27, ఫిబ్రవరి 2024, మంగళవారం

మార్చి 8న అక్కదేవతల ఆలయంలో ఉత్సవాలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి 26(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమవతి నది ఒడ్డున వెలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో మార్చి 8న మహాశివరాత్రి  పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమం వివరాలతో ప్రచురించిన కరపత్రాలను సోమవారం విడుదల చేసినట్లు పూజారి వెంకటేష్ తెలిపారు.శివరాత్రి పండుగ రోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు,సాయంత్రం 5గంటల నుంచి 6 వరకు గిరిగుల పూజలు,రాత్రి 8 గంటలకు జ్యోతి కార్యక్రమం,9 గంటలకు భజన కార్యక్రమం,రాత్రి 10పది గంటల నుంచి ఆర్కెస్ట్రా తెల్లవారుజామున వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భక్తాలు విశేషంగా పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కాగలరని కోరుతూ.... ఆహ్వాన కరపత్రం విడుదల చేసారని పూజారి వెంకటేష్ తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

_____________________________

శివాలయానికి ఉత్సవ విగ్రహాలు వితరణ

శ్రీసత్యసాయిజిల్లా ఓబుళదేవరచెరువు గ్రామానికి చెందిన బొడ్డు సాంబశివ కుమారుడు బొడ్డు నాగరాజు, బొడ్డు అరుణ దంపతులు ఓడిచెరువు గ్రామంలోని బస్టాండ్ సమీపంలో వెలసిన శివాలయానికి గణపతి, పార్వతీ పరమేశ్వరుల  ఉత్సవ పంచంలోహ విగ్రహాలను సోమవారం పురోహిత పూజారి మురళీ స్వామి సమక్షంలో అందజేశారు. 

అంతక ముందు మాఘు మాస సోమవారం పురస్కరించుకొని ఉదయం ఏడు గంటల నుండి  దాతలు బొడ్డు నాగరాజు,బొడ్డు అరుణమ్మ దంపతులు ఉత్సవ వి గ్రహాలను స్వగృహం నుండి పురావిధుల గుండా మేళతాలతో శివాలయం వరకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. శివాలయంలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం,అర్చన  వివిధ పుష్ప్హాలతో అలంకరణ చేసి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజా కార్యక్రమములు నిర్వహించి, దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్ద,అన్న ప్రసాదములు అందజేశారన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, పురప్రజలకు విగ్రహాల దాతలు బొడ్డు నాగరాజుతో పాటు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, ఫిబ్రవరి26(విజయస్వప్నం.నెట్) 

మాజీమంత్రి,పుట్టపర్తి తెలుగుదేశంపార్టీ  ఇంచార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో (నేడు) మంగళవారం ఉదయం 10:30 గంటలకు అనధికార విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడి,అనంతరం పోలీస్ స్టేషన్ పక్కన  పెట్రోల్ బంక్ నుండి ఇనగలూరు వరకు బైక్ ర్యాలీ  నిర్వహించి,రా.... కదలిరా.... ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొంటూ.... నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, మహిళా కార్యకర్తలు,యూనిట్ ఇన్చార్జిలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని సోమవారం మండల తెదేపా శ్రేణులు విలేకరులకు తెలిపారు. శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మండలంలోని మాడిమెకులపల్లి, కంచనవారిపల్లి గ్రామాలకు చెందిన ఆదినారాయణరెడ్డి, కిష్టప్ప ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 10కుటుంబాలకు చెందిన కార్యకర్తలు ఆదివారం పుట్టపర్తి తెదేపా కార్యాలయంలో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలలో ప్రచార కార్యక్రమాలు మాజీమంత్రి పల్లె చేపడుతున్నట్లు తెలుగుదేశంపార్టీ శ్రేణులు తెలిపారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి 26(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మిట్టపల్లి పంచాయతీ వణుకువారిపల్లి గ్రామానికి చెందిన  దేరంగుల రామకృష్ణ గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుడ్డుకుంట కిషన్ రెడ్డి గ్రామానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి,ఆర్ధికసాయం అందజేశారని స్థానిక ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు తెలిపారు.





_____________________________

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి (విజయస్వప్నం.నెట్)

అనంత జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ సాధన బహిరంగసభకు శ్రీసత్యసాయిజిల్లా పరిధిలోని 7 నియోజకవర్గంలోని మండలాల నుండి భారీగా తరలివచ్చి విజవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు జిల్లా కార్యదర్శి బొగ్గిటి మునికుమార్, పుట్టపర్తి డివిజన్ ఉపాధ్యక్షులు (ఓడిచెరువు మాజీ ఎంపిటిసి) తుమ్మల  మహబూబ్ బాష ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.




_____________________________

శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మండలంలో ఆదివారం పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించి కంచరవారిపల్లి గ్రామానికి చెందిన సోసైటీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సోదరుడి కుమారుడు నరేష్ కుమార్ రెడ్డి నూతన గృహప్రవేశం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదే గ్రామానికి చెందిన ఆదినారాయణ ఇటీవల తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే దుద్దుకుంట భాదితుడు ఆదినారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించి,సిఎం సహాయ నిధి ద్వారా సాయం అందిస్తామన్నారు, అలాగే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నూర్ బాషా కుటుంబ సభ్యులను పరామర్శించి వైకాపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు వైకాపా నాయకులు శివశంకర్ రెడ్డి,క న్వీనర్ సూర్యనారాయణరెడ్డి, సర్పంచులు ఆదినారాయణ, శ్రీధర్ రెడ్డి,షబ్బీర్, నాగరాజు, జయప్ప, రంగారెడ్డి తదితరులు తెలిపారు.

_____________________________

ప్రతి పేద కుటుంబానికి ఐదువేలు అందిస్తాం:ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే,ఏపిసీసి అధ్యక్షులు షర్మిల

శ్రీసత్యసాయి/అనంత జిల్లా ఫిబ్రవరి26(విజయస్వప్నం.నెట్)

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్టంలో ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5వేల రూపాయలు అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,ఏపిసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. అనంత జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో న్యాయ సాధన బహిరంగ సభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిధులుగా ఏఐసీసీ మల్లికార్జునఖర్గే, ఏపిసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గోని ప్రసంగించారు. సోనియాగాంధీకి,రాహుల్ గాంధీకి అనంత జిల్లా అంటే అభిమానమని,దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్టం అభివృద్ధి చెందిందని, సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలమ్మను మీముందుకు తీసుకొచ్చిందని ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే అన్నారు.దేశం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ధనిక వర్గాల  కోసం పని చేస్తోందని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోడీ అంటే చంద్రబాబు,జగన్,పవన్ భయపడుతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మోడీని నిలదీయడానికి దైర్యం లేక బీజేపీతో పొత్తుల కోసం వెంటపడుతున్నారని అయన విమర్శలు చేశారు .ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.... రాష్ట్ర విభజన పదేళ్లలో 5ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు,5 ఏళ్ళు జగనన్న పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేయలేదని,అభివృద్ధిలో రాష్టం 25ఏళ్ళు వెనక్కేళ్ళిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5వేలు అందిస్తామని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబడతమన్నారు. అనంతరం ప్రతి పేద కుటుంబానికి 5 వేలు అందిస్తామని రూపొందించిన చెక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రులు, ఎన్. రఘువీరారెడ్డి, శైలజానాథ్, రుద్రంరాజు, పల్లంరాజు, కేటీ శ్రీధర్, గౌతమ్, జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

_____________________________

ఆలయ ఉప ప్రధాన అర్చకులకి డాక్టరెట్ పురస్కారం

శ్రీసత్యసాయిజిల్లా కదిరి26(విజయస్వప్నం.నెట్)

పశ్చిమ బెంగాల్ కోలకత్తలో 2024 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ యూనివర్సిటీ 45వ వార్షిక ఇంటర్నేషనల్ సెమినార్ నందు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అర్చకం కుమారరాజాచార్యులకి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, సంస్కృత భాషా పండితులు, వేద పండితులు, వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎంపీలు, వెస్ట్ బెంగాల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వివిధ అధికారులు ఈ సెమినార్కు హాజరయ్యారు. ధర్మశాస్త్రాల యందు విశేష ప్రతిభ కలిగి, 25 ఏళ్లుగా శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో నిత్య కైంకార్యములు నిర్వహిస్తూ ధర్మ ప్రచారమునకు తన వంతు కృషి చేయుచున్న  దేవస్థానం ఉప ప్రధానార్చుకులు అర్చకం కుమార్ రాజాచార్యులకి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకొన్న సందర్బంగా ప్రముఖులు, పుర ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి