ఘనంగా సీఐటీయూ 54వ ఆవిర్భావ వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే30(విజయస్వప్నం.నెట్)
సీఐటీయూ 54వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో ఆటో స్టాండ్ వద్ద సీఐటీయూ నాయకులు వివి.రమణ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా. సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ,ట్రాన్స్ పోర్ట్ రంగం ప్రధాన కార్యదర్శి పెడబల్లి బాబావలి,మండల కార్యదర్శి శ్రీరాములు,కుళ్లాయప్ప మాట్లాడుతూ 1970 మే 30వ తేదీన సిఐటియు ఆవిర్భావం చేపట్టినట్లు పేర్కొన్నారు.అప్పటినుండి ఇప్పటివరకు కార్మికులు,కార్మికుల సమస్యల పైన,వర్గ పోరాటాల్లో దేశంలోనే అగ్ర భాగాన నిలిచి,పోరాటాలు చేసిన చరిత్ర సిఐటియు కార్మిక సంఘానికి ఉందని,కార్మికులు పోరాడి సాధించుకున్న 42 కార్మిక చట్టాలను,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకురావడం జరిగిందని, ఇలాంటి లేబర్ కోడుల వలన కార్మికులకు అభద్రత భావం ఏర్పడిందని,కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని,కాబట్టి. గతంలో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాం,ప్రైవేటు రంగానికి వ్యతిరేకంగా పోరాడుదామని డిమాండ్ చేస్తూ వారు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సుధాకర్,మాబ్ భాష,శంకర,మనోజ్,మురళి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభో....!!
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే30(విజయస్వప్నం.నెట్)
మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ దిగువపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నెలకొని రెండువారాలు గడుస్తున్నా.... పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, తాగునీటి సమస్య పరిష్కరించండి మహాప్రభో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో రెండు మంచినీటి సరఫరా పథకం బోరు మోటార్లు మరమ్మతులు నోచుకోలేదని, దీంతో నీటి సమస్య జఠిలంగా మారిందని, సుదూర ప్రాంతాలకు వెళ్లి రైతు బోరు బావులను ఆశ్రయించి పిల్లలు,మహిళలు,వృద్ధులు రాత్రింబవళ్ళు నీళ్ళ కోసం అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు.విద్యత్ సరఫరాలో కోతల వల్ల రైతు బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారని, బోరు మోటార్ విద్యుత్ తీగలు చోరీ చేయడంతో మరమ్మతులకు అంతరాయం కలిగిందని రెండు వారాలుగా తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారిందని, అంతేకాకుండా పశువులకు నీరు అందించేందుకు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని,ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి మంచినీటి పథకం బోర్లు రిపేరు చేసి గ్రామస్తులకు తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
$$$__________@@@__________$$$
ప్రకృతి వ్యవసాయం ఉత్తమం: బిజేపీ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే31(విజయస్వప్నం.నెట్)
ప్రకృతి వ్యవసాయం సాధనలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో దినేష్ గత మూడు దశాబ్దాలకు పైగా విశేషమైన సేవలు అందించడంపై బిజేపీ ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి అభినందించారు.శుక్రవారం కదిరి కుమ్మరివాండ్లపల్లిలో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించిన బిజెపి ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి వారితో(దినేష్ తో)కలిసి ప్రకృతి వ్యవసాయంలో వస్తున్న సవాళ్లు రైతులకు చేరుకోడాల్సిన మార్గాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.వారి అనుభవాలను అలాగే సమాజంలో ఆహార పదార్థాల పైన ప్రజలకు కల్పించాల్సిన అవగాహన ఇతర అంశాల గురించి వివరించారన్నారు.ఈ సందర్భంగా దినేష్ ను శాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ ప్రాంతంలోని రైతులు వేరుశనగ పంటను విపరీతంగా సాగు కోసం కావలసిన రసాయనాలు భూమిపై చల్లడం వలన భూమి లోపల పోషకాలు నశించి పోతున్నాయని,గతంలో ఒక ఎకర వేరుశనగ పంటకు 30 సెర్లు విత్తనాలు వేసేవాళ్ళని,రైతుల ఆదాయం కోసం వాటిని 60 సేర్లు విత్తనాలకు పెంచారని,కానీ పంట సాగుకు కావలసిన ఎరువులను,సాంద్రతను పూర్తిగా ,వేరుశనగ విత్తనాలు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న విధంగానే చిరుధాన్యాలను రైతులకు సబ్సిడీలపై పంట వేఅసుకున్నందుకు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో రామాంజులరెడ్డి,గంగాధర్,శ్రీనాథ్ రెడ్డి,రమేష్ బాబు,చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
సిగరెట్ పొగ జీవితానికి సెగ
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే31(విజయస్వప్నం.నెట్)
ఆరోగ్యవంతమైన అలవాట్లతో పొగాకు రహిత సమాజ నిర్మాణానికి అన్ని వర్గాల వారు కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ పేర్కొన్నారు.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ఈసందర్భంగా మాట్లాడుతూ..... క్యాన్సర్ వ్యాధి కారకాల్లో పొగ త్రాగడం అతి ముఖ్యమైనదని,వయోభేదం లేకుండా పొగాకు ఉత్పత్తుల అలవాట్ల వల్ల అందరి ఆయు ప్రమాణ సగటు రేటు అవరోహణ క్రమంలో అతివేగంగా తగ్గిపోతోందని,నిలకడకు,మెరుగుదలకు మంచి ఆరోగ్య అలవాట్లు ఒక్కటే ఉత్తమ మార్గమన్నారు.పొగాకు వాడకం వలన నోటి,ఊపిరితిత్తులు,ప్రేగు,రక్త, గర్భాశయ,మూత్ర సంబంధ,జీర్ణాశయ క్యాన్సర్ అలాగే దీర్ఘకాలిక వ్యాధులు పక్షవాతం,అంగవైకల్యం,గుండె,వంధ్యత్వం,రక్తనాళాలు గట్టిపడటం వంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.నివారణకై వైద్యులు ఇచ్చే మంచి సలహాలు,సూచనలు,ఆరోగ్య అలవాట్లు పాటించాలని సూచించారు.అనంతరం సదస్సుకు హాజరైన వారితో పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి పర్యావరణాన్ని రక్షించుటకై ప్రతిజ్ఞ చేయించారు.ఈకార్యక్రమంలో వైద్యాధికారి కమల్ రోహిత్,వైద్య బృందం సుభాషిని,దిల్షాద్,విజయ కుమారి,వరలక్ష్మి,సరిత,హెప్సిబా తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
భజన కళాకారుడు శ్రీరామిరెడ్డి మృతి
కుటుంబానికి ఐదు వేలు ఆర్థికసాయం
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే31(విజయస్వప్నం.నెట్)
శ్రీ సత్యసాయిజిల్లా కొత్తచెరువు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన భజన కళాకారుడు శ్రీరామరెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న జానపద వృత్తి కళాకారుల సంఘం శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు ఎం.నారాయణ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారని మండల కళాకారుల సంఘం సభ్యులు తెలిపారు.భజన కళాకారులకు సహాయనిధిగా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ లో సభ్యత్వం చేసిన కళాకారుడు రామిరెడ్డి మృతి చెందాడంతో జానపద కళాకారుల సంఘం జాతీయ,రాష్ట్ర అధ్యక్షుడు పులిమామిడి యాదగిరి సూచనల మేరకు మృతుడి కుటుంబానికి జానపద వృత్తి కళాకారుల సంఘం తిరుపతి నుండి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర నాయకులు,జిల్లా అధ్యక్షుడు ఎం.నారాయణ నారాయణ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి చేతులమీదుగా అందించినట్లు తెలిపారు.కళాకారుల సంఘం సహయనిధి ఉద్ధేశ్యం గ్రామాలలో భజన సంస్కృతి మరింత పెరగడానికి,భజన కళాకారులు భజనలు సాంస్కృతిక కళలపై ఆసక్తి కనబరిచాలని,మన ఆధ్యాత్మిక ధర్మప్రచారం మరింత పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారని, కళాకారుల సంఘం సభ్యులు మీరంతా సహకరించాలని వారు కోరారు.
$$$__________@@@__________$$$
వైభవంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు
శ్రీసత్యసాయి కదిరి(ఓడిచెరువు) జూన్01(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునకు అనుబంధ శ్రీద్వారం ఆంజనేయస్వామి,ఏటి గడ్డ ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం హనుమాన్ జయంత్సోవం సందర్భంగా స్వామివారిని తులసిమాలలతో అలంకరించి,ప్రత్యేక అభిషేక పూజలు,ఆస్థాన కైంకర్యములు నిర్వహించారు.హనుమాన్ జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. ఓడిచెరువులో.... మండల కేంద్రంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ఆకుపూజ,అర్చనలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులు కాయకర్పూరం సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.మిట్టపల్లి గ్రామ సమీపంలో సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంత్సోవం సందర్భంగా వార్డెన్ శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా స్వామివారిని నూతన వస్త్రాలు,వెండి కవచములు,వివిధ పుష్పాలతో అలంకరించి,ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతుల నీరాజనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయంలో భజనలు చేపట్టారు.ఓడిచెరువు ఎం.కొత్తపల్లి బండపైన శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ఓడిచెరువు మండల పరిధిలో అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ శ్రీఅభయ ఆంజనేయస్వామివారి ఆలయంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి,విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.గ్రామస్తులు,భజన బృంద సభ్యుల ఆధ్వర్యంలో భజనలు చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీఆంజనేయ స్వామి భక్తులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీ ఖాద్రీనృసింహుశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
భక్త ప్రహ్లాద దర్శనము పాప విమోచనం
శ్రీసత్యసాయిజిల్లా కదిరి జూన్ 01(విజయస్వప్నం.నెట్)
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము చారిత్రాత్మకంగా వైశాఖ మాస ఆఖరి శనివారం, హనుమాన్ జయంతి పురస్కరించుకుని శ్రీ ఖాద్రీ నృసింహునికి అర్చకులు పూజలు నిర్వహించారు.దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.శ్రీ స్వామి వారి దర్శనార్థము తెల్లవారుఝుమున నుండి భక్తులు బారులు తీయడంతో ఆలయ ఆవరణలో రద్దీలోనే దీపార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అభిషేక దర్శనము కోసం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి ఇంటి ఇలవెల్పుగా కొలిచే కర్నాటక రాష్ట్రములోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధికముగా విచ్చేసిన భక్తాదులు స్వామివారికి తలనీలాలను,తూలభారము మొక్కుబడులు సమర్పించుకున్నారు.భక్తుల సౌక్యార్థము అతి శీఘ్రదర్శనము,ప్రత్యేక దర్శనము,ఉచిత దర్శనమునకు క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.దర్శనం కోసం విచ్చేసిన భక్తాదులకు నైవేద్య ప్రసాదము వితరణతో పాటు నిత్య అన్నదాన వసతి సౌకర్యాలు కల్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి,అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూన్02(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదవ తరగతి 2004 -05 బ్యాచ్ విద్యార్థులు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొని తమ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉపాధ్యాయులు జయచంద్రారెడ్డి, భాగ్యలక్ష్మి, రామచంద్రరెడ్డి, సుబ్బిరెడ్డి, జయరాజ్, బాబాఫకృద్దీన్, కృష్ణారెడ్డి, ఆంజనప్ప, ఫకృద్దీన్, బాబు పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారు. విద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరూ కలిసి గురువులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ నిర్వాహణ కమిటీ సభ్యులైన విద్యార్థులు మాట్లాడుతూ 19 సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని,ఉపాధ్యాయుల చల్లని దీవెనన్న వల్లే మేమంతా ఈ స్థాయిలో ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో రవి,బాబాఅలీ,సల్మా,కళ్యాణి, శీను,లావణ్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి