చంద్రబాబుతోనే.... ప్రజా సంక్షేమం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే05(విజయస్వప్నం.నెట్)
తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని పుట్టపర్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లి,మలకవారిపల్లి, ఎంబి క్రాస్,నందివారిపల్లి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడు హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు అవకాశాలు కల్పించారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుతోనే రాష్ట్రం పురోభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని, చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్,భవిష్యత్తుకు గ్యారంటీ మానిఫెస్టో పధకాలను వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డికి గ్రామాల్లో నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పూలు చల్లి ఘనంగా స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో తెదేపా, జనసేన,బిజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
ఘనంగా అయ్యప్ప ఆలయ విగ్రహ వార్షికోత్సవ పూజలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే05(విజయంస్వప్నం.నెట్)
మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపైన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు ఆధ్వర్యంలో 12వ ఆలయ స్థాపన వార్షికోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.12 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం చేపట్టగా,గత యేడాది అయ్యప్పస్వామి మూల విరాట్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.తెల్లవారుజామున నుండి వినాయక, సుబ్రహ్మణ్యం,శ్రీలక్ష్మీసింహ స్వామివారికి ఉపాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారికి పాలు,పెరుగు,నెయ్యి,తేనె, పసుపు,కుంకుమ,విభూధి,పంచఫలాల పంచామృతం,సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పూజలు నిర్వహించి,స్వామివారి మూలవిరాట్ విగ్రహానికి పట్టు వస్త్రం,వివిధ పుష్పాలతో అలంకరించి,ధూపదీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి నీరాజనాలతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.12వ ఆలయ స్ధాపన,ప్రధమ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
$$$__________@@@__________$$$
వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే05(విజయంస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలోని మామిళ్ళకుంటపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా,దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని స్థానిక వైకాపా నాయకులు,కార్యకర్తలు ఆదివారం సాయంత్రం నుండి ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని వారు కోరారన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తొట్లి రంగారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీదేవి,మాజీ సర్పంచలు చింతా కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి,మాజీ సొసైటీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి,వైకాపా నాయకులు బయపరెడ్డి,ఈశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి,తేజ, బాలకృష్ణారెడ్డి,జగారెడ్డి,సతీష్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
స్మశాన వాటికలో తోటకు నిప్పు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే05(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలోని ఓడిచెరువు పంచాయతీ గ్రామ ముస్లిం స్మశాన వాటిక ఆవరణలో తోటకు గుర్తు తెలియని వ్యక్తులు(ఆకతాయిలు) నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధం అయినట్లు ఆదివారం నిర్వాహకులు హుస్సేన్ విలేకరులకు తెలిపారు.కొబ్బరిచెట్లు,అల్లనేరడు చెట్లు,డ్రిప్పు సామాగ్రి కాలి బూడిద అయ్యాయని,3 ఎకరాల్లో దాదాపు వంద చెట్లకు పైగా మంటల్లో కాలిపోవడంతో రూ,1.80 లక్షలు నష్టం వాటిల్లిందని ముస్లిం సోదరులు తెలిపారు.మంటలు అంటున్న సమాచారంతో స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.అల్లనేరడు చెట్లు పూత దశలో వున్నాయని, మంటల్లో కాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, నిప్పు పెట్టిన ఆకతాయిలను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ముస్లిం సోదరులు కోరుతున్నారు.
$$$__________@@@__________$$$
వైకాపాకు శెట్టివారి రమేష్ రాజీనామా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే05(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తంగేడుకుంట పంచాయతీ గ్రామానికి చెందిన శెట్టివారి రమేష్ కుమార్ వైకాపా సభ్యత్వానికి,మండల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం తెలిపారు.గ్రామస్ధాయి నుండి మండల వ్యాప్తంగా వైకాపా బలోపేతానికి కృషి చేసినట్లు పేర్కొంటూ.... రాజీనామా పత్రాలను ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ త్వరలో తెలిజేయనున్నట్లు ఆయన తెలిపారు.
$$$__________@@@__________$$$
టిడిపి అధికారంలోకి రాగానే రైతులకు ఏటా 20వేల పంట పెట్టుబడి ఆర్థిక సాయం అందజేస్తాం:
పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే06(విజయస్వప్నం.నెట్)
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 20వేలరూపాయలు పంట పెట్టుబడి సాయం ద్వారా అందిస్తామని పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా, జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.సోమవారం ఓడిచెరువు మండలంలోనీ వెంకటాపురం,తుమ్మల కుంట్లపల్లి, ఇనగలూరు పంచాయతీ గ్రామాల్లో ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ముందుగా నారప్పగారిపల్లి గ్రామదేవత మారెమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు.ఆమెకు స్థానిక ప్రజలు పూల వర్షం కురిపిస్తూ బాలసంచా పేల్చి మహిళలు హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు.యువకులు మహిళలు ఎన్నికల ప్రచారంలో నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.... ఎక్కడ చూసినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని తెదేపాకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని అన్నారు.రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే తెదేపా అధికారంలోకి రావాలన్నారు.సాగునీరు, త్రాగునీరు తీసుకురావడమే తెదేపా ధ్యేయమన్నారు.తెదేపా అధికారంలోకి రాగానే కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రతి ఏటా పంట పెట్టుబడి సాయం కింద 20వేల రూపాయలను తెలుగుదేశం ప్రభుత్వం అందజేస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న 193 చెరువులను నింపే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటానని ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని,అందుకు హిందూపురం పార్లమెంటు తెదేపా అభ్యర్థి పార్థసారథి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి పల్లె సింధూరమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల తెదేపా,జనసేన,బిజెపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
మాజీమంత్రి పల్లె సమక్షంలో తెదేపాలోకి చేరిక
ఓడిచెరువు మండలంలోని వెంకటాపురం పంచాయతీ మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి, ఆయన కుమారుడు మోహన్ రెడ్డి, రామిరెడ్డిపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి,గంగిరెడ్డితో పాటు పది కుటుంబాలకు చెందిన వైకాపా నాయకులు,కార్యకర్తలు సోమవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరినట్లు తెలిపారు.పార్టీలో చేరిన వారికి మాజీమంత్రి పల్లె కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మే13 వతేది జరిగే ఎన్నికల్లో తెదేపా సైకిల్ గుర్తుకు ఓటు వేసి హిందూపురం పార్లమెంట్ తెదేపా అభ్యర్థిగా బికే పార్థసారథిని, పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
$$$__________@@@__________$$$
శబరిమలలో 80 వేల మంది భక్తులకు దర్శనం సరైంది కాదు....!
టీడిబీ నిర్ణయం ఉపసంహరించుకోవాలి..!!
ఏబిఏపీ రాష్ట్ర అధ్యక్షులు హరిప్రసాద్ అభ్యర్ధన
శ్రీసత్యసాయిజిల్లా(అనంతపురం)మే06(విజయస్వప్నం.నెట్)
శబరిమలలోని స్పాట్ బుకింగ్ సదుపాయాన్ని నిలిపివేసేందుకు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా ప్రతి రోజు ఎనభై వేల(80వేల భక్తులకు)మందిని పరిమితం చేసిన తిరువాంకూర్ దేవ్‌స్వామ్ బోర్డు (టీడీపీ)చర్యపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు హరిప్రసాద్ బెల్లపు సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు.కేరళ పోలీసులు గతంలో ప్రవేశపెట్టిన వర్చువల్ క్యూ సిస్టమ్‌ను గత ఏడాది టీడిబీ స్వాధీనం చేసుకుందని,ఇది టీడిబీ మరియు కేరళ పోలీసుల మధ్య చాలా అపార్థాన్ని సృష్టించిందని,ఇది 12 నుండి 18 గంటల పాటు వేచి ఉండే అయ్యప్ప భక్తులకు చాలా ఇబ్బందులకు గురి చేసిందని,ఇది వర్చువల్ క్యూ సిస్టమ్ యొక్క ఉద్దేశ్యాన్నే దెబ్బతీసిందని, అంతేకాకుండా కొండ ప్రాంతంలో క్యూలో ఉన్నప్పుడు ఆహారం,నీరు కూర్చోవడానికి స్థలం తదితర సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు,పిల్లలు,వృద్ద మహిళ భక్తులు ఎదుర్కొంటున్న కష్టాలు చాలా అధికంగా ఉన్నాయని,తిరుపతి క్యూ వ్యవస్థను శబరిమలతో పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు.తిరుపతిలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాల బోర్డులు అందజేస్తున్నాయని,క్యూలైన్లలో నిలబడిన భక్తులకు ఆహారం,నీరు,మరుగుదొడ్లు పిల్లలకు పాలు మొదలైన సదుపాయాలు తితిదే కల్పిస్తున్నాయని,కానీ శబరిమలలో నీరు కూడా ఇవ్వడానికి వ్యవస్థ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మండల మకరవిల్లకు పండుగ మూడు నెలల ముందు స్లాట్‌లు తెరవడం మరియు స్పాట్ బుకింగ్ లేకుండా చేయడం వంటి తాజా ప్రకటన రహస్య ఎజెండాతో కూడిన వ్యూహంగా కనిపిస్తుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.ఏలాంటి అధ్యయనం లేకుండా గురుస్వాములతో చర్చ లేకుండా ఈ తుగ్లక్ రాజ్ నిర్ణయాలను ఎవరు అంగీకరించరని,ఈ విధానం మొత్తం వాతావరణాన్ని పాడుచేసి మరో శబరిమల రక్షణ ప్రచారానికి దారి తీస్తుందని,శబరిమల వర్చువల్ క్యూ సిస్టమ్‌ను ప్రవేశపెట్టకముందే శబరిమలలో భారీ సంఖ్యలో రద్దీని చూసిందని,అయ్యప్ప భక్తులకు పెద్దగా ఇబ్బందులు లేకుండా అంతా బాగానే జరిగిందని,ఈ కొత్త నిర్ణయం వినాశకరమైన మార్గాలను తీసుకురాబోతుండగా, తక్షణమే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉందని,క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ఒక నిర్ణయానికి రావడానికి దక్షిణాది రాష్ట్రాలలో కొన్ని సమావేశాలు నిర్వహించి, శబరి యాత్రకు సంబంధించి ఏకాభిప్రాయానికి
అందరితోనూ చర్చించి శాస్త్రీయ అధ్యయనం జరపాలని టీడిబీని అభ్యర్థించారని ఆయన ఈసందర్భంగా తెలిపారు.
$$$__________@@@__________$$$
నేడు చింతమానుపల్లిలో దుద్దుకుంట కిషన్ రెడ్డి ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే06(విజయస్వప్నం.నెట్)
నేడు 7వతేది(మంగళవారం)చింతమాను పల్లి పంచాయతీలోని అచ్చామియ పల్లి,నాయనవారి పల్లి,కాటం రెడ్డిపల్లి,కమ్మవారిపల్లి,బొమ్మిరెడ్డిచెరువు,గుర్రప్పగారిపల్లి,చింతమానుపల్లి,మళ్ళిమల్లొల్ల పల్లి,మల్లెలవాండ్ల పల్లిలో శాసనసభ్యులు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని,
కావున ఈ కార్యక్రమానికి ఎంపీపీలు,జడ్పీ సభ్యులు, కన్వీనర్లు,సర్పంచులు,ఎంపీటీసీలు,వైస్ ఎంపీపీలు, వార్డు సభ్యులు,మండల జేసిఎస్ కన్వీనర్లు,సచివాలయ కన్వీనర్లు,మండల,బూత్ కమెటీ కన్వీనర్లు, ఏజెంట్లు, సింగల్ విండో అధ్యక్షులు,ఇతర ప్రజా ప్రతినిధులు,వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు, డీలర్లు, అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు, గృహ సారథులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని వైకాపా శ్రేణులు కోరారు. తిప్పేపల్లిలో దుద్దుకుంట వాసు పర్యటన మండలంలోని తిప్పేపల్లి పంచాయతీ గ్రామాల్లో నేడు మంగళవారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసులురెడ్డి(వాసు) ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని,మండల వ్యాప్తంగా వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని వైకాపా శ్రేణులు కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి