google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : నేడు స్వామివారి చక్రస్నానం ఉత్సవం - రవి నాయక్ కు డాక్టరేట్ ప్రదానం - నవోదయ ప్రవేశానికి శ్రీజ్ఞానసాయి విద్యానికేతన్ విద్యార్థులు -

2, ఏప్రిల్ 2024, మంగళవారం

నేడు స్వామివారి చక్రస్నానం ఉత్సవం - రవి నాయక్ కు డాక్టరేట్ ప్రదానం - నవోదయ ప్రవేశానికి శ్రీజ్ఞానసాయి విద్యానికేతన్ విద్యార్థులు -

నేడు స్వామివారి చక్రస్నానం ఉత్సవం

శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి31(విజయస్వప్నం.నెట్) 

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 14వరోజు(ఏప్రిల్1వతేది) సోమవారం తీర్థవాది పురష్కరించుకుని కోనేరు జలంలో శ్రీవారి చక్రస్నానము, పూజా కార్యక్రమాలు, భృగు తీర్థం నుండి స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ.... ఆలయానికి చేరుకుని,ధ్వజా అవరోహణము, పూర్ణహుతి, హోమ పూజలు నిర్వహిస్తారని ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు తెలిపారు.     13వరోజు ఆదివారం శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారు అశ్వవాహనంపై తిరువీధుల్లో దర్శనమిచ్చి, అలకోత్సవ మండపం వద్ద పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

$$$__________@@@__________$$$

రవి నాయక్ కు డాక్టరేట్ ప్రదానం

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు,మార్చి31 విజయస్వప్నం.నెట్) 

మండలంలోని కొట్టువారిపల్లికి చెందిన రవినాయక్ కు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపక ఆచార్యులు డాక్టరేట్ ప్రదానం చేశారు.రవినాయక్ రాజనీతి శాస్త్రం విభాగంలో సహాయ ఆచార్యులు చంద్రమౌళి పర్యవేక్షణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం-గిరిజనుల సాధికారత అంశంపై పరిశోధన చేశారు.రవినాయక్ కు డాక్టరేట్ ప్రదానం పట్ల గ్రామస్తులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

$$$__________@@@__________$$$

మైనారిటీ వర్గాలకు జగన్ తీవ్ర అన్యాయం 

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,మార్చి 31(విజయ స్వప్నం.నెట్) 

ముస్లిం మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ తీవ్ర అన్యాయం చేశారని మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు.ఆదివారం స్థానిక వెంకట సాయి ఐటిఐ కళాశాలలో సోదరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.వైకాపా ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల వర్గాలకు అన్యాయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీఠ వేశారని ఆయన గుర్తు చేశారు.మసీదు ఈద్గా మరమ్మతుల కోసం జిల్లాకు 25 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తెదేపా ఘనతగా ఆయన పేర్కొన్నారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్లకు నెలకు 5 వేలు,మౌలాలిలకు 4వేలు చొప్పున అందించినట్లు మాజీమంత్రి పల్లె పేర్కొన్నారు.ముస్లీం మైనార్టీలకు తెదేపా ఎళ్ళవేళల అండగా ఉంటుందని ఆయన అన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో ముస్లిం సోదరులు, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నవోదయ ప్రవేశానికి శ్రీజ్ఞానసాయి విద్యానికేతన్ విద్యార్థులు



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి31(విజయస్వప్నం.నెట్) 

మండల కేంద్రంలోని శ్రీజ్ఞాన సాయి విద్యానికేతన్  ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచారు.ఆదివారం ప్రకటించిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో శ్రీజ్ఞాన సాయి పాఠశాల విజయడంక మ్రోగించింది.ఐదవ తరగతి చదువుతున్న  విద్యార్థులకు అకాడమిక్ సిలబస్ తో పాటు,సైనిక్ స్కూల్,నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించి,శిక్షణ ఇవ్వడంతో,శిక్షణ తీసుకున్న 10 మంది విద్యార్థులలో బి.ఖ్యాతి రెడ్డి, జి.శృతి కీర్తన ఇద్దరు విద్యార్థినులు అర్హత సాధించారని కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి  తెలిపారు. కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డితోపాటు ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, పుర ప్రముఖులు విద్యార్థినులను అభినందించారు.

$$$__________@@@__________$$$

చలివేంద్రం ప్రారంభం 

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు మార్చి31(విజయస్వప్నం.నెట్) 

వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడంపై ఎం.కొత్తపల్లి భాషను పలువురు అభినందించారు. మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ఆదివారం ఎం.కొత్తపల్లి భాష చలివేంద్ర శిబిరం ఏర్పాటు చేయగా ఎంపీపీ తుమ్మల పర్వీన్ షామీర్ భాను ప్రారంభించారు. వేసవి కాలంలో ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు ఎం.కొత్తపల్లి బాషా సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ముద్దలపల్లి గోవిందు,విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ ఎం.ఫక్రుద్దీన్, టైలర్ నిజాం, మండోజీ ఆరీఫ్ ఖాన్, మాల మహానాడు అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు,మార్చి31(విజయ స్వప్నం.నెట్) 

మండల కేంద్రంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి బి.జయంత్ ఆదివారం వెలువడిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధించినట్లు కరస్పాండెంట్ ఎం.ఫకృధ్థీన్ తెలిపారు.శిక్షణ తరగతులు నిర్వహించి బోధించిన ఉపాధ్యాయ బృందంకు,విద్యార్థులకు,మాపై నమ్మకంతో పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్యసాయిజిల్లా, ఓడిచెరువు,మార్చి 31(విజయస్వప్నం.నెట్) 

ఓడిచెరువు మండల కేంద్రంలో ఆదివారం సిఅండ్ఐసి మిషన్ చర్చిలో ఈస్టర్ వేడుకలు క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. యేసు క్రీస్తు శిలువ వేసిన నంతరం తిరిగి పునరుద్ధరణ రోజు సందర్భంగా ఈస్టర్ పండుగ వేడుకలు నిర్వహిస్తారని,ఈస్టర్ ప్రత్యేకతను పాస్టర్ డాక్టర్ ఎంజీ జయానందం వివరించారు. చర్చిలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి  క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిఅండ్ఐసి మిషన్ చర్చి కమిటీ కార్యదర్శి దార్ల రాజశేఖర్, సభ్యులు బాలరాజు, సునీల్ కుమార్, ఆశీర్వాదమ్మ, కమలమ్మ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

తెదేపా నుండి వైకాపాలోకి పలువురు చేరిక

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి31(విజయ స్వప్నం.నెట్) 

మండలంలోని ఇనగలూరు పంచాయతీ  గ్రామానికి చెందిన దాదాపు 100 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదివారం పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో చేరినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ....తెదేపా నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మకండని, రాబోయే ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షించి తెదేపా నుండి వందమంది వైకాపాలోకి చేరినట్లు మండల కన్వీనర్ రాజునాయుడు తెలిపారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి