google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - పది ఫలితాల్లో జిల్లా టాపర్ గా గోరంట్ల విద్యార్థి

23, ఏప్రిల్ 2024, మంగళవారం

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు - పది ఫలితాల్లో జిల్లా టాపర్ గా గోరంట్ల విద్యార్థి

599 మార్కులతో ఏలూరు విద్యార్థినీ స్టేట్ ఫస్ట్ 

శ్రీసత్యసాయిజిల్లా ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్  విడుదల చేసిన పది ఫలితాల్లో ఏలూరు విద్యార్థినీ స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్ఎస్సి బోర్డ్ ప్రకటించింది.2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది.ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ)మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది.హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 మార్కులు వచ్చాయి.ఈ మేరకు మనస్వి ఈ ఏడాది (2024) పదో తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.

రాష్ట్రంలో బాలురు 84.02 శాతం,బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత పొందారు. బాలురు కంటే బాలికలు 4.98 శాతం అధికంగా పాస్‌ పర్సెంటైల్‌ సాధించారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాల్లో జిల్లా టాపర్ గా గోరంట్ల విద్యార్థి

596 మార్కులు సాధించిన విద్యార్థి యువకిశోర్ రెడ్డి

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)


సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోమవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గోరంట్ల మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసరెడ్డి,త్రివేణి దంపతుల కుమారుడు డి.యువ కిషోర్ రెడ్డి 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి శ్రీసత్యసాయి జిల్లా టాపర్ గా నిలిచారని గోరంట్ల శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు.శ్రీసత్యసాయిజిల్లా స్దాయిలో డి.యువ కిషోర్ రెడ్డి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో టాపర్ గా నిలవడం కళాశాలకు ఎంత గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థి యువకిశోర్ రెడ్డిని అభినందిస్తూ.... పాఠశాలలో సత్కరించారు.జిల్లా టాపర్ గా ప్రతిభ కనబరిచిన విద్యార్ధి యువకిశోర్ రెడ్డిని మండల వాసులు అభినందించారు.                   

కదిరి విద్యార్ధినీ జిల్లా టాపర్ సోమవారం వెలుబడిన పది ఫలితాల్లో శ్రీసత్యసాయిజిల్లా కదిరి పట్టణంలో నారాయణ పాఠశాల విద్యార్ధిని కే.షర్మీలారెడ్డి 600/596 మార్కులు సాధించి ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా టాపర్ గా నిలిచినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం సంతోషం వ్యక్తం చేశారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాలలో రెయిన్బో పాఠశాల విజయ దుందుభి

593 డివిజన్ టాపర్ గా విద్యార్ధి మేఘనాథ్ రెడ్డి



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

సెకండరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన  పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండలంలోని రైన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.593/600 మార్కులతో 

మేఘనాథ్ రెడ్డి ప్రధమ శ్రేణి సాధించి డివిజన్ టాపర్ గా నిలిచారు.అలాగే హర్షవర్ధన్ రెడ్డి 587 మార్కులతో పాఠశాలలో రెండవ స్థానంలో,లతిక 579 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు.100% ఉత్తీర్ణతతో పాటు ఎనిమిది మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు.మొత్తంగా 16 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులను సాధించి ఓడిచెరువు మండలంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది.ఇంతటి విజయానికి కారకులైన విద్యార్థినీ,విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.యం.జయసింహారెడ్డి అభినందించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు.

$$$__________@@@__________$$$

వశిష్ట విద్యార్థుల వందశాతం ఉత్తీర్ణత



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం వెలుబడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో వశిష్ట పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో విజయ దుందుభి మోగించారు.పరీక్ష రాసిన విద్యార్థులు 67 మందికి 67 మంది మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు శివశంకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.కే.మౌనిష 589 మార్కులతో  మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా,550 మార్కుల పైన 22 మంది విద్యార్థులు,500  మార్కుల పైన 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని,గణితంలో 100/100 16 మంది విద్యార్థులు,సైన్సులో 100/100 నలుగురు విద్యార్థులు,తెలుగులో 100/100 ఒక్కరు మార్కులు సాధించాలన్నారు.ఈ ఫలితాలతో పాటు ఆధునిక పోటీ ప్రపంచంలో ధీటైన విద్యను అందిస్తున్న పాఠశాలలో ఐఐటి విద్యాభోథనలతో దూసుకుపోతున్న ఏకైక విద్యాసంస్థ వశిష్ట ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రత్యేకతని పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

పదిలో శ్రీ విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండల కేంద్రంలో శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 97% ఉత్తీర్ణతతో విజయ ఢంకా మోగించారు.పరీక్ష రాసిన విద్యార్థులు 88 మందికి 85 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కరస్పాండెంట్ మస్తాన్ తెలిపారు.వి.వినయ్ కుమార్ రెడ్డి 589 మార్కులతో  మొదటి స్థానంలో,టిఎస్.టబ్రెజ్ 586,బి.దివ్యశ్రీ 583,బి.జవిర్యా 581మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.పైన 22 మంది విద్యార్థులు,500  మార్కుల పైన 40మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.పాఠశాల కరస్పాండెంట్ యం.మస్తాన్ ఈసందర్భంగా విద్యార్థులకు, బోధించిన ఉపాధ్యాయులను అభినందించారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాల్లో వాల్మీకి విద్యార్థుల ప్రభంజనం

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం ప్రకటించన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వాల్మీకి పాఠశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు.టి. భరద్వాజ 592 ప్రధమ స్థానం సాధించగా, ఎస్.తస్మియా 591,పియం.నిజ్భ 591,ఇ.దేదీప్య 591 ద్వితీయ స్ధానంలో,ఎం.ప్రణతి 590 తృతీయ స్థానంలో నిలిచారు.అలాగే 580 పైగా 27 మంది విద్యార్థులు,550 పైగా 127 మంది విద్యార్థులు,500 మార్కులు పైగా 275 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.ఈ విజయానికి కారణం అయిన ఉపాధ్యాయులకు,తల్లిదండ్రులకు పాఠశాల కరస్పాండెంట్ కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాల్లో విజ్ఞాన్ పాఠశాల విజయ దుందుభి

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

 మండలంలోని విజ్ఞాన్ పాఠశాల పదవ తరగతి విద్యార్థులు సోమవారం వెలుబడిన ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు.టి.సునీత 585/600 మార్కులతో ప్రధమ స్థానంలో,ఎం.అభిషేక్ 581/600 ద్వితీయ స్ధానంలో,ఎం.అజయ్ కుమార్ నాయక్ 573 తృతీయ స్థానంలో నిలిచారని కరస్పాండెంట్ ఎం.ఫకృధ్థీన్ తెలిపారు.9 మంది విద్యార్థులు 550 పైగా మార్కులు సాధించారని,25 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించి మండలంలో విజ్ఞాన్ ఇంగ్లీష్ పాఠశాలను ప్రధమ స్థానంలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.ఇంతటి గొప్ప విజయానికి కారకులైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులను,విద్యా బోధక ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ ఎం.ఫకృధ్ధీన్ అభినందించారు.

$$$__________@@@__________$$$

సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

590 మండల టాపర్ గా విద్యార్ధి  ఎ.చందు

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు

A. రితిక 569

M. ఆశ  580

M. చందు 590

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

నేడు విడుదలైన ఎస్ఎస్ సి ఫలితాలలో అమడగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.పాఠశాల విద్యార్ధి ఎం.చందు 590 మార్కులతో మండల టాపర్ గా నిలిచారని ప్రధానోపాధ్యాయులు పి.శ్రీధర్ బాబు సోమవారం తెలిపారు. అలాగే పాఠశాలలో 500కు పైగా పలువురు విద్యార్థులు మార్కులు సాధించడంతో ఉపాధ్యాయ బృందం సంతోషంగా వ్యక్తం చేశారు.ఎం.చందు 590 టాపర్ గా సాధించగా,ఎం.ఆశ 580,ఏ.రితిక 569,కే.ఇందు,545 సోహేల్ ఖాన్ 527,శృతి 527,అర్జున్ రెడ్డి 512,రమ్య 508 మార్కులు సాధించారని,2023-24 విద్యా సంవత్సరంలో 51 మంది గాను 41 మంది పాసయ్యారని పది పరీక్షాలలో ప్రభంజనం సృష్టించారని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను,భోధనలపై నమ్మకంతో పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు అభినందించారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

పది ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన హరీష్ విద్యార్థులు

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

కదిరి రూరల్ పరిధిలోని ఎరుకులవాండ్లపల్లి సమీపంలో హరీష్ పాఠశాల విద్యార్థులు సోమవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ యం.యస్. కిరణ్ తెలిపారు. కె.మైథిలి 600గాను 592 మార్కులు,యస్.సఫిరా అంజూమ్ 590,యస్.గీతికా నాగసాయి 586,పి.విశాల్ రెడ్డి 586,యస్.యఫ్.తౌహీద్ 581,యస్.యం.డి.ఫాజిల్ 580 మార్కులు సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యం.యస్.కిరణ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషదాయకమన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా హరీష్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని,ఇందుకు నేడు వెలువడిన ఫలితాలే నిదర్శనమన్నారు.మొత్తం 51 మంది విద్యార్థులకు గాను తెలుగులో ఇరువురు  విద్యార్థులు,గణితంలో 19 మంది విద్యార్థులు,సైన్స్ ఒకరు,సోషియల్ లో 5 మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించినట్లు తెలిపారు.విద్యార్థులు ఉన్నత చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను అభినందించి,మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

$$$__________@@@__________$$$

పదిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయ ఢంకా


ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయు


శ్రీసత్యసాయిజిల్లా తలుపుల ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో తలుపుల మండల ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు.పాఠశాల విద్యార్థులు 170 మంది పరీక్షలు రాయగా 167 మంది ఉత్తీర్ణత సాధించి 98.3%తో విజయ ఢంకా మోగించారు.అత్యంత ప్రతిభ కనబరిచిన  వై.సుశాంత్ రెడ్డి 589 మార్కులతో పాఠశాల ప్రథమ స్థానం సాధించగా, బి.హాసిని 584 మార్కులతో ద్వితీయ స్థానం,జి.జోష్న 583 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని,అలాగే  500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 55 మంది కాగా,మొత్తం 150 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో,13 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని ఉపాధ్యాయ బృందం తెలిపారు.నియోజకవర్గంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన  తలుపులు ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల ప్రధమ స్థానంలో నిలిచిందని,గత మూడేళ్లుగా తలుపుల ప్రభుత్వ పాఠశాల విజయ ఢంకా మోగిస్తూ.....ప్రధమ స్థానంలో గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరన్న,ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తంచేశారు.ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను,ఎంతో నమ్మకంతో పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

పదిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

శ్రీసత్యసాయిజిల్లా తనకల్లు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్) 

సోమవారం ఎస్ఎస్ సి విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తనకల్లు ప్రభుత్వం జిల్లా ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రధానోపాధ్యాయుడు ఖాదరవలి భాష, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఖాదర్ వలీ బాషా మాట్లాడుతూ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా వాటికంటే అధికంగా 94.52 శాతంతో అత్యుత్తమ ఫలితాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.తమ పాఠశాలలో 102 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 95 మంది ఉత్తీర్ణత సాధించారని, అందులో ప్రధమ స్థానంలో ఎం.భారతి 574,ద్వితీయ స్ధానంలో ఎస్.నఫీసా 572,పి.సాయి త్రిషా 559 మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు.అలాగే మిగిలిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొంటూ.... విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో విద్యార్థులను, ఉపాధ్యాయులను మండల వాసులు, గ్రామస్తులు,తల్లిదండ్రులు అభినందించారు.

$$$__________@@@__________$$$

పదిలో మంగళకర విద్యార్థుల ప్రతిభ

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

పత్తి మండల పరిధిలోని జగరాజుపల్లి గ్రామ మంగళకర పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు పరీక్ష ఫలితాలలో ప్రతిభ కనబరిచారు.10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ పాసయ్యారని,ఇందులో 44 మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు ఉపాధ్యాయ బృందం తెలిపారు.పి.లిఖిత 584,ఆర్.దర్శిని 583,ఎల్. రమ్య 580,తేజస్విని 571,చేతన్ సాయి 564, నాగలక్ష్మి 563 మార్కులు సాధించారని తెలిపారు.ఈ ఫలితాలు సాధించడానికి కృషిచేసిన బోధన ఉపాధ్యాయ బంధానికి,విద్యార్థులకు మంగళకర పాఠశాల కరస్పాండెంట్ సురేష్ కుమార్, సంస్థ ప్రతినిధి ఆర్యా ప్రకాష్,ఏఓ జయచంద్ర, ప్రధానోపాధ్యాయిని బిందుజా అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

పది ఫలితాలలో రెయిన్బో పాఠశాల విజయ దుందుభి

593 డివిజన్ టాపర్ గా విద్యార్ధి మేఘనాథ్ రెడ్డి




శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్22(విజయస్వప్నం.నెట్)

సెకండరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన  పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండలంలోని రైన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 593/600 మార్కులతో మేఘనాథ్ రెడ్డి ప్రధమ శ్రేణి సాధించి డివిజన్ టాపర్ గా నిలిచారు.అలాగే హర్షవర్ధన్ రెడ్డి 587 మార్కులతో పాఠశాలలో రెండవ స్థానంలో,లతిక 579 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు.100% ఉత్తీర్ణతతో పాటు ఎనిమిది మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. మొత్తంగా 16 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులను సాధించి ఓడిచెరువు మండలంలో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది.ఇంతటి విజయానికి కారకులైన విద్యార్థినీ, విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.యం. జయసింహారెడ్డి అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి