20, మే 2024, సోమవారం

భక్తిశ్రద్ధలతో అక్కదేవతల ఎలవగంప ఉత్సవ పూజలు - ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భజనలు - 20 నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ

 భక్తిశ్రద్ధలతో అక్కదేవతల ఎలవగంప ఉత్సవ పూజలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే17(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ అక్కదేవతల ఎలవ గంప ఉత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు జివీ ఆదినారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ అక్కదేవతల ఆలయంలో పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు‌.అంతక ముందు గౌనిపల్లి గ్రామంలో ప్రతి ఇంటి నుండి అమ్మవారికి పసుపు,కుంకుమ,గాజులు, వస్త్రాల ఎలవ గంపలలో కొలువైన అమ్మవారికి పుష్పాలతో అలంకరించి గ్రామ పురవీధుల్లో గురువయ్యల డప్పు వాయిద్యాలతో ఘనంగా ఊరేగించారు.ఆలయం వద్ద  ఏడుగురు చిన్నారులు పసుపు,కుంకుమ,గంగా జలాలు,ధాన్యాలు,దీపధూప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి జ్యోతుల హరతి నీరాజనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వందలాది భక్తులు,గ్రామస్తులు  అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.తీర్థ, అన్నప్రసాదాలు అందజేశారు.

$$$__________@@@___________$$$

ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భజనలు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే17(విజయస్వప్నం.నెట్)

తనకల్లు మండలం బంతలపల్లి గ్రామ కళాకారుల సంఘం సభ్యులు శుక్ర,శనివారం రెండు రోజులు(16,17 తేదీలు)కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో భజనలు చేసినట్లు తెలిపారు.తనకల్లు మండలం బంతలపల్లి భాస్కర స్వామి ఆధ్వర్యంలో బాలయ్య స్వామి,నల్లచెరువు గంగాధర స్వామి గురువుల సమక్షంలో  నరసింహస్వామి ఆలయంలో భజనలు చేసినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం,శనివారం ఆలయంలో భజనలు నిర్వహిస్తారని భజన బృందం సభ్యులు తెలిపారు.ఈకార్యక్రమంలో బాలయ్య స్వామి, ఆంజనేయస్వామి, శివారెడ్డిస్వామి, రంగప్పస్వామి, నరసింహరావు, కుర్తిరామయ్య, కవులేపల్లి రమణ, రామస్వామి, ఓబులేష్, కిరణ్, శంకర స్వామి, గంగాధర, అరుణమ్మ,ఆది, అమడగూరు వెంకటస్వామి తదితర భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@___________$$$

20 నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే18(విజయస్వప్నం.నెట్)

ఓబులదేవరచెరువు మండల వ్యాప్తంగా 20వతేది(సోమవారం)నుండి వేరుశనగ విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ కొరకు రైతులు వారి పరిధిలోని రైతుభరోసా కేంద్రాల్లో సంప్రదించాని మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ అహ్మద్ విజయస్వప్నం.నెట్ ప్రతినిధికి తెలిపారు.మొదటగా విత్తనం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొన్న రైతులకి మాత్రమే విత్తనం అందజేస్తారని తెలిపారు.రైతులు తమ వెంట పట్టాదారు పాసుపుకం,ఆధార్ కార్డు,మొబైల్ ఫోన్ కచ్చితంగా తీసుకొని వెళ్ళాలని తెలిపారు.0 - 0.5 ఎకరాలు ఉన్న రైతుకు 30 కేజీల బ్యాగు ఒకటి,0.5- 1.0 ఎకరాలు ఉన్నా రైతుకి 30 కేజీల బ్యాగులు రెండు,1.01 ఎకరాల పైనున్న వారికి 30 కేజీల బ్యాగులు 3 పంపిణీ చేస్తామన్నారు.కే-6 మరియు టిసిజీఎస్-1694 రకం విత్తనానికి సంబంధించి 30 కేజీల 1 బ్యాగు పూర్తి ధర రూ.2,850 ఉండగా,అందులో సబ్సిడీ 1,140 రూపాయలు పోగా రూ.1,710 చెల్లించాలని,కే-6 మరియు టిసిజీఎస్ -1694 రకం విత్తనానికి సంబంధించి 60 కేజీల 2 బ్యాగుల పూర్తి ధర రూ.5,700 ఉండగా,అందులో సబ్సిడీ 2,280 రూపాయలు పోగా రూ.3,420 చెల్లించాలని,కే-6  టిసిజీఎస్-1694 రకం విత్తనానికి సంబంధించి 90 కేజీల 3 బ్యాగుల పూర్తి ధర రూ.8,550 ఉండగా,అందులో సబ్సిడీ 3,420 రూపాయలు పోగా రూ.5,130 చెల్లించాలని,కదిరి లేపాక్షి (కె - 1812) రకం విత్తనానికి సంబంధించి 30 కేజీల 1 బ్యాగు పూర్తి ధర రూ.2,610 ఉండగా,అందులో సబ్సిడీ 1,044 రూపాయలు పోగా రూ.1,566 చెల్లించాలని, కదిరి లేపాక్షి (కె -1812) రకం విత్తనానికి సంబంధించి 60 కేజీల 2 బ్యాగుల పూర్తి ధర రూ.5,220 ఉండగా,అందులో సబ్సిడీ 2,088 రూపాయలు పోగా రూ.3,132 చెల్లించాలని,90 కేజీల 3 బ్యాగుల పూర్తి ధర రూ.7,830 ఉండగా, అందులో సబ్సిడీ 3,132 రూపాయలు పోగా రూ.4,698 చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. మండల రైతుభరోసా కేంద్రానికి శనివారం విత్తన వేరుశనగ కాయలు చేరినట్లు వ్యవసాయ రైతుభరోసా సహయాధికారి లలిత తెలిపారు.

$$$__________@@@___________$$$

మచ్చలేని మహానీయుడు సుందరయ్య: సిపిఎం నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే19(విజయస్వప్నం.నెట్)

భారతదేశ తొలి ప్రతిపక్ష నేత సుందర రాంరెడ్డి అయినా తన పేరును సుందరయ్యగా మార్చుకుని పేదలందికి అండగా అన్నం పెట్టే మార్గాన్ని ఎంచుకున్న మహానేత శ్రీ సుందరయ్య తనకున్న వందల ఎకరాల సాగుభూమిని కడుపేదలకు పంచి,నిరుపేదగా జీవించిన పేదల ప్రేమమూర్తిగా పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ పై పార్లమెంటుకు వెళ్ళి నిరాడంబరతను చాటిన నిజాయితీ పరుడు.తెలంగాణ దాస్యవిముక్తిగా వించిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట రథసారధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వవర్ధంతి సందర్భంగా సిపిఎం,సీఐటీయూ నాయకులు ఘనంగా  నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... మచ్చలేని మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు. వివిరమణ, శ్రీరాములు, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

17, మే 2024, శుక్రవారం

స్ట్రాంగ్ రూములో ఈవీయంల భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరిశీలన - రేపటి నుంచి గాండ్లపెంట గంగాభవాని తిరుణాళ్ళు - శ్రీసత్యసాయిజిల్లాలో 144 సెక్షన్ కొనసాగింపు: జిల్లా ఎస్పీ

స్ట్రాంగ్ రూములో ఈవీయంల భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరిశీలన

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే15(విజయస్వప్నం.నెట్)

హిందూపురం బిట్స్ కాలేజీ,లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం...  స్ట్రాంగ్ రూమ్ ల  భద్రత ఏర్పాట్లను,మూడంచెల భద్రతను   బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపిఎస్ పరిశీలించారు.అనంతరం   అక్కడ ఏర్పాటు చేసిన  సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ ను ఆయన పరిశీలించారు.ఈవీఎం ఏర్పాటు చేసిన ఈవీఎం.. స్ట్రాంగ్ రూమ్ పరిసరాలను, ఎస్పీ పరిశీలించారు.స్ట్రాంగ్ రూముల మూడంచెల భద్రతస్థాయిలో కేంద్ర సాయుధ బలగాలు,ఆర్మడు రిజర్వుడు  బలగాలు,సివిల్ పోలీసు బలగాలను మోహరించారు.స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144 సెక్షన్  అమల్లో ఉందని,ప్రతి స్ట్రాంగ్ రూమ్,పరిసరాలలో  సిసిటివి కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారని ఎస్పీ కార్యాలయ అధికారులు తెలిపారు.ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద  కేంద్ర,రాష్ట్ర పోలీసు బలగాలతో గస్తీ,నిరంతరం నిఘా పెట్టారని,విద్యుత్ అంతరాయం  లేకుండా జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారని,ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,స్ట్రాంగ్ రూముల కోసం ఏర్పరిచిన కేంద్రాల ఎంట్రెన్స్ గేట్  లోపలికి పరిసరాలలోకి  గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు  అనధికార వ్యక్తులనో,ఇతరుల వాహనాలకు  అనుమతిలేదని,స్ట్రాంగ్ రూం 24 గంటలూ సాయుధ బలగాల రక్షణలో ఉంటుందని,సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని,పారదర్శకంగా,అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో  జూన్ 4 న  ఓట్ల లెక్కింపు  జరిగే వరకు  దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టామని,స్ట్రాంగ్ రూములకు సీసీటీవీ కవరేజీతో సహా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గెజిటెడ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు 24 గంటలూ విధుల్లో ఉండే విధంగా చర్యలు చేపట్టారని,స్ట్రాంగ్ రూములు తెరిచే ముందు,మూసివేసే సమయంలో సీసీటీవీ కవరేజ్,వీడియోగ్రఫీ మొత్తం సీలింగ్ ప్రక్రియ స్పష్టంగా కనిపించే విధంగా సిసిటివీలు  ఏర్పాటు చేశారని,అపోహలు,తప్పుడు సమాచారాలు నమ్మి జిల్లాలో ఎవరైనా  అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు శాఖ తీవ్రంగా చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెంట  డిఎస్పీ కంజక్షన్ ఏ ఆర్ డిఎస్పీ జెడ్.విజయ్ కుమార్,సిఐ,ఎస్ఐలు ఉన్నారు.

$$$__________@@@__________$$$

రేపటి నుంచి గాండ్లపెంట గంగాభవాని తిరుణాళ్ళు


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి మే15(విజయ్స్వప్నం.నెట్)

గాండ్లపెంట మండలం గాండ్లపెంట గ్రామంలో వెలసిన గంగాభవాని మాత ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా రేపటి నుంచి(17 నుండి 19తేది వరకు) మూడు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్ళు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తెలిపారు.17 శుక్రవారం ఉదయం శ్రీ గంగాభవాని కలశ పూజ,అభిషేకాలు,అర్చనలు,అలంకరణ,అష్టోత్తర పూజలు, తీర్థ,అన్నప్రసాదాలు తదుపరి మహిళా భక్తులచే లలిత సహస్ర నామాలు,కుంకుమార్చన పూజా కార్యక్రమాలు,18 మధ్యాహ్నం 3గంటల నుండి శ్రీ గంగాభవాని అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించి,ఒంగోలు కళాకారుల బృందం  నూనే దీపాలతో  ప్రదర్శనలు, కీలుగుర్రాలతో చెక్కభజన,డప్పు మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగింపు,19 ఆదివారం తెల్లవారుజామున 2గంటల నుండి అమ్మవారికి జ్యోతులు,భోణాల పూజలు, మధ్యాహ్నం 3 గంటల నుండి ఉట్ల తిరుణాల తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.అమ్మవారి తిరుణాల కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ గంగాభవాని మాత ఆశీస్సుల కోసం పూజలు నిర్వహించాలని భక్తులకు,గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

$$$__________@@@__________$$$

రెమ్యునరేషన్ చెల్లింపులో తేడాలొద్దు:డిటిఎఫ్

శ్రీసత్య సాయిజిల్లా ఓడిచెరువు మే15(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్న ఓపిఓలకి  తక్కువ రెమ్యునరేషన్ చెల్లించారని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్ విలేకరులకు తెలిపారు.అనంతపురం జిల్లాలో ఓపిఓలకి 1300 రూపాయలు చెల్లిస్తుండగా శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కోరకంగా చెల్లించడం తగదన్నారు.ఓపిఓలు 2నుంచి3 రోజులు ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించారని కనుక వారికి అందుకు తగిన విధంగా రెమ్యునరేషన్ (టిఏ,డిఏ)చెల్లించాలని,అందరికీ ఒకే రకమైన రెమ్యురేషన్ చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సిబ్బందిపై లాఠీఛార్జ్ చేయడం అన్యాయమని వారు ఈసందర్భంగా ఖండించారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లాలో 144 సెక్షన్ కొనసాగింపు: జిల్లా ఎస్పీ

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే15(విజయస్వప్నం.నెట్)

శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఐపీఎస్ బుధవారం తెలిపారు.15వ తేదీ నుండి జూన్ 4న కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు, జిల్లాలోని మండలాల్లో ఎవరైనా హింసాత్మకమైన ఘర్షణలకు  పాల్పడిన,విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని,అనుమతులు లేకుండా ఎక్కడ కూడా సభలు,ప్రచారాలు నిర్వహించరాదన్నారు.ఎవరైనా నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తితో ఉండాలని,ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు,ఘర్షణలకు వెళ్ళకూడదని ఎస్పి ఈ సందర్భంగా సూచించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు,వివాహాలకు,అంత్యక్రియలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు.తదుపరి ఉత్తర్వులు వెలబడే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు.

$$$__________@@@__________$$$

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మే15(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మంగళవారం రాత్రి చేలూరు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బొలెరో వాహనం ఢీ కొనగా ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా,మరొకరి తీవ్ర గాయాలు అయ్యినట్లు స్థానికులు సమాచారం అందించారు.చినగానిపల్లి పంచాయతీ కమ్మవారిపల్లి  గ్రామానికి చెందిన గంగులప్ప కుమారుడు గంగాధర్ తో కలిసి చేలూరు నుండి ద్విచక్ర వాహనంలో వస్తుండగా పాల వ్యాన్ ఢీ కొనడంతో 

చినగానిపల్లి పంచాయతీ ఎంపీటీసీ నారాయణ కుమారుడు  పవన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం

 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మఏ16(విజయస్వప్నం.నెట్)

సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి భాను ప్రకాష్ పేర్కొన్నారు.జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో  ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ....వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల,కాలానుగుణంగా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ వ్యాధి అతి ప్రమాదకర,ప్రాణాంతకమైందని,పలు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.టైగర్ దోమగా పిలువబడే ఒక రకమైన దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పరిసరాల అపరిశుభ్రత ముఖ్య దోహదకారకం కాగా నిలువ ఉండే మంచినీరు,వర్షపు నీరు,ఇళ్లలోని వాడకంలో లేని రోలు,రబ్బరు టైర్లు,టెంకాయ చిప్పలు,పాత డబ్బాలు,కుండలు మొదలగు వాటిలో నిలువ ఉండే వర్షపు మంచినీటిలో ఈ దోమలు గుడ్లు పెట్టి అనంతర పరిణామంలో పెద్ద వైన దోమలు అనారోగ్యవంతున్ని కుట్టి తిరిగి ఆరోగ్యవంతులను కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు.ఈసందర్భంగా వైద్యాధికారి  కమల్ రోహిత్ మాట్లాడుతూ....వ్యాధి లక్షణాలలో ముఖ్యంగా ప్రాథమిక దశలో విపరీత తలనొప్పితో కూడిన జ్వరము,రెండవ దశలో శరీరంపై నీలిరంగు దద్దులు,మూడవ దశలో మెదడులోని రక్తనాళాలు చిట్లి రక్తంలోని ప్లేట్లెట్స్ మోతాదు విపరీతంగా వేగంగా తగ్గి డెంగ్యూ హేమరేజ్ లక్షణంతో మరణించడం జరిగుతుందని,కనుక పరిసరాల పరిశుభ్రత,ఫ్రైడే డ్రై డే నియమాలు పాటిస్తూ నీటి నిలువలను తొలగించడంలో సామాజిక చైతన్యం పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడు ఈ డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని ఆయన సూచించారు.అనంతరం డెంగ్యూ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ చేపట్టి,ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఆకస్మిక తనిఖీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే16(విజయస్వప్నం.నెట్)

జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి  నాగేంద్ర నాయక్ గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఓడిచెరువు-1 ఆరోగ్య ఉప కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభమైన వయోజన క్షయ టీకా కార్యక్రమమును పరిశీలిస్తూ తనిఖీల్లో భాగంగా ఓడిచెరువు ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు.శరీరంలో కేలరీల లోపం వలన అలాగే క్షయ వ్యాధిగ్రస్తుల నుండి నోటి తుంపర్లతో గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుందని,మూడు రోజుల నుండి జ్వరం రావడం,దగ్గి నప్పుడు రక్తపు చారలతో కూడిన గల్ల పడడం,పక్కటెముకలు నొప్పి,ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు కాగా నివారణలో భాగంగా ప్రతి గురువారం నిర్వహించే ఈ నూతన వయోజన క్షయ టీకా కార్యక్రమంలో అర్హులైన 60 సంవత్సరముల వయసు దాటిన వారు,చక్కెర వ్యాధిగ్రస్తులు,పొగ త్రాగువారు,శరీర ద్రవ్యరాశి 18 కన్నా తక్కువ ఉన్నవారు, టీబి రోగులతో సన్నిహితంగా ఉన్నవారు ఈ టీకా అందిస్తామని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.తనిఖీ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రంలోని రికార్డులను,ప్రగతి నివేదిక సూచికలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ టీకా కార్యక్రమం సంపూర్ణ విజయవంతం కావడానికి పలు జాగ్రత్తలపై సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సమాచార శాఖ అధికారి బాబా ఫక్రుద్దీన్,జిల్లా నర్సింగ్ అధికారిణి వీరమ్మ, మండల వైద్యాధికారులు  భాను ప్రకాష్,కమల్ రోహిత్,ఆరోగ్య పర్యవేక్షకులు విజయ కుమారి, మురళి,ల్యాబ్ టెక్నీషియన్ నరేంద్ర,ఫార్మాసిస్ట్ వరలక్ష్మి, ఆరోగ్య,ఆశా కార్యకర్తలు నాగవేణి,బషీర,రాధ,అంజలి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ దరఖాస్తులు చేసుకోండి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే16(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో ఓడిచెరువు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (హైస్కూల్ ఫ్లస్)కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో(ఇంగ్లీష్ మీడియం)2024-24 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ కోర్సులు యంపీసీ, బైపీసీ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు కే.శోభారాణి ప్రకటనలో తెలిపారు.పాఠశాల, కళాశాలలో ఉన్నత సదుపాయాలు కలిగిన తరగతి గదులు,ఐ.ఎఫ్,పిల ద్వారా ఆధునిక పద్ధతుల్లో బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే భోధన, విశాలమైన క్రీడా మైదానం, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ,వ్యక్తిత్వ వికాసం-శిక్షణ, లైబ్రరీ, డిజిటల్ విద్య సౌకర్యాలు కల్పించారని తెలిపారు.జూన్ 1వతేది నుండి తరగతులు ప్రారంభం కానున్నాయని ఆమె తెలిపారు.పదవ తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

15, మే 2024, బుధవారం

ఫ్లాష్....లారీ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్ మృతి - శ్రీసత్యసాయిజిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం

సమస్యాత్మక కేంద్రాలపై పటిష్ట నిఘా

: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే12జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత బందోబస్తుతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని  ఆయన పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ .... సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో  నిర్వహించేందుకు లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నట్లు తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో 3200 మంది పోలీసులు పాల్గొంటున్నారని,13 కేంద్ర సాయుధ బలగాలు ఇప్పటికే విధుల్లో ఉన్నారని,199 సమస్యాత్మక పోలింగ్ బూతుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.అవసరమైన ప్రాంతాల వద్ద  సీసీ కెమెరాలు, విడియో కెమెరాలు,డ్రోన్ కెమెరాల ఏర్పాటు చేశారని, ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించామని, పోలింగ్ నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి వారైనా హద్దు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆదివారం ఎస్పీ మాధవరెడ్డి గోరంట్ల,

హిందూపురం,పుట్టపర్తి కేంద్రాల్లో రిసెప్షన్ కౌంటర్లు, స్ట్రాంగ్ రూములు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి, భద్రత ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ సరళి,కేంద్రాల్లో పరిస్థితుపై కమాండ్ కంట్రోల్ స్ట్రాంగ్ రూమ్ నుండి పర్యావరణ ఉంటుందని తెలిపారు.

$$$__________@@@__________$$$

పోలింగ్ కు పటిష్ట చర్యలు

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే12(విజయసవప్నం.నెట్)

పోలింగ్ సజావుగా జరగాలని పటిష్ట చర్యలు చేపట్టామని, జిల్లాలోని 1873 పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, సమస్యాత్మకమైనవి గుర్తించిన 299 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ మరింత పకడ్బందీగా నిర్వహిస్తున్నారని, పోలింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు ఆదివారం ఓప్రకటనలో తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) పుట్టపర్తి మే13(విజయస్వప్నం.నెట్)

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఈవిధంగా.... పెనుగొండ నియోజకవర్గంలో అత్యధికంగా 78:77 శాతం కాగా, కదిరి నియోజకవర్గంలో 72:24 శాతం అత్యల్పంగా నమోదైంది. ధర్మవరం 76:10,పుట్టపర్తి 75:22, మడకశిర 74:25, హిందూపురం 73:32, రాప్తాడు 73:01 నమోదైనట్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అధికారులు ద్వారా సమాచారం.               ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎస్పీ పర్యవేక్షణ    జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ,పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షించారు.ఉదయం నుండి కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి ఎస్పీతో కలిసి జిల్లా ఎన్నికల అబ్జర్వర్లు జిల్లా వ్యాప్తంగా  పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళి, పరిస్థితులను అడిగి తెలుసుకుని అక్కడిక్కడే సిబ్బందిని అప్రమత్తం చేశారు.

$$$__________@@@__________$$$

ఏపీఆర్డీసి ప్రవేశానికి విద్యార్ధి యశ్వంత్ ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా (ఓడిచెరువు)మే14(విజయస్వప్నం.నెట్)

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 మంగళగిరి బోర్డ్ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఓడిచెరువు మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ ఎగువ చెర్లోపల్లి గ్రామానికి చెందిన యరమనేని రామకృష్ణ, ఇందిరమ్మ దంపతుల కుమారుడు యశ్వంత్ నాయుడు 66వ రాంక్ తో 76 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.ఏఫ్రిల్ 25న ఏపీఆర్డీసి ప్రవేశానికి పరీక్షలు నిర్వహించగా, మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో (బీకాం ప్రవేశానికి) యరమనేని విద్యార్ధి యశ్వంత్  నాయుడు ప్రతిభతో ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి యశ్వంత్ నాయుడు అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూపులో 875 మార్కులు సాధించి కళాశాలలో ద్వితీయ స్ధానంలో నిలిచి, ఏపీఆర్డీసి ప్రవేశానికి ఎంపికపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ.... విద్యార్థికి(కుమారుడికి)స్వీట్ అందించారు.అమడగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకర్, అధ్యాపక బృందం విద్యార్థి యశ్వంత్ నాయుడుకి అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఫ్లాష్....ఫ్లాష్....


శ్రీసత్యసాయిజిల్లా (అమడగూరు)మే14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని వెంకటనారాయణపల్లి క్రాస్ సమీపంలో మంగళవారం సాయంత్రం కల్వర్టు వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్  మృతి చెందినట్లుగా సమాచారంగా ఉంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

$$$__________@@@__________$$$

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మే14(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మంగళవారం రాత్రి చేలూరు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బొలెరో వాహనం ఢీ కొనగా ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా,మరొకరి తీవ్ర గాయాలు అయ్యినట్లు స్థానికులు సమాచారం అందించారు.చినగానిపల్లి పంచాయతీ కమ్మవారిపల్లి  గ్రామానికి చెందిన గంగులప్ప కుమారుడు గంగాధర్ తో కలిసి చేలూరు నుండి ద్విచక్ర వాహనంలో వస్తుండగా పాల వ్యాన్ ఢీ కొనడంతో చినగానిపల్లి పంచాయతీ ఎంపీటీసీ నారాయణ కుమారుడు  పవన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

11, మే 2024, శనివారం

పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ పరిశీలన

మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొందాం

బుక్కపట్నం రోడ్ షోలో  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు

వైకాపా ప్రచారంలో ప్రముఖ సింగర్ నిర్మల రాథోడ్ 



శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే10(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో ఎన్నికల ప్రచార రోడ్ షో లో పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,హిందూపురం లోకసభ అభ్యర్థి బోయ శాంతమ్మ పాల్గొన్నారు.ఈసందర్భంగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  మాట్లాడుతూ....సత్య సాయిజిల్లా,మూడు జాతీయ రహదారులు సాధించుకున్నామని,864 కోట్లతో 193 చెరువులు నింపే కార్యక్రమానికి పనులు ప్రారంభించుకున్నామని,బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా 26వేల గృహాలు నిర్మించుకున్నామని,అందరి ఆశీస్సులతో పుట్టపర్తి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని,పేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున జగనన్నను మరోసారి ముఖ్యమంత్రినీ చేసుకోవాలని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి నీ ఎమ్మెల్యేగా బోయ శాంతమ్మ ఎంపీ గా గెలిపించాలని,జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ గాయని నిర్మల రాథోడ్ విచ్చేసి పాటలతో అలరించారు.స్థానిక ప్రజా ప్రతినిధులు,వైకాపా నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.           వైకాపాలో చేరిన బీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్      శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే10(విజయస్వప్నం.నెట్) ఓడిచెరువు మండలంలోని బాబాసాహెబ్ పల్లి గ్రామానికి చెందిన శ్రీసత్యసాయిజిల్లా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్ శుక్రవారం పుట్టపర్తి వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు. బీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు షబ్బీర్ తోపాటు ఓడిచెరువు పంచాయతీ గ్రామానికి చెందిన  30 వైకాపా కుటుంబాలు వైకాపాలోకి చేరగా వీరికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి వైకాపాలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.... వైకాపా పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షించాయని,సంక్షేమం,అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.మే13న వైకాపాకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుద్దామని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ పరిశీలన



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు(అమడగూరు)మే10(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంతోపాటు కొండకమర్ల పోలింగ్ కేంద్రాలను శుక్రవారం శ్రీసత్యసాయిజిల్లా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని,13వతేది పోలింగ్ రోజు నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.పోలింగ్ రోజు ఎవరైనా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిఐ రాజేంద్రనాధ్ యాదవ్,ఎస్ఐ వంశీకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమడగూరులో  ఎస్సీ చెక్పోస్ట్ లు తనిఖీలు....    మండలంలోని తుమ్మల, వెంకటనారాయణపల్లి, చినగానిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతోపాటు సమీపంలో చెక్ పోస్టులను శుక్రవారం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తనిఖీలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....మే13న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా కర్ణాటక సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.ఈకార్యక్రమంలో నల్లమాడ సిఐ రాజేంద్రనాధ్ యాదవ్, ఎస్ఐ మగ్బుల్ బాషా,పోలీసులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం:తెదేపా ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే10(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి గడ్డపై ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకొందామని పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,యువనాయకుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఓడిచెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలో శుక్రవారం తెదేపా,జనసేన,బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర ను గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ముందుగా గ్రామ ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి అపూర్వ స్వాగతం పల్లె సింధూరరెడ్డికి పలికారు.ఈ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి,ఆమె భర్త పల్లెవెంకట కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.... పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరాలని,ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళినప్పుడు సైకిల్ గుర్తును మాత్రమే గమనించి మీ అమూల్యమైన ఓటును వేయాలని కోరారు.తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రగతి ఉంటుందన్నారు.చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తొలి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరారు. ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా,జనసేన,బీజీపీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సినీ నటుడు నారా రోహిత్ ప్రచారం

 శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం నుండి సినీ నటుడు నారా రోహిత్ రోడ్డు షో నిర్వహించారు.మే13న సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని,హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్ధసారధిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రచారం చేపట్టిన్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.తెదేపా పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్ బిజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

డీఐజీకి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) పుట్టపర్తి మే11(విజయస్వప్నం.నెట్)

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అనంతపురం రేంజ్ డీఐజీగా నియమితులైన షీముషి శ్రీసత్యసాయిజిల్లా కార్యాలయానికి శనివారం  చేరుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి గౌరవ పూర్వకంగా స్వాగతం పలికారు.సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా భద్రత చర్యలపై సమీక్షించారు.ఏఎస్పీ విష్ణు,ఏఆర్ డిఎస్పీ విజయకుమార్,ఎస్బీ సిఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి, సైబర్ క్రైమ్ సెల్ సిఐ హేమాంత్ కుమార్,సిపీ రాఘవేంద్ర,ఏఆర్ ఎస్ఐలు వలి,రవికుమార్,ఎస్ఐ ప్రదీప్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఇతర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు 

:జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు

పోలింగ్ రోజు 144 సెక్షన్: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి 

  శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే11(విజయస్వప్నం.నెట్)

ఓటరు గుర్తింపు కార్డు లేకపోయిన ఇతర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఓటరు జాబితాలో పేరుండి గుర్తింపు కార్డు లేకపోయిన ఆధార్, బ్యాంకు బుక్కు,డ్రైవర్ లైసెన్స్, పాన్ కార్డు 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి వున్నా ఓటు వేయచ్చన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.శనివారం సాయంత్రానికి మైక్,జెండాల ప్రచారానికి ముగిసిందని,12న ఆదివారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకొంటారని,13వతేది సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు.ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.... ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.11వతేది శనివారం సాయంత్రం నుండి 13 సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయించారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలతో గట్టి బందోబస్తుతో నిఘా ఉంచామని ఆయన తెలిపారు.డిఆర్వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

9, మే 2024, గురువారం

ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం బంద్ : జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు - వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ వంశీకృష్ణ - గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం: వైద్యాధికారి భానుప్రకాష్

వైకాపా భారీ ప్రచార బైక్ ర్యాలీ

ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికిన ఓడిచెరువు ప్రజానీకం


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే08(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలం కేంద్రంలో స్ధానిక బస్టాండ్ వద్ద ఎన్నికల ప్రచార రోడ్ షో బుధవారం నిర్వహించగా పుట్టపర్తి శాసనసభ్యులు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి నిర్మల రాథోడ్ కార్యక్రమంలో పాటలతో అలరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట మాట్లాడుతూ....దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత  ముఖ్యమంత్రి జగనన్నదని,వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నదని,ప్రతి ఇంటికి సంక్షేమం,ప్రతి ఒక్కరి మోములో సంతోషంగా చూడాలని జగనన్న ప్రభుత్వ లక్ష్యమని,ప్రజలకు పాలనను చేరువ చేయాలని గ్రామస్థాయిలో గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను చెరువ చేసామన్నారు.రెయిన్ గన్ల పేరుతో 450కోట్లు దోచుకుని ప్రజలను మోసం చేసిన వ్యక్తి కావాలో.. 864 కోట్లతో 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టిన మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి కావాలో ఆలోచించాలని,పేద ప్రజలను దోచుకుని పెత్తందారులకు కట్టబెడుతున్న బీజేపీ తో జత కట్టిన పచ్చ పార్టీ కావాలో,పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసే వైకాపా కావాలో ప్రజలు ఆలోచించి 13వతేది జరిగే ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ముందుగా వైకాపా శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గజమాలతో సత్కరించి వైకాపా శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

$$$__________@@@__________$$$

ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం బంద్

జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు 

శ్రీసత్యసాయిజిల్లా మే08(విజయస్వప్నం.నెట్) 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13న లోకసభ శాసనసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా 48గంటల(రెండు రోజుల పాటు) ముందు 11వతేది శనివారం సాయంత్రం 7గంటల నుండి 13వతేది సోమవారం సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని,మద్యం క్రయవిక్రయాలపై నిషేధం విధించినట్లు శ్రీసత్యసాయిజిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఓప్రకటనలో తెలిపారు.అలాగే జూన్ 4వతేది కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఈసందర్భంగా ఆయన తెలిపారు.

$$$__________@@@__________$$$

తెదేపాలోకి పలు వైకాపా కుటుంబాలు చేరిక


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు (పుట్టపర్తి)మే08(విజయ స్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీ చౌడేపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు బుధవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు తెలిపారు.గౌనిపల్లి గ్రామంలో వైకాపాకు చెందిన 20 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.వీరికి తెదేపా కండువాలు కప్పి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెదేపాలోకి ఆహ్వానం పలికారు.ఈసందర్భంగా మాజీమంత్రి పల్లె మాట్లాడుతూ.... వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెదేపా జాతీయ అధ్యక్షులు,మాజీమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పలువురు నాయకులు,కార్యకర్తలు తెదేపాలోకి చేరినట్లు ఆయన పేర్కొన్నారు.మే 13వతేదిన తెదేపా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని, ఎంపీ అభ్యర్థి బీకే పార్ధసారధిని గెలిపించాలని,చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన ఈసందర్భంగా పిలుపునిచ్చారు. వైకాపా నుండి తెదేపాలోకి చేరిన వారిలో భాస్కర్ రెడ్డి,శంకర్ రెడ్డి,జయచంద్ర రెడ్డి,రాంశెట్టి,రామచంద్ర, రాజారెడ్డి, వెంకటరమణ, రాజగోపాల్, శివనారాయణ, నరసింహా, నాగలక్ష్మి, బాబు, శ్రీనివాసులు, రాణి, సుధాకర్, వెంకటేష్, రాజశేఖర్, పెద్ద మునిస్వామి, ఆదినారాయణ, మునిస్వామి, రామకృష్ణ, రంగప్ప, చిన్న మునెప్ప,అమర్ నాథ్  తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీ సభ్యులు పిట్టా ఓబుళరెడ్డి, మండల కన్వీనర్ జయచంద్ర, తెదేపా నాయకులు కార్యకర్తలు నాగేంద్ర,నంది నరసింహులు, భైరిశెట్టి, రమణారెడ్డి, బోనాల రామాంజీ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

బి.యిడ్ చదువుతున్న ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి: డిటిఎఫ్

 శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే09(విజయస్వప్నం.నెట్)

డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ విజయస్వప్నం.నెట్ ప్రతినిధితో గురువారం మాట్లాడుతూ.... జి.ఓ 342 ప్రకారం ఫర్మీషన్ పొంది ఇన్ సర్వీసు లో బీఈడీ చదువుతున్న ఉపాద్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయకుండా,యధావిధిగా వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేసేలా డిడీవోలకు క్లారిఫికేషన్  ఇవ్వాలని వారు ఈసందర్భంగా కోరారు.

$$$__________@@@__________$$$

వైకాపాను వీడి మాజీమంత్రి  పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరిక 

శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి) మే09(విజయస్వప్నం.నెట్)

సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ఉంట్ల మహేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపిటిసి రఘునాథ్ రెడ్డి,ఉప సర్పంచ్ వెంకటస్వామిరెడ్డి తోపాటు 25 వైకాపా కుటుంబాలు తెదేపాలోకి  చేరారు.పుట్టపర్తి కార్యాలయంలో గురువారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వీరు తెదేపా కండువాలు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఓడిచెరువు సింగల్ విండో మాజీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి,తిప్పేపల్లి మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి,ఉపసర్పంచ్ వెంకటస్వామి రెడ్డి,మదన్ మోన్మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి,లక్ష్మీపతి రెడ్డి,రాఘవేంద్ర,జె.వెంకట్రాంరెడ్డి,వై.ఆదినారాయణరెడ్డి,మందల మధు,సద్దా చలపతితో పాటు తిప్పేపల్లి గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైకాపాని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.ఈ సందర్భంగా వైకాపాను వీడిన నాయకులు మాట్లాడుతూ....పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరమ్మ గెలుపు కోసం కష్టపడి పని చేస్తామని  పేర్కొన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వారు తెలిపారు.మన పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమన్నారు.పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే పల్లె సింధూరమ్మ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

భాస్కర్ సారధ్యంలో సవితమ్మకు ఘన సన్మానం 

శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల (ఓడిచెరువు)మే09(విజయస్వప్నం.నెట్)

అఖిల భారత వలస కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు మందడి భాస్కర్  సారధ్యంలో పెనుగొండ తెదేపా,జనసేన,బిజెపి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకు  ఆమె భర్త వెంకటేశ్వర్లకు స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం పూలమాలలు,బొక్కేలు దుశ్శాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉన్న తెలుగు వలస కార్మికులను ఓటర్లు కోసం  ప్రతిరోజు అక్కడ  కలిసి రాబోయే ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మకు ఓట్లు వేయాలని ఎన్నికల ప్రచారం చేస్తునట్లు భాస్కర్ సవితమ్మ వివరించారు.ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ వలస కార్మికులను విరివిగా కలిసి తెదేపాకి ఓట్లు వేసే విదంగా వారిలో చైతన్యం తీసుకురావాలని భాస్కర్ కు సవితమ్మ సూచించినట్లు తెలిపారు.అలాగే తెదేపా గెలుపు కోసం బెంగళూరులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న భాస్కర్ టీమ్ ను సవితమ్మ అభినందించారు. భవిష్యత్ లో వలస కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటానని భాస్కర్ కు  సవితమ్మ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  పచ్చ అశోక్,   ఉపాధ్యక్షుడు రామ్మోహ నాయుడు,కార్యదర్శి ఆంజనేయులు.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

సంవత్సరాల ముందు ఉన్న టోకెన్ ఐ.డి సేకరించడం సాధ్యం కాదు...

గడువును జూలై నెలాఖరు వరకు పెంచాలి.... ప్రాతినిధ్యం :-

ఏపిజిఎల్ఐ యాప్(నిధి పోర్టల్) అప్డేషన్ లో ఉన్న సమస్యలపై ఏడిని కలసి ప్రాతినిధ్యం చేసిన డిటిఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, జిల్లా ఉపాధ్యక్షులు శేషగిరి

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే09(విజయస్వప్నం.నెట్)

మిస్సింగ్ క్రెడిట్స్ ను భర్తీ చేసే ప్రక్రియను డిపార్ట్మెంట్ చూసుకోవాలని,ఉపాధ్యాయులకు ఆ పని సాధ్యం కాదని,సంవత్సరాల ముందు ఉన్న టోకెన్ ఐ.డి సేకరించడం సాధ్యం కాదని,మినహాయింపు లేనిదే జీతాల బిల్లు సబ్మిట్ కానందున ఆమేరకు మిస్సింగ్ క్రెడిట్స్ ను భర్తీ చేయాలని కోరారు.గత సంవత్సర కాలంగా సర్వీసెస్ లేనందున పెంచిన మొత్తాలు పెంచిన తేదీ నుండి కాకుండా యాప్ అప్డేట్ చేసిన తేదీ నుండి రావడం జరుగుతుందని ఏడి  దృష్టికి తీసుకెళ్ళనట్లు డిటిఎఫ్ శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్,ఉపాధ్యక్షులు శేషగిరి గురువారం తెలిపారు.గతేడాది జూలై 1వతేది(01-07-2023) నుండి  రుణాలు/ పాక్షిక ఉపసంహరణ/డెత్ క్లెయిమ్స్  పెండింగ్ లో ఉన్నాయని,వెంటనే దరఖాస్తులకు అవకాశం కల్పించి మంజూరు చేయాలని కోరినట్లు డిటిఎఫ్ శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, ఉపాధ్యక్షులు శేషగిరి కోరినట్లు తెలిపారు.ఇటీవల ఏపి.జి.యల్ ఐ డిపార్ట్మెంట్ నుండి ప్రింటెడ్  బాండ్లు సంబంధిత ట్రెజరీల ద్వారా డి.డి.ఓ లకు పంపారని,అయితే ఇంకా 40% మందికి బాండ్లు పంపిణీ కాలేదని,వాటిని కూడా వెంటనే పంపిణీ చేయాలని,సంవత్సరాంతమున అన్ని విభాగాల వివరాలను ప్రభుత్వానికి నివేదించే కార్యక్రమం,విద్యార్థుల మార్కుల కన్సాల్డేషన్ చేసే కార్యక్రమం,ఎన్నికల విధులు ఉండడంతో యాప్ లో నమోదు చేయవలసిన వివరాలను నమోదు చేయలేని పరిస్థితి ఉందని, ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఉపాధ్యాయులు యాప్ మీద దృష్టి పెట్టే అవకాశమున్నందున  ఈ గడువును జూలై నెలాఖరు వరకు పెంచాలని కోరినట్లు తెలిపారు.పెంచిన మొత్తం కన్న తక్కువ మొత్తం కనపడుతున్నదని తెలుపగా అలాంటి కేసులను పరిష్కారం చేస్తామని తెలిపారన్నారు.                ఏడి సందేశం*

యాప్ లో ఉన్న సమస్యలపై వస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు అధికారులకు పంపి యాప్ అప్డేషన్ కార్యక్రమం చేస్తున్నామని,అన్నీ సౌకర్యాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.మీ చెల్లింపులను స్పిప్పుల కన్నా యాప్ లో డౌన్ లోడ్ చేసుకొని చెక్ చేసుకొని చూస్తే అప్డేట్ సమాచారం తెలుస్తుందన్నారు.

$$$__________@@@__________$$$

గర్భవతుల హై రిస్క్ పరిస్థితులు నివారిద్దాం: వైద్యాధికారి భానుప్రకాష్



 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే09(విజయస్వప్నం.నెట్)

ముందస్తుగా అవగాహన కలిగి ఉండి గర్భవతుల హై రిస్క్  పరిస్థితులను నివారించగలిగితే సాధారణ ప్రసవాలతో ఆరోగ్యవంతమైన పిల్లలను సంతానంగా పొందవచ్చని ఓడిచెరువు మండల ప్రాథమిక ఆరోగ్య  వైద్యాధికారి భాను ప్రకాష్ పేర్కొన్నారు.గురువారం స్థానిక మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో  యధావిధిగా ప్రతి నెల నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారి భానుప్రకాష్ పాల్గొని మాట్లాడారు.భౌతిక వీక్షణ హై రిస్క్ లక్షణాలు అయిన యుక్త,మేనరిక వివాహాలు,40 సంవత్సరాలు పైన గర్భవతి వయస్సు,35 సంవత్సరాలు పైన ప్రసవం,145 సె.మీ. లోపు ఎత్తు,42 కేజీల లోపు బరువు,వంధత్వం తర్వాత గర్భధారణ అలాగే వైద్య సంబంధమైన హైరిస్క్ అంశాలు అనగా దీర్ఘకాలిక రుగ్మతలు,గర్భస్రావ గత చరిత్ర,కవలలు,పిండం అసాధారణ స్థితి,తీవ్ర రక్తహీనత,గుండె జబ్బులు, మధుమేహం,హెచ్ఐవి,థైరాయిడ్,కామెర్లు తదితర విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకొని జాగ్రత్తలు తీసుకుంటే ముందస్తుగా ప్రమాద సంకేత ప్రసవాలను నివారించవచ్చని ఆయన సూచించారు.ఆరోగ్య విద్యలో భాగంగా ఐరన్,ప్రోటీన్లు,విటమిన్లు,ఖనిజాల తో పోషకాహార ప్రాముఖ్యత,పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా వాతావరణ అనుకూలంగా  వ్యాప్తి చెందే వ్యాధుల నివారణ,క్రమం తప్పకుండా గర్భవతి పరీక్షలు,ప్రసవ ప్రణాళిక, ఆసుపత్రిలో ప్రసవం ప్రాముఖ్యత,ప్రభుత్వ ఆరోగ్య ప్రోత్సాహక పథకాల వినియోగం తదితర విషయాలపై ఆయన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన 61 మంది గర్భవతులలో 19 మందిని హై రిస్క్ వారిగా గుర్తించి అవసర,అత్యవసర చికిత్సలు, మిగత వారికి చిరు వ్యాధుల  చికిత్స అందించి,13 మందికి ఉచిత స్కానింగ్,మందుల పంపిణీ చేశారు.కాగా ఈ కార్యక్రమంనకు హాజరైన గర్భవతులకు,వారి సహాయకులకు కదిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి పృథ్వి,నితిన్ సహకారంతో భోజన సౌకర్యం కల్పించారు.వీరి సేవా భావనకు సిబ్బంది, గర్భవతులు,సంరక్షకులు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలోకి   10 కుటుంబాలు చేరిక

శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే09(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 10 తెదేపా కుటుంబాలు గురువారం పుట్టపర్తి కార్యాలయంలో పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.గ్రామానికి చెందిన ఉతప్ప,గంగులమ్మ,చిన్ననరసింహ,కిష్టప్ప,నారాయనప్ప,నాగప్ప,వరలక్ష్మి,లక్ష్మన్న,మారక్కా,కాంతమ్మ తదితరులు వైకాపాలో చేరిన వారిలో ఉన్నారన్నారు.చేరినవారికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 13వతేది వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి,మరోసారి వైఎస్ జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ వంశీకృష్ణ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే09(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని ఎంబి క్రాస్ గ్రామ సమీపంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఎన్నికల నిబంధనల ప్రకారం ఎస్ఐ వంశీకృష్ణ పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీలు నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఏలాంటి అనుమతులు లేకుండా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం,నగదు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ కు ముందు (48 గంటలు)11వతేది శనివారం సాయంత్రం నుండి 13వతేది సోమవారం సాయంత్రం వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.