మన్యం వీరుడు అల్లూరికి ఘన నివాళులు
శ్రీసత్యసాయిజిల్లా07 (విజయస్వప్నం.నెట్)
మన్యం విప్లవవీరుడు గిరిజనుల విముక్తి కోసం తన ప్రాణాల్ని అర్పించిన తెలుగువారి గుండెల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాయలసీమ విద్యార్ధి యువజన సంఘం(ఆర్ఎస్ వైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కన్నెలూరు శంకర్ తెలిపారు.విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 100 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం కడప నగరంలోని ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ....స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్ల దొరలకు సింహస్వప్నంగా నిలిచిన పోరాట యోదుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు,స్వాతంత్ర్యం పొందటానికి సాయుధ పోరాటం ఒక్కటే అని నమ్మిన అల్లూరి.. తన పోరాట పటిమతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించారని,మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. కొన్నేళ్లపాటు సమరశీల ఉద్యమాలకు అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించారని,తనను నమ్ముకున్న ప్రజల కోసం,1919 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపైన ఉద్యమం మొదలు పెట్టిన అల్లూరి.. ఇరవై ఏళ్ల వయస్సు నిండకుండానే అడవి బాటపట్టారని,గిరిజనులపై సాగుతున్న బ్రిటీష్ అధికారుల దౌర్జన్యాలపై అల్లూరి తిరుగుబాటు చేశారన్నారు.కొద్దికాలంలోనే అల్లూరికి ప్రజల్లో ఆదరణ పెరిగిగిందన్నారు,ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు, రెండేళ్ళపాటు బ్రిటిషన్లకు కంటినిండా నిద్రలేకుండా గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు సంస్కృతం, విలువిద్య, గుర్రపుస్వారీలో మంచి ప్రావీణ్యం కలిగిన వీరుడని, ఆయన ఆశయానికి అనుగుణంగా విద్యార్థులు, యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు,నగర నాయకులు శ్రీనాథ్,సురేష్ పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
జనసంద్రంగా మారిన ఓడి చెరువు
ఎన్నికల రోడ్ షో లో తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పత్తి చంద్రశేఖర్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు07(విజయస్వప్నం.నెట్)
ఈఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డినీ ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి తోపాటు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ లతో కలిసి అయన మంగళవారం ఎన్నికల రోడ్ షో నిర్వహించారు.ఓడిచెరువు పంచాయతీలోని ఓడిచెరువు,అకుతోటపల్లి,వేమారెడ్డిపల్లి,బాబాసాహెబ్ పల్లి,మారేవాండ్లపల్లి గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఓడిచెరువు జనసంద్రంగా మారగా తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పత్తి చంద్రశేఖర్ కు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి అపూర్వ స్వాగతం పలికారు.ఈసందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దుష్ట పాలన సాగుతోందన్నారు. వైసీపీ అరాచక పాలనకు చమరగీతం పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని విమర్శించారు.తెదేపా అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీ అభ్యర్థి బీకే పార్ధసారధిని గెలిపించాలని,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మే13 వతేది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అమూల్యమైన తమ ఓటును తెదేపా అభ్యర్థుల సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెదేపా జనసేన బిజేపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్,మండల కన్వీనర్ జయచంద్ర,మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,ఎద్దుల ప్రమోద్ రెడ్డి,జన సేన మండల కన్వీనర్ మేకల ఈశ్వర్,బీజీపీ కన్వీనర్ రంగారెడ్డి,తెదేపా,జనసేన,బిజెపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఎన్నికల ప్రచారంలో దుద్దుకుంట కిషన్ రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే07(విజయస్వప్నం.నెట్)
మండలంలోని చింతమానుపల్లి పంచాయతీ అచ్చామియాపల్లి, నాయనవాపల్లి, కాటంరెడ్డిపల్లి, కమ్మవారిపల్లి, బొమ్మిరెడ్డిచెరువు గుర్రప్పగారిపల్లి, మల్లిమల్లొల్లపల్లి, మల్లెలవాండ్లపల్లి గ్రామాలలో మంగళవారం పుట్టపర్తి శాసన సభ్యులు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.గ్రామాలలో వైకాపా పాలనలో చేపట్టిన అబివృద్ధి,సంక్షేమాలతో పాటు జగనన్న మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారని, మే13వతేది ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా,బోయ శాంతమ్మని హిందూపురం ఎంపిగా భారీ మెజారిటీతో గెలిపించాలని,జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు,కార్యకర్తలు వైకాపా శ్రేణులు,అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. తిప్పేపల్లిలో దుద్దుకుంట శ్రీనివాసులురెడ్డి మండల పరిధిలోని తిప్పేపల్లిలో మంగళవారం పుట్టపర్తి శాసనసభ్యులు,వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసులురెడ్డి ఇంటింటా ప్రచారం చేపట్టి మే13వతేది వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని,ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మని భారీ మెజారిటీతో గెలిపించాలని, మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను అభ్యర్ధించారని వైకాపా శ్రేణులు తెలిపారు.ఈకార్యక్రమంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి