈసందర్బంగా పిలుపునిచ్చారు.
____________________________________
జగనన్న 2వ విడత ఆరోగ్య శిబిరం వైద్య పరీక్షలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఫిబ్రవరి 02(విజయస్వప్నం. నెట్)కొత్తచెరువు మండలం కొదపగానిపల్లిలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం నిర్వహించారు.శిబిరంలో ప్రతి ఒక్క రికిvసంబంధిత వైద్యాధికారులు తక్షణమే వారికి వైద్య పరీక్షలు చేసి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి ఉచితంగా మందులు అందజేశారు.అత్యవసర పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేయడమే కాకుండా వారికి కావలసిన మందులను కూడా ఉచితంగా ఇస్తూ,కంటి పరీక్షలు తక్షణమే నిర్వహిస్తూ కళ్ళ అద్దాలను అందజేస్తూ....నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తామన్నారు.డిప్యూటీ డిఎంహెచ్ఓ సెల్వియ సోలోమన్ వైద్య శిబిరంలో పర్యవేక్షించి సూచనలు సలహాలు తెలియజేసి,మందులు పరికరాలను దగ్గరుండి మరి వీక్షించి సదుపాయాలు కల్పించి ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.నోడల్ అధికారి వీరమ్మ,వైద్యాధికారి వెంకట్ నారాయణరెడ్డి,సర్జన్ అశ్వర్థ కుమార్,స్త్రీ వైద్య నిపుణులు రాధ,సీహెచ్ఓ గౌరీదేవి,పిహెచ్ఎన్ రామలక్ష్మి,,సర్పంచ్ అలివెలమ్మ ,ఏంపిటిసి యం.వరలక్ష్మి,గ్రామ కార్యదర్శి సురేంద్రరెడ్డి, ఆరోగ్య,ఆశ కార్యకర్తలు,వైద్య సిబంది పాల్గొన్నారు.
______________________________________
శ్రీసత్యసాయి జిల్లా,నల్లచెరువు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎం.రాణెమ్మను కార్యాలయం అధికార సిబ్బంది గౌరవప్రదం గా స్వాగతం పలికి, పరిచయం చేసుకొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ శుక్రవారం శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డికి పుష్పగుచ్చం అందజేసి, మర్యాదపూర్వకంగా కలిశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి