మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకొందాం
బుక్కపట్నం రోడ్ షోలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు
వైకాపా ప్రచారంలో ప్రముఖ సింగర్ నిర్మల రాథోడ్
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే10(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలంలో ఎన్నికల ప్రచార రోడ్ షో లో పుట్టపర్తి శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి,హిందూపురం లోకసభ అభ్యర్థి బోయ శాంతమ్మ పాల్గొన్నారు.ఈసందర్భంగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ....సత్య సాయిజిల్లా,మూడు జాతీయ రహదారులు సాధించుకున్నామని,864 కోట్లతో 193 చెరువులు నింపే కార్యక్రమానికి పనులు ప్రారంభించుకున్నామని,బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా 26వేల గృహాలు నిర్మించుకున్నామని,అందరి ఆశీస్సులతో పుట్టపర్తి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని,పేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా శ్రమిస్తున జగనన్నను మరోసారి ముఖ్యమంత్రినీ చేసుకోవాలని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వేయించి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి నీ ఎమ్మెల్యేగా బోయ శాంతమ్మ ఎంపీ గా గెలిపించాలని,జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు.ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ గాయని నిర్మల రాథోడ్ విచ్చేసి పాటలతో అలరించారు.స్థానిక ప్రజా ప్రతినిధులు,వైకాపా నాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైకాపాలో చేరిన బీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్ శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే10(విజయస్వప్నం.నెట్) ఓడిచెరువు మండలంలోని బాబాసాహెబ్ పల్లి గ్రామానికి చెందిన శ్రీసత్యసాయిజిల్లా బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఎమ్మెస్ షబ్బీర్ శుక్రవారం పుట్టపర్తి వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు. బీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు షబ్బీర్ తోపాటు ఓడిచెరువు పంచాయతీ గ్రామానికి చెందిన 30 వైకాపా కుటుంబాలు వైకాపాలోకి చేరగా వీరికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి వైకాపాలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.... వైకాపా పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షించాయని,సంక్షేమం,అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.మే13న వైకాపాకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుద్దామని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ పరిశీలన
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు(అమడగూరు)మే10(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండల కేంద్రంతోపాటు కొండకమర్ల పోలింగ్ కేంద్రాలను శుక్రవారం శ్రీసత్యసాయిజిల్లా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని,13వతేది పోలింగ్ రోజు నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.పోలింగ్ రోజు ఎవరైనా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిఐ రాజేంద్రనాధ్ యాదవ్,ఎస్ఐ వంశీకృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమడగూరులో ఎస్సీ చెక్పోస్ట్ లు తనిఖీలు.... మండలంలోని తుమ్మల, వెంకటనారాయణపల్లి, చినగానిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతోపాటు సమీపంలో చెక్ పోస్టులను శుక్రవారం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తనిఖీలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ....మే13న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా కర్ణాటక సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.ఈకార్యక్రమంలో నల్లమాడ సిఐ రాజేంద్రనాధ్ యాదవ్, ఎస్ఐ మగ్బుల్ బాషా,పోలీసులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం:తెదేపా ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే10(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి గడ్డపై ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించి, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకొందామని పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,యువనాయకుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఓడిచెరువు మండలం తంగేడుకుంట పంచాయతీలో శుక్రవారం తెదేపా,జనసేన,బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర ను గెలిపించాలని ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ముందుగా గ్రామ ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి అపూర్వ స్వాగతం పల్లె సింధూరరెడ్డికి పలికారు.ఈ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి,ఆమె భర్త పల్లెవెంకట కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.... పుట్టపర్తి నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరాలని,ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళినప్పుడు సైకిల్ గుర్తును మాత్రమే గమనించి మీ అమూల్యమైన ఓటును వేయాలని కోరారు.తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రగతి ఉంటుందన్నారు.చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తొలి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని కోరారు. ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెదేపా,జనసేన,బీజీపీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సినీ నటుడు నారా రోహిత్ ప్రచారం
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం నుండి సినీ నటుడు నారా రోహిత్ రోడ్డు షో నిర్వహించారు.మే13న సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని,హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్ధసారధిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రచారం చేపట్టిన్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.తెదేపా పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,జనసేన నాయకులు పత్తి చంద్రశేఖర్ బిజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
డీఐజీకి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) పుట్టపర్తి మే11(విజయస్వప్నం.నెట్)
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అనంతపురం రేంజ్ డీఐజీగా నియమితులైన షీముషి శ్రీసత్యసాయిజిల్లా కార్యాలయానికి శనివారం చేరుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి గౌరవ పూర్వకంగా స్వాగతం పలికారు.సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా భద్రత చర్యలపై సమీక్షించారు.ఏఎస్పీ విష్ణు,ఏఆర్ డిఎస్పీ విజయకుమార్,ఎస్బీ సిఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి, సైబర్ క్రైమ్ సెల్ సిఐ హేమాంత్ కుమార్,సిపీ రాఘవేంద్ర,ఏఆర్ ఎస్ఐలు వలి,రవికుమార్,ఎస్ఐ ప్రదీప్ కుమార్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఇతర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చు
:జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
పోలింగ్ రోజు 144 సెక్షన్: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి
శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి)మే11(విజయస్వప్నం.నెట్)
ఓటరు గుర్తింపు కార్డు లేకపోయిన ఇతర గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్ బాబు పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఓటరు జాబితాలో పేరుండి గుర్తింపు కార్డు లేకపోయిన ఆధార్, బ్యాంకు బుక్కు,డ్రైవర్ లైసెన్స్, పాన్ కార్డు 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి వున్నా ఓటు వేయచ్చన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.శనివారం సాయంత్రానికి మైక్,జెండాల ప్రచారానికి ముగిసిందని,12న ఆదివారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకొంటారని,13వతేది సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు.ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.... ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.11వతేది శనివారం సాయంత్రం నుండి 13 సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయించారని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలతో గట్టి బందోబస్తుతో నిఘా ఉంచామని ఆయన తెలిపారు.డిఆర్వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి