26, ఫిబ్రవరి 2024, సోమవారం

శివాలయానికి విగ్రహాలు వితరణ - హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై నాటక ప్రదర్శన

 శివాలయానికి విగ్రహాలు వితరణ 


శ్రీసత్యసాయిజిల్లా ఓబుళదేవరచెరువు గ్రామానికి చెందిన బొడ్డు సాంబశివ కుమారుడు బొడ్డు నాగరాజు  వారి ధర్మపత్నిబొడ్డు అరుణ(మాజీ ఎంపిటిసి), ఓడిచెరువు గ్రామంలోని బస్టాండ్ సమీపంలో వెలసిన శివాలయానికి గణపతి,పార్వతీ పరమేశ్వరుల  ఉత్సవ పంచంలోహ విగ్రహాలను(నేడు) సోమవారం ఉదయం ఏడు గంటలకు వితరణ చేసి పూజా కార్యక్రమములు నిర్వహించి,  అన్న ప్రసాదములు అందించునున్నారని,కావున గ్రామంలోని భక్తాదులు,పుర ప్రజలు పూజా కార్యక్రమములో పాల్గొనాలని కుటుంబ సభ్యులు ఆదివారం ప్రకటనలో పిలుపునిచ్చారు.



వారు గణపతి, పార్వతీ పరమేశ్వరుల  ఉత్సవ పంచంలోహ విగ్రహాలను సోమవారం పురోహిత పూజారి మురళీ స్వామి సమక్షంలో అందజేశారు. అంతక ముందు మాఘు మాస సోమవారం పురస్కరించుకొని ఉదయం ఏడు గంటల నుండి  దాతలు బొడ్డు నాగరాజు,బొడ్డు అరుణమ్మ దంపతులు ఉత్సవ వి గ్రహాలను స్వగృహం నుండి పురావిధుల గుండా మేళతాలతో శివాలయం వరకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. శివాలయంలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం,అర్చన  వివిధ పుష్ప్హాలతో అలంకరణ చేసి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజా కార్యక్రమములు నిర్వహించి,దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్ద,అన్న ప్రసాదములు అందజేశారన్నారు.పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు,పురప్రజలకు విగ్రహాల దాతలు బొడ్డు నాగరాజుతో పాటు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

______________________________

మాతృశ్రీ వృద్ధాశ్రమంలో.... టైలర్ నిజాం జన్మదిన వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా,ఆమడగూరు, ఫిబ్రవరి 25(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆదివారం ఓడిచెరువు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు టైలర్ నిజాంవలి జన్మదిన వేడుకలు వృద్ధుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు. ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు భోజనాలు అందించి, టైలర్ షాప్ లో ఏడాది పాటు ప్రొగు చేసిన హుండీని పగులగొట్ట దాదాపు 10వేల రూపాయల నగదు ఆశ్రమ నిర్వహకురాలు అరుణజ్యోతికి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.... ఆశ్రమంలో ప్రతి యేటా టైలర్ నిజాం వృద్ధులకు తమవంతుగా సహాయం అందిస్తున్నారని, టైలర్ నిజాంకు వృద్ధులతో పాటు అరుణజ్యోతి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్ నిజాం కుటుంబ సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఫిబ్రవరి25(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్  ఆవరణలో ఆదివారం 4 వ నేషనల్ లెవెల్ కరాటి ఛాంపియన్ షిప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న ను ఆహ్వానించారు.ఈసందర్బంగా నాగన్న  మాట్లాడుతూ.... విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలపై అవగాహన కల్పించి ప్రోత్సాహించాలని, అన్ని రంగాల్లోనూ విద్యార్థులు ముందంజలో ఉంటూ సొంత ఊరికి,రాష్ట్రానికి,దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని,పిల్లలకి చదువుతోపాటు క్రీడారంగంలో కూడా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలిపారు.ఈసందర్భంగా డాక్టర్ షేక్షావలి,డాక్టర్ ఏ.మురళీకృష్ణ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్ కే విSఎస్కేఏ ఇండియా, ఎన్.మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఏపీభి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి నాగన్న గారికి సన్మానించడం ô ఈ కార్యక్రమంలో ఆర్ సి పి మండల కార్యదర్శి శేఖర్ శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

_____________________________

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీసత్యసాయిజిల్లా,ఓబుళదేవరచెరువు,ఫిబ్రవరి25(విజయస్వప్నం.నెట్)

2007 -08  పదవ తరగతి బ్యాచ్ ఆదివారం తంగేదుకుంట పంచాయతీ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల  సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొని గత తీపి జ్ఞాపకాలను  గుర్తులు నెమరు వేసుకున్నారు. సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి రాధమ్మ, అమృతవల్లి, రవికుమార్, రమేష్, కరుణాకర్ రెడ్డి పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశమిచ్చారు. అనంతరం విద్యార్థులు గురువులకు పాదపద్మములకు నమస్కరించి ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమ నిర్వాహణ కమిటీ సభ్యులు జేజేoద్ర,అశోక్ కుమార్, అంజలి, రోహిత్, మున్నిరా, జయచంద్ర బాబు, అశోక్, సాయి తదితర పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.... గురువులు నేర్పిన విద్య వల్ల సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపుతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, వేదికపై ఆశీనులైన గురువుల సేవలను పూర్వ విద్యార్థులు కొనియాడారు.

_____________________________

హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై నాటక ప్రదర్శన

శ్రీసత్యసాయిజిల్లా,ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి25(విజయస్వప్నం.నెట్)

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ సంస్థ,జన జాగృతి కదిరి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  వెంకటేష్ కళాజాత బృందాలతో అవగాహన నాటక ప్రదర్శన నిర్వహించారు.శుక్రవారం ఓడిచెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు.నాటక ప్రదర్శన ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు,వ్యాధి వ్యాప్తి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా  సమాజములో ఎలాగ కలసి జీవించాలి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్,క్షయ వ్యాధి సంబందం గూర్చి,సుఖ వ్యాధులు,చికిత్సలు,కండోమ్ ఉపయోగాలు,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017,ఏఆర్టి మందులు,ఏపిఎస్ఏ సి ఎస్ యాప్,టోల్ ఫ్రీ నెంబర్ 1097 తదితర అంశాలపై వెంకటేష్ కళాజాత బృందం కళాకారులు పుర ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  జన జాగృతి కదిరి ప్రాజెక్ట్ మేనేజర్ ఇ.శ్రీనివాసులు,ఓ.ఆర్.డబ్ల్యూ శ్రీవాణి, శాంతమ్మ,ప్రసన్న,చంద్రకళ, విహన్ టీమ్ విజయ్,చైల్డ్ ఫండ్ ఇండియా యువరాజ్  పాల్గొన్నారు.

_____________________________

చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలి

బంజారా గర్జన భారీ ర్యాలీ 

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఫిబ్రవరి 25(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో  బంజారా నాయకులు ఆదివారం బంజారా గర్జన ర్యాలీ నిర్వహించారని ఎం. నారాయణనాయక్ తదితరులు తెలిపారు. పట్టణ పురవీధుల్లో వేలాది మంది గిరిజన సోదరులు ర్యాలీలో పాల్గొన్నారని, అనంతరం కదిరి  ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారన్నారు.స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న బంజారా ప్రాంతాలలో అభివృద్ధిని,గిరిజనుల సమస్యలు విస్మరించారన్నారు. గిరిజనులకు చట్టసభల్లో ప్రాధాన్యత,విద్యా,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు,తండాల అభివృద్ధి సాధన కోసం ప్రతి బంజారా బిడ్డలు ఉద్యమంలో పాల్గొనాలని బంజారా నాయకులు కోరారు.

_____________________________

శాస్త్రీయ ఆలోచనతోనే సామాజిక మార్పు సాధ్యం

డాక్టర్ సి.వి.మదన్ కుమార్

శ్రీసత్యసాయిజిల్లా, కదిరి25(విజయస్వప్నం.నెట్)

దిరి పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఎన్జీవో భవనంలో సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు బి.నరసారెడ్డి అధ్యక్షతన పిళ్లా కుమారస్వామి రచించిన "శాస్త్రీయ ఆలోచన" అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిషిత చిన్నిపిల్లల వైద్యులు సి.వి మదన కుమార్, న్యాయవాది నరసింహులు, యుటిఎఫ్ నాయకులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి ఎల్ఐసి ఏజెంట్ల సంఘం నాయకులు బయప్ప, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఆదిశేషు, ఇంద్రజాలకులు నబి. రచయిత పిళ్లా కుమారస్వామి, పెన్షనర్ల సంఘం నాయకులు వీరస్వామి పాల్గొన్నారు. అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక కదిరి ప్రాంతంలో ఉన్న అనేక మూఢనమ్మకాలపై  ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు వివిధ రూపాల ప్రదర్శనలతో ప్రయత్నం చేస్తుందన్నారు. మూర్చ వైద్య శిబిరాలను, విద్యార్థులకు చెకుముకి పరీక్షలను నిర్వహిస్తోందన్నారు. ఆయన స్వయంగా మ్యాజిక్ ఫైర్  ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యులు సి.వి. మదన్ కుమార్ మాట్లాడుతూ రచయిత పిళ్లా కుమారస్వామి తన వంతు సామాజిక బాధ్యత నెరవేర్చాడన్నారు. శాస్త్రీయ ఆలోచన మనిషిని ఉన్నతంగా ఆలోచింప చేస్తుందని, మూఢ విశ్వాసాలకు గురికాకుండా చేస్తుందన్నారు. శాస్త్రీయ ఆలోచన సమాజ మార్పుకు దోహదం చేస్తుందన్నారు. చాలామంది ఈ దిశగా కృషి చేస్తూ ఉన్నారని అందువల్లనే సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మూఢనమ్మకాలు పూర్తిగా తెర మరుగౌతాయని ఆశభావం వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డా.ఆదిశేషు మాట్లాడుతూ..... నేటి పాలకులు అనేక మూఢ విశ్వాసాలపై ప్రచారం చేస్తున్నారని, అంతేగాక సైన్సు నిరూపించిన అంశాలను కూడా పద్ధతి ప్రకారం పాఠ్యప్రణాళిక లోంచి తొలగిస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జ్యోతిషాన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టిందన్నారు. అంతేగాక ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ లో అనేక శాస్త్రీయ అంశాలను ఎప్పుడో ప్రాచీన భారతదేశంలో ఉన్నాయని ప్రచారం చేస్తూ, వాటన్నిటినీ సైన్స్ అని చెప్పుకుంటూ, ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.సమాజం ముందుకు పోతోందో, వెనక్కి పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందన్నారు.ఈనేపథ్యంలో సమాజంలో ఉన్న అనేక శాస్త్రీయ ధోరణులకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి శాస్త్రీయ ఆలోచనా ధోరణి గల పుస్తకాలు ఎక్కువగా రావాలని,ఈ పుస్తకాలనే సోషల్ మీడియాలో వేరువేరు రూపాలలో ప్రచారం చేయాలని ఆయన కోరారు.న్యాయవాది నరసింహులు మాట్లాడుతూ సమాజంలో అనేక సామాజిక నమ్మకాలు ఉన్నాయని,అవి కులంతో ముడిపడి ఉన్నాయన్నారు. ఆ కుల దృక్పథం నుంచి రచయిత బయటపడడానికి ఆయనకు  శాస్త్రీయ ఆలోచన దోహద పడిందన్నారు. ఎల్ఐసిఏజెంట్ల సంఘం నాయకులు బయ్యప్ప మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఎంతోమందిని శాస్త్రీయ ఆలోచన వైపు మళ్ళించిందని, ఆ వేదిక చేసిన గత 25 ఏళ్ళ  సేవలను వివరిస్తు కొనియాడారు. ఈ సందర్భంగా  సైన్సు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి, సైంటిస్ట్ చండ్రాయుడు, సాహితీ  స్రవంతి నాయకులు రాజశేఖర్, కదిరి అభివృద్ధి వేదిక నాయకులు చింతా శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు నరసింహులు, ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్, సిఐటియు నాయకులు యాకూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

_____________________________

సాహసం చేసిన మోదీ.. సముద్ర గర్భంలోకి వెళ్లి

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి సాహసమే చేశారు. ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పిఎంఓ ట్విటర్లో షేర్ చేసింది. ప్రార్థనా స్థలంలో మోదీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలను ఉంచి నమస్కరించారు. ఈ చర్యతో ద్వారకా టూరిజం మరింత పెరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి