google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : అంతా.... రామమయం....

18, ఏప్రిల్ 2024, గురువారం

అంతా.... రామమయం....

 అంతా.... రామమయం.... 

ఊరు వాడ అంతా.... రామమయం....!

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్17(విజయస్వప్నం.నెట్)

మండలంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ఊరూవాడా అంతా రామమయం నామస్మరణలతో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు.మండలంలోని గౌనిపల్లి గ్రామ రామాలయంలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మిట్టపల్లి శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో,తుమ్మలకుంట్లపల్లి,నల్లగుట్టపల్లి,కొండకమర్ల, మామిళ్ళకుంటపల్లి,వీరఓబునపల్లి రామాలయంల్లో పూజారి అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు వడపప్పు,పానకం, తీర్ధప్రసాదాలు అందజేశారు.గ్రామీణ ప్రాంతాల్లో రామాలయంలో పూజలు నిర్వహించి, సీతారాములవారి ప్రతిమలతో వాహనంపై ఊరేగింపు ఉత్సవాలు, వేడుకలు వైభవంగా నిర్వహించారు.     






ఓడిచెరువులో శ్రీరామ శోభాయాత్ర ఓడిచెరువు పంచాయతీ గ్రామ రామాలయంలో బుధవారం అర్చకులు పూజలు నిర్వహించారు.శ్రీరామ భక్త మండలి యువత జై శ్రీరామ్, జైజై శ్రీరామ్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించి,శ్రీరాముడు చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు.ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి