జర్నలిస్టుపై దాడి దుర్మార్గం..
తహశీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా ఎస్ఐ, తహసీల్దార్లకు వినతులు
ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి 19(విజయస్వప్నం.నెట్)
సమాజంలో ఫోర్త్ పిల్లర్‌గా ఉన్న మీడియా వ్యవస్థపై దాడులు దుర్మార్గమని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పాత్రికేయులు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. డిప్యూటీ తహశీల్దార్ జాకీర్, ఎస్ఐ వంశీకృష్ణకు వినతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా పలువురు విలేకరులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు విధి నిర్వహణలో ఉన్న ఆంధ్రజ్యోతి జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణపై కొందరు వైకాపా నాయకులు తీవ్రంగా దాడి చేయడం హేమమైన చర్యని మండిపడ్డారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సభలో ఒక పత్రిక విలేకరిపై దాడి జరిగితే ఇంకా సామాన్యులకు ఏమి రక్షణ కల్పిస్తారన్నారు.ప్రశ్నించే స్వరాలపై దాడులు జరపడం హేయమైన చర్యని,వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ చీకటి శక్తుల అరాచకాలపై వార్తా కథనాలతో ప్రజల్లో చైతన్యం కల్పించే జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. పత్రికా స్వేచ్ఛను హరింపజేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుతూ.... జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్.షాజహాన్(ఆంధ్రజ్యోతి) బుద్దల. గోపీనాథ్ రెడ్డి(టీవీ5) రంగారెడ్డి(ఆంధ్రప్రభ) శ్రీనివాసులు(వార్త) శిరిగం. చంద్రశేఖర్ రెడ్డి (మనం) ఆదిమూర్తి (విశాలాంధ్ర ) లక్ష్మన్న (సూర్య) మొమీన్. ఫయాజ్ (ప్రజాశక్తి ) రంగప్ప( అనంత భూమి) మౌలా (మహా న్యూస్) మహబూబ్ బాషా (బి.ఆర్.కె న్యూస్) భుజంగరావు (సివిఆర్ న్యూస్) చందు(రాజ్ న్యూస్) ఆనంద్(అనంత జనశక్తి) అయ్యప్ప (ధర్మపోరు) జయచంద్రరాజు(వజ్ర భారతి) నరసింహులు(అక్షర) పచ్చర్ల ఆంజనేయులు నాయుడు (విజయ స్వప్నం.net) లక్ష్మీపతి (అనంత ఫోకస్ ) మీడియా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.
______________________________
జర్నలిస్టుపై దాడి హెయ్యమైన చర్య
శ్రీసత్య సాయిజిల్లా,కదిరిఫిబ్రవరి19(విజయస్వప్నం..నెట్)
జగన్ సభలో మీడియా మీద దాడి పై అమానుషమని డీసీసీ ప్రధాన కార్యదర్శి బొగ్గిటి ముని కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో ఖండించారు. జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైకాపా దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
______________________________
విలేకరి పై దాడి చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలి:-సిపిఐ నాయకులు
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి19(విజయస్వప్నం.నెట్)
రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపై వైస్సార్ పార్టీ నాయకులు విచక్షణంగా దాడి చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మండల డిప్యూటి తహసీల్దారు జాకిర్ కీ వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఈ లాంటి రౌడీ ముకల దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని,పత్రిక విలేకరుల పైన దాడి అత్యంత హేమమైన చర్యని,మృగాల కంటే హీనంగా విలేకరిపై దాడికి పాల్పడ్డారని వేలాది మంది పోలీసులు బందోబస్తూలో ఉన్న విలేకరిపై దాడి ఆపకపోవడం సిగ్గు చేటని,ఇ ప్పటికైనా నిందుతలను అరెస్ట్ చేయాలనీ వారు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండలకార్యదర్శి చలపతినాయుడు,మహిళా నాయకురాలు రత్నబాయ్,కృష్ణారెడ్డి,రమణ, రవి తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల మండల జర్నలిస్ట్ ఈశ్వర్ పై దాడి మరువకుండనే రాప్తాడు సియం సిద్ధం బహిరంగ సభ వద్ద ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కృష్ణపై వైకాపా అల్లరిమూకలు దాడి చేయడం హేయమైన చర్య అంటూ....దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సోమవారం హిందూపురం ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులు నిరసన తెలిపి ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.
______________________________
జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ప్రజా ప్రెస్ క్లబ్, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో
శ్రీసత్యసాయిజిల్లా,తనకల్లు 19(విజయస్వప్నం.నెట్)
రాప్తాడులో సిఎం సిద్ధం సభలో కొంతమంది అల్లరమూకలు ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై దాడి చేయడం దారుణమని సోమవారం ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండకమర్ల రెడ్డిబాష,కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల సౌజన్యంతో హైవేపై నిరసన తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ రాప్తాడులో సియం సిద్ధం సభలో కొంతమంది చిల్లరమూకలు ఆంధ్రజ్యోతి కృష్ణ పై బౌతిక దాడి చేసి గాయపరిచడం దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, ఇటీవల పాత్రికేయులుపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అణిచివేయకపోతే భవిష్యత్తులో ప్రజల తరుపున ప్రశ్నించే వారు ఉండరని,ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ను భంగం కల్గించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.... రాష్ట్రములో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విలేకర్లపై దాడులు అధికమయ్యాయని, ఇలాంటి వైఖరి సమాజానికి మంచిది కాదని,దాడి చేసిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయకపోతే దాడులు పునరావృతమవుతాయని దాడి చేసినవారిని అరెస్ట్ చేసే వరుకు పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా వైస్ ప్రసిడెంట్ సోంపాళ్యం నాగభూషణ, మస్తాన్ వలి, సిపిఎం మండల కార్యదర్శి శివన్న,జిపిఎస్ రాయలసీమ నాయకులు మూడే ప్రసాద్ నాయక్, డిఎస్ఎస్ నాయకులు చిన్నప్ప, సిఐటియు డివిజన్ నాయకులు ఒంటెద్దు వేమన్న,వార్డు మెంబర్ తీరుపల్లి దామోదర్, శ్రీకాంతరెడ్డి, జనసేన నాయకులు, రవి, హర్షద్, శీనా, గంగులప్ప, తదితరులు పాల్గొన్నారు.
___________________________
వేలమద్ధి విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి
శ్రీ సత్యసాయిజిల్లా,నల్లమాడ ఫిబ్రవరి19(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి కేంద్రానికి చెందిన ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ షామీర్ ఆధ్వర్యంలో పుట్టపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కరణం సుబ్రహ్మణ్యేశ్వరరావు,గాయత్రి దంపతుల 21వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నల్లమాడ మండలం వేలమద్ది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో షామీర్ చేతుల మీదుగా విద్యార్థులకు పలకలు,ప్యాడ్స్,నోట్ బుక్స్,పెన్సిల్స్ విద్యా సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్,హర్షవర్ధన్,అల్లు తరుణ్,లక్ష్మణ్ ఉపాధ్యాయిని అరుణ తదితరులు పాల్గొన్నారు.
______________________________
పల్స్ పోలియో వాక్సిన్ టర్స్ పై శిక్షణ
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి19(విజయస్వప్నం.నెట్)
మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారి భానుప్రకాష్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో వాక్సిన్ టర్స్ పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఉపాధ్యాయులు,అంగన్వాడీ,ఆరోగ్య,ఆశ కార్యకర్తలు,ఐకేపి, ఆర్డీటి,స్వచ్ఛంద సంస్థలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్బంగా వైద్యాధికారులు భానుప్రకాష్,కమల్ రోహిత్ లు మాట్లాడుతూ....పోలియో వ్యాధి లక్షణాలు,ముందు జాగ్రత్త చర్యలు,నివారణపై అవగాహన కల్పిస్తూ....0-5 వయసు పిల్లలకు పోలియో చుక్కలు అందించేందుకే ప్రణాళికంగా శిక్షణ కార్యక్రమంలో ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
_____________________________
శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి19(విజయస్వప్నం.నెట్)
తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు సోషయల్ మీడియాలో విసృత్తంగా ప్రచారం చేస్తున్న ఐటిడిపి పుట్టపర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షులు పొగాకు షానువాజ్ ను సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సేవలు గుర్తించి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో కొత్తపల్లి జయప్రకాశ్ చేతుల మీదుగా పార్టీ చిహ్నం సైకిల్ ను బహుమతిగా షాన్వాజ్ కు అందజేశారు.ఈకార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కోఆర్డినేటర్ ఆర్ఎంపి డాక్టర్ జాకీర్ అహ్మద్,ఆమడగూరు కన్వీనర్ గోపాల్ రెడ్డి,నారపరెడ్డి, గండికోట ఇర్షాద్,పవన్ కళ్యాణ్, అబ్బాస్,నిజాం,శ్రీనివాసులు, మల్లికార్జున,పాపన్న, అబ్బాస్ తదితర తెదేపా నాయకులు పాల్గొన్నారు
______________________________
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి19(విజయస్వప్నం.నెట్)
ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వంశీకృష్ణను కలసి సర్పంచ్ వెంకటరమణ శుభాకాంక్షలు తెలిపారు. మండల పోలీసుస్టేషన్ లో సోమవారం అలాపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్ మాకం వెంకటరమణ ఎస్ఐ వంశీకృష్ణను గౌరవ పూర్వకంగా కలసి పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారన్నారు.
______________________________
ఈనెల 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు వాట్సాప్ వేదికగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ వివరాలను తనకు పంపితే ఉచితంగా ఇన్కమ్ టాక్స్ ఫారాలను తయారుచేసి పంపడం జరిగిందని సోమవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కట్టుబడి గౌస్ లాజమ్ తెలిపారు. మెసేజ్ కు స్పందించిన ఉమ్మడి జిల్లాలోని 328 మంది ఉపాధ్యాయులు తనకు పంపడం జరిగిందనివారికి వెనువెంటనే వారికి వాట్సప్ వేదికగా పంపడం జరిగిందని, 46 పాఠశాలకు సంబంధించిన యూ-డైస్ ప్లస్ పూర్తి చేసి ఇవ్వడం జరిగింది అని ఒక సామాజిక బాధ్యతగా ఈ పని ఉచితంగా గత 13 సంవత్సరం నుండి చేయడం జరుగుతున్నదని, రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఒక యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్ సైట్ ప్రారంభించడం జరుగుతుందని గౌస్ లాజమ్ తెలిపారు.
______________________________
జిల్లా నూతన ఏఆర్ డిఎస్పిగా భాద్యతలు చేపట్టిన
బి. చిన్నికృష్ణ
అన్నమయ్య జిల్లా ఫిబ్రవరి19(విజయస్వప్నం.నెట్)
గుంటూరు ఉమ్మడి పల్నాడు జిల్లాలో,ఏఆర్ డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న డిఎస్పీ బి.చిన్నికృష్ణని ఎన్నికల నేపధ్యంలో అన్నమయ్య జిల్లా ఏఆర్ డిఎస్పీ గా బదిలీ చేశారు. ఏఆర్ డిఎస్పి గా బి.చిన్నికృష్ణ సోమవారం భాద్యతలు చేపట్టి అనంతరం, ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ ని, అదనపు ఎస్పీ డాక్టర్ విబి. రాజ్ కమల్ ని డిఎస్పి బి. చిన్నికృష్ణ మర్యాద పూర్వకంగా కలసి పుస్పగుచ్చం అందించారు. నూతన ఏఆర్ డిఎస్పీ శ్రీ.బి.చిన్నికృష్ణని జిల్లా ఏఆర్ అధికారులు, సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి