నిరుపేద కుటుంబానికి గ్యాస్ స్టవ్ వితరణ
శ్రీ సత్యసాయిజిల్లా పుట్టపర్తి(ఓడిచెరువు)మే20(విజయస్వప్నం.నెట్)
పశ్చిమ బెంగాల్ రాష్టం నుంచి గత రెండేళ్ల క్రితం వికలాంగులైన ఇద్దరి పిల్లల ఆపరేషన్ కి పుట్టపర్తికి వచ్చి,ఇక్కడే స్థిరపడి కూలిపనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబ సభ్యులు గ్యాస్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ షామీర్ స్పందించి తక్షణమే సాలమ్మ శివప్రసాద్ చౌదరి ద్వారా వివరాలు సేకరించి,ప్రశాంత్ గ్యాస్ ఏజెన్సీ చిన్నా అన్నని సంప్రదించగా ఆయన మానవత్వంతో స్పందించి నిరుపేద కుటుంబ సభ్యులకు గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు చేసి, గ్యాస్ స్టవ్,సిలిండర్ అందజేశారని తెలిపారు.నిరుపేద కుటుంబానికి సహాయపడాలనే సేవభావంతో స్పందించిన సాలమ్మ శివ ప్రసాద్ చౌదరికి కృతజ్ఞతలు తెలుపుతూ.... సహకరించిన చిన్నాకి,మిత్రులకు ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు,పేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
$$$__________@@@__________$$$
ఓడిచెరువులో వర్షం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే20(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలో సోమవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. తుమ్మలకుంట్లపల్లి గ్రామంలో కురిసిన వర్షానికి మారెమ్మ ఆలయం వద్ద రోడ్డుపై పొంగిపొర్లి,కుంటల్లో నీరు చేరడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా ఎండవేడిమికి అల్లాడిపోతున్న ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుందని మండలవాసులు పేర్కొన్నారు.
$$$__________@@@__________$$$
అక్కదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే20(విజయ స్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీసోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీఅక్కదేవతల ఆలయంలో వైశాఖ మాస సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారని పూజారి వెంకటేష్ తెలిపారు.
$$$__________@@@__________$$$
అల్లాపల్లిలో జూ"ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే20(విజయస్వప్నం.నెట్)
మండలంలోని అల్లాపల్లి పంచాయతీ పగడాలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు.ముందుగా ఎన్టీఆర్ అక్షరాలతో రూపొందించిన కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అభిమానులు త్రిలోక్,రంజిత్,తరుణ్,హరి తదితరులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి