అశ్వవాహనంపై శ్రీచౌడేశ్వరి అమ్మవారు దర్శనం
శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)
ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం 6వరోజు కీ"శే" యర్రంరెడ్డి,కీ"శే"చిన్నమ్మ,కీ"శే"వెంకటరెడ్డి వీరి జ్ఞాపకార్థం పి.ఆశ్వర్థమ్మ,పిఎల్ఎస్ రెడ్డి కొలూరు పి.రామిరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి,పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని పుష్పాలతో అలంకరించిన అశ్వవాహనంపై రాత్రివేళ గ్రామ పురవీధుల్లో మేళతాళాలు,వాయిద్యాలతో భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు,గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీచౌడేశ్వరిదేవి బ్రహ్మోత్సవ అమ్మవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నదాన,తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈకార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
తెదేపాతోనే యువతకు ఉపాధి అవకాశాలు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)
తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కియా లాంటి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని,తెదేపాతోనే యువతకు ఉపాధి అవకాశాలు సాధ్యమని ఆదివారం చింతమానుపల్లి పంచాయతీ గ్రామాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి మద్దతుగా పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.తెదెపా అధికారంలోకి వస్తేనే అన్ని రంగాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని,పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం పురోభివృద్ధి సాధ్యమని ఆయన ప్రచారం చేపట్టి ప్రజలకు వివరించారు.ఈకార్యక్రమంలో తెదేపా నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
భజన కళాకారుడు శ్రీధర్ నాయుడు మృతి
శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మార్చి28(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు మండలం రాసినపల్లి గ్రామానికి చెందిన భజన కళాకారుడు శ్రీధరనాయుడు ఆదివారం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీసత్యసాయిజిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు ఎం.నారాయణ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ కళాకారుడు శ్రీధర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో గ్రామ భజన సంఘం పేరు నమోదు చేయించి,ఇప్పటికి ఐదుమార్లు తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం అఖండములో హరినామ సంకీర్తన భజన కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు నిర్వహించి, స్వామివారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురికి అందుబాటులో ఉంటూ సహకరించేవారన్నారు.హరినామ సంకీర్తన భజన గీతాలు ఆలపించడమే కాకుండా ప్రతివ్రత శిరోమణి,సాసవ చిన్నమ్మ తల్లి చరిత్రను కథ రూపంలో రంగస్థల వేదికలపై నాటక రూపంలో కళాకారుడు శ్రీధర్ నాయుడు ఎన్నో ప్రదర్శనలతో మన్ననలు పొందారని కొనియాడారు.గొప్ప కళాకారుడిని కోల్పోయమని ఆవేదన వ్యక్తం చేశారు.కళాకారుడు శ్రీధర్ నాయుడు మృతి పట్ల పలువురు జానపద వృత్తి కళాకారుల సంఘం సభ్యులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి,శ్రీధర్ నాయుడు ఆత్మకు శాంతి కలగాలని భగవంతునికి కోరుకున్నారు.
$$$__________@@@__________$$$
వైకాపాను గెలిపించాలని ప్రచారం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)
మండలంలోని సున్నంపల్లి పంచాయతీ చౌడేపల్లి,ఎంబి క్రాస్,వంచిరెడ్డిపల్లి,నందివారిపల్లి ఎస్సీ,బీసీ కాలనీల్లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.ఇంటింటికి తిరుగుతూ....ఎవ్వరి ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న వైకాపా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని, పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రీధరన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రచారం చేపట్టిన్నట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
పరారీలో బ్యాంకు మేనేజర్ చెన్నై లో అరెస్ట్
సత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్28 (విజయస్వప్నం.నెట్)
గతంలో 2021-22 లో అమడగూరు మండల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న కె.పెంచల రెడ్డిని ఆదివారం చెన్నై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసిన సమాచారంతో మండలంలోని రైతులు,ప్రజలు పోలీసు అధికారులను అభినందిస్తున్నారు.అప్పట్లో పెంచల రెడ్డి బ్యాంక్ మేనేజర్ గా పని చేసేటప్పుడు ఖాతాదారుల నుండి(అధికంగా రైతుల ఖాతాల నుండి)అక్రమ పద్ధతుల్లో వివిధ ప్రభుత్వ పథకాలు కింద మంజూరైన దాదాపు 45లక్షలకు పైన తెలియకుండా సొంత అవసరాలకు వాడుకున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.అప్పటి బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు 2022లో పెంచల్ రెడ్డి పైన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే.అప్పటినుండి బ్యాంకు మేనేజర్ పెంచల్ రెడ్డి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.నల్లమాడ సిఐ రాజేంద్రనాధ్ యాదవ్ పర్యవేక్షణలో 27వ తేదీ(నిన్నటి రోజు)ఆదివారం పెంచల్ రెడ్డి కౌలాలంపూర్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో అధికారుల సహాయంతో బ్యాంకు మేనేజర్ పెంచల్ రెడ్డిని చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కదిరి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ మగ్బుల్ బాషా తెలిపారు.దర్యాప్తులో భాగంగా పెంచల్ రెడ్డిని కోర్టు అనుమతితో పోలీసుల కస్టడీలో తీసుకొని విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
$$$__________@@@__________$$$
మే 3న శ్రీఅయ్యప్పస్వామి విగ్రహ పునఃప్రతిస్థాపన
మేల్ తాంత్రీ శ్రీ పరమేశ్వరన్ నంబూద్రి స్వామివారిచే పూజలు
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్29(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో వెలసిన శ్రీఅయ్యప్పస్వామి సన్నిధిలో శ్రీ జనార్ధన్ గురుస్వామి ఆశీస్సులతో మే 2 నుండి 3 తేదీ వరకు స్వామివారి విగ్రహ పునఃప్రతిస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ శంకరయ్య,కార్యదర్శి కేవి రమణయ్య ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో బ్రహ్మాశ్రీ శ్రీపరమేశ్వరన్ నంబూద్రి తాంత్రీ స్వామివారిచే పూజలు నిర్వహిస్తారని తెలిపారు. 2వతేది గురువారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు వినాయక స్వామివారికి హోమం, ఉషపూజ, కలశపూజ, కలశాభిషేకం, ఉత్ఫపూజ అనంతరం తీర్థ ప్రసాదాలు వినియోగం, సాయంత్రం 6:30 గంటలకు దీపారాధన,7:30 గంటలకు శ్రీ భగవతీ అమ్మవారి సేవా అనంతరం మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు వినియోగం, 3వతేది ఉదయం నుండి ప్రత్యేక పూజలు, స్వామివారి విగ్రహ పునఃప్రతిస్థాపన పూజలు, మధ్యాహ్నం స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అన్నదాన తీర్థప్రసాదాలు వినియోగం సాయంత్రం 6:30 గంటలకు ఆలయ అర్చకులు తులసి స్వామివారిచే అయ్యప్పస్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి, 7:30 గంటలకు పడిపూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.
$$$__________@@@__________$$$
కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకుని అభ్యర్థులు ప్రచారం చేపట్టాలి
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్28(విజయస్వప్నం.నెట్)
ప్రచారం కోసం కనీసం 10 మంది నాయకులతో కలసి ప్రచారం చేబడితే గౌరవంగా ఉంటుందని మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, మాజీ ఎంపీటీసీ తుమ్మల మహబూబ్ బాష కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు హితువు పలికారు.ఆదివారం ఆయన విలేకరులకు ఓప్రకటనలో పేర్కొంటూ.... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొందరైతే 5 మందితో ప్రచారం చేయడం చాలా అవమానకరమని, గత రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పార్టీ క్యాడర్ లీడర్లను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు పిలవకుండా పార్టీ పరువు తీస్తున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తామని రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి వద్ద ప్రగల్భాలు పలికి, స్థానికంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల తర్వాత కపట ప్రేమ వల్లిస్తున్న ఇలాంటి కాగితపు పులులు కనుమరుగు అయిపోతారని ఎద్దేవా చేశారు.చివరికి మిగిలేది కాంగ్రెస్ పార్టీ ప్రాణంగా భావించే నిజమైన కార్యకర్తలు మేమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ.... ఇప్పటికైనా మండల, గ్రామస్ధాయిలో నాయకులను,కార్యకర్తలను కలుపుకుని ప్రచారం చేపట్టాలని, చేతకాక పోతే పార్టీ ఫండ్ ఏమైనా వస్తే తీసుకుని ఎన్నికల ప్రచారం నుండి పారి పోవాలని,అలా కాకపోతే ఎన్నికల తరువాత మిమ్మల్ని పార్టీ కార్యకర్తలు క్షమించరని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు (పట్టుమని పదిమంది కూడా లేకుండా ప్రచారం చేస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి వైఖరిపై మాజీ ఎంపీటీసీ మహబూబ్ బాష ఫోటోలు పంపించి స్పందిస్తూ విలేకరులకు ఓప్రకటనలో పేర్కొంటూ.... ఇటీవలే ఓడిచెరువు మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తో సహా నాయకులు,కార్యకర్తలు కార్యకర్తలు రాజీనామాలు చేసిన విషయం ఆయన గుర్తు చేశారు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి