google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : చంద్రప్రభ పల్లకిపై శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం - వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల అందజేత - మలేరియాను నివారిద్దాం : ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

చంద్రప్రభ పల్లకిపై శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం - వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల అందజేత - మలేరియాను నివారిద్దాం : ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ

చంద్రప్రభ పల్లకిపై శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం 3వరోజు శీతిరెడ్డిపల్లి, నల్లగుట్టపల్లి, రెడ్డివారిపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి, గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించిన చందప్రభ పల్లకిలో రాత్రివేళ  గ్రామ పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు, గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పి.శివారెడ్డి, పి.శంకర్ రెడ్డి, పి.భయారెడ్డి, పి.శ్రీనువాసులురెడ్డి జెడ్పీటీసీ,పి. రమేష్ రెడ్డి, పి.కృష్ణమోహన్ రెడ్డి, పి.ఈశ్వర్ రెడ్డి, ఆర్.సురేంద్రర్ రెడ్డి(సర్పంచ్) ఆర్.శంకర్ రెడ్డి(టీచర్) ఆర్.లక్ష్మినారాయణరెడ్డి, ఆర్.సునీల్ రెడ్డి, కే.ఉత్తమరెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకుల అందజేత

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

గాజులపల్లి సమీపంలో మాతృశ్రీ వృద్ధాశ్రమానికి గురువారం కదిరి పట్టణానికి చెందిన శ్రీదేవి, భాగ్యలక్ష్మి నిత్యవసర సరుకులు అందజేసినట్లు ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి తెలిపారు. సుమారు పదివేల ఐదు వందల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులు, నూతన వస్త్రాలు వృద్ధులకు అందజేసిన శ్రీదేవి, భాగ్యలక్ష్మి సేవా గుణాన్ని నిర్వాహకురాలు అరుణజ్యోతి అభినందిస్తూ.... ఈసందర్భంగా ఆమె దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎళ్ళవేళలా ఆశ్రమంలో వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తామని దాతలు పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

మలేరియాను నివారిద్దాం

ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యాధికారి వైద్యాధికారులు భాను ప్రకాష్, కమల్ రోహిత్  పేర్కొన్నారు.ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం  మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా వ్యాధి అవగాహన కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గోని  మాట్లాడారు.చిన్న దోమతో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని,కాలానుగుణంగా వచ్చే వ్యాధులలో మలేరియా అతి ప్రమాదకర,ప్రాణాంతకమైందని, వ్యాధి లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గివుండాలని,అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.నిల్వ ఉన్న మురుగు నీటిలో లార్వాలుగా ఎదిగి తదుపరి దోమలుగా మారిన ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని,ప్లాస్మోడియం ఫాల్సి ఫారం రకపు మలేరియా ద్వారా మెదడుకు వ్యాప్తి చెందే సిరిబ్రల్ మలేరియాతో ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.నివారణ మార్గాలు ,చికిత్స అంశాలను వివరిస్తూ పరిసరాల పరిశుభ్రత,లార్వాల నిర్మూలన, ఫ్రైడే డ్రై డే పద్ధతిని ప్రతి ఒక్కరూ పాటించాలని,వేపాకు పొగ,దోమతెరలు వాడడం,జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయితే మూల చికిత్స తీసుకోవడం అత్యవసరమని సూచించారు.అనంతరం  మలేరియా వ్యతిరేక నినాదాలతో ప్రధాన వీధుల గుండా ర్యాలీతో అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్  హెల్త్ ప్రొవైడర్స్,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్,ఆరోగ్య పర్యవేక్షకులు,ఆరోగ్య,ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అమడగూరులో.... మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యశాలలో గురువారం వైద్యాధికారిణి రోజా ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. దోమ పుట్టకూడదు-దోమ కుట్టకూడదు,దోమతెరలను వాడండి,దోమ కాటు నుండి రక్షణ పొందండి,దోమకాటు ప్రమాదానికి ముప్పు అంటూ బస్టాండ్ నుండి పురవీధులలో ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు.మూడు రోజులకు మించి జ్వరం వచ్చిందంటే మలేరియా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని,నిల్వ ఉన్న నీటిని పారద్రోలి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారిణి అవగాహన కల్పిస్తూ.... ప్రతి ఒక్కరూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహించి, మలేరియా నివారణ కొరకు బాధ్యతగా తీసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.ఈకార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ దేశే నాయక్, సిహెచ్ఓ ఫకృధ్ధీన్, సూపర్వైజర్ ఇర్ఫాన్ బాష, ల్యాబ్ టెక్నీషియన్ గాయత్రి, ఎంఎల్ హెచ్ దివ్యవాణి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

అనుమానాస్పదంగా యువకుడు మృతి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్25(విజయ స్వప్నం.నెట్)

మండలంలోని ఓడిచెరువు పంచాయతీ వేమారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి(35) అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఓడీచెరువు మండల కేంద్రంలోని వడ్డివారిపల్లి గ్రామ సమీపంలో బాలుర సమళీకృత వసతి గృహం వెనుక వైపు సోమావతి నది మడుగు వద్ద గురువారం శవం లభ్యం కాగా, స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఎస్ఐ వంశీకృష్ణ, ఏఎస్ఐ కిషోర్ రెడ్డి,పోలీసులు చేరుకుని పరిశీలించి,వారం క్రితం నీటిలో పడి మృతిచెందినట్లు ప్రాథమిక అంచనాగా నిర్ధారించారు.మృతుడి ఆనవాళ్ళు గుర్తించి పోలీసులు సమాచారం తెలియజేయడంతో వేమారెడ్డిపల్లికి చెందిన ఉప్పుతోళ్ళ కృష్ణమూర్తిగా గుర్తించారు.మృతిని బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని,కుళ్ళిన మృతదేహాన్ని బయటికి తీయించి, పోలీసులు సంఘటన స్థలం వద్ద శవ పంచనామా నిర్వహించారు.కేసు నమోదు చేసుకుని,మృతికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.

$$$__________@@@__________$$$

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్25(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని చౌడేపల్లి గ్రామానికి చెందిన పూల లక్ష్మిరెడ్డి,కళావతమ్మ దంపతుల కుమారుడు పూల మంజునాథరెడ్డి(26) గురువారం స్వగృహంలో ఎవ్వరులేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమీప బంధువులు తెలిపారు.ఆరు నెలల క్రితం బుక్కపట్నం మారాల గ్రామానికి చెందిన యువతితో మంజునాథకి వివాహం జరుపగా,భార్య పుట్టింటికి వెళ్ళి గత కొన్ని నెలలుగా కాపురానికి రాకపోవడంతో మృతుడు మంజునాథరెడ్డి తరచూ మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.ఉదయం పనిపైన తల్లిదండ్రులు కదిరికి వెళ్ళడంతో మంజునాథరెడ్డి ఇంటి తలుపులు మూసి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో  తల్లిదండ్రులు, బంధువుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది.గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించి,కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి