నేడు కదిరిలో శ్రీనరసింహస్వామి జయంతి ఉత్సవం
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మే21 (విజయస్వప్నం.నెట్)
నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్తప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వెలసిన క్షేత్రము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం కదిరి పట్టణంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నేడు శ్రీనరసింహస్వామివారి జయంతి సందర్భముగా శ్రీవారి ఆలయములో వివిధ రకముల పుష్పాలు, మామిడికాయలు, ద్రాక్ష పండులతో ప్రత్యేకంగా అలంకరించి,అలయములో విద్యుత్ అలంకరణతో ఉత్సవాలను నిర్వహించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మంగళవారం తెలిపారు.శ్రీస్వామివారి జయంతి సందర్భంగా నేడు(బుధవారం)సాయంత్రం 6.30 గంటల నుండి శ్రీస్వామి వారు విశేష ఆలంకారణములతో శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతముగా వసంతవల్లభుల తిరుమాడవీధుల గుండా ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంటూ.... ఆలయంలో స్వామివారి జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు పిలుపునిచ్చారు.
$$$__________@@@__________$$$
గ్రామాల్లో ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవు
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు (ఓడిచెరువు) మే21 (విజయస్వప్నం.నెట్)
జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ మగ్బుల్ బాషా, ఓడిచెరువు ఎస్ఐ వంశీకృష్ణ, నల్లమాడ ఎస్ఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బందితో కలిసి మండలంలోని తుమ్మల,మలకవారిపల్లి, ఎగువతాండ,దిగువ తాండా తదితర గ్రామాల్లో మంగళవారం కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామాల్లో అలజడులు సృష్టించిన, ఘర్షణలకు పాల్పడిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని, ఆయా గ్రామాల్లో అలజడులు, ఘర్షణలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మగ్బుల్ బాషా హెచ్చరించారు. 144 సెక్షన్ కొనసాగుతుందని, సమస్యాత్మక గ్రామాల్లో ఎవ్వరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే.... పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు ఏలాంటి గొడవలకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. మద్యం, నిషేధిత మత్తు పదార్థాలు క్రయవిక్రయాలు నిర్వహించే వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈసందర్భంగా హెచ్చరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి