google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : అక్రమంగా మద్యం,నగదు నిల్వపై సమాచారం అందించండి

2, మే 2024, గురువారం

అక్రమంగా మద్యం,నగదు నిల్వపై సమాచారం అందించండి

 అక్రమంగా మద్యం,నగదు నిల్వపై సమాచారం అందించండి

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి మే01(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయి జిల్లాఎన్నికల నిఘా వేదిక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ....

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మద్యం సేవించే వారు, ఓటును అమ్ముకునేవారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నిర్ణయించకూడదన్నారు.భవిష్యత్తు తరాల భవితవ్యం మందుబాబుల చేతుల్లో ఉండరాదని ఓటును అమ్ముకునే వారు ప్రభుత్వాలను నిర్ణయించరాదని ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమం అభివృద్ధి,ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే నాయకులను ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకునే అవకాశం కోల్పోకూడదని బాధ్యతగల పౌరులందరూ జిల్లావ్యాప్తంగా అక్రమ మద్యం,నగదు ప్రలోభాలకు గురి చేస్తూ.... ఎవరైనా ఓటర్లను కొనుగోలు కోసం నిలువ ఉంచినట్లయితే 9963163232, 9581237146 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందివ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని. ఎలాంటి వారి ఒత్తిళ్లకు కూడా లొంగకుండా నగదు,మద్యం పంపిణీ నివారించుటకు, ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా ఓటర్లను మభ్యపెట్టిన బెదిరించిన అలాంటి వారికి భరోసాగా ఉండగలమని,ఎన్నికల నిఘా వేదిక ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఈసందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

వడ్డెర్ల సంక్షేమమే తెదేపా ధ్యేయం: మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే01(విజయస్వప్నం.నెట్)

ఒడిసి మండల కేంద్రంలో పుట్టపర్తి నియోజకవర్గ  ఓడిచెరువు మండల కేంద్రంలో బుధవారం వడ్డెర సోదరులు నిర్వహించిన వడ్డెర్ల ఆత్మీయ సమావేశానికి పుట్టపర్తి నియోజకవర్గం తెదేపా ఇంఛార్జి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డేరుల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తోందని,వారికి ఉపాధి,రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఓడిచెరువు,ఆమడగూరు వైకాపా నాయకులు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరిక

పుట్టపర్తి నియోజకవర్గం లో రోజురోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసక బారుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కడుగట్టిన కార్యకర్తలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా బుధవారం ఓడి చెరువు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమడుగురు మండలం బావాజీ కొత్తపల్లి కి చెందిన 20 కుటుంబాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపి కండువా కప్పుకుని వాటికీ తీర్థం పుచ్చుకున్నారు. అమ్మడు ఊరు మండలానికి చెందిన ఈశ్వర్ రెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి ఆదిలక్ష్మి పెద్దక్క, బాలమ్మ చిన్న నాగమ్మ రమణప్ప ఉమాదేవి రాజ్ కుమార్ వినోద్ కుమార్ లక్ష్మన్న నగేష్ బాబు రమణ చిన్నప్పయ్య తో పాటు పలువురు టిడిపిలో చేరారు.అలాగే ఓడిచెరువులో వైకాపాకి చెందిన మోపురి శంకరాచారి, బోనాల శేఖర్, నటరాజ్, మునయ్య, నాగరాచారిలు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుని పార్టీలోకి చేరారు. పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లి సింధూర రెడ్డి గెలుపు కోసం శాయా శక్తుల  పనిచేస్తామని వారి పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

ఘనంగా మే డే వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మే01(విజయస్వప్నం.నెట్)

మండల సిపిఐ నాయకులు బుధవారం మేడే సందర్భంగా మండలంలోని సిపిఐ కార్యాలయం ప్రదేశంలో జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు,సిపిఐ మండల కార్యదర్శి చలపతినాయుడు మాట్లాడుతూ....ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే 138వ మేడే కార్మికుల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.చికాగో నగరంలో 18 గంటల పనిదినాన్ని వ్యతిరేకస్తూ 8 గంటల పనిదినం కోసం కార్మికుల ఉద్యమాల సాధనతో  మేడేగా ఏర్పడిందని,అప్పటినుంచి కార్మికుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతంగా....శ్రమదోపిడీపై పోరాడి కార్మిక చట్టాలుగా ఏర్పాటు చేసి ప్రపంచకార్మికుల లారా ఏకం కాండీ అనే నినాదంతో వివిధ దశల్లో పోరాటాలు చేసి సాధించినట్లు పేర్కొన్నారు.ప్రసుత్తం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలను లేకుండా చేస్తున్నాయన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44చట్టాలను రద్దు చేసి 4 విధాలుగా విభజించి కార్మికులకు అన్యాయం చేస్తున్నాడని, కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలపై మరో పోరాటానికి కార్మికులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు సుధాకర, రవి, గంగులప్ప, వెంకటేష్, రవణప్ప, వెంకరమణ, ఆదిలక్ష్మి, లక్ష్మినారస్సు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తెదేపా నుండి వైసీపీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో చేరికలు


పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలంలోని ఇనగలూరు పంచాయితీ పరిధిలోని బోడెద్దులవాండ్ల పల్లి గ్రామంలో తెదేపాకు చెందిన 20 కుటుంబాలు బుధవారం పుట్టపర్తి ఎమ్మెల్యే  కార్యాలయంలో పుట్టపర్తి శాసనసభ్యులు, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైకాపాలోకి చేరారు. వైకాపాలోకి చేరిన వారిలో లక్ష్మీనరసింహ, రవి, కిష్ట, వెంకటరమణనాయుడు, రవి, ఎం.వెంకటరమణ, శివకుమార్, నవీన్, కిష్టప్ప, శేఖర్, రామాంజనేయులు, నాగరాజు తదితరులు శ్రీధర్ రెడ్డి  సమక్షంలో వైకాపాలోకి చేరారు. వారికి శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న పాలనలో మీ ఇంట్లో మంచి జరిగివుంటే.... మే13వతేది వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేపట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు సూచించినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి