తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే02(విజయంస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ కాలనీల్లో గురువారం పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా, జనసేన,బిజేపీఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెదేపా నాయకులు ఎద్దుల ప్రమోద్ రెడ్డి, బిసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జరిపిటి అంజనప్ప, మాజీ సర్పంచ్ పొగాకు షపి, ఆర్ఎంపీ డాక్టర్ జాకీర్, మాజీ ఎంపిటిసి నాగిరెడ్డిగారి రాజారెడ్డి,చండ్రాయుడు,ఆనంద్,శంకర్ జనసేన,బిజేపీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.ఇంటింటికి వెళ్లి తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్ మినీ మ్యానిఫెస్టో పథకాలపై వివరిస్తూ ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా జనసేన బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా,హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారన్నారు.
$$$__________@@@__________$$$
వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే02(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని తంగేడుకుంట పంచాయతీ గ్రామాల్లో గురువారం పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు,వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు.ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా,పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారని వైకాపా శ్రేణులు తెలిపారు.గ్రామాల్లో వైకాపాకి విశేష స్పందన లభిస్తోందని వారు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ తో పాటు ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
$$$__________@@@__________$$$
జగనన్న పాలనలోనే అభివృద్ధి సాధ్యం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే03(విజయస్వప్నం.నెట్)
జగనన్న సారధ్యంలో వైకాపా పాలనలోనే అభివృద్ధి సాధ్యమని పుట్టపర్తి శాసనసభ్యులు,వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండలంలోని వెంకటాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తారని, జగనన్న పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.మే13వతేది వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి వైఎస్ జగనన్నని ముఖ్యమంత్రిగా, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజలను కోరినట్లు తెలిపారు.గ్రామాల్లో ప్రచారం చేపట్టిన దుద్దుకుంట కిషన్ రెడ్డికి వైకాపా నాయకులు,కార్యకర్తలు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,స్ధానిక వైకాపా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తహశీల్దార్ గారు రైతు సమస్యలపై స్పందించండీ....!
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే03(విజయస్వప్నం.నెట్)
మండలంలోని రైతులు బ్యాంకులో రెన్యూవల్ చేసుకోనేందుకు గడువు సమీపిస్తున్న తరుణంలో సకాలంలో రెన్యూవల్ చేసుకోకపోతే అధిక వడ్డీలు చెల్లించే పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని గత రెండు వారాలుగా వన్ బి,అడంగల్ లాక్ లో ఉన్న వాటిని తొలగింపు కొరకు రెవెన్యూ అధికారులకు అర్జీలు సమర్పించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏలాంటి సమాధానం లేదని, తహశీల్దార్ గారు రైతు సమస్యలపై స్పందించండని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మున్నా, బిజేపీ నాయకులు రామచంద్ర తదితరులు డిమాండ్ చేశారు.రైతుల అర్జీలతో పాటు విద్యార్థుల కుల,ఆదాయ తదితర దరఖాస్తులపై స్పందించి ధృవీకరణ పత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. రైతులు వీరాంజనేయులు, చౌడప్ప, నంజుండప్ప, దస్తగిరి, వెంకటనర్సునాయుడు, నాగరాజు, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరిన 110 వైకాపా కుటుంబాలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే03(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ నాయనకోట తాండలో శుక్రవారం వైకాపా నుంచి 110 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపా కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈసందర్భంగా మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ....నాయనకోట తాండా ఒక్కగానొక్కప్పుడు కంచుకోట అని ఇప్పుడు తెదేపాలోకి చేరిందన్నారు.గ్రామానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు.తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమని భావించి వైకాపా నుంచి తెదేపాలోకి చేరడం ఎంతో శుభపరిణామని,గెలిచిన వెంటనే ఈగ్రామానికి వచ్చి ఏ అవసరం ఉన్న సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి పల్లెకి స్థానిక ప్రజలు నీరాజనాలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. యువకులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య బాణా సంచా కాల్చి అభిమానం చాటుకున్నారు.గ్రామంలోని పుర వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు తెదేపా జిల్లా అధ్యక్షులు అంజినప్ప,ఎన్నికల పరిశీలకులు డీఎన్ మూర్తి,జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్,లాయర్ రాజశేఖర్,కన్వీనర్ జయ చంద్ర,మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,యువ నాయకుడు ఎద్దుల ప్రమోద్ రెడ్డి,అక్కులప్ప నాయక్,వెంకటేష్ నాయక్,కాలే నాయక్,శంకర్ నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భవిష్యత్తు కోసం తెదేపా అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పల్లె సింధూరమ్మ, హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి పార్థసారథి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.బిజెపి నాయకులు శరత్ రెడ్డి,కొత్త చెరువు తెదేపా కన్వీనర్ శ్రీనివాసులు,వల్లేపి సోమశేఖర్,మాజీ కన్వీనర్ నాగిరెడ్డిగారి రాజారెడ్డి,తుమ్మల మహబూబ్ బాషా,పొగాకు జాకీర్,తెదేపా,జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని గెలిపించుకుద్దాం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే04(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా జనసేన బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుద్దామని శనివారం మాజీ సొసైటీ అధ్యక్షులు పిట్టా ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు,కార్యకర్తలతో కలిసి శనివారం ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.బిసీ కాలనీ,నాయిబ్రహ్మాణ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోభివృద్ధి సాధ్యమని, సూపర్ సిక్స్ పథకాలపై వివరిస్తూ ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.మే13వతేది తెదేపా సైకిల్ గుర్తుకు ఓటు వేసి, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా, పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని వారు ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో టిఎన్టీయూసీ నియోజకవర్గ నాయకులు టైలర్ నిజాం, ఎస్సీ సెల్ నాయకులు ముద్దలపల్లి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ మోపూరి నర్సింహులు, మైనారిటీ సెల్ నాయకులు షబ్బీర్, షాను,ఆరీఫ్,సౌదీ నాగరాజు,మీసేవ సుధాకర్, మస్తానమ్మ,అఖిల,జ్యోతి,రామాంజీ తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఎగువగువ్వలపల్లిలో వైకాపా నాయకుల ప్రచారం
193 చెరువులు నిండాలంటే....
శ్రీధర్ అన్నను..ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి!
శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మే04(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొట్టువారిపల్లి పంచాయతీ పరిధిలోని ఎగువగువ్వలపల్లిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీధర్ అన్నకు మద్దతుగా శనివారం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి,193 చెరువులకు నీరు నింపలంటే మరోసారి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదికేశవ నాయుడు,మండల రైతు సంఘం అధ్యక్షులు గుమ్మల ధర్మారెడ్డి, వైకాపా నాయకులు ఎర్రగుండ్ల కొండారెడ్డి,ఇందుకూరు రామ్మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అంజి, లక్ష్మీనారాయణ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి