30, ఏప్రిల్ 2024, మంగళవారం

సింహా వాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం

సింహా వాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం 7వరోజు కొలిమిరాళ్ళపల్లి గ్రామ వాస్తవ్యులు కీ"శే" కడగట్టు సావిత్రమ్మ, సుబ్బారెడ్డి,భాస్కర్ రెడ్డి వీరి జ్ఞాపకార్థం జెడ్పీటీసీ కడగట్టు కవిత శివశంకర్ రెడ్డి, వరుణ్ తేజ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి,పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించిన సింహా వాహనంపై రాత్రివేళ  గ్రామ పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు,గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి బ్రహ్మోత్సవ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నదాన, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పలువురు తెదేపా నుండి వైకాపాలోకి చేరిక    


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు(పుట్టపర్తి) ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయితీ గ్రామాల తెదేపాకు చెందిన 27కుటుంబాలు  పుట్టపర్తి శాసనసభ్యులు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  సమక్షంలో వైకాపాలోకి చేరారు.

వైకాపాలోకి చేరిన వారిలో చిట్టిబాబు, వెంకటలక్ష్మి, రామ్ లక్ష్మమ్మ, గాయత్రి భాయ్, వసంత భాయ్, సావిత్రిబాయి, లక్ష్మీదేవి, మహేష్, రియాజ్ అహ్మద్, రషీద్ అబ్దుల్, హైదర్ వలీ, ధర్మవరం రాజా, షేక్షా తదితరులు వున్నారు. చేరిన వారికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి వైకాపాలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఎమ్మెల్యేగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవాలి

కడప పట్టణ అమీన్ పీర్ దర్గా లో మండోజీ ఆరీఫ్ ప్రార్థన

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

సార్వత్రిక ఎన్నికల్లో శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని సోమవారం కడప పట్టణంలో అమీన్ పీర్ దర్గాలో ఓడిచెరువు పంచాయతీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షులు మండోజీ ఆరీఫ్ ఖాన్ ప్రార్థనలు చేశారని విజయస్వప్నం ప్రతినిధికి తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ....పరమ పవిత్రమైన ఆథ్యాత్మిక పుణ్యభూమిలో వెలసిన అమీన్ పీర్ దర్గా ప్రశాంతత నిలయమని,ఎందరో మహానుభావులు నడియాడిన పుణ్యశిఖరమని,భక్తుల కొంగు బంగారంగా,మతసామరస్యానికి,జాతీయ సమైక్యతను చాటి చెప్పే అమీన్ పీర్ దర్గాలో  సమస్యలు చెప్పుకుని ప్రార్థనలు చేస్తే అన్ని నెరవేరుతాయని విశ్వాసంతో కడప పట్టణంలో సందర్శించి పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అఖండ విజయం సాధించాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.    జగనన్న సీఎం కావడం ఖాయం          2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అఖండ విజయం సాధించి మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలౌకి రావడం ఖాయమని ఓడిచెరువు పంచాయతీ గ్రామ వైకాపా అధ్యక్షులు మండోజీ ఆరీఫ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగనన్న సారధ్యంలో వైకాపా ప్రభుత్వంలో ఎవ్వరి ప్రమేయం లేకుండా,అవినీతికి చోటు లేకుండా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నవరత్నాలు, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి అందించి పేదప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని,రాష్ట్రంలో వైకాపా అత్యధిక స్థానాల్లో గెలుపొంది జగనన్న సీఎం కావడం ఖాయం అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

$$$__________@@@__________$$$

పల్లె సింధూరమ్మ ను ఆశీర్వదించండి l

 సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి 

 చంద్రన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం

 ఎన్నికల ప్రచారంలో యువ నేత పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి పల్లె సింధూరమ్మను గెలిపించాలని టీడీపీ యువ నాయకుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓడిచెరువు మండలంలోని డబురువారిపల్లి పంచాయతీ కుసుమవారిపల్లి,మామిళ్ళకుంట్లపల్లి పంచాయతీలోని ఎం.కొత్తపల్లి,వడ్డివారిపల్లి,తోట్లిపల్లి  గ్రామాల్లో తెదేపా అభ్యర్థి పల్లె సింధూర గెలుపుకు మద్దతుగా సోమవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.యువనేత పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి గ్రామస్తులు పూలు చల్లి కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పల్లె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి తెదేపా ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెదేపా విజయం ఖాయమన్నారు.ఈ ఐదేళ్ల వైకాపా పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని విమర్శించారు.పుట్టపర్తి గడ్డపై తెదేపా జెండా ఎగురవేసి అమరావతిలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓడిచెరువు మండల తెదేపా,జనసేన,బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 టీడీపీ ప్రచారంలో కవ్వింపుకలకు దిగిన వైసీపీ నేతలు 

 వైసీపీ ప్రచార రథాన్ని అడ్డుపెట్టి టీడీపీని ఆపగలరా 

 మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి 

పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా టిడిపి యువనేత పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తుండడంతో వైసిపి నాయకులు వైసిపి ప్రచార రతాన్ని అడ్డుపెట్టి కవ్వింపులకు దిగడం మంచిది కాదని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హెచ్చరించారు.

వైసీపీ రెచ్చగొట్టడం వల్లే వివాదం 

 టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ ప్రచార రథాన్ని టీడీపీ కార్యకర్తల ముందు అదే పనిగా తిప్పి అదే పనిగా రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ఇలా పదే పదే రథాన్ని తిప్పవద్దని టీడీపీ కార్యకర్తలు చెప్పినా వినకుండా అదే పనిగా పలు మార్లు అడ్డుగించి కవ్వింపు చర్యలకు దిగడంతో ఈ వివాదం చెలరేగిందన్నారు.

 దీంతో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకొని టీడీపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. దీంతో అక్కడ ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదం పెద్దది కావడంతో పోలీసులు వచ్చి ఇరుపార్టీలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. 

అయితే వైసీపీ పెద్దల జోక్యంతో రాజకీయ డ్రామా మొదలైంది.  వైసీపీ నేతలు నుంచి పోలీసులకు తీవ్ర ఒత్తిళ్లు రావడం టీడీపీ కార్యకర్తల్ని  మాత్రమే పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. ఈ వివాదంపై మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి స్పందించి వైసీపీ వారు కవ్వింపులకు దిగడంతో ఈ వివాదం చెలరేగిందన్నారు . టీడీపీ కార్యకర్తల్నే ఏక పక్షంగా పోలీసులు ఇబ్బంది పెట్టడం సరైన చర్య కాదని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అశ్వవాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం - భజన కళాకారుడు శ్రీధర్ నాయుడు మృతి - పరారీలో బ్యాంకు మేనేజర్ చెన్నై లో అరెస్ట్

అశ్వవాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం 6వరోజు కీ"శే" యర్రంరెడ్డి,కీ"శే"చిన్నమ్మ,కీ"శే"వెంకటరెడ్డి వీరి జ్ఞాపకార్థం పి.ఆశ్వర్థమ్మ,పిఎల్ఎ‌స్ రెడ్డి కొలూరు పి.రామిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి,పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించిన అశ్వవాహనంపై రాత్రివేళ  గ్రామ పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు,గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి బ్రహ్మోత్సవ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నదాన,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈకార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

 తెదేపాతోనే యువతకు ఉపాధి అవకాశాలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)

తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కియా లాంటి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని,తెదేపాతోనే యువతకు ఉపాధి అవకాశాలు సాధ్యమని ఆదివారం చింతమానుపల్లి పంచాయతీ గ్రామాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి మద్దతుగా పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.తెదెపా అధికారంలోకి వస్తేనే అన్ని రంగాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని,పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోభివృద్ధి సాధ్యమని ఆయన ప్రచారం చేపట్టి ప్రజలకు వివరించారు.ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

భజన కళాకారుడు శ్రీధర్ నాయుడు మృతి


శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మార్చి28(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మండలం  రాసినపల్లి గ్రామానికి చెందిన భజన కళాకారుడు శ్రీధరనాయుడు ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీసత్యసాయిజిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు ఎం.నారాయణ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ కళాకారుడు శ్రీధర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో గ్రామ భజన సంఘం పేరు నమోదు చేయించి,ఇప్పటికి ఐదుమార్లు తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం అఖండములో హరినామ సంకీర్తన భజన కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు నిర్వహించి, స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురికి అందుబాటులో ఉంటూ సహకరించేవారన్నారు.హరినామ సంకీర్తన భజన గీతాలు ఆలపించడమే కాకుండా  ప్రతివ్రత శిరోమణి,సాసవ చిన్నమ్మ తల్లి చరిత్రను కథ రూపంలో రంగస్థల వేదికలపై నాటక రూపంలో కళాకారుడు శ్రీధర్ నాయుడు ఎన్నో ప్రదర్శనలతో మన్ననలు పొందారని కొనియాడారు.గొప్ప కళాకారుడిని కోల్పోయమని ఆవేదన వ్యక్తం చేశారు.కళాకారుడు శ్రీధర్ నాయుడు మృతి పట్ల పలువురు జానపద వృత్తి కళాకారుల సంఘం సభ్యులు  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి,శ్రీధర్ నాయుడు ఆత్మకు శాంతి కలగాలని భగవంతునికి కోరుకున్నారు.

$$$__________@@@__________$$$

వైకాపాను గెలిపించాలని ప్రచారం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సున్నంపల్లి పంచాయతీ చౌడేపల్లి,ఎంబి క్రాస్,వంచిరెడ్డిపల్లి,నందివారిపల్లి ఎస్సీ,బీసీ కాలనీల్లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.ఇంటింటికి తిరుగుతూ....ఎవ్వరి ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని, పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రీధరన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు. 

ఈకార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

పరారీలో బ్యాంకు మేనేజర్ చెన్నై లో అరెస్ట్

సత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్28 (విజయస్వప్నం.నెట్)

గతంలో 2021-22 లో అమడగూరు మండల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కె.పెంచల రెడ్డిని ఆదివారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సమాచారంతో మండలంలోని రైతులు,ప్రజలు పోలీసు అధికారులను అభినందిస్తున్నారు.అప్పట్లో పెంచల రెడ్డి బ్యాంక్ మేనేజర్ గా పని చేసేటప్పుడు  ఖాతాదారుల నుండి(అధికంగా రైతుల ఖాతాల నుండి)అక్రమ పద్ధతుల్లో వివిధ ప్రభుత్వ పథకాలు కింద మంజూరైన దాదాపు 45లక్షలకు పైన తెలియకుండా సొంత అవసరాలకు వాడుకున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.అప్పటి బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు 2022లో పెంచల్ రెడ్డి పైన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.అప్పటినుండి బ్యాంకు మేనేజర్ పెంచల్ రెడ్డి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.నల్లమాడ సిఐ రాజేంద్రనాధ్ యాదవ్ పర్యవేక్షణలో 27వ తేదీ(నిన్నటి రోజు)ఆదివారం పెంచల్ రెడ్డి కౌలాలంపూర్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో అధికారుల సహాయంతో బ్యాంకు మేనేజర్ పెంచల్ రెడ్డిని చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కదిరి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ మగ్బుల్ బాషా తెలిపారు.దర్యాప్తులో భాగంగా పెంచల్ రెడ్డిని కోర్టు అనుమతితో పోలీసుల కస్టడీలో తీసుకొని విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

$$$__________@@@__________$$$

మే 3న శ్రీఅయ్యప్పస్వామి విగ్రహ పునఃప్రతిస్థాపన

మేల్ తాంత్రీ శ్రీ పరమేశ్వరన్ నంబూద్రి స్వామివారిచే పూజలు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీఅయ్యప్పస్వామి సన్నిధిలో శ్రీ జనార్ధన్ గురుస్వామి ఆశీస్సులతో మే 2 నుండి 3 తేదీ వరకు స్వామివారి విగ్రహ పునఃప్రతిస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ శంకరయ్య,కార్యదర్శి కేవి రమణయ్య ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో బ్రహ్మాశ్రీ శ్రీపరమేశ్వరన్ నంబూద్రి తాంత్రీ స్వామివారిచే పూజలు నిర్వహిస్తారని తెలిపారు. 2వతేది గురువారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు వినాయక స్వామివారికి హోమం, ఉషపూజ, కలశపూజ, కలశాభిషేకం, ఉత్ఫపూజ అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం, సాయంత్రం 6:30 గంటలకు దీపారాధన,7:30 గంటలకు శ్రీ భగవతీ అమ్మవారి సేవా అనంతరం మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు వినియోగం, 3వతేది ఉదయం నుండి ప్రత్యేక పూజలు, స్వామివారి విగ్రహ పునఃప్రతిస్థాపన పూజలు, మధ్యాహ్నం స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నదాన తీర్థప్రసాదాలు వినియోగం సాయంత్రం 6:30 గంటలకు ఆలయ అర్చకులు తులసి స్వామివారిచే అయ్యప్పస్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, 7:30 గంటలకు పడిపూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.

$$$__________@@@__________$$$

కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకుని అభ్యర్థులు ప్రచారం చేపట్టాలి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)

ప్రచారం కోసం కనీసం 10 మంది నాయకులతో కలసి ప్రచారం చేబడితే గౌరవంగా ఉంటుందని మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, మాజీ ఎంపీటీసీ తుమ్మల మహబూబ్ బాష కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు హితువు పలికారు.ఆదివారం ఆయన విలేకరులకు ఓప్రకటనలో పేర్కొంటూ.... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొందరైతే 5 మందితో ప్రచారం చేయడం చాలా అవమానకరమని, గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పార్టీ క్యాడర్ లీడర్లను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు పిలవకుండా పార్టీ పరువు తీస్తున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి వద్ద ప్రగల్భాలు పలికి, స్థానికంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత కపట ప్రేమ వల్లిస్తున్న ఇలాంటి కాగితపు పులులు కనుమరుగు అయిపోతారని ఎద్దేవా చేశారు.చివరికి మిగిలేది కాంగ్రెస్ పార్టీ ప్రాణంగా భావించే  నిజమైన కార్యకర్తలు మేమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.... ఇప్పటికైనా మండల, గ్రామస్ధాయిలో నాయకులను,కార్యకర్తలను కలుపుకుని ప్రచారం చేపట్టాలని, చేతకాక పోతే పార్టీ ఫండ్ ఏమైనా వస్తే తీసుకుని ఎన్నికల ప్రచారం నుండి పారి  పోవాలని,అలా కాకపోతే ఎన్నికల తరువాత మిమ్మల్ని పార్టీ కార్యకర్తలు క్షమించరని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు (పట్టుమని పదిమంది కూడా లేకుండా ప్రచారం చేస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వైఖరిపై మాజీ ఎంపీటీసీ మహబూబ్ బాష ఫోటోలు పంపించి స్పందిస్తూ విలేకరులకు ఓప్రకటనలో పేర్కొంటూ.... ఇటీవలే ఓడిచెరువు మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తో సహా నాయకులు,కార్యకర్తలు కార్యకర్తలు రాజీనామాలు చేసిన విషయం ఆయన గుర్తు చేశారు)

28, ఏప్రిల్ 2024, ఆదివారం

వైభవంగా శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతోత్సవం

వైభవంగా శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతోత్సవం

జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో వేలాది భక్తులు



శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్27(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 5వరోజు శనివారం శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి మహా జ్యోతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తంరెడ్డి,పొట్టా ఉమాదేవి,పొట్టా జయదేవ్ రెడ్డి,గీతమ్మ,పొట్టా మల్లికార్జునరెడ్డి,పొట్టా పూజిత కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం వ్వవహరించారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన కళాకారులచే అమ్మవారి రథానికి వివిధ రకాల పుష్పాలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.అమ్మవారి జ్యోతి దర్శనం కోసం రాత్రి 9 గంటలకు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి,బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారిపై డప్పు మంగళ వాయిద్యాలతో పురవీధుల గుండా ఉట్టి వద్దకు చేరుకుని,జంతుబలి హరణం తదితర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం యధావిధిగా ఆలయం వద్దకు అమ్మవారి రథం చేరుకోగా వివిధ ప్రాంతాల ప్రజలు,కర్ణాటక భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి రథం ఉత్సవ ఊరేగింపులో భక్తులు కాయకర్పూరం,పసుపు,కుంకుమ సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.అమ్మవారి జ్యోతోత్సవం కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు చీకిరేవులపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణరెడ్డి వివిధ గ్రామాలు శీతిరెడ్డిపల్లి,చీకిరేవులపల్లి, నల్లగుట్టపల్లి,బలకవారిపల్లి,గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు,యువత సహకారంతో ఉదయం నుండి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.అమ్మవారి జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో ఆర్కెస్ట్రా,భజనలు,హరికథలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకొందాం....!

తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి ప్రచారం....!



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్27(విజయస్వప్నం.నెట్)

రాష్ట్రం పురోగతి సాధించాలంటే.... నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకొందామంటూ.... శనివారం తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు మండలంలోని సున్నంపల్లి, కొండకమర్ల, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.ప్రజా వ్యతిరేక పాలనును సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా శ్రమించాలని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, సూపర్ సిక్స్ పథకాలపై వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టి,మే13వతేది సైకిల్ గుర్తుకు ఓటు వేసి,పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చౌడేపల్లి, రామయ్యపేట, నారప్పగారిపల్లి, గంజిబండతాండాల్లో ప్రజలను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో వెంకటాపురం,సున్నంపల్లి సర్పంచులు శంకర్ రెడ్డి, ధారా లక్ష్మీదేవమ్మ,ఎంపీటీసీ శ్రీనివాసులు,తెదేపా నాయకులు క్లస్టర్ ఇంఛార్జ్ నారాపరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుంఛపు ఆంజనేయులు,మాజీ సర్పంచ్ నాగిరెడ్డి,ఎద్దుల ప్రమోద్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ జాకీర్, జయచంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, ధారా నాగేంద్ర, బోనాల రామాంజనేయులు, వాటర్ బాలు, విశ్వనాథ్ రెడ్డి, వెంకటేష్,ఆంజన్ రెడ్డి,రామిరెడ్డి, వెంకటరమణ, జనసేన నాయకులు మేకల ఈశ్వర్, తలసాని దివాకర్ రెడ్డి, కొండబోయన సతీష్,చంద్ర, కేశవ,ధనుంజయ, రియాజ్, రఫీ, ప్రసాద్, శేఖర్, భరత్, శ్రీనాథ్, వీరయ్య, నారాయణ, రామకృష్ణ, కిష్టప్ప, బాలకృష్ణ, చిన్నప్పయ్య, రాజు,అంజి తెదేపా, జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


వైకాపాలోకి  చేరిన పలువురు తెదేపా నాయకులు

వైకాపాలోకి  స్వాగతించిన ఎమ్మెల్యే దుద్దుకుంట


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 27(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలం సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన పలువురు తెదేపా నాయకులు శనివారం పుట్టపర్తి శాసనసభ్యులు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు.పెద్దగుట్లపల్లి నుండి వైకాపాలోకి చేరిన వారిలో లోకానాథరెడ్డి,గంగాద్రీ, హరి తదితరులు ఉన్నారని వైకాపా శ్రేణులు తెలిపారు.ఈసంధర్బంగా వారికి శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

27, ఏప్రిల్ 2024, శనివారం

నేడు అమ్మవారి జ్యోతోత్సవం, ఘనంగా శ్రీచౌడేశ్వరిదేవి సూర్యప్రభ పల్లకి ఉత్సవం - ఉపాధి పనులు పరిశీలించిన డ్వామా పీడీ

నేడు అమ్మవారి జ్యోతోత్సవం

ఘనంగా శ్రీచౌడేశ్వరిదేవి సూర్యప్రభ పల్లకి ఉత్సవం

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్26(విజయస్వప్నం.నెట్)

నేడు(శనివారం)ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి,పొట్టా జయదేవ్ రెడ్డి,పొట్టా మల్లికార్జునరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమడగూరు మండల కేంద్రంలో చౌడేశ్వరిదేవి  ఆలయంలో అమ్మవారి జ్యోతి మహోత్సవ కార్యక్రమం  నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జ్యోతి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.        సూర్యప్రభ పల్లకిలో అమ్మవారు దర్శనం     ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 4వరోజు అమడగూరు బ్రాహ్మణ సంఘం,శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి,అమ్మవారి విగ్రహాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించిన సూర్యప్రభ పల్లకిలో రాత్రివేళ  ప్రధాన పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారని తెలిపారు,గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

$$$__________@@@__________$$$

ఉపాధి పనులు పరిశీలించిన డ్వామా పీడీ

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్26(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలోని ఓడిచెరువు పంచాయతీ గ్రామ పెద్దచెరువు వద్ద కూలీలు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం డ్వామా పీడీ విజయప్రసాద్ పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... 252 కూలీ నగదును ప్రభుత్వం 300 రూపాయలకు పెంచిందని,ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.వేసవిలో కూలీ పనులు చేపట్టే ప్రదేశాల్లో నీడ, నీరు ప్రథమ చికిత్స కిట్లు తప్పకుండా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఆయన సూచించారు.ప్రభుత్వం సరాపర చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీల హాజరు, మాస్టర్ తదితర రికార్డులు పరిశీలించారు.ఏపీడి శ్రీనివాసులురెడ్డి, ఏపీవో సుధాకర్, ఈసీ ఆంజనేయులు, ఏపీడి అసిస్టెంట్ ప్రతాప్ రెడ్డి, శారదా, సాంకేతిక, క్షేత్ర సహాయకులు రాజారెడ్డి, రాజేంద్ర, హనుమంతురెడ్డి, బాలరాజు, అబ్బులు తదితరులు ఉన్నారు.

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

చంద్రప్రభ పల్లకిపై శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం - వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల అందజేత - మలేరియాను నివారిద్దాం : ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ

చంద్రప్రభ పల్లకిపై శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం 3వరోజు శీతిరెడ్డిపల్లి, నల్లగుట్టపల్లి, రెడ్డివారిపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి, గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించిన చందప్రభ పల్లకిలో రాత్రివేళ  గ్రామ పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు, గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పి.శివారెడ్డి, పి.శంకర్ రెడ్డి, పి.భయారెడ్డి, పి.శ్రీనువాసులురెడ్డి జెడ్పీటీసీ,పి. రమేష్ రెడ్డి, పి.కృష్ణమోహన్ రెడ్డి, పి.ఈశ్వర్ రెడ్డి, ఆర్.సురేంద్రర్ రెడ్డి(సర్పంచ్) ఆర్.శంకర్ రెడ్డి(టీచర్) ఆర్.లక్ష్మినారాయణరెడ్డి, ఆర్.సునీల్ రెడ్డి, కే.ఉత్తమరెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల అందజేత

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

గాజులపల్లి సమీపంలో మాతృశ్రీ వృద్ధాశ్రమానికి గురువారం కదిరి పట్టణానికి చెందిన శ్రీదేవి, భాగ్యలక్ష్మి నిత్యవసర సరుకులు అందజేసినట్లు ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి తెలిపారు. సుమారు పదివేల ఐదు వందల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు, నూతన వస్త్రాలు వృద్ధులకు అందజేసిన శ్రీదేవి, భాగ్యలక్ష్మి సేవా గుణాన్ని నిర్వాహకురాలు అరుణజ్యోతి అభినందిస్తూ.... ఈసందర్భంగా ఆమె దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎళ్ళవేళలా ఆశ్రమంలో వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తామని దాతలు పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

మలేరియాను నివారిద్దాం

ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యాధికారి వైద్యాధికారులు భాను ప్రకాష్, కమల్ రోహిత్  పేర్కొన్నారు.ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం  మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా వ్యాధి అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గోని  మాట్లాడారు.చిన్న దోమతో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని,కాలానుగుణంగా వచ్చే వ్యాధులలో మలేరియా అతి ప్రమాదకర,ప్రాణాంతకమైందని, వ్యాధి లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గివుండాలని,అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.నిల్వ ఉన్న మురుగు నీటిలో లార్వాలుగా ఎదిగి తదుపరి దోమలుగా మారిన ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని,ప్లాస్మోడియం ఫాల్సి ఫారం రకపు మలేరియా ద్వారా మెదడుకు వ్యాప్తి చెందే సిరిబ్రల్ మలేరియాతో ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.నివారణ మార్గాలు ,చికిత్స అంశాలను వివరిస్తూ పరిసరాల పరిశుభ్రత,లార్వాల నిర్మూలన, ఫ్రైడే డ్రై డే పద్ధతిని ప్రతి ఒక్కరూ పాటించాలని,వేపాకు పొగ,దోమతెరలు వాడడం,జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయితే మూల చికిత్స తీసుకోవడం అత్యవసరమని సూచించారు.అనంతరం  మలేరియా వ్యతిరేక నినాదాలతో ప్రధాన వీధుల గుండా ర్యాలీతో అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్  హెల్త్ ప్రొవైడర్స్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్,ఆరోగ్య పర్యవేక్షకులు,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అమడగూరులో.... మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో గురువారం వైద్యాధికారిణి రోజా ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. దోమ పుట్టకూడదు-దోమ కుట్టకూడదు,దోమతెరలను వాడండి,దోమ కాటు నుండి రక్షణ పొందండి,దోమకాటు ప్రమాదానికి ముప్పు అంటూ బస్టాండ్ నుండి పురవీధులలో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు.మూడు రోజులకు మించి జ్వరం వచ్చిందంటే మలేరియా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని,నిల్వ ఉన్న నీటిని పారద్రోలి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి అవగాహన కల్పిస్తూ.... ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించి, మలేరియా నివారణ కొరకు బాధ్యతగా తీసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈకార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ దేశే నాయక్, సిహెచ్ఓ ఫకృధ్ధీన్, సూపర్వైజర్ ఇర్ఫాన్ బాష, ల్యాబ్ టెక్నీషియన్ గాయత్రి, ఎంఎల్ హెచ్ దివ్యవాణి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

అనుమానాస్పదంగా యువకుడు మృతి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్25(విజయ స్వప్నం.నెట్)

మండలంలోని ఓడిచెరువు పంచాయతీ వేమారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(35) అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఓడీచెరువు మండల కేంద్రంలోని వడ్డివారిపల్లి గ్రామ సమీపంలో బాలుర సమళీకృత వసతి గృహం వెనుక వైపు సోమావతి నది మడుగు వద్ద గురువారం శవం లభ్యం కాగా, స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఎస్ఐ వంశీకృష్ణ, ఏఎస్ఐ కిషోర్ రెడ్డి,పోలీసులు చేరుకుని పరిశీలించి,వారం క్రితం నీటిలో పడి మృతిచెందినట్లు ప్రాథమిక అంచనాగా నిర్ధారించారు.మృతుడి ఆనవాళ్ళు గుర్తించి పోలీసులు సమాచారం తెలియజేయడంతో వేమారెడ్డిపల్లికి చెందిన ఉప్పుతోళ్ళ కృష్ణమూర్తిగా గుర్తించారు.మృతిని బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని,కుళ్ళిన మృతదేహాన్ని బయటికి తీయించి, పోలీసులు సంఘటన స్థలం వద్ద శవ పంచనామా నిర్వహించారు.కేసు నమోదు చేసుకుని,మృతికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.

$$$__________@@@__________$$$

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని చౌడేపల్లి గ్రామానికి చెందిన పూల లక్ష్మిరెడ్డి,కళావతమ్మ దంపతుల కుమారుడు పూల మంజునాథరెడ్డి(26) గురువారం స్వగృహంలో ఎవ్వరులేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమీప బంధువులు తెలిపారు.ఆరు నెలల క్రితం బుక్కపట్నం మారాల గ్రామానికి చెందిన యువతితో మంజునాథకి వివాహం జరుపగా,భార్య పుట్టింటికి వెళ్ళి గత కొన్ని నెలలుగా కాపురానికి రాకపోవడంతో మృతుడు మంజునాథరెడ్డి తరచూ మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.ఉదయం పనిపైన తల్లిదండ్రులు కదిరికి వెళ్ళడంతో మంజునాథరెడ్డి ఇంటి తలుపులు మూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో  తల్లిదండ్రులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది.గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి,కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉయ్యాల ఉత్సవ సేవ - జిల్లా వ్యాప్తంగా MEOలకు ప్రధానోపాధ్యాయులు కు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని DTF తీవ్రంగా ఖండిస్తోంది

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉయ్యాల ఉత్సవ సేవ

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం 2వరోజు శీతిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారి ఉయ్యాల సేవ ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ముందుగా శ్రీదేవి అమ్మవారికి శీతిరెడ్డిపల్లి గ్రామస్తులు పూజలు నిర్వహించి,జ్యోతుల భోనాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహానికి పుష్పాలతో అలంకరించి, రాత్రివేళ అమ్మవారి ఉత్సవ పల్లకిని గ్రామ పురవీధుల్లో మేళతాళాల మధ్య  భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించి, కాలక్షేపం కోసం గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

$$$__________@@@__________$$$

అట్టహాసంగా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నామినేషన్ దాఖలు




శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ స్థానానికి బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జనసమూహం మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సత్యమ్మ ఆలయం కూడలి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి,సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి వున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని, వైకాపాపై పచ్చ పార్టీ నాయకుల అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే.... మే 13వతేది జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఈసందర్భంగా వివరించారు.వైకాపా శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.  నామినేషన్ కు తరలిన వైకాపా శ్రేణులు  పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  నామినేషన్ కార్యక్రమానికి బుధవారం మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

జిల్లా వ్యాప్తంగా  MEOలకు ప్రధానోపాధ్యాయులు కు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని DTF తీవ్రంగా ఖండిస్తోంది

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

జిల్లా వ్యాప్తంగా 62 మంది ఎంఈఓలకి... దాదాపు 422మంది ప్రధానోపాధ్యాయులకు 2023- 24 సంవత్సరానికి సంబంధించిన యుడైస్ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ...

పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారనే కారణంగా ఇంత పెద్ద ఎత్తున షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరైనది కాదని డిటిఎఫ్  ఖండిస్తూ.... వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

$$$__________@@@__________$$$

వైకాపా నుండి తెదేపాలోకి పలువురు చేరిక



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని ఎంబి క్రాస్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు,కార్యకర్తలు బుధవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు. తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్ మినీ మ్యానిఫెస్టో పథకాలు ఆకర్షించాయని, రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వైకాపా నుండి తెదేపాలోకి చేరినట్లు చుక్క భైరిశెట్టి, బోనాల శంకరాచారి,డేగ వెంకటరమణ, బాలకృష్ణాచారి, నంది నర్సింహులు, పెద్దప్పయ్య తదితరులు పేర్కొన్నారు. దాదాపుగా 180 మంది మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి తెదేపాలోకి చేరినట్లు తెలిపారు.చేరినవారికి మాజీమంత్రి పల్లె కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీమంత్రి పల్లె మాట్లాడుతూ.... రాష్ట్రంలో జగనన్న పాలనకు చరమగీతం పాడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన సూచించారు. మే 13వతేది సైకిల్ గుర్తుకు ఓటు వేసి, తెదేపా, జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,ప్రధాన కార్యదర్శి పీట్లా సుధాకర్, మాజీ రెస్కో ఛైర్మన్ లాయర్ రాజశేఖర్, తెదేపా మండల ఇంఛార్జ్ శ్యాంబాబు నాయుడు,రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కృష్ణమూర్తి,జనసేన,బిజేపీ మండల కన్వీనర్లు మేకల ఈశ్వర్,రంగారెడ్డి తెదేపా, జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

24, ఏప్రిల్ 2024, బుధవారం

కిసాన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా చింత శరత్ కుమార్ రెడ్డి - భక్తిశ్రద్ధలతో కుంభకూడు ఉత్సవ పూజలు

కిసాన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా చింత శరత్ కుమార్ రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి/కదిరి ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు మండలం తుమ్మల పంచాయతీ వెంకటనారాయణపల్లి గ్రామానికి చెందిన చింత శివారెడ్డి,పద్మావతమ్మ దంపతుల నాలుగవ కుమారుడు చింత శరత్ కుమార్ రెడ్డి విద్యాభ్యాసం తుమ్మల హైస్కూల్లో,ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల కదిరి,ప్రభుత్వం డిగ్రీ కళాశాలకదిరి,న్యాయవిద్య ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు.హై స్కూల్ స్థాయి నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రేరణతో 1998లో జాతీయ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో చేరి వివిధ విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు చేస్తూ విద్యార్థులను జాతీయ భావాలు వైపు నడిపించడంలో ముందున్నారు.కదిరి కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ....విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు.2002 నుండి ఏబీవీపీలో పూర్తి సమయవ్వయ కార్యకర్తగా, ఉమ్మడి రాష్ట్రం కరీంనగర్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తు వారిలో జాతీయ భావాలు కల్పిస్తూ సేవాలు అందిస్తూ.తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్,నల్గొండ తదితర జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ చింత శరత్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందారు.2010 నుండి జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రస్తుతం ఇండియన్ వాయిస్ దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు.విద్యార్థులు రాజకీయాలకు రావాలని ఉద్దేశంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

 2015 నుండి కదిరి కేంద్రంగా సేవా భారతి కార్యదర్శిగా పరిసర గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేని గ్రామాలకు ట్యాంకుర్లతో నీటి సరఫరా చేయడం,పసు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్న  పశువులకు పశుగ్రాసం పంపిణీ చేపట్టారు.సేవ భారతి ఆధ్వర్యంలో మాధవ గురుకులం వ్యవస్థాపకులుగా అమ్మానాన్న లేని అనేకమంది విద్యార్థులకు  ఒక ఆసరాగా మాధవ గురుకులం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర రాజధానికి రైలు సౌకర్యం లేదని గ్రహించి రైలు సాధించాలనే సంకల్పంతో ప్రజా ఉద్యమం నిర్మాణం చేపట్టి విద్యార్థి,ఉపాధ్యాయ కార్మిక,రాజకీయ,మేధావులతో సంతకాల సేకరణ చేసి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కదిరి మీదుగా మచిలీపట్నం వెళ్తున్న రైలు సాధించడంలో శరత్ కుమార్ రెడ్డి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఈ ప్రాంతంలో  ప్రజలకు ఉపయోగపడుతున్న రైలు నడుస్తున్నది అంటే అది శరత్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైందని చెప్పాలి.శ్రీ విజ్ఞాన్ విద్యాసంస్థలలో  వృత్తి విద్య కోర్సులతో వందలాది మంది విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్నారు.కదిరి ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్నదని,ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా ప్రతి చెరువును నింపాలని కోరుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోచ్చారు.15 సంవత్సరాల పాటు విద్యార్థి నాయకునిగా పది సంవత్సరాలు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తున్న యువ విద్యావంతుడు శరత్ కుమార్ రెడ్డికి  జాతీయస్థాయిలో అనేకమంది నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా శరత్ కుమార్ రెడ్డిని నియమించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలలో వస్తున్న ఆరోగ్య సమస్యలను మార్పులు ఆహారంలో వస్తున్న మార్పులు వీటన్నిటికీ కారణం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మార్చుకొని యాంత్రికరణ ద్వారా వ్యవసాయం చేయడంతో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన సన్నగిల్లుతుందని వాటిని అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచి నాణ్యమైన ఆహార ఉత్పత్తుల తయారుచేసి ప్రజలకు చేరువేసేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా చదువుకున్న యువతను ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్లించి వ్యవసాయం భారం కాకుండా వ్యవసాయం ప్రజలకు దగ్గర చేసే విధంగా కృషి చేస్తానని నూతనంగా కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా ఎంపికైన చింత శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని తన నియమకం సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరికి,కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామికి,తెరాస ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డికి,జిల్లా పార్టీ అధ్యక్షులు జిమ్ శేఖర్ కి,భారతీయ జనతా పార్టీ జిల్లా ఇంచార్జ్ బాలకృష్ణ యాదవ్ కి,జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ కి, కిషన్ మోర్చా అధ్యక్షులు కేశవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@___________$$$

వైకాపా సీనియర్ నాయకులు తెదేపాలోకి చేరిక 


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ప్రమోద్ రెడ్డి, మహేష్ రెడ్డితో పాటు దాదాపుగా 200 కుటుంబ సభ్యులు మంగళవారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైకాపా నుండి  తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వారిలో మైనారిటీలు,మహిళలు,యంపిటిసి అభ్యర్థులు వాలంటీర్లు తదితరులు ఉన్నట్లు తెదేపా శ్రేణులు తెలిపారు.వైకాపా నుండి తెదేపాలోకి చేరిన వారికి మాజీమంత్రి పల్లె కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.అంతక ముందు తెదేపా నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రధాన వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

$$$__________@@@___________$$$

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండలం తుమ్మల పంచాయతీ,వెంకటనారాయణపల్లి గ్రామానికి చెందిన చింత శివారెడ్డి పద్మావతమ్మ దంపతుల నాలుగవ సంతానం జన్మించిన చింత శరత్ కుమార్ రెడ్డి విద్య అభ్యాసం తుమ్మల ప్రభుత్వ పాఠశాల,జూనియర్ కళాశాల,కదిరి ప్రభుత్వం డిగ్రీ కళాశాల కదిరి న్యాయవిద్య ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. స్థాయి నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రేరణతో 1998 లో జాతీయ విద్యార్థి సంస్థ ఏబీవీపీలో  చేరి అనేక విద్య రంగ సమస్యలను పోరాటం చేస్తూ విద్యార్థులను జాతీయ భావాలు వైపు నడిపించడంలో ముందున్నారు కదిరి కేంద్రంగా అనేక విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం వహిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారు , 2002 నుండి ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా కరీంనగర్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలను నాయకత్వం వహిస్తూ అనేకమంది కార్యకర్తలకు స్ఫూర్తినిస్తు వారిలో జాతీయ భావాలు కల్పిస్తూ పని చేయడం జరిగింది .తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, అనేక జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి చింత శరత్ కుమార్ రెడ్డి.2010 నుండి జర్నలిస్టుగా పనిచేయడం జరిగింది, ఇండియన్ వాయిస్ దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు. విద్యార్థుల్లో రాజకీయాలకు రావాలని ఉద్దేశంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది.

 2015 నుండి కదిరి కేంద్రంగా సేవా భారతి కార్యదర్శిగా ఈ ప్రాంతంలో చాలా గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు ట్యాంకులతో నీటి సరఫరా చేయడం, పసు గ్రాసం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పశువులకు పశుగ్రాసం పంపిణీ చేయడం జరిగింది. సేవ భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాధవ గురుకులం వ్యవస్థాపకులుగా ఉండి అమ్మానాన్న లేనటువంటి అనేకమంది విద్యార్థులకు ఈరోజు ఒక ఆసరాగా మాధవ గురుకుల ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం రాజధాని కి రైలు సౌకర్యం లేదని గ్రహించి రైలు సాధించాలనేటువంటి సంకల్పంతో ప్రజా ఉద్యమం నిర్మాణం చేసి విద్యార్థి ,ఉపాధ్యాయ కార్మిక ,రాజకీయ, మేధావులతో సంతకాల సేకరణ చేసి ఢిల్లీ వెళ్లి కదిరి మీదుగా మచిలీపట్నం వెళ్తున్న రైలు సాధించడంలో శరత్ కుమార్ రెడ్డి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉన్నది, ఈ ప్రాంతంలో ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతున్న రైలు నడుస్తున్నది అంటే అది శరత్ కుమార్ రెడ్డి తోనే సాధ్యమైందని చెప్పాలి , శ్రీ విజ్ఞాన్ విద్యాసంస్థలలో  వృత్తి విద్య కోర్సులు ఏర్పాటుచేసి వందలాది మంది విద్యార్థులు ఉపాధి కల్పించడం జరిగింది. కదిరి ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్నదని ఈ ప్రాంతం సస్యములు కావాలంటే హంద్రీనీవా సృజల స్రవంతి ద్వారా ప్రతి చెరువును నింపాలని కోరుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. 15 సంవత్సరాల పాటు విద్యార్థి నాయకునిగా పది సంవత్సరాలు గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉంటూ యువకుడు విద్యావంతుడు అయినా శరత్ కుమార్ రెడ్డి గారికి  జాతీయస్థాయిలో అనేకమంది నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడు . ఆంధ్రప్రదేశ్లో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా ఆర్గానిక్ ఫార్మింగ్ రాష్ట్ర కన్వీనర్ గా శరత్ కుమార్ రెడ్డి నియమించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలలో వస్తున్న ఆరోగ్య సమస్యలను మార్పులు ఆహారంలో వస్తున్న మార్పులు వీటన్నిటికీ కారణం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు మాని యాంత్రికరణ ద్వారా వ్యవసాయం చేయడంతో రైతులలో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల అవగాహన సన్నగిల్లుతుందని వాటిని అవగాహన కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ పెంచి మంచి ఆహార ఉత్పత్తుల తయారుచేసి ప్రజలకు చేరువేందుకు కృషి చేస్తానని ముఖ్యంగా చదువుకున్నటువంటి యూత్ యువకులను ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్లించి వ్యవసాయం అన్నది భారం కాకుండా వ్యవసాయం ప్రజలకు దగ్గర చేసేది కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా తనపై ఉంచిన నమ్మకాన్ని తన నియమకం సహకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి గారికి, తెరాస ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు జిమ్ శేఖర్ గారికి,  భారతీయ జనతా పార్టీ జిల్లా ఇంచార్జ్ బాలకృష్ణ యాదవ్ గారికి,  జోనల్ ఇంచార్జ్ చంద్రశేఖర్ గారికి, కిషన్ మోర్చా అధ్యక్షులు కేశవ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

$$$__________@@@___________$$$

భక్తిశ్రద్ధలతో కుంభకూడు ఉత్సవ పూజలు

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్23(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు అమ్మవారి ఆలయంలో కుంభకూడు ఉత్సవం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆనావాయితీ మేరకు చీకిరేవుపల్లి గ్రామానికి చెందిన నేసే కులస్తులు జొన్నలు రాసిగా పోసి,శిఖరంపై పసుపు,కుంకుమ వివిధ రకాల పుష్పాలతో అలంకరించి,అనంతరం అమ్మవారికి ధూపదీప పూజలు నిర్వహించి, జంతు బలిదానం చేసి కుంభకూడుపై సమర్పించారు. కుంభకూడు ఉత్సవ కార్యక్రమంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పాల్గొని కుంభకూడు జొన్నలు తీసుకెళ్లి వెళ్లి పంట పొలాల్లో,గృహాలల్లో చల్లించుకున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.

23, ఏప్రిల్ 2024, మంగళవారం

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - పది ఫలితాల్లో జిల్లా టాపర్ గా గోరంట్ల విద్యార్థి

599 మార్కులతో ఏలూరు విద్యార్థినీ స్టేట్ ఫస్ట్ 

శ్రీసత్యసాయిజిల్లా ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్  విడుదల చేసిన పది ఫలితాల్లో ఏలూరు విద్యార్థినీ స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్ఎస్సి బోర్డ్ ప్రకటించింది.2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది.ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ)మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది.హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి.ఈ మేరకు మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.

రాష్ట్రంలో బాలురు 84.02 శాతం,బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత పొందారు. బాలురు కంటే బాలికలు 4.98 శాతం అధికంగా పాస్‌ పర్సెంటైల్‌ సాధించారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాల్లో జిల్లా టాపర్ గా గోరంట్ల విద్యార్థి

596 మార్కులు సాధించిన విద్యార్థి యువకిశోర్ రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)


సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోమవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గోరంట్ల మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి,త్రివేణి దంపతుల కుమారుడు డి.యువ కిషోర్ రెడ్డి 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి శ్రీసత్యసాయి జిల్లా టాపర్ గా నిలిచారని గోరంట్ల శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు.శ్రీసత్యసాయిజిల్లా స్దాయిలో డి.యువ కిషోర్ రెడ్డి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో టాపర్ గా నిలవడం కళాశాలకు ఎంత గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థి యువకిశోర్ రెడ్డిని అభినందిస్తూ.... పాఠశాలలో సత్కరించారు.జిల్లా టాపర్ గా ప్రతిభ కనబరిచిన విద్యార్ధి యువకిశోర్ రెడ్డిని మండల వాసులు అభినందించారు.                   

కదిరి విద్యార్ధినీ జిల్లా టాపర్ సోమవారం వెలుబడిన పది ఫలితాల్లో శ్రీసత్యసాయిజిల్లా కదిరి పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్ధిని కే.షర్మీలారెడ్డి 600/596 మార్కులు సాధించి ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా టాపర్ గా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేశారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాలలో రెయిన్బో పాఠశాల విజయ దుందుభి

593 డివిజన్ టాపర్ గా విద్యార్ధి మేఘనాథ్ రెడ్డి



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

సెకండరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన  పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండలంలోని రైన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.593/600 మార్కులతో 

మేఘనాథ్ రెడ్డి ప్రధమ శ్రేణి సాధించి డివిజన్ టాపర్ గా నిలిచారు.అలాగే హర్షవర్ధన్ రెడ్డి 587 మార్కులతో పాఠశాలలో రెండవ స్థానంలో,లతిక 579 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు.100% ఉత్తీర్ణతతో పాటు ఎనిమిది మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు.మొత్తంగా 16 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులను సాధించి ఓడిచెరువు మండలంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది.ఇంతటి విజయానికి కారకులైన విద్యార్థినీ,విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.యం.జయసింహారెడ్డి అభినందించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు.

$$$__________@@@__________$$$

వశిష్ట విద్యార్థుల వందశాతం ఉత్తీర్ణత



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం వెలుబడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో వశిష్ట పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో విజయ దుందుభి మోగించారు.పరీక్ష రాసిన విద్యార్థులు 67 మందికి 67 మంది మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు శివశంకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.కే.మౌనిష 589 మార్కులతో  మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా,550 మార్కుల పైన 22 మంది విద్యార్థులు,500  మార్కుల పైన 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని,గణితంలో 100/100 16 మంది విద్యార్థులు,సైన్సులో 100/100 నలుగురు విద్యార్థులు,తెలుగులో 100/100 ఒక్కరు మార్కులు సాధించాలన్నారు.ఈ ఫలితాలతో పాటు ఆధునిక పోటీ ప్రపంచంలో ధీటైన విద్యను అందిస్తున్న పాఠశాలలో ఐఐటి విద్యాభోథనలతో దూసుకుపోతున్న ఏకైక విద్యాసంస్థ వశిష్ట ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రత్యేకతని పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

పదిలో శ్రీ విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండల కేంద్రంలో శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 97% ఉత్తీర్ణతతో విజయ ఢంకా మోగించారు.పరీక్ష రాసిన విద్యార్థులు 88 మందికి 85 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాండెంట్ మస్తాన్ తెలిపారు.వి.వినయ్ కుమార్ రెడ్డి 589 మార్కులతో  మొదటి స్థానంలో,టిఎస్.టబ్రెజ్ 586,బి.దివ్యశ్రీ 583,బి.జవిర్యా 581మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.పైన 22 మంది విద్యార్థులు,500  మార్కుల పైన 40మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.పాఠశాల కరస్పాండెంట్ యం.మస్తాన్ ఈసందర్భంగా విద్యార్థులకు, బోధించిన ఉపాధ్యాయులను అభినందించారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాల్లో వాల్మీకి విద్యార్థుల ప్రభంజనం

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం ప్రకటించన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వాల్మీకి పాఠశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు.టి. భరద్వాజ 592 ప్రధమ స్థానం సాధించగా, ఎస్.తస్మియా 591,పియం.నిజ్భ 591,ఇ.దేదీప్య 591 ద్వితీయ స్ధానంలో,ఎం.ప్రణతి 590 తృతీయ స్థానంలో నిలిచారు.అలాగే 580 పైగా 27 మంది విద్యార్థులు,550 పైగా 127 మంది విద్యార్థులు,500 మార్కులు పైగా 275 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఈ విజయానికి కారణం అయిన ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాల్లో విజ్ఞాన్ పాఠశాల విజయ దుందుభి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

 మండలంలోని విజ్ఞాన్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు సోమవారం వెలుబడిన ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు.టి.సునీత 585/600 మార్కులతో ప్రధమ స్థానంలో,ఎం.అభిషేక్ 581/600 ద్వితీయ స్ధానంలో,ఎం.అజయ్ కుమార్ నాయక్ 573 తృతీయ స్థానంలో నిలిచారని కరస్పాండెంట్ ఎం.ఫకృధ్థీన్ తెలిపారు.9 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించారని,25 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించి మండలంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ పాఠశాలను ప్రధమ స్థానంలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.ఇంతటి గొప్ప విజయానికి కారకులైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను,విద్యా బోధక ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఫకృధ్ధీన్ అభినందించారు.

$$$__________@@@__________$$$

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

590 మండల టాపర్ గా విద్యార్ధి  ఎ.చందు

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు

A. రితిక 569

M. ఆశ  580

M. చందు 590

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

నేడు విడుదలైన ఎస్ఎస్ సి ఫలితాలలో అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.పాఠశాల విద్యార్ధి ఎం.చందు 590 మార్కులతో మండల టాపర్ గా నిలిచారని ప్రధానోపాధ్యాయులు పి.శ్రీధర్ బాబు సోమవారం తెలిపారు. అలాగే పాఠశాలలో 500కు పైగా పలువురు విద్యార్థులు మార్కులు సాధించడంతో ఉపాధ్యాయ బృందం సంతోషంగా వ్యక్తం చేశారు.ఎం.చందు 590 టాపర్ గా సాధించగా,ఎం.ఆశ 580,ఏ.రితిక 569,కే.ఇందు,545 సోహేల్ ఖాన్ 527,శృతి 527,అర్జున్ రెడ్డి 512,రమ్య 508 మార్కులు సాధించారని,2023-24 విద్యా సంవత్సరంలో 51 మంది గాను 41 మంది పాసయ్యారని పది పరీక్షాలలో ప్రభంజనం సృష్టించారని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను,భోధనలపై నమ్మకంతో పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు అభినందించారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

పది ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన హరీష్ విద్యార్థులు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

కదిరి రూరల్ పరిధిలోని ఎరుకులవాండ్లపల్లి సమీపంలో హరీష్ పాఠశాల విద్యార్థులు సోమవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ యం.యస్. కిరణ్ తెలిపారు. కె.మైథిలి 600గాను 592 మార్కులు,యస్.సఫిరా అంజూమ్ 590,యస్.గీతికా నాగసాయి 586,పి.విశాల్ రెడ్డి 586,యస్.యఫ్.తౌహీద్ 581,యస్.యం.డి.ఫాజిల్ 580 మార్కులు సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యం.యస్.కిరణ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషదాయకమన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా హరీష్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని,ఇందుకు నేడు వెలువడిన ఫలితాలే నిదర్శనమన్నారు.మొత్తం 51 మంది విద్యార్థులకు గాను తెలుగులో ఇరువురు  విద్యార్థులు,గణితంలో 19 మంది విద్యార్థులు,సైన్స్ ఒకరు,సోషియల్ లో 5 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించినట్లు తెలిపారు.విద్యార్థులు ఉన్నత చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను అభినందించి,మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

$$$__________@@@__________$$$

పదిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయ ఢంకా


ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు


శ్రీసత్యసాయిజిల్లా తలుపుల ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో తలుపుల మండల ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు.పాఠశాల విద్యార్థులు 170 మంది పరీక్షలు రాయగా 167 మంది ఉత్తీర్ణత సాధించి 98.3%తో విజయ ఢంకా మోగించారు.అత్యంత ప్రతిభ కనబరిచిన  వై.సుశాంత్ రెడ్డి 589 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, బి.హాసిని 584 మార్కులతో ద్వితీయ స్థానం,జి.జోష్న 583 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని,అలాగే  500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 55 మంది కాగా,మొత్తం 150 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో,13 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని ఉపాధ్యాయ బృందం తెలిపారు.నియోజకవర్గంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన  తలుపులు ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల ప్రధమ స్థానంలో నిలిచిందని,గత మూడేళ్లుగా తలుపుల ప్రభుత్వ పాఠశాల విజయ ఢంకా మోగిస్తూ.....ప్రధమ స్థానంలో గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరన్న,ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తంచేశారు.ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను,ఎంతో నమ్మకంతో పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

పదిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం ఎస్ఎస్ సి విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తనకల్లు ప్రభుత్వం జిల్లా ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రధానోపాధ్యాయుడు ఖాదరవలి భాష, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఖాదర్ వలీ బాషా మాట్లాడుతూ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా వాటికంటే అధికంగా 94.52 శాతంతో అత్యుత్తమ ఫలితాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.తమ పాఠశాలలో 102 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 95 మంది ఉత్తీర్ణత సాధించారని, అందులో ప్రధమ స్థానంలో ఎం.భారతి 574,ద్వితీయ స్ధానంలో ఎస్.నఫీసా 572,పి.సాయి త్రిషా 559 మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు.అలాగే మిగిలిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొంటూ.... విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో విద్యార్థులను, ఉపాధ్యాయులను మండల వాసులు, గ్రామస్తులు,తల్లిదండ్రులు అభినందించారు.

$$$__________@@@__________$$$

పదిలో మంగళకర విద్యార్థుల ప్రతిభ

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

పత్తి మండల పరిధిలోని జగరాజుపల్లి గ్రామ మంగళకర పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచారు.10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ పాసయ్యారని,ఇందులో 44 మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు ఉపాధ్యాయ బృందం తెలిపారు.పి.లిఖిత 584,ఆర్.దర్శిని 583,ఎల్. రమ్య 580,తేజస్విని 571,చేతన్ సాయి 564, నాగలక్ష్మి 563 మార్కులు సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు సాధించడానికి కృషిచేసిన బోధన ఉపాధ్యాయ బంధానికి,విద్యార్థులకు మంగళకర పాఠశాల కరస్పాండెంట్ సురేష్ కుమార్, సంస్థ ప్రతినిధి ఆర్యా ప్రకాష్,ఏఓ జయచంద్ర, ప్రధానోపాధ్యాయిని బిందుజా అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాలలో రెయిన్బో పాఠశాల విజయ దుందుభి

593 డివిజన్ టాపర్ గా విద్యార్ధి మేఘనాథ్ రెడ్డి




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

సెకండరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన  పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండలంలోని రైన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 593/600 మార్కులతో మేఘనాథ్ రెడ్డి ప్రధమ శ్రేణి సాధించి డివిజన్ టాపర్ గా నిలిచారు.అలాగే హర్షవర్ధన్ రెడ్డి 587 మార్కులతో పాఠశాలలో రెండవ స్థానంలో,లతిక 579 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు.100% ఉత్తీర్ణతతో పాటు ఎనిమిది మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. మొత్తంగా 16 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులను సాధించి ఓడిచెరువు మండలంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది.ఇంతటి విజయానికి కారకులైన విద్యార్థినీ, విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.యం. జయసింహారెడ్డి అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు.