నేడు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు
శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మే22 (విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణములో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో నేడు గురువారం హుండిల లెక్కింపు ఉదయము 6గంటల నుండి ప్రారంభిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఓప్రకటనలో బుధవారం తెలిపారు. సదరు హుండీల లెక్కింపు కార్యక్రమమునకు హాజరుగు వ్యక్తులు ప్రభుత్వ నిభందనల ప్రకారము పురుషులు పంచె,కండువాతో రావలని, ఎవ్వరు వారి స్వంత నగదు తీసుకొని హుండి లెక్కింపు ప్రాంతములోనికి హజరు కాకూడదని అలాగే బంగారు ఇతర విలువైన వస్తువులు ధరించి రాకూడదని ఉపకమీషనరు, కా ర్యనిర్వహణాధికారి తెలిపారు.
$$$__________@@@__________$$$
అవాంఛనీయ ఘటనలపై దృష్టి సారించాలి: ఆర్డీవో భాగ్యరేఖ
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే22(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని బుధవారం డిఎస్పీ వాసుదేవన్ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశంలో ఆర్డీవో భాగ్యరేఖ సూచించారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల అనంతరం అల్లర్లు జరిగే అవకాశం ఉందని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా గట్టి నిఘా ఉంచి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పెట్రోల్ బంకుల్లో, కిరాణా దుకాణాల్లో బాటిళ్లల్లో పెట్రోల్,డీజిల్ క్రయవిక్రయాలు పూర్తిగా నియంత్రించి,కర్ణాటక నుండి మద్యం, పెట్రోల్, డీజిల్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. 144 సెక్షన్ కొనసాగుతుందని ఎక్కడ కూడా నలుగురికి మంచి ఉండరాదని, అంగళ్ళు, టీ స్టాల్, భోజన హోటళ్ళ వద్ద గుంపులుగా ఉండకూడదన్నారు. బాణసంచా పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వలు గుర్తించి సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను, పోలీసులను ఆదేశించారు. గతంలో బైండోవర్ జాబితా, ప్రస్తుతం జాబితాలో ఎవ్వరైనా పేర్లు నమోదు కాకుండా ఉంటే పరిశీలించి, గుర్తించిన వివరాలు నమోదు చేయాలన్నారు.ఇనుప కమ్మీలు,రాళ్ళు,కర్రలు తదితర సామాగ్రి నిర్మణాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఆమె తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అమడగూరు, ఓడిచెరువు, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ మండలాల తహశీల్దార్లు రమాకాంత్ రెడ్డి,ఖాజాభీ, వేణుగోపాల్, కళావతి, భారతి, నాగభూషణం, వెంకటస్వామి, పుట్టపర్తి రూరల్,అర్బన్ సిఐలు రామయ్య, కొండారెడ్డి, ఎస్ఐలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే22 (విజయస్వప్నం.నెట్)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందించే పండ్ల మొక్కలను పెంచడంపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ.... దరఖాస్తులు స్వీకరించాలని బుధవారం ఏపిఓ సుధాకర్ సాంకేతిక, క్షేత్రస్థాయి సహాయకులకు బుధవారం సమావేశం ఏర్పాటు చేసి సూచించారు. ఆసక్తి కనబరిచే రైతుల పేర్లు నమోదు చేసుకొని, దరఖాస్తులు స్వీకరించాలని ఆయన తెలిపారు.జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని,హాజరు,పనిదినాలు తదితర అంశాలు మస్టర్ లో పొందుపరచాలని,300 రూపాయలు కూలీ నగదును అందించే విధంగా దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులను గుర్తించి కూలీలకు కల్పించాలని ఆయన సూచించారు. వేసవిలో నీడ నీరు ప్రథమ చికిత్స కిట్లు తప్పకుండా పని చేసే ప్రదేశంలో అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సాంకేతిక సహాయకులు రాజారెడ్డి, రాజేంద్ర, నాగముని, హనుమంతురెడ్డి, చంద్రారెడ్డి ఆంజనేయులు క్షేత్ర సహాయకులు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి