పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్
శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి21(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు బుధవారం కదిరి డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను,మౌలిక వసతులను పరిశీలించారు.ముందుగా ముత్యాల చెరువు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల 136 పోలింగ్ కేంద్రం సందర్శించారు.కదిరి పట్టణంలోని కుమ్మరి వాండ్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో 145,146పోలింగ్ కేంద్రాలను,అలాగే
కదిరి మండలంలోని గంగన్నగారిపల్లి ఎంపీపీ స్కూల్ 149 పోలింగ్ కేంద్రం సందర్శించి పరిశీలించి, అనంతరం ఎన్ పి కుంట మండలంలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌళిక సదుపాయాలు పరిశీలించారు. కదిరి ఆర్డీవో వంశీకృష్ణ,ఎమ్మార్వో, రెవెన్యూ సిబ్బంది తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
______________________________
నేటి నుండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి21(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని బుక్కపట్నం మండలం కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం గ్రామం నుండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నేడు(గురువారం)ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారని విలేకరులకు ఓప్రకటనలో తెలిపారు.ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తారని,అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం,జనసేన కూటమి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రచారం చేస్తూ....ప్రజలకు వివరిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు ఉదయం 9 గంటలకు హాజరై
ప్రచారంలో పాల్గొనాలని
______________________________
రెడ్డిపల్లిలో దుద్దుకుంట అపర్ణ రెడ్డి ఎన్నికల ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా,నల్లమాడ ఫిబ్రవరి21(విజయస్వప్నం.నెట్)
నల్లమాడ మండలం రెడ్డిపల్లి పంచాయితీ పరిధిలోనీ నేరాలవంక తాoడా, బాపనకుంట గ్రామాల్లో బుధవారం పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు.ముందుగా అభయ ఆంజనేయ స్వామి,మారెమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి శ్రీధర్ రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని,ప్రతిపక్ష పార్టీలు చేప్పే విషపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని,సిఎం వైఎస్ జగనన్న నేతృత్వంలో పుట్టపర్తి అభివృద్ది శ్రీధర్ రెడ్డితోనే సాధ్యమని ఆమె తెలిపారు.ప్రచారంలో స్థానిక వైకాపా ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
______________________________
శ్రీసత్యసాయిజిల్లా కదిరి పట్టణంలో జూనియర్ బాలుర కళాశాల మైదానంలో ఈనెల 25వతేది మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించే బంజారాల ఆత్మీయసభకు జిల్లా నలుమూలల నుండి బంజారా సోదరులు, యువత, మహిళలు, ఉద్యోగాలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని బుధవారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సత్యసాయి జిల్లా కమిటీ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఎం.నారాయణ నాయక్ పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి