google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు; జిల్లా కలెక్టర్, ఎస్పీలు - వైభవంగా శ్రీస్వామివారి వెండి రథం ఉత్సవము -

28, మే 2024, మంగళవారం

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు; జిల్లా కలెక్టర్, ఎస్పీలు - వైభవంగా శ్రీస్వామివారి వెండి రథం ఉత్సవము -

ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు: జిల్లా కలెక్టర్, ఎస్పీలు

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే27(విజయస్వప్నం.నెట్)

జూన్ 4న హిందూపురం బిట్ కళాశాల, లేపాక్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించనున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియ హలో భాగంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని,ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశామని, అందుకు రాజకీయ పార్టీలు, ఏజెంట్లు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అరుణ్ బాబు కోరారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డితో  కలిసి ఓట్ల లెక్కింపుపై అభ్యర్ధులు, వారివారి కౌంటింగ్ ఏజెంట్లతో  సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ.... ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కట్టుదిట్టమైన భద్రత చర్యలు పూర్తి అవుతున్నట్లు తెలిపారు.ఏలాంటి వివాదాలకు చోటు లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో అభ్యర్థులు,ఏజెంట్లు తమ గుర్తింపు కార్డులను ధరించాలని, ఓట్లు లెక్కింపు ముగింపు వరకు అధికారులకు సంపూర్ణ సహకారాలు అందించాలని,ఈవీయంల లెక్కింపు కోసం 14 టేబుళ్ళు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఓట్ల లెక్కింపు గదుల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ నిరంతరం పర్యవేక్షించబడుతాయన్నారు.జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.... కౌంటింగ్ ప్రక్రియ రోజు ఆతర్వాత రోజు కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈసమావేశంలో హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి బికే.పార్థసారథి, వైకాపా తరపున వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థి సమద్ షాహిన్, బిఎస్పీ తరుపున భాగ్య, సోషలిస్టు యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా తరపున రమేష్,ఆర్ ఎస్పీ పార్టీ తరపున శ్రీనివాసులు,నవ క్రాంతి పార్టీ తరపున ధనుంజయ, డిఆర్వో కొండయ్య,కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

చినుకు పడితే.... ఇనుప కడ్డీలకు విద్యుత్ 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే27(విజయస్వప్నం.నెట్)

వర్షం కురిసిందంటే.... ఎక్కడైనా సరే సంతోషంతో మురిసిపోతారు.రైతులు అయితే హర్షం వ్యక్తం చేయడం రివాజు. ఇదిలా వుంటే.... ఓడిచెరువు మండల కేంద్రంలో వ్యాపారులకు,దుకాణ సముదాయ దారులు, ప్రయాణికులకు చినుకు పడితే భయంతో వణుకు తున్నారు.విషయం ఏమిటంటే.... బస్టాండ్ సమీపంలో స్తంభం నుండి గృహాలకు,వ్యాపార సముదాయ దుకాణాలకు విద్యుత్ తీగలు అతుకులతో ఏర్పాటు చేసుకోవడంతో తేలికపాటి వర్షం చినుకులు పెడితే చాలు దుకాణాల ముందు ఇనుప కడ్డీలకు,రేకులకు విద్యుత్ సరఫరా అవుతుందని పలువురు షాక్ తగిలి ప్రాణాపాయం నుండి బయట పడి భయభ్రాంతులకు గురౌతున్నారు. సంఘటనపై సంబంధించిన లైన్ మేన్లకు సమాచారం అందించగా స్పందించలేదని పలువురు పేర్కొంటున్నారు.గత మూడు రోజుల క్రితం స్ధానికంగా వుండే హిదాయతుల్లా చికెన్ వ్యాపారం చేసుకుంటున్న అంగడి వద్ద సహాయకుడిగా కుమారుడు దాదాఫీర్ విద్యుత్ సరఫరా అవుతున్న ఇనుప కడ్డీలకు తాకడంతో షాక్ గురై కింద పడుతున్న కుమారుడిని గమనించి అప్రమత్తంగా తీగలు తొలగించి కాపాడుకున్నారని తండ్రి హిదాయతుల్లా తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

$$$__________@@@__________$$$

ప్రతి ఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలి

ఘర్షణలకు పాల్పడితే చర్యలు:కదిరి డిఎస్పీ శ్రీలత 




శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే27(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలకు మేరకు జూన్ 4వతేదీ జరగబోవు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా సోమవారం కదిరి పట్టణంలో డిఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో కదిరి సబ్ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న సుమారు 100 మంది పోలీసులకు శ్రీ సత్యసాయి జిల్లా ఏఆర్ పోలీసుల సహకారాలతో అంబేద్కర్ కూడలి వద్ద పోలీస్ మాక్  డ్రిల్  నిర్వహించారు.ఈ పోలీస్ మాక్ డ్రిల్ నందు ఎన్నికల కౌంటింగ్  రోజు ఎవరైనా వ్యక్తులు గుంపులుగా చేరి సమస్య సృష్టించబడతారో వారిని పోలీసులు ఏ విధంగా ఎదుర్కోవాలనే సూచనలు ప్రకారం ఈ మాక్ డ్రిల్ నిర్వహించారని డిఎస్పీ శ్రీలత తెలిపారు.ప్రతి ఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలని, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.మాక్ డ్రిల్ ద్వారా పోలీసులతో ప్రజలకు వివరిస్తున్నారన్నొరు.అల్లరి మూకలను చెదరగొట్టుటకు పోలీసులు తీసుకునే  చర్యలు ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ....ముందుగా అల్లరి మూకలపై టియర్ గ్యాస్  ప్రయోగించి గుంపును చెదరగొడతారని,తర్వాత ఇంకా అల్లరిముకలు ఆగడాలు ఎక్కువగా ఉంటె లాఠీ చార్జి చేయబడుతుందని, లాఠీ ఛార్జ్ లో గాయపడిన వారిని అంబులెన్సులో ఆసుపత్రికి ఏలా తీసుకెళ్లి చికిత్సలు అందించే విధానం,లాఠీ చార్జి చేసినా కూడా అల్లరిమూకలు చెదరకపోతే చివరిగా సదరు అల్లరిమూకలపై పోలీసులు కాల్పులు జరుపుతారని పేర్కొంటూ.... ప్రజలకు పోలీసులతో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.144 సెక్షన్ కొనసాగుతుందని, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బాణసంచా పేల్చుట, విజయోత్సవ ర్యాలీలు నిషేధించారని ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో  కదిరి టౌన్ సిఐ కె.పుల్లయ్య,కదిరి రూరల్ సర్కిల్ సిఐ వెంకటేశ్వర్లు,కదిరి అర్బన్ పిఎస్ సిఐ మోహన్,స్పెషల్ పార్టీ పోలీసులు,ఎఆర్ పోలీసులు,  కదిరి సబ్ డివిజన్ పోలీస్  సిబ్బంది సుమారు వంద మంది  పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీ అక్కదేవతల ఆలయంలో  కర్ణాటక భక్తులు ప్రత్యేక పూజలు


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే27(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో వైశాఖ మాస సోమవారం సందర్భంగా కర్ణాటక గౌరీ బిధినూరుకు చెందిన చలపతి,రెడ్డమ్మ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హఅనంతరం దర్శనం కోసం విచ్చేసిన వందలాది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వైభవంగా శ్రీస్వామివారి వెండి రథం ఉత్సవము



శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే28(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా క్షేత్రము  శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రంలో వైశాఖ మాసం,బహళ పక్షం,తిథి:పంచమి  మంగళవారము రాత్రి 8 గంటల నుండి  శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండిరథము ప్రాకరోత్సవ(ఆలయ ప్రాకరోత్సవము)  కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.వెండి రథం పైన కొలువు దీరిన స్వామివారికి సుగంధ పుష్పాలతో,కదిరి మల్లెలు,తులసి మాలతో అలంకరణ గావించి,అస్థాన పూజలు నిర్వహించి అనంతరము తాళమేళాలతో ఆలయ ప్రాకరోత్సవము అత్యంత వైభవముగా నిర్వహించారు.అనంతరం నివేదనగా పులిహోర ప్రసాదము నైవేద్యం గావించి  పలు రకాలు ఫలాలు సమర్పించి ప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించి,వెండి రథోత్సవముకు విచ్చేసిన భక్తులందరు విరివిగా పాల్గొని స్వామి వారి సేవలో తరించి అనుగ్రహము పొందారని కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు తెలిపారు.

$$$__________@@@__________$$$

భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ 


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని అల్లాపల్లి పంచాయతీ పగడాలవారిపల్లి గ్రామంలో నూతన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ గ్రామపెద్దల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం శ్రీపంచరత్న సురేష్ శర్మ పురోహితులచే శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నవగ్రహ పూజ,వాస్తు పూజలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేటి నుంచి రైతులకు విత్తన కాయలు పంపిణీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే28(విజయస్వప్నం.నెట్)

నేడు బుధవారం నుండి ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ కాయల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంగళవారం మండల వ్యవసాయాధికారి ఇలియాజ్ అహ్మద్ ఓప్రకటనలో తెలిపారు.ఇటీవల వేరుశన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా సంబంధిత రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి రసీదు చూపీ,నగదు చెల్లించి వేరుశనగ విత్తన కాయలు తెచ్చుకోవాల్సిందిగా ఆయన ఈసందర్భంగా కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి