google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net

3, ఫిబ్రవరి 2024, శనివారం

మారుమూల_ప్రాంతమైన_కంశెట్టిపల్లి_తిరుమల_దేవరపల్లి విద్యార్థులకు_భోజనం ప్లేట్లు, వాటర్ గ్లాసులు_పంపిణీ

ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా  #ఖిద్మత్_ఎ_ఖల్క్_చారిటబుల్_ట్రస్ట్ షామీర్ ఆధ్వర్యంలో 





★పుట్టపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా రెండు స్కూల్ కంశెట్టిపల్లి,తిరుమల దేవరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శ్రీకాంత్ చేతుల మీదుగా విద్యార్థులకు_భోజనం ప్లేట్లు, వాటర్ గ్లాసులు, బిస్కెట్ అందించడం జరిగింది. 

●ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవి రాజు,జావీద్, జైబు తదితరులు పాల్గొన్నారు.

_____________________________________

గ్రామీణ పాఠశాల విద్యార్థులకు భోజనం ప్లేట్లు,గ్లాసులు పంపిణి

 శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఫిబ్రవరి 03(విజయస్వప్నం.నెట్)- పుట్టపర్తి పట్టణ ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షామీర్ ఆధ్వర్యంలో,సత్యసాయి జిల్లా  ఎన్టీఆర్ అభిమాన సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా  కంశెట్టిపల్లి,తిరుమల దేవరపల్లి మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల(రెండు పాఠశాలలో)విద్యార్థులకు భోజనం ప్లేట్లు,వాటర్ గ్లాసులు,బిస్కెట్ ప్యాకెట్లు శ్రీకాంత్ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవి రాజు,జావీద్, జైబు తదితరులు పాల్గొన్నారు.

_____________________________________

పెనుగొండ అసంబ్లీ తెదేపా అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా: మాజీ శాసనసభ్యులు బికే పార్థసారధి

శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ ఫిబ్రవరి 03(విజయస్వప్నం.నెట్ ) - బాబు నాకు భరోసా ఇచ్చారు.నేను మీకు భరోసా నాకు మీరు నాకు అండగా ఉండండి అంటూ శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తెదేపా నాయకులు, కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు.

పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే,గెలిచేది నేనే,పెనుగొండ గడ్డ పై తెలుగుదేశం జెండా ఎగరావేసేది నేనే అంటూ కార్యకర్తలతో బికే అన్నారు.హిందూపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాననే ప్రచారం నమ్మకండి,నేను పెనుగొండ శాసనసభ స్థానం నుండే పోటీ చేస్తానని అయోమయంలో ఉన్న నాయకులకు,కార్యకర్తలకు బికే పార్థసారధి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భరోసా ఇచ్చారు.

_____________________________________


భవన కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తాం

(శ్రీసత్యసాయి జిల్లా)ఓడిచెరువు ఫిబ్రవరి03(విజయస్వప్నంనెట్)భవన నిర్మాణ కార్మికులు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు పంపిణి చేసి,గృహాలు మంజూరు చేసే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని భవన నిర్మాణ కార్మికులు,సిఐటీయు నాయుకులు తెలిపారు.మండల రెవిన్యూ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చేపట్టిన రిలే దీక్షలు 5వరోజు శనివారం కొనసాగించారు.సిఐటీయు నాయకులు లక్ష్మినారాయణ,పోరాటాల శ్రీరాములు,కుళ్లాయప్ప తదితరులు సంఘీభావం తెలిపారు.శిబిరంలో సిఐటీయు జిల్లా అధ్యక్షులు సాంబశివ పాల్గోని మాట్లాడుతూ.... భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల పట్టాల మంజూరు చేయాలని రిలే దీక్షలు చేపట్టి 5రోజులు కావస్తున్న అధికారులు స్పందించక పోవడం బాధాకరమన్నారు,ఇళ్ల పట్టాలు మంజూరు చేసే వరకు రిలే దీక్షలు  కొనసాగిస్తామని వారు  తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మినారాయణ, కుళ్లాయప్ప, శ్రీరాములు,భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కిష్టప్ప,కార్యదర్శి రవి,కోశాధికారి సూరి,శ్రీనివాసులు,మహేంద్ర, సహాయ కార్యదర్శి కేశవ,రమణప్ప,మహిళ నాయకురాలుమనీ,గంగాదేవితదితరులు పాల్గొన్నారు.


శ్రీసత్యసాయి జిల్లా, కదిరి (విజయస్వప్నం.నెట్)కదిరి పరిధిలో 83సర్వే నెంబర్ లో జరిగిన భూ కుంభకోణం కారకుడు ఆర్ఐ మునవర్ హుసేన్, దళారులు బొట్టు సామి,నారాయణ పాల్  తదితరులపై విచారణ జరిపి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ....రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షలు 6వరోజు శనివారం కొనసాగాయి.

_____________________________________

అపోహలు నమ్మదండీ కదిరి అసెంబ్లీ అభ్యర్థిగా నేనే....:-మాజీ ఎమ్మెల్యే కందికుంట

శ్రీసత్యసాయి జిల్లా,కదిరి ఫిబ్రవరి 03(విజయస్వప్నం.నెట్) - అపోహలు నమ్మకండి, రాబోయే 2024 ఎన్నికలలో కదిరి శాసనసభ తెదేపా అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నానని శనివారం కదిరి పట్టణంలో స్వగృహంలో తెదేపా శ్రేణులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో తెదేపా ఇంచార్జ్, మాజీఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.గతంలో కదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న తెదేపా జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కదిరి శాసనసభ స్థానానికి కందికుంట ప్రసాద్ పోటీలో ఉంటారని ప్రకటించిన విషయం అయన గుర్తు చేశారు.కందికుంట ప్రసాద్ కు టికెట్ ఇవ్వలేదని ఇటీవల ప్రచారం జరుగుతుందని లేనిపోని అపోహలు నమ్మవద్దని, కదిరి శాసనసభ అభ్యర్థిగా నేనే పోటీ చేసి నాయకులు, కార్యకర్తల అండదండలతో విజయం సాధిస్తానని అయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందకుండా తెదేపా విజయం కోసం ముందుకెళ్లాలని అయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు.

_____________________________________

మంత్రి ఉషశ్రీ ఎదుట వైకాపా శ్రేణులు గందరగోళం

శ్రీసత్యసాయి జిల్లా, పెనుగొండ (విజయస్వప్నం.నెట్)మంత్రి ఉషశ్రీకి చుక్కదురైంది.సొంత  పార్టీలో వర్గ పోరు,సమావేశం ప్రదేశంలో వైకాపా శ్రేణుల మధ్య వాదనలు, ఇదంతా సోమందేపల్లి మండలం చాలకూరులో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉషశ్రీ ఎదుటే వైకాపా శ్రేణులు ఓ వర్గం అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్లెక్సీలను లాగేసారు.పోలీసులు ఇరువురికి సర్దిచెప్పారు.అయితే ఇది మంత్రికి సంబంధం లేదని,ఇరువర్గాల వ్యక్తిగత సాధారణ విభేదాలని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.

_____________________________________

అది మెగా డీఎస్సీ కాదు,వైసీపీ దగా డిఎస్సి:-మాజీమంత్రి పల్లె విమర్శ

శ్రీసత్యసాయి జిల్లా,పుట్టపర్తి ఫిబ్రవరి03(విజయస్వప్నం.నెట్) - అది మెగా డిఎస్సి కాదు వైసిపీ దగా డిఎస్సి,జాబ్ క్యాలెండర్ ఎక్కడ జగన్ రెడ్డి  ఎక్కడని ప్రశ్న,దేశంలో నిరుద్యోగం 11 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం 24% శాతం,యువతను వంచించే  విధంగా ఆంధ్రప్రదేశ్ ను నిరుద్యోగ ఆంధ్రగా మార్చారని,టీడీపీ రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్ గా మార్చితే వైసీపీ గంజాయి హబ్ గా మార్చిందని,ముఖ్యమంత్రి సభ కోసం ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా వేశారని మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి తెదేపా ఇంచార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి తెదేపా కార్యాలయం శనివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై విమర్శించారు.విద్యార్థుల భవిష్యత్ తో జగన్ చెలగాటం ఆడుతున్నారని,వైసీపీ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల పై పుట్టపర్తి  నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు.

_____________________________________

నేడు చర్మ వ్యాధులకు చికిత్సలు



 శ్రీసత్యసాయి జిల్లా,కదిరి ఫిబ్రవరి03(విజయస్వప్నం.నెట్) - కదిరి పట్టణంలో నేడు(ఆదివారం)రిషిత చిన్న పిల్లల ఆసుపత్రిలో అన్ని రకముల చర్మ వ్యాధులకు చికిత్సలు నిర్వహిస్తారని వైద్య నిపుణులు సీవి మదన్ కుమార్ శనివారం ఓప్రకటనలో తెలిపారు. ప్రతి నెల మొదటి, మూడవ ఆదివారం ప్రముఖ చర్మ సంరక్షణ నిపుణులు వైద్యుడు కే.విశ్వనాధ్ రిషిత ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలో వరకు అందుబాటులో ఉండి అన్ని రకాల చర్మ వ్యాధులతో భాధపడుతున్న వారికి చికిత్సలు, పరీక్షలు నిర్వహిస్తారని,ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అయన తెలిపారు.
_____________________________________

శ్రీసత్యసాయి జిల్లా(విజయస్వప్నం.నెట్) - కదిరి పట్టణంలో జీవిమాను కూడలి వద్ద శనివారం జీవిమాను హమాలి యూనియన్ అధ్యక్షులు ప్లే వుడ్ హిదయాత్  ఆధ్వర్యంలో కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  కందికుంట వెంకటప్రసాద్, పి.వి.పవన్ కుమార్ రెడ్డి  సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి 100 కుటుంబాల సభ్యులు చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.
_____________________________________

ఆధ్యాత్మిక భావంతో సేవా కార్యక్రమాలు చేపట్టాలి:-గ్రామ వికాస్ సమితి సభ్యులు 




శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి 03(విజయస్వప్నం. నెట్) - ఓడిచెరువు మండల పరిధిలోని డబురువారిపల్లి పంచాయతీ కుసుమవారిపల్లి గ్రామంలో శనివారం గ్రామ వికాస్ సమితి జిల్లా,డివిజన్, మండల అబ్యాస కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఈశ్వరీమాత దేవస్థానంలో   భజన కళాకారులకు సమావేశం ఏర్పాటు చేసి గ్రామ వికాస్ సమితి సభ్యులను ఎంపిక చేశారు.ఈ కార్
గ్రామాలవిద్యార్థి వికాస కేంద్రాల మాతాజీలు ఆచార్యులు పాల్గొన్నారు.సామాజిక విద్యా సమస్కార ప్రముఖ గంగులప్ప,విభాగ్ సాహసంయోజక చంద్రశేఖర్,జిల్లా సంయోజక్ దేవరాజ్ స్వామీజీ,మండల సంయోజక పూజారి రమణప్ప, సుబ్బరాజు తదితరులు మాట్లాడుతూ....
 భజన కళాకారులు ఆధ్యాత్మిక భావంతో పారిశుద్దం, పర్యావరణ పరిరక్షణ సేవా కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలని,కేవలం భజనలకు పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలు గ్రామ వికాస్ సమితి ద్వారా నిర్వహించే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసి నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసినట్లు వారు తెలిపారు.అనంతరం గ్రామ వికాస్ ఆధ్యాత్మిక సేవా భావం కరపత్రాలు విడుదల చేశారు.

_____________________________________

గుండెపోటుతో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి 

మృతుడు వెంకటసుబ్బు ఫైల్ ఫోటో
శ్రీసత్యసాయి జిల్లా, ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ గ్రామానికి చెందిన మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ సుబ్బు(వెంకటసుబ్బన్న)శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.2006 నుండి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ గా వెంకటసుబ్బు నాలుగేళ్లు పని చేస్తూ....కొంత పొలంలో అప్పట్లో బోరులు వేసి నీళ్లు తగ్గడంతో వ్యవసాయం చేసుకొంటూ పంటలు చేతికి అందక పోవడంతో బెంగళూరుకు వెళ్లి కూలినాలి చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొంటుండేవాడని, శనివారం ఉదయం స్నానికి వెళ్లగా ఆకస్మితుగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం గమనించి ఆసుపత్రికి తీసుకొళ్లగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.స్వగ్రామానికి తీసుకొచ్చిన మృతదేహనికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధువులు తెలిపారు.మృతడికి భార్య అమరావతి,పెళ్ళైన కుమారుడు గిరి, కుమార్తె అశ్వని ఉన్నారని తెలిపారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి