నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 04(విజయస్వప్నం.నెట్)
ఎన్నికల కమిషన్ నియమావళి మేరకు గురువారం ఎస్ఐ వంశీకృష్ణ పోలీసులతో కలిసి యంబి క్రాస్ గ్రామ సమీపంలో వాహనాలను తనిఖీలు చేపట్టారు.నిబంధనలు ఉల్లంఘించి వాహనాలల్లో అక్రమంగా మద్యం,నగదు,నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.ద్విచక్ర, ఆటోలు తదితర భారీ వాహనాలను తనిఖీలు నిర్వహించి ఆయన రికార్డులు పరిశీలించారు.
$$$__________@@@__________$$$
నలుగురు వాలంటీర్లు రాజీనామా
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్04(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు సచివాలయం గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న నలుగురు వాలంటీర్లు గురువారం స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తెలిపారు.ఐదేళ్ళుగా గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్న చంద్రశేఖర్,రమేష్,ఫకృధ్థీన్,గంగాద్రీ స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలను మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిణి వరలక్ష్మికి అందజేశారని తెలిపారు.
$$$__________@@@__________$$$
ప్రచారం మొదలుపెట్టిన బిఎస్పీ అభ్యర్థులు
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్ 04(విజయస్వప్నం.నెట్)
మండలంలోని తుమ్మలకుంట్లపల్లి గ్రామం నుండి గురువారం బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంపావతిని గోవిందు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ముందుగా గ్రామ దేవత శ్రీదండు మారెమ్మతల్లి ఆలయంలో పుట్టపర్తి శాసనసభ బిఎస్పీ అభ్యర్థి అంపావతిని గోవిందు,హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వడ్డే నాగరాజు,బిఎస్పీ నాయకులు,కార్యకర్తలు పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.అన్ని వర్గాలకు సంక్షమ పథకాలను అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి సాధించాలంటే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీకే సాధ్యమని,ఇంటింటికి వెళ్ళి బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారని ఎమ్మెల్యే అభ్యర్థి అంపావతిని గోవిందు తెలిపారు.తుమ్మలకుంట్లపల్లి, వెంకటాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో మొదటిరోజు ప్రచారం చేపట్టారని ఆయన పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి