google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : బుధవారప్రియుడికి పట్టాభిషేకం

30, మే 2024, గురువారం

బుధవారప్రియుడికి పట్టాభిషేకం

బుధవారప్రియుడికి పట్టాభిషేకం

 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే29(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి ఆలయంలో బుధవారప్రియుడికి (శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారికి) ప్రత్యేక పూజలు నిర్వహించి,పట్టాభిషేకం కార్యక్రమం చేపట్టారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.వైశాఖ మాస బుధవారం సందర్భంగా ఆలయ ఆవరణలో వినాయకస్వామి,సుబ్రహ్మణ్యంస్వామి,శ్రీలక్ష్మీసింహస్వామివారి ఉపాలయాల్లో పూజలు నిర్వహించి, అనంతరం శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి మూల విరాట్ విగ్రహానికి వివిధ పుష్పాలతో అలంకరించి, అర్చనలు, అభిషేకాలు,పట్టు వస్త్రం,ధూపదీప నైవేద్యాలు, సమర్పించి స్వామివారికి పట్టాభిషేకం పూజలు నిర్వహించారని తెలిపారు.దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.

$$$__________@@@__________$$$

సబ్సిడీ వేరుశెనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయశాఖ ఏడి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే29(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి రైతుభరోసా కేంద్రంలో బుధవారం ప్రభుత్వం సబ్సిడీ  వేరుశెనగ కాయల పంపిణీ కార్యక్రమం కదిరి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్.సత్యనారాయణ ప్రారంభించారు.అనంతరం ఆయన వేరుశనగ కాయల నాణ్యతను పరిశీలించారు.ఈసందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.....ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వేరుశెనకాయలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.వ్యాపారస్తులు  రైతులకు ప్రలోభాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన వ్యాపారస్తులను హెచ్చరించారు.మండల వ్యాప్తంగా ఇప్పటివరకు 4354 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు తొలి రోజు 1570  క్వింటాళ్లువేరుశెనగాకాయలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణతో పాటు మండల వ్యవసాయశాఖ అధికారి ఇలియాజ్ మహ్మద్, రైతుభరోసా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి