google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : భక్తిశ్రద్ధలతో అక్కదేవతల ఎలవగంప ఉత్సవ పూజలు - ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భజనలు - 20 నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ

20, మే 2024, సోమవారం

భక్తిశ్రద్ధలతో అక్కదేవతల ఎలవగంప ఉత్సవ పూజలు - ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భజనలు - 20 నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ

 భక్తిశ్రద్ధలతో అక్కదేవతల ఎలవగంప ఉత్సవ పూజలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే17(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ అక్కదేవతల ఎలవ గంప ఉత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు జివీ ఆదినారాయణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ అక్కదేవతల ఆలయంలో పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు‌.అంతక ముందు గౌనిపల్లి గ్రామంలో ప్రతి ఇంటి నుండి అమ్మవారికి పసుపు,కుంకుమ,గాజులు, వస్త్రాల ఎలవ గంపలలో కొలువైన అమ్మవారికి పుష్పాలతో అలంకరించి గ్రామ పురవీధుల్లో గురువయ్యల డప్పు వాయిద్యాలతో ఘనంగా ఊరేగించారు.ఆలయం వద్ద  ఏడుగురు చిన్నారులు పసుపు,కుంకుమ,గంగా జలాలు,ధాన్యాలు,దీపధూప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించి జ్యోతుల హరతి నీరాజనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వందలాది భక్తులు,గ్రామస్తులు  అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.తీర్థ, అన్నప్రసాదాలు అందజేశారు.

$$$__________@@@___________$$$

ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భజనలు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే17(విజయస్వప్నం.నెట్)

తనకల్లు మండలం బంతలపల్లి గ్రామ కళాకారుల సంఘం సభ్యులు శుక్ర,శనివారం రెండు రోజులు(16,17 తేదీలు)కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో భజనలు చేసినట్లు తెలిపారు.తనకల్లు మండలం బంతలపల్లి భాస్కర స్వామి ఆధ్వర్యంలో బాలయ్య స్వామి,నల్లచెరువు గంగాధర స్వామి గురువుల సమక్షంలో  నరసింహస్వామి ఆలయంలో భజనలు చేసినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం,శనివారం ఆలయంలో భజనలు నిర్వహిస్తారని భజన బృందం సభ్యులు తెలిపారు.ఈకార్యక్రమంలో బాలయ్య స్వామి, ఆంజనేయస్వామి, శివారెడ్డిస్వామి, రంగప్పస్వామి, నరసింహరావు, కుర్తిరామయ్య, కవులేపల్లి రమణ, రామస్వామి, ఓబులేష్, కిరణ్, శంకర స్వామి, గంగాధర, అరుణమ్మ,ఆది, అమడగూరు వెంకటస్వామి తదితర భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@___________$$$

20 నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే18(విజయస్వప్నం.నెట్)

ఓబులదేవరచెరువు మండల వ్యాప్తంగా 20వతేది(సోమవారం)నుండి వేరుశనగ విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ కొరకు రైతులు వారి పరిధిలోని రైతుభరోసా కేంద్రాల్లో సంప్రదించాని మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ అహ్మద్ విజయస్వప్నం.నెట్ ప్రతినిధికి తెలిపారు.మొదటగా విత్తనం కొరకు రిజిస్ట్రేషన్ చేసుకొన్న రైతులకి మాత్రమే విత్తనం అందజేస్తారని తెలిపారు.రైతులు తమ వెంట పట్టాదారు పాసుపుకం,ఆధార్ కార్డు,మొబైల్ ఫోన్ కచ్చితంగా తీసుకొని వెళ్ళాలని తెలిపారు.0 - 0.5 ఎకరాలు ఉన్న రైతుకు 30 కేజీల బ్యాగు ఒకటి,0.5- 1.0 ఎకరాలు ఉన్నా రైతుకి 30 కేజీల బ్యాగులు రెండు,1.01 ఎకరాల పైనున్న వారికి 30 కేజీల బ్యాగులు 3 పంపిణీ చేస్తామన్నారు.కే-6 మరియు టిసిజీఎస్-1694 రకం విత్తనానికి సంబంధించి 30 కేజీల 1 బ్యాగు పూర్తి ధర రూ.2,850 ఉండగా,అందులో సబ్సిడీ 1,140 రూపాయలు పోగా రూ.1,710 చెల్లించాలని,కే-6 మరియు టిసిజీఎస్ -1694 రకం విత్తనానికి సంబంధించి 60 కేజీల 2 బ్యాగుల పూర్తి ధర రూ.5,700 ఉండగా,అందులో సబ్సిడీ 2,280 రూపాయలు పోగా రూ.3,420 చెల్లించాలని,కే-6  టిసిజీఎస్-1694 రకం విత్తనానికి సంబంధించి 90 కేజీల 3 బ్యాగుల పూర్తి ధర రూ.8,550 ఉండగా,అందులో సబ్సిడీ 3,420 రూపాయలు పోగా రూ.5,130 చెల్లించాలని,కదిరి లేపాక్షి (కె - 1812) రకం విత్తనానికి సంబంధించి 30 కేజీల 1 బ్యాగు పూర్తి ధర రూ.2,610 ఉండగా,అందులో సబ్సిడీ 1,044 రూపాయలు పోగా రూ.1,566 చెల్లించాలని, కదిరి లేపాక్షి (కె -1812) రకం విత్తనానికి సంబంధించి 60 కేజీల 2 బ్యాగుల పూర్తి ధర రూ.5,220 ఉండగా,అందులో సబ్సిడీ 2,088 రూపాయలు పోగా రూ.3,132 చెల్లించాలని,90 కేజీల 3 బ్యాగుల పూర్తి ధర రూ.7,830 ఉండగా, అందులో సబ్సిడీ 3,132 రూపాయలు పోగా రూ.4,698 చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. మండల రైతుభరోసా కేంద్రానికి శనివారం విత్తన వేరుశనగ కాయలు చేరినట్లు వ్యవసాయ రైతుభరోసా సహయాధికారి లలిత తెలిపారు.

$$$__________@@@___________$$$

మచ్చలేని మహానీయుడు సుందరయ్య: సిపిఎం నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే19(విజయస్వప్నం.నెట్)

భారతదేశ తొలి ప్రతిపక్ష నేత సుందర రాంరెడ్డి అయినా తన పేరును సుందరయ్యగా మార్చుకుని పేదలందికి అండగా అన్నం పెట్టే మార్గాన్ని ఎంచుకున్న మహానేత శ్రీ సుందరయ్య తనకున్న వందల ఎకరాల సాగుభూమిని కడుపేదలకు పంచి,నిరుపేదగా జీవించిన పేదల ప్రేమమూర్తిగా పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ పై పార్లమెంటుకు వెళ్ళి నిరాడంబరతను చాటిన నిజాయితీ పరుడు.తెలంగాణ దాస్యవిముక్తిగా వించిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట రథసారధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వవర్ధంతి సందర్భంగా సిపిఎం,సీఐటీయూ నాయకులు ఘనంగా  నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... మచ్చలేని మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాల అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు. వివిరమణ, శ్రీరాములు, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి