26, డిసెంబర్ 2023, మంగళవారం

 RDO భాగ్యరేఖ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు

26 డిసెంబరు, ఓబులదేవరచేరువు, ఎం.కొత్తపల్లి - మండల కేంద్రం ఎం.కొత్తపల్లి బంగారు కొండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం సందర్బంగా సోమవారం పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ మండల కేంద్రానికి విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలు ఉభయదారులు సమర్పించి పూజలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమె మాట్లాడుతూ శ్రీమణికంటస్వామివారికి ఎక్కడాలేని విధంగా రథోత్సవం జరిపి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం శుభపరిణామామని, శ్రీ అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించిన ఆలయ నిర్మాణ సంకల్పకులు పచర్ల ఆంజనేయులు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణ సంకల్పకులు పచర్ల ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ ప్రతియేటా అయ్యప్పస్వామివారికి జిల్లా రెవిన్యూ అధికారుల ద్వారా పట్టువస్త్రాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుందని, నవరాత్రి ఉత్సవాలు అయ్యప్ప బ్రహ్మోరథోత్సవం, కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ బి. మల్లికార్జునరెడ్డికి, మండల భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు










 ఎంతో వైభవంగా అయ్యప్పస్వామి రథయాత్ర

25 డిసెంబరు, అనంతపురం - శ్రీ సత్యసాయి జిల్లా, ఓబుఓదెవరచేరువు - మండలంలోని ఎం కొత్తపల్లి బండపైన వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి వార్షికోత్సవం రథయాత్ర వైభవంగా జరిగింది.ఉదయాన్నే ఆలయ సంకల్పకులు ఆంజనేయులు నాయుడు ఆలయంలో అన్ని పూజ అభిషేకాల అనంతరం పూలమాలలతో కనులవిందుగా అలంకరించిన రథంలో స్వామివారి పంచాలోక విగ్రహాన్ని కొలువుదీర్చు వైభవంగా రథయాత్ర కొనసాగించారు.. అయ్యప్పస్వాములు ఊరిలోనిభక్తుల మధ్యలో అయ్యప్ప నామస్మరణతో రధోత్సవం సాగింది.అనంతరం ఆలయప్రాంగణంలో అన్నదాన కార్యక్రమంతో ఆలయ వార్షికోత్సవం పూర్తిఅయ్యింది








































24, డిసెంబర్ 2023, ఆదివారం

Kadir sri Khadri narasimha swami darshanam

ఘనంగా ముక్కోటి ఏజదాశి వేడుకలు

ఉత్తర గోపురం వద్ద దర్శనం ఇచ్చిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు


అనంతపురం జిల్లా కదిరి - శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం లో 2023 ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన స్వామి వారు ఉత్తర ద్వారంలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ పర్వదినాన దర్శనం కోసం ఎంతో దూరాల నుండి భక్తులు వచ్చారు... రద్దీ పెరగడం తో ఆలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది కలిసి కొన్ని కట్టుదిట్టమైన జాగతలు తీసుకొని భక్తులకు అన్ని వసతులని ఏర్పాటు చేశారు. ముక్యంగా ఉత్తర ద్వారం దెగ్గర స్వామి వారి దర్శనానికి అలంకరణ, మరియు దర్శనానికి భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్రాలనుంది కూడా ప్రజలు వచ్చి స్వామి వారిని దర్శించి తరించారు









23, డిసెంబర్ 2023, శనివారం

Vadaanya Jana Society Talent test December 17 2023


శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువు లో వదాన్య జన సొసైటీ ఆద్వర్యం లో విద్యార్థులకొరకు నిర్వహించిన ప్రతిభా పరీక్ష కొరకు జిల్లా నలుమూలల విద్యాలయాల నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు ఆయిన వారికి మంచి పారితోషకం ఉండటంతో విద్యార్థులు తమ ప్రతిభను చూపడానికి ఉత్సాహంగా హాజరు అయ్యారు




వదాన్య జన సొసైటీ ఆద్వర్యంలో కొత్తచెరువులోని జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మరియు జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన ప్రతిభా పరీక్ష కొరకు తమ ప్రతిభను చూపడానికి విద్యార్థి, విద్యార్థినుల ఉత్సాహంగా హాజరు అయ్యారు. పరీక్ష కొరకు విద్యార్థులనుంది ఎటువంటి రుసుము తీసుకోకుండా నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా పారితోసకం ప్రకటించబడింది. మొదటి 30 ర్యాంకుల వారికి బహుమానములు ప్రకటించారు. అందులో మొదటి ర్యాంకు పొందిన వారికి రూ15,000గాను రెండవ ర్యాంక్ రూ12,000గాను మూడు రూ10,000 నాలుగు నుంచి ఎనిమిది కి రూ5,000గాను 9 నుంచి 15 రూ2,500గాను 15 నుంచి 25 వరకు రూ2,000 తదుపరి రూ1,500 గాను ప్రకటించారు

3, డిసెంబర్ 2023, ఆదివారం

  ఓబుళదేవరచెరువు  అయ్యప్పస్వామి దీక్షలు -భక్తులకు మోక్షమార్గాలు 

కేరళ శబరిమల అయ్యప్పస్వామివారి సన్నిధానం నుంచి విచ్ఛేసిన మేల్ తాంత్రీ ఐదుగురు (ప్రధాన అర్చకులు), శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామివారి దేవస్థానంలో కేరళ సంప్రదాయం మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు. 



మాలధారణలో వున్న అయ్యప్ప స్వాములు మేల్ తాంత్రీకులకు ఆహ్వానించుచున్న సమయమున భారీగా వర్శము వల్ల  అన్తరాయము ఎర్పడినది 


ఓబుళదేవరచెరువు అయ్యప్పస్వామి ఆలయానికి విచ్చేసినకేరళ ప్రధాన అర్చకులు









r