RDO భాగ్యరేఖ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు
26 డిసెంబరు, ఓబులదేవరచేరువు, ఎం.కొత్తపల్లి - మండల కేంద్రం ఎం.కొత్తపల్లి బంగారు కొండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయంలో 11వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవం సందర్బంగా సోమవారం పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ మండల కేంద్రానికి విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలు ఉభయదారులు సమర్పించి పూజలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆమె మాట్లాడుతూ శ్రీమణికంటస్వామివారికి ఎక్కడాలేని విధంగా రథోత్సవం జరిపి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం శుభపరిణామామని, శ్రీ అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించిన ఆలయ నిర్మాణ సంకల్పకులు పచర్ల ఆంజనేయులు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణ సంకల్పకులు పచర్ల ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ ప్రతియేటా అయ్యప్పస్వామివారికి జిల్లా రెవిన్యూ అధికారుల ద్వారా పట్టువస్త్రాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుందని, నవరాత్రి ఉత్సవాలు అయ్యప్ప బ్రహ్మోరథోత్సవం, కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ బి. మల్లికార్జునరెడ్డికి, మండల భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి