google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : స్ట్రాంగ్ రూములో ఈవీయంల భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరిశీలన - రేపటి నుంచి గాండ్లపెంట గంగాభవాని తిరుణాళ్ళు - శ్రీసత్యసాయిజిల్లాలో 144 సెక్షన్ కొనసాగింపు: జిల్లా ఎస్పీ

17, మే 2024, శుక్రవారం

స్ట్రాంగ్ రూములో ఈవీయంల భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరిశీలన - రేపటి నుంచి గాండ్లపెంట గంగాభవాని తిరుణాళ్ళు - శ్రీసత్యసాయిజిల్లాలో 144 సెక్షన్ కొనసాగింపు: జిల్లా ఎస్పీ

స్ట్రాంగ్ రూములో ఈవీయంల భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ పరిశీలన

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే15(విజయస్వప్నం.నెట్)

హిందూపురం బిట్స్ కాలేజీ,లేపాక్షి వద్ద ఏర్పాటు చేసిన ఈవీఎం...  స్ట్రాంగ్ రూమ్ ల  భద్రత ఏర్పాట్లను,మూడంచెల భద్రతను   బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపిఎస్ పరిశీలించారు.అనంతరం   అక్కడ ఏర్పాటు చేసిన  సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ ను ఆయన పరిశీలించారు.ఈవీఎం ఏర్పాటు చేసిన ఈవీఎం.. స్ట్రాంగ్ రూమ్ పరిసరాలను, ఎస్పీ పరిశీలించారు.స్ట్రాంగ్ రూముల మూడంచెల భద్రతస్థాయిలో కేంద్ర సాయుధ బలగాలు,ఆర్మడు రిజర్వుడు  బలగాలు,సివిల్ పోలీసు బలగాలను మోహరించారు.స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 144 సెక్షన్  అమల్లో ఉందని,ప్రతి స్ట్రాంగ్ రూమ్,పరిసరాలలో  సిసిటివి కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారని ఎస్పీ కార్యాలయ అధికారులు తెలిపారు.ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద  కేంద్ర,రాష్ట్ర పోలీసు బలగాలతో గస్తీ,నిరంతరం నిఘా పెట్టారని,విద్యుత్ అంతరాయం  లేకుండా జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారని,ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,స్ట్రాంగ్ రూముల కోసం ఏర్పరిచిన కేంద్రాల ఎంట్రెన్స్ గేట్  లోపలికి పరిసరాలలోకి  గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు  అనధికార వ్యక్తులనో,ఇతరుల వాహనాలకు  అనుమతిలేదని,స్ట్రాంగ్ రూం 24 గంటలూ సాయుధ బలగాల రక్షణలో ఉంటుందని,సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని,పారదర్శకంగా,అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో  జూన్ 4 న  ఓట్ల లెక్కింపు  జరిగే వరకు  దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టామని,స్ట్రాంగ్ రూములకు సీసీటీవీ కవరేజీతో సహా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గెజిటెడ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు 24 గంటలూ విధుల్లో ఉండే విధంగా చర్యలు చేపట్టారని,స్ట్రాంగ్ రూములు తెరిచే ముందు,మూసివేసే సమయంలో సీసీటీవీ కవరేజ్,వీడియోగ్రఫీ మొత్తం సీలింగ్ ప్రక్రియ స్పష్టంగా కనిపించే విధంగా సిసిటివీలు  ఏర్పాటు చేశారని,అపోహలు,తప్పుడు సమాచారాలు నమ్మి జిల్లాలో ఎవరైనా  అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు శాఖ తీవ్రంగా చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెంట  డిఎస్పీ కంజక్షన్ ఏ ఆర్ డిఎస్పీ జెడ్.విజయ్ కుమార్,సిఐ,ఎస్ఐలు ఉన్నారు.

$$$__________@@@__________$$$

రేపటి నుంచి గాండ్లపెంట గంగాభవాని తిరుణాళ్ళు


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) కదిరి మే15(విజయ్స్వప్నం.నెట్)

గాండ్లపెంట మండలం గాండ్లపెంట గ్రామంలో వెలసిన గంగాభవాని మాత ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా రేపటి నుంచి(17 నుండి 19తేది వరకు) మూడు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్ళు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తెలిపారు.17 శుక్రవారం ఉదయం శ్రీ గంగాభవాని కలశ పూజ,అభిషేకాలు,అర్చనలు,అలంకరణ,అష్టోత్తర పూజలు, తీర్థ,అన్నప్రసాదాలు తదుపరి మహిళా భక్తులచే లలిత సహస్ర నామాలు,కుంకుమార్చన పూజా కార్యక్రమాలు,18 మధ్యాహ్నం 3గంటల నుండి శ్రీ గంగాభవాని అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించి,ఒంగోలు కళాకారుల బృందం  నూనే దీపాలతో  ప్రదర్శనలు, కీలుగుర్రాలతో చెక్కభజన,డప్పు మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో ఊరేగింపు,19 ఆదివారం తెల్లవారుజామున 2గంటల నుండి అమ్మవారికి జ్యోతులు,భోణాల పూజలు, మధ్యాహ్నం 3 గంటల నుండి ఉట్ల తిరుణాల తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.అమ్మవారి తిరుణాల కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ గంగాభవాని మాత ఆశీస్సుల కోసం పూజలు నిర్వహించాలని భక్తులకు,గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

$$$__________@@@__________$$$

రెమ్యునరేషన్ చెల్లింపులో తేడాలొద్దు:డిటిఎఫ్

శ్రీసత్య సాయిజిల్లా ఓడిచెరువు మే15(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పాల్గొన్న ఓపిఓలకి  తక్కువ రెమ్యునరేషన్ చెల్లించారని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజమ్,మారుతి ప్రసాద్ విలేకరులకు తెలిపారు.అనంతపురం జిల్లాలో ఓపిఓలకి 1300 రూపాయలు చెల్లిస్తుండగా శ్రీసత్యసాయి జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కోరకంగా చెల్లించడం తగదన్నారు.ఓపిఓలు 2నుంచి3 రోజులు ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించారని కనుక వారికి అందుకు తగిన విధంగా రెమ్యునరేషన్ (టిఏ,డిఏ)చెల్లించాలని,అందరికీ ఒకే రకమైన రెమ్యురేషన్ చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సిబ్బందిపై లాఠీఛార్జ్ చేయడం అన్యాయమని వారు ఈసందర్భంగా ఖండించారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లాలో 144 సెక్షన్ కొనసాగింపు: జిల్లా ఎస్పీ

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే15(విజయస్వప్నం.నెట్)

శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఐపీఎస్ బుధవారం తెలిపారు.15వ తేదీ నుండి జూన్ 4న కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందన్నారు, జిల్లాలోని మండలాల్లో ఎవరైనా హింసాత్మకమైన ఘర్షణలకు  పాల్పడిన,విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని,అనుమతులు లేకుండా ఎక్కడ కూడా సభలు,ప్రచారాలు నిర్వహించరాదన్నారు.ఎవరైనా నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ప్రతి ఒక్కరూ సమయస్ఫూర్తితో ఉండాలని,ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు,ఘర్షణలకు వెళ్ళకూడదని ఎస్పి ఈ సందర్భంగా సూచించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు,వివాహాలకు,అంత్యక్రియలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు.తదుపరి ఉత్తర్వులు వెలబడే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు.

$$$__________@@@__________$$$

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మే15(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మంగళవారం రాత్రి చేలూరు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బొలెరో వాహనం ఢీ కొనగా ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా,మరొకరి తీవ్ర గాయాలు అయ్యినట్లు స్థానికులు సమాచారం అందించారు.చినగానిపల్లి పంచాయతీ కమ్మవారిపల్లి  గ్రామానికి చెందిన గంగులప్ప కుమారుడు గంగాధర్ తో కలిసి చేలూరు నుండి ద్విచక్ర వాహనంలో వస్తుండగా పాల వ్యాన్ ఢీ కొనడంతో 

చినగానిపల్లి పంచాయతీ ఎంపీటీసీ నారాయణ కుమారుడు  పవన్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం

 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మఏ16(విజయస్వప్నం.నెట్)

సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి భాను ప్రకాష్ పేర్కొన్నారు.జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో  ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ....వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల,కాలానుగుణంగా వ్యాప్తి చెందే వ్యాధులలో డెంగ్యూ వ్యాధి అతి ప్రమాదకర,ప్రాణాంతకమైందని,పలు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు.టైగర్ దోమగా పిలువబడే ఒక రకమైన దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని పరిసరాల అపరిశుభ్రత ముఖ్య దోహదకారకం కాగా నిలువ ఉండే మంచినీరు,వర్షపు నీరు,ఇళ్లలోని వాడకంలో లేని రోలు,రబ్బరు టైర్లు,టెంకాయ చిప్పలు,పాత డబ్బాలు,కుండలు మొదలగు వాటిలో నిలువ ఉండే వర్షపు మంచినీటిలో ఈ దోమలు గుడ్లు పెట్టి అనంతర పరిణామంలో పెద్ద వైన దోమలు అనారోగ్యవంతున్ని కుట్టి తిరిగి ఆరోగ్యవంతులను కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు.ఈసందర్భంగా వైద్యాధికారి  కమల్ రోహిత్ మాట్లాడుతూ....వ్యాధి లక్షణాలలో ముఖ్యంగా ప్రాథమిక దశలో విపరీత తలనొప్పితో కూడిన జ్వరము,రెండవ దశలో శరీరంపై నీలిరంగు దద్దులు,మూడవ దశలో మెదడులోని రక్తనాళాలు చిట్లి రక్తంలోని ప్లేట్లెట్స్ మోతాదు విపరీతంగా వేగంగా తగ్గి డెంగ్యూ హేమరేజ్ లక్షణంతో మరణించడం జరిగుతుందని,కనుక పరిసరాల పరిశుభ్రత,ఫ్రైడే డ్రై డే నియమాలు పాటిస్తూ నీటి నిలువలను తొలగించడంలో సామాజిక చైతన్యం పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడు ఈ డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని ఆయన సూచించారు.అనంతరం డెంగ్యూ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ చేపట్టి,ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఆకస్మిక తనిఖీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే16(విజయస్వప్నం.నెట్)

జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి  నాగేంద్ర నాయక్ గురువారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఓడిచెరువు-1 ఆరోగ్య ఉప కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభమైన వయోజన క్షయ టీకా కార్యక్రమమును పరిశీలిస్తూ తనిఖీల్లో భాగంగా ఓడిచెరువు ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు.శరీరంలో కేలరీల లోపం వలన అలాగే క్షయ వ్యాధిగ్రస్తుల నుండి నోటి తుంపర్లతో గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుందని,మూడు రోజుల నుండి జ్వరం రావడం,దగ్గి నప్పుడు రక్తపు చారలతో కూడిన గల్ల పడడం,పక్కటెముకలు నొప్పి,ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు కాగా నివారణలో భాగంగా ప్రతి గురువారం నిర్వహించే ఈ నూతన వయోజన క్షయ టీకా కార్యక్రమంలో అర్హులైన 60 సంవత్సరముల వయసు దాటిన వారు,చక్కెర వ్యాధిగ్రస్తులు,పొగ త్రాగువారు,శరీర ద్రవ్యరాశి 18 కన్నా తక్కువ ఉన్నవారు, టీబి రోగులతో సన్నిహితంగా ఉన్నవారు ఈ టీకా అందిస్తామని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.తనిఖీ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రంలోని రికార్డులను,ప్రగతి నివేదిక సూచికలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ టీకా కార్యక్రమం సంపూర్ణ విజయవంతం కావడానికి పలు జాగ్రత్తలపై సూచనలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప సమాచార శాఖ అధికారి బాబా ఫక్రుద్దీన్,జిల్లా నర్సింగ్ అధికారిణి వీరమ్మ, మండల వైద్యాధికారులు  భాను ప్రకాష్,కమల్ రోహిత్,ఆరోగ్య పర్యవేక్షకులు విజయ కుమారి, మురళి,ల్యాబ్ టెక్నీషియన్ నరేంద్ర,ఫార్మాసిస్ట్ వరలక్ష్మి, ఆరోగ్య,ఆశా కార్యకర్తలు నాగవేణి,బషీర,రాధ,అంజలి తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ దరఖాస్తులు చేసుకోండి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే16(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల కేంద్రంలో ఓడిచెరువు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (హైస్కూల్ ఫ్లస్)కో-ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలో(ఇంగ్లీష్ మీడియం)2024-24 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్ కోర్సులు యంపీసీ, బైపీసీ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు కే.శోభారాణి ప్రకటనలో తెలిపారు.పాఠశాల, కళాశాలలో ఉన్నత సదుపాయాలు కలిగిన తరగతి గదులు,ఐ.ఎఫ్,పిల ద్వారా ఆధునిక పద్ధతుల్లో బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే భోధన, విశాలమైన క్రీడా మైదానం, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ,వ్యక్తిత్వ వికాసం-శిక్షణ, లైబ్రరీ, డిజిటల్ విద్య సౌకర్యాలు కల్పించారని తెలిపారు.జూన్ 1వతేది నుండి తరగతులు ప్రారంభం కానున్నాయని ఆమె తెలిపారు.పదవ తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి