వైకాపా నుండి తెదేపాలోకి పలువురు చేరిక
మండలంలోని తుమ్మలకుంట్లపల్లి పంచాయతీ లో శనివారం సర్పంచ్ శ్రీదేవి ఆధ్వర్యంలో పలువురు వైకాపా నాయకులు,కార్యకర్తలు తెదేపా లోకి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో చేరారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెదేపా జాతీయ అధ్యక్షులు మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, సూపర్ సిక్స్ పథకాలు ఆకర్షించాయని, వైకాపా నుండి తెదేపాలోకి చేరినట్లు తెలిపారు.పార్టీలోకి చేరిన వారికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.తెదేపా,జనసేన,బిజేపీ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
బిజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఆకుతోట హరికృష్ణ
శ్రీసత్యసాయిజిల్లా బిజేపీ కార్యవర్గ సభ్యులుగా మండల కేంద్రానికి చెందిన ఆకుతోట హరికృష్ణను శనివారం నియమించినట్లు తెలిపారు.నూతనంగా ఎంపికైన శ్రీసత్యసాయిజిల్లా బిజేపీ కార్యవర్గ సభ్యులు ఆకుతోట హరికృష్ణ మాట్లాడుతూ....మరింత భాధ్యతగా మండల, గ్రామస్ధాయిలో కార్యక్రమాలు విసృతంగా ప్రచారం చేపట్టి బిజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.బిజేపిలో అందించిన సేవలను గుర్తించి జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసిన శ్రీసత్యసాయిజిల్లా బిజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ స్వామికి, సీనియర్ బిజేపీ రాష్ట్ర నాయకులు ఉత్తమరెడ్డికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ కి, జిల్లా ఉపాధ్యక్షులు కొండమరాజుకి,రాష్ట్ర కల్లుగీత కార్మిక కమిటీ కన్వీనర్ లాయర్ హరికృష్ణకి,జిల్లా ప్రధాన కార్యదర్శులు బూదిలి సుదర్శన్ కి,మేకల శ్రీనివాసులు కి, నియోజకవర్గ కన్వీనర్ హనుమంతరెడ్డికి,కో కన్వీనర్ శేషాద్రి నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు,సహకరించిన మండల నాయకులు రంగారెడ్డికి, మేకల వెంకటరమణకు,ఆశ్వర్ధప్ప తదితర కార్యకర్తలకు ధన్యవాదాలు ఆకుతోట హరికృష్ణ తెలిపారు.
$$$__________@@@__________$$$
తెదేపా నుండి వైకాపాలోకి పలువురు చేరిక
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్13(విజయస్వప్నండాట్.నెట్)
ఓడిచెరువు మండల పరిధిలోని తుమ్మలకుంట్లపల్లి బసప్పగారిపల్లి గ్రామానికి చెందిన తెదేపా నాయకులు,కార్యకర్తలు వైకాపాలోకి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమక్షంలో శనివారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయగా పలువురు చేరినట్లు వైకాపా శ్రేణులు తెలిపారు.సియం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షించి వైకాపాలో చేరినట్లు తెలిపారు.సియం వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైకాపా మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
శ్రీలక్ష్మీసింహుడి సన్నిధిలో బాలకృష్ణ పూజలు
Nandamuri BalaKrishna at kadiri narasimha swamy temple |
Nandamuri BalaKrishna at kadiri narasimha swamy temple |
శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్ 13(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శనివారం సిని నటుడు,హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణాంధ్ర సాధరా యాత్రలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కదిరిలో పర్యటించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణకు పూర్ణకుంభం హారతితో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.తదుపరి శ్రీలక్ష్మీసింహస్వామివారి సన్నిధిలో అర్చనలు,అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ సమీపంలో అలంఖాన్ వలి దుర్గా వద్దకు బాలకృష్ణ చేరుకోగా ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు.అంతక ముందు బెంగుళూరు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో కదిరి డిగ్రీ కళాశాల మైదానంలోకి చేరుకొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కదిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్,తెదేపా శ్రీసత్యసాయిజిల్లా అధ్యక్షులు బివీ వెంకటరాముడు, గ్రంధాలయ మాజీ ఛైర్మన్ గౌస్ మొద్దీన్,తెదేపా నాయకులు పవన్ కుమార్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, కృష్ణమోహన్ నాయుడు, అహ్మద్ అలీ తదితరులు పుష్పగుచ్ఛాలు స్వాగతం పలికారు. బాలకృష్ణను చూడడానికి అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా బాలకృష్ణ అభివాదం చేస్తూ, సిఎల్పీలు, ఫోటోలు తీసుకోవడానికి ఆయన చొరవ చూపారు.
ఘనంగా శ్రీచెన్నకేశవస్వామి ఎలవ గంప ఉత్సవం
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్13(విజయస్వప్నం.నెట్)
మండలంలోని కొక్కంటీవారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో ప్రతి ఇంటి నుంచి పసుపు,కుంకుమ, పుష్పం,పత్రం,నైవేద్యాలు ఎలవ గంపలలో స్వామివారికి సమర్పించి, గ్రామ పురవీధుల్లో గురువయ్య స్వాములు ఉరుములు,వాయిద్యాలతో ఊరేగింపుగా శ్రీచెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పొర్లు దండాలతో ముక్కులు తీర్చుకున్నారు,అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
$$$__________@@@__________$$$
నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఈనెల 14వతేది ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దళిత సంఘాల నాయకులు తెలిపారు.నూతన డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన బిఆర్ అంబేద్కర్ విగ్రహస్ధాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొంటూ.... ఈ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో అధికారులు,ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, కావున మండల,గ్రామాల నుండి అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి