వైభవంగా శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి జ్యోతోత్సవం
జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో వేలాది భక్తులు
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్27(విజయస్వప్నం.నెట్)
మండల కేంద్రంలో శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 5వరోజు శనివారం శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి మహా జ్యోతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఎం.కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తంరెడ్డి,పొట్టా ఉమాదేవి,పొట్టా జయదేవ్ రెడ్డి,గీతమ్మ,పొట్టా మల్లికార్జునరెడ్డి,పొట్టా పూజిత కుటుంబ సభ్యులు ఉభయ దారులుగా అమ్మవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం వ్వవహరించారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన కళాకారులచే అమ్మవారి రథానికి వివిధ రకాల పుష్పాలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.అమ్మవారి జ్యోతి దర్శనం కోసం రాత్రి 9 గంటలకు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి,బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారిపై డప్పు మంగళ వాయిద్యాలతో పురవీధుల గుండా ఉట్టి వద్దకు చేరుకుని,జంతుబలి హరణం తదితర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.అనంతరం యధావిధిగా ఆలయం వద్దకు అమ్మవారి రథం చేరుకోగా వివిధ ప్రాంతాల ప్రజలు,కర్ణాటక భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి రథం ఉత్సవ ఊరేగింపులో భక్తులు కాయకర్పూరం,పసుపు,కుంకుమ సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.అమ్మవారి జ్యోతోత్సవం కార్యక్రమానికి విచ్చేసి భక్తులకు చీకిరేవులపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణరెడ్డి వివిధ గ్రామాలు శీతిరెడ్డిపల్లి,చీకిరేవులపల్లి, నల్లగుట్టపల్లి,బలకవారిపల్లి,గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు,యువత సహకారంతో ఉదయం నుండి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.అమ్మవారి జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో ఆర్కెస్ట్రా,భజనలు,హరికథలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకొందాం....!
తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి ప్రచారం....!
రాష్ట్రం పురోగతి సాధించాలంటే.... నారా చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకొందామంటూ.... శనివారం తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు మండలంలోని సున్నంపల్లి, కొండకమర్ల, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.ప్రజా వ్యతిరేక పాలనును సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా శ్రమించాలని, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, సూపర్ సిక్స్ పథకాలపై వివరిస్తూ ఇంటింటా ప్రచారం చేపట్టి,మే13వతేది సైకిల్ గుర్తుకు ఓటు వేసి,పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికే పార్థసారథిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చౌడేపల్లి, రామయ్యపేట, నారప్పగారిపల్లి, గంజిబండతాండాల్లో ప్రజలను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమాల్లో వెంకటాపురం,సున్నంపల్లి సర్పంచులు శంకర్ రెడ్డి, ధారా లక్ష్మీదేవమ్మ,ఎంపీటీసీ శ్రీనివాసులు,తెదేపా నాయకులు క్లస్టర్ ఇంఛార్జ్ నారాపరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుంఛపు ఆంజనేయులు,మాజీ సర్పంచ్ నాగిరెడ్డి,ఎద్దుల ప్రమోద్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్ జాకీర్, జయచంద్ర రెడ్డి, రఘునాథరెడ్డి, ధారా నాగేంద్ర, బోనాల రామాంజనేయులు, వాటర్ బాలు, విశ్వనాథ్ రెడ్డి, వెంకటేష్,ఆంజన్ రెడ్డి,రామిరెడ్డి, వెంకటరమణ, జనసేన నాయకులు మేకల ఈశ్వర్, తలసాని దివాకర్ రెడ్డి, కొండబోయన సతీష్,చంద్ర, కేశవ,ధనుంజయ, రియాజ్, రఫీ, ప్రసాద్, శేఖర్, భరత్, శ్రీనాథ్, వీరయ్య, నారాయణ, రామకృష్ణ, కిష్టప్ప, బాలకృష్ణ, చిన్నప్పయ్య, రాజు,అంజి తెదేపా, జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైకాపాలోకి చేరిన పలువురు తెదేపా నాయకులు
వైకాపాలోకి స్వాగతించిన ఎమ్మెల్యే దుద్దుకుంట
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 27(విజయస్వప్నం.నెట్)
పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు మండలం సున్నంపల్లి పంచాయతీ పెద్దగుట్లపల్లి గ్రామానికి చెందిన పలువురు తెదేపా నాయకులు శనివారం పుట్టపర్తి శాసనసభ్యులు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపాలో చేరారు.పెద్దగుట్లపల్లి నుండి వైకాపాలోకి చేరిన వారిలో లోకానాథరెడ్డి,గంగాద్రీ, హరి తదితరులు ఉన్నారని వైకాపా శ్రేణులు తెలిపారు.ఈసంధర్బంగా వారికి శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి