google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉయ్యాల ఉత్సవ సేవ - జిల్లా వ్యాప్తంగా MEOలకు ప్రధానోపాధ్యాయులు కు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని DTF తీవ్రంగా ఖండిస్తోంది

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉయ్యాల ఉత్సవ సేవ - జిల్లా వ్యాప్తంగా MEOలకు ప్రధానోపాధ్యాయులు కు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని DTF తీవ్రంగా ఖండిస్తోంది

వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉయ్యాల ఉత్సవ సేవ

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

ఈనెల 23 నుండి 30వతేది వరకు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జ్యోతి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం 2వరోజు శీతిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారి ఉయ్యాల సేవ ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.ముందుగా శ్రీదేవి అమ్మవారికి శీతిరెడ్డిపల్లి గ్రామస్తులు పూజలు నిర్వహించి,జ్యోతుల భోనాలు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.గ్రామానికి చేరుకున్న అమ్మవారి విగ్రహానికి పుష్పాలతో అలంకరించి, రాత్రివేళ అమ్మవారి ఉత్సవ పల్లకిని గ్రామ పురవీధుల్లో మేళతాళాల మధ్య  భక్తులకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించి, కాలక్షేపం కోసం గ్రామస్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

$$$__________@@@__________$$$

అట్టహాసంగా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నామినేషన్ దాఖలు




శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

పుట్టపర్తి నియోజకవర్గం శాసనసభ స్థానానికి బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జనసమూహం మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సత్యమ్మ ఆలయం కూడలి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన వెంట మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి,సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి వున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.... గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని, వైకాపాపై పచ్చ పార్టీ నాయకుల అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే.... మే 13వతేది జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఈసందర్భంగా వివరించారు.వైకాపా శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.  నామినేషన్ కు తరలిన వైకాపా శ్రేణులు  పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి  నామినేషన్ కార్యక్రమానికి బుధవారం మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుండి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

జిల్లా వ్యాప్తంగా  MEOలకు ప్రధానోపాధ్యాయులు కు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని DTF తీవ్రంగా ఖండిస్తోంది

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

జిల్లా వ్యాప్తంగా 62 మంది ఎంఈఓలకి... దాదాపు 422మంది ప్రధానోపాధ్యాయులకు 2023- 24 సంవత్సరానికి సంబంధించిన యుడైస్ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ...

పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారనే కారణంగా ఇంత పెద్ద ఎత్తున షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరైనది కాదని డిటిఎఫ్  ఖండిస్తూ.... వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్, ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

$$$__________@@@__________$$$

వైకాపా నుండి తెదేపాలోకి పలువురు చేరిక



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్24(విజయస్వప్నం.నెట్)

మండలంలోని ఎంబి క్రాస్ గ్రామానికి చెందిన వైకాపా నాయకులు,కార్యకర్తలు బుధవారం మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు తెదేపా శ్రేణులు తెలిపారు. తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ సిక్స్ మినీ మ్యానిఫెస్టో పథకాలు ఆకర్షించాయని, రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వైకాపా నుండి తెదేపాలోకి చేరినట్లు చుక్క భైరిశెట్టి, బోనాల శంకరాచారి,డేగ వెంకటరమణ, బాలకృష్ణాచారి, నంది నర్సింహులు, పెద్దప్పయ్య తదితరులు పేర్కొన్నారు. దాదాపుగా 180 మంది మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి తెదేపాలోకి చేరినట్లు తెలిపారు.చేరినవారికి మాజీమంత్రి పల్లె కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీమంత్రి పల్లె మాట్లాడుతూ.... రాష్ట్రంలో జగనన్న పాలనకు చరమగీతం పాడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆయన సూచించారు. మే 13వతేది సైకిల్ గుర్తుకు ఓటు వేసి, తెదేపా, జనసేన,బిజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,ప్రధాన కార్యదర్శి పీట్లా సుధాకర్, మాజీ రెస్కో ఛైర్మన్ లాయర్ రాజశేఖర్, తెదేపా మండల ఇంఛార్జ్ శ్యాంబాబు నాయుడు,రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కృష్ణమూర్తి,జనసేన,బిజేపీ మండల కన్వీనర్లు మేకల ఈశ్వర్,రంగారెడ్డి తెదేపా, జనసేన, బిజేపీ ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి