google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : ఘనంగా శ్రీఅక్కదేవతల ఎలవ గుంప ఉత్సవం - నేడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం - ఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు - శ్రీచౌడేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం 5.46 లక్షలు

6, ఏప్రిల్ 2024, శనివారం

ఘనంగా శ్రీఅక్కదేవతల ఎలవ గుంప ఉత్సవం - నేడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం - ఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు - శ్రీచౌడేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం 5.46 లక్షలు

ఘనంగా శ్రీఅక్కదేవతల ఎలవ గుంప ఉత్సవం


 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్05(విజయస్వపం.నెట్) 

మండల పరిధిలోని  మల్లోలపల్లి గ్రామంలో శ్రీ అక్కదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం గ్రామ పుర వీధుల్లో గురువయ్యలు ఉరుములు,వాయిద్యాలతో ఎలవ గంప ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు.మొక్కులు సమర్పించి,దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

$$$__________@@@__________$$$

నేడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం 

శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్05(విజయస్వప్నం.నెట్)

నేడు శనివారం పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి మండలంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు మండల వైకాపా శ్రేణులు తెలిపారు.మండలంలోని గుండువారిపల్లి పంచాయతీ పరిధిలోని మామిడిమాకులపల్లి, కొలిమిరాళ్ళపల్లి,సోదకుంట్లపల్లి, గుండువారిపల్లి గ్రామాల్లో దుద్దుకుంట కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వంలో సియం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి,మరోసారి వైఎస్ జగనన్నని ఆశ్వర్దించి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేపట్టనున్నట్లు మండల కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు.ఎన్నికల ప్రచారంలో వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఈసందర్భంగా ఆయన కోరారు.

$$$__________@@@__________$$$

వృద్ధాశ్రమంలో చలివేంద్రం ఏర్పాటు


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్05(విజయస్వప్నం.నెట్) 

మండల పరిధిలోని గాజుకుంటపల్లి సమీపంలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో శుక్రవారం ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి చలివేంద్ర శిబిరం ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.... వేసవి కాలంలో ఎండలు తీవ్ర ప్రభావం వల్ల వృద్ధాశ్రమానికి విచ్చేసే వారికోసమే కాకుండా మండల కేంద్రానికి వివిధ సమస్యలతో వెళ్ళే వాహనదారులు,పాదచారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.గత రెండేళ్ళుగా వేసవి కాలంలో ప్రజలకు అందుబాటులో వృద్ధాశ్రమంలో చలివేంద్రం ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

$$$__________@@@__________$$$

వైకాపాకు గుడ్ బై చెప్పి 40 కుటుంబాలు తెదేపాలోకి చేరిక

సియం జగన్ ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించండీ:మాజీ మంత్రి పల్లె


శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఏప్రిల్05(విజయస్వప్నం.నెట్)

వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఆపార్టీకి చమరగీతం పాడాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.ఓడి చెరువు మండలంలోని డబురువారిపల్లిలో శుక్రవారం నిర్వహించిన జయహో బిసి సమావేశంలో వైకాపా నుంచి టీడీపీలోకి చేరిక కార్యక్రమంలో మాజీమంత్రి పల్లె పాల్గొన్నారు.డబురువారిపల్లి పంచాయతీలో సుమారు 40 వైకాపా కుటుంబాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు.పార్టీలోకి చేరిన వారికి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి వారిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు.సుమారు 3500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని,ఏపికి 12 లక్షలు అప్పు భారం ప్రజలపై పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డి మాత్రమే అన్నారు.రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరుగలేదని,రోడ్లు వేయలేదని,సాగు,తాగునీరు తీసుకురాలేదని,పోలవరం నిర్మాణం చేపట్టలేదని,మరి ఎందుకు అప్పులు పెరిగాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పై ఉందన్నారు. ఏపీని మరో శ్రీలంకగా జగన్ మార్చారని ఎద్దేవా చేశారు.ఇసుక,మద్యం,కరెంట్ చార్జీల పెంపు,చెత్త పన్ను,ఆస్తి పన్ను ప్రజలపై భారం వేసి కోట్లాది రూపాయలు దోచేశారని వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు జగన్ రెడ్డి చెల్లికి, తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వైకాపా నుంచి టీడీపీకి చేరిన వారిలో ఎద్దుల శివారెడ్డి, ఎద్దుల శంకర్ రెడ్డి, అమిర్ భాష, మహేష్, చెన్నకేశవరెడ్డి, వెంకట్, రవీంద్రారెడ్డి, లక్ష్మీనారాయణ, రాజారెడ్డి, శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, అప్పిరెడ్డి, నరసింహారెడ్డి, గోవింద్ రెడ్డి, సూరి, శివ తోపాటు పలు కుటుంబాలు టీడీపీలోకి చేరాయి.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయ చంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి,జనసేన మండల కన్వీనర్ మేకల ఈశ్వర్,అమడుగూరు మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి,సర్పంచ్ శంకర్ రెడ్డి,ఎంపిటిసి శ్రీనివాసులు,మాజీ ఎంపీటీసీలు రాజారెడ్డి, రామానాయుడు,పీట్ల సుధాకర్,ఆరిఫ్ ఖాన్,శివారెడ్డి,మీసేవ సుధాకర్,గంటా శ్రీనివాస్, అంజినప్ప,నాగరాజు,ఎద్దుల నారాయణ రెడ్డి,తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజీ,సురేష్,జాకీర్,జయచంద్ర రెడ్డి,కొండే ఈశ్వరయ్య, గంగాధర్, చక్రధర్, సూరి, చంద్రశేఖర్ రెడ్డి, చౌట కిట్టప్ప, కంచి సురేష్, సౌదీ నాగరాజు, శ్రీనివాసులు, అంజన్ రెడ్డి, సాంబశివరెడ్డి, నారపరెడ్డి, అబ్లు హుసేన్, రఘునాథరెడ్డి, జనసేన రామంజి, మహిళ నాయకులు మస్తానమ్మ, భాగ్యమ్మ, పాలెమ్మ, టిడిపి  జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.సాయంత్రం కొండకమర్ల గ్రామంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$


శ్రీసత్యసాయిజిల్లా నల్లచెరువు మండలంలోని ఓరువాయి గ్రామ దేవత శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఏప్రిల్ 9,10తేదిల్లో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా ఆలయంలో సుందరంగా తీర్చిదిద్ది, రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించి అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.రెండు రోజుల పాటు అమ్మవారి ఉత్సవ జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి మొక్కుబడులు తీర్చుకుంటారని,భక్తులకు నీరు,నీడ,అన్నదాన తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు

శ్రీసత్యసాయిజిల్లా(కడప) ఏప్రిల్05(విజయస్వప్నం. నెట్)

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్ 117 వర్ధంతి సందర్భంగా ఆర్ఎస్ వైఎఫ్ ఆధ్వర్యంలో కడప పట్టణంలో శుక్రవారం  బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు..

ఈ సందర్భంగా ఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ....బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడని,భారత తొలి ఉప ప్రధాని,సమసమాజ స్థాపనకు కృషి చేసిన కృషీవలుడని వారు కొనియాడారు,రాజ్యాంగం అమలు కోసం చట్ట సభల్లో  పోరాటం చేశారని,బడుగు బలహీవర్గాలకు అభివృద్ధి కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల అమలుకోసం కృషి చేశారని,కుల రహిత సమాజం కోసం అహర్నిశలు పోరాటం కొనసాగించారని,బాబు జగ్జీవన్ రామ్ సామాజిక, సంఘసంస్కర్తని వారు కొనియాడారు.అట్టడుగు వర్గాల అభ్యున్నతి ,అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మన భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశయ సాధనకు కృషి చెయ్యాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ వైఎఫ్ జిల్లా కార్యదర్శి ఓరుగంటి నాగేంద్రబాబు,నగర కమిటీ నాయకులు వేణు,నవీన్ తదితరులు పాల్గోన్నారు.

$$$__________@@@__________$$$

 శ్రీచౌడేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం 5.46 లక్షలు


శ్రీసత్యసాయిజిల్లా అమడగూరు ఏప్రిల్05(విజయస్వప్నం.నెట్) 

మండల కేంద్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం శుక్రవారం ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో 16 గ్రామాల ప్రజల సమక్షంలో నిర్వహించారు.అమ్మవారి హుండీ ఆదాయం 5,46,360 వచ్చినట్లు తెలిపారు.ప్రతి యేటా అమ్మవారి జ్యోతి ఉత్సవాలను పురస్కరించుకుని హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించి, అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు, హుండీ ఆదాయ నగదు, వస్తువులను అమ్మవారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా ఈనెల 9వతేది నుండి పక్షం రోజుల పాటు 16 గ్రామాల్లో అమ్మవారి పల్లకిలో గ్రామోత్సవం కార్యక్రమాలు నిర్వహించి,23 నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 30వతేదికి ఉత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఏప్రిల్05(విజయస్వప్నం.నెట్) 

కదిరి పట్టణంలో శంకరయ్య ఆసుపత్రి  ప్రముఖ వైద్యులు,శ్రీఅయ్యప్పస్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు డాక్టర్ శంకరయ్య శుక్రవారం ఉదయం వ్యాయామం చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వేమారెడ్డి కూడలి వద్ద గుర్తు తెలియని ఆటో ఢీ కొట్టిన ప్రమాదం గమనించిన స్థానికులు తక్షణమే రైల్వే రోడ్డు సమీపంలో హుస్సేన్ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందిస్తున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, కదిరి తెదేపా,జనసేన,బిజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ శంకరయ్యను పరామర్శించి, ప్రమాదం ఏలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. శంకరయ్య ముక్కుకు గాయాలు కావడంతో వైద్యులు కుట్లు వేసి చికిత్సలు అందించినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి